జిల్లాలో అద్దె ఇళ్లలో
కొనసాగుతున్న
తహసీల్దార్ ఆఫీసులు
అచ్చంపేట ఆర్డీఓ కార్యాలయానికి సొంత భవనం లేకపోవడంతో తాత్కాలికంగా తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో చిన్న గది, గోదాం షెడ్డులను మరమ్మతు చేపట్టి అరకొర వసతుల మధ్య కొనసాగుతుంది. కొల్లాపూర్ ఆర్డీఓ కార్యాలయం ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో నిర్వహిస్తున్నారు. కల్వకుర్తి ఆర్డీఓ కార్యాలయం పశుసంవర్ధక శాఖకు సంబంధించిన భవనంలో తాత్కాలికంగా కొనసాగిస్తున్నారు. పదర తహసీల్దార్ కార్యాలయం వైద్య, ఆరోగ్య శాఖ శిథిలావస్థకు చేరిన పురాతన పాత భవనంలో కొనసాగుతుంది. ఉద్యోగులు, సందర్శకులు అవస్థలు పడుతున్నారు. చారకొండ తహసీల్దార్ కార్యాలయం అద్దె భవనంలో కొనసాగుతుండగా.. ఇటీవలే రియల్ ఎస్టేట్ వ్యాపారులు వెంచర్‌లో ఓ భవనం నిర్మించి ఇచ్చారు. పెంట్లవెల్లి తహసీల్దార్ కార్యాలయం పాత పంచాయతీ భవనంలో అరకొర గదులు, వసతుల మధ్య కొనసాగుతుంది. ఊర్కొండ తహసీల్దార్ కార్యాలయం పశువైద్యశాల, మహిళా సంఘం భవనాల్లో నెట్టుకొస్తున్నారు. అచ్చంపేట తహసీల్దార్ కార్యాలయం శిథిలావస్థకు చేరి గదులు కురుస్తున్నాయి. నాగర్‌కర్నూల్ తహసీల్దార్ కార్యాలయం వందేళ్ల క్రితం నిర్మించిన పాత భవనంలో ఇరుకు గదుల్లో కొనసాగుతుంది. ఉప్పునుంతల, బల్మూర్, లింగాల, అమ్రాబాద్,వంగూరు తహసీల్థార్ కా ర్యాలయాలు సొంత భవనాల్లో సాగుతున్నా.. శిథిలావస్థకు చే రాయి. ఇక్కడ అధికారులతోపాటు ఉద్యోగులు తీవ్ర ఇబ్బందు ల మధ్య పాలన వ్యవహారాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ప్రభు త్వం దీనిపై ప్రత్యేకంగా దృష్టిసారించిన నేపథ్యంలో.. త్వరగా కార్యరూపం దాల్చేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
అచ్చంపేట: జిల్లాలోని పలు రెవెన్యూ కార్యాలయాలకు మహర్దశ పట్టనుంది. పరిపాలనలో కీలకమైన తహసీల్దార్, ఆర్డీఓ కార్యాలయాలకు నూతనంగా శాశ్వత పక్కా భవనాలు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. అద్దె భవనాలు, శిథిలావస్థకు చేరిన కార్యాలయాలకు రెండు విడతల్లో నూతన భవనాలు నిర్మించనున్నట్లు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ భవనాలన్నింటినీ ఒకే నమూనాలో నిర్మించేలా ప్రతిపాదనలు సిద్ధ చేస్తున్నట్లు వెల్లడించారు. మంత్రి మాటలు కార్యరూపం దాల్చితే అద్దె కష్టాలు తొలగడంతోపాటు శిథిలావస్థకు చేరిన భవనాల స్థానంలో నూతన భవనాలు నిర్మించనున్నారు.
పథకాల అమలులో కీలకం..
జిల్లా పరిపాలనకు రెవెన్యూ గుండెకాయలాంటింది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేయడంలో ఈ శాఖనే అత్యంత కీలకమైంది. క్షేత్రస్థాయిలో ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమం చేపట్టాలన్న రెవెన్యూ వ్యవస్థదే ప్రధాన పాత్ర. ఇంతటి ప్రాధాన్యత కలిగిన రెవెన్యూ శాఖకు సొంత భవనాలు కరువయ్యాయి. ఒకటి, రెండు మండలాలను మినహాయిస్తే జిల్లాలో మెజార్టీ తహసీల్దార్ కార్యాలయాలకు పక్కా భవనాలు లేవు. అద్దె ప్రతిపాదికన కొన్నిచోట్ల కొనసాగుతుండగా.. మరికొన్ని చోట్ల ఇతర శాఖల ప్రభుత్వ భవనాల్లో నిర్వహిస్తున్నారు. వాటిలో సరైనా సౌకర్యాలు లేక అధికారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది.
ఆర్డీఓ కార్యాలయాలది అదే పరిస్థితి
తాజా సొంత భవన నిర్మాణాలకు ప్రభుత్వం చర్యలు


