కందనూలు: జిల్లాలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ముగిశాయి. శుక్రవారం జిల్లావ్యాప్తంగా 34 కేంద్రాల్లో ద్వితీయ సంవత్సరం కెమిస్ట్రీ, కామర్స్ పరీక్షలు నిర్వహించగా.. 5,721 మంది విద్యార్థులకు గాను 5,521 మంది హాజరయ్యారు. జనరల్‌లో 4,505 మందికి గాను 4,377 మంది, ఒకేషనల్ విభాగంలో 1,216 మందికి గాను 1,144 మంది హాజరై పరీక్ష రాశారు. జనరల్‌లో 128 మంది, ఒకేషనల్ విభాగంలో 72 మంది గైర్హాజరయ్యారు. పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశామని డీఐఈఓ వెంకటరమణ తెలిపారు.


