పైసలిస్తే యూరియా ఇవ్వాలి.. | - | Sakshi
Sakshi News home page

పైసలిస్తే యూరియా ఇవ్వాలి..

Mar 3 2026 9:07 AM | Updated on Mar 3 2026 9:07 AM

పైసలిస్తే యూరియా ఇవ్వాలి.. యాప్‌ రద్దు చేయాలి.. ఏఈఓలను సంప్రదించాలి..

యూరియా కోసం వస్తే ఫోన్‌లో బుకింగ్‌ చేసుకోవాలి అంటున్నారు. మాకు పెద్ద ఫోన్‌ లేదు. ఈ ఫోన్‌లో బుకింగ్‌ కుదరదని చెబుతున్నారు. ఆన్‌లైన్‌లో బుకింగ్‌ మాకు సమస్యగా మారింది. బుకింగ్‌ చేసుకుందామన్నా స్టాక్‌ లేదని చెబుతున్నారు. కాబట్టి మాలాంటి వారికి పైసలిస్తే యూరియా బస్తా ఇచ్చేలా చూడాలి.

– రాములు,

ఎండబెట్ల, నాగర్‌కర్నూల్‌

యూరియా బస్తాల కోసం వెళ్తే ఇబ్బందులు ఎదురవుతున్నా యి. ప్రభుత్వం యూరియా బుకింగ్‌ యాప్‌ను రద్దు చేసి నేరుగా బస్తాలను పంపిణీ చేయాలి. యాప్‌లో బుకింగ్‌ కావ డం లేదు. ఎప్పుడు స్టాక్‌ ఉంటుందో, ఎప్పుడు అయిపోతుందో అర్థం కావడం లేదు. ఎప్పటిలాగే దుకాణాల్లో నేరుగా యూ రియా ఇస్తేనే బాగుంటుంది.

– నరేందర్‌, తిర్మలాపురం, తాడూరు మండలం

జిల్లాలో యూరియా అవసరమైన రైతులు యాప్‌ ద్వారా బుకింగ్‌ చేసుకుని పొందాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు 46,529 మంది రైతులకు 2.18 లక్షల యూరియా బస్తాలను పంపిణీ చేశాం. స్మార్ట్‌ ఫోన్లు లేని రైతులు సంబంధిత ఏఈఓలను సంప్రదించి యూరియా బుక్‌ చేసుకోవాలి. జిల్లాలో అవసరమైన మేరకు 20 వేల బస్తాల యూరియా నిల్వలు ఉన్నాయి.

– యశ్వంత్‌రావు, డీఏఓ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement