యూరియా బుకింగ్‌కు ఫర్టిలైజర్ యాప్‌లో ముందస్తు బుకింగ్‌ను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. రైతు పాస్‌బుక్‌తో లింకేజీ ఉన్న మొబైల్ నంబర్‌తో యాప్‌లో లాగిన్ కావాల్సి ఉంటుంది. మొబైల్ నంబర్ లింక్ లేకున్నా.. స్మార్ట్ ఫోన్ లేకపోయినా యూరియా బుకింగ్‌కు అవకాశం లేదు. దీంతో యూరియా బస్తాలు ఎలా పొందాలని రైతులు ఆందోళన చెందుతున్నారు. పీఏసీఎస్, ఫర్టిలైజర్ కేంద్రాలకు వచ్చి యూరియా బస్తాలు లేకుండానే వెనుదిరగడం కనిపిస్తోంది. అయితే స్మార్ట్‌ఫోన్ లేనివారు సంబంధిత ఏఈఓ, ఏఓలను సంప్రదించాలని అధికారులు చెబుతున్నారు. ఈ విషయంపై అవగాహన లేక రైతులు ఫర్టిలైజర్ కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. ఏఈఓలను సంప్రదించినా మొబైల్ నంబర్ లింక్ లేకపోవడంతో బుకింగ్‌కు నోచుకోవడం లేదు. తీరా బుకింగ్ సమయానికి నోస్టాక్ అని చూపిస్తోంది.


