బిజినేపల్లి: వట్టెం శ్రీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు సోమవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవాల మొదటిరోజు ఉదయం సుప్రభాతం, ప్రాతరాధన, అర్చన, సేవాకాలం, హోమం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. అలివేలుమంగ, గోదాదేవి సమేత వేంకటేశ్వరస్వామివార్లకు అభిషేకాలు, అలంకరణ, రాజభోగం, వాసుదేవ పుణ్యాహవచనం, రక్షాబంధనం, అంకురార్పణ వంటి కార్యక్రమాలు జరిపారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యుడు ప్రతాప్‌రెడ్డి, వికాస తరంగిణి ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ రాజశేఖర్, భరత్‌కుమార్, చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


