వ్యవసాయ మార్కెట్లతోపాటు ప్రైవేటు వ్యాపారుల వద్ద నిర్వహిస్తున్న కాంటాల్లో తేడాలు ఉంటున్నాయి. ప్రామాణికమైన తూకం రాళ్లకు బదులుగా సాధారణ బండరాళ్లను వినియోగిస్తున్నారు. తూకంలో తేడాలు వస్తున్నాయని ఫిర్యాదు చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. లీగల్ మెట్రాలజీ అధికారులు తరచుగా తనిఖీలు చేపట్టాలి.
– వర్దం సైదులు, అచ్చంపేట
రైతుల నుంచి ప్రైవేటుగా పత్తి కొనుగోలు చేసే వ్యాపారులు కాంటాలను సక్రమంగా నిర్వహించడం లేదు. ఎలక్ట్రానిక్ కాంటాలను సైతం ట్యాంపర్ చేసి తూకాల్లో తేడాతో రైతులను మోసగిస్తున్నారు. మార్కెట్ ధర కన్నా తక్కువగా కొనుగోలు చేయడంతోపాటు పంట బరువు తూకంలో మోసాలతో ఎక్కువగా నష్టపోతున్నాం. సంబంధిత అధికారులు స్పందించి కాంటాల నిర్వహణ సక్రమంగా ఉండేలా చూడాలి. – అబ్దుల్ కలీం,
కోమటికుంట, లింగాల మండలం
తూనికల శాఖ అధికారులు తనిఖీలు చేపట్టకపోవడంతో వ్యాపారస్తులు తూకాల్లో తేడా చేస్తూ పేదలను మోసం చేస్తున్నారు. మరోపక్క వారాంతపు సంస్థలో బాట్లకు బదులు మోటు రాళ్లు పెట్టి తూకం చేసి వ్యాపారులు సామాన్యులతో భారీగా డబ్బులు గుంజుతున్నారు. అలాగే రైతులు పండించిన పంటలను దలారి వ్యాపారులు ఎలక్ట్రిక్ కాంటాల్లో మోసాలకు పాల్పడుతూన్నారు. తూనికల శాఖ అధికారులు మాత్రం కన్నెత్తి చూడడం లేదు. – మోహన్ రెడ్డి, రైతు,
మరికల్, నారాయణపేట జిల్లా
●


