తొలిసారి ‘నల్లమలశ్రీకు గవర్నర్‌ | - | Sakshi
Sakshi News home page

తొలిసారి ‘నల్లమలశ్రీకు గవర్నర్‌

Mar 14 2026 8:27 AM | Updated on Mar 14 2026 8:27 AM

మన్ననూర్‌: శ్రీశైలం క్షేత్రానికి రోడ్డు మార్గాన వెళ్తున్న రాష్ట్ర గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లాకు శుక్రవారం మన్ననూర్‌ మృగవాణి అతిథిగృహం వద్ద కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌, ఎస్పీ సంగ్రామ్‌ సింగ్‌జీ పాటిల్‌ ఘనస్వాగతం పలికారు. అనంతరం పోలీస్‌ గౌరవ వందనం సమర్పించారు. రాష్ట్ర గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా ఈ ప్రాంతానికి వచ్చిన ఆయన.. కలెక్టర్‌, ఇతర అధికారులతో ఈ ప్రాంతం విశేషాలు, ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. అతిథిగృహంలో ఆయన కాసేపు విశ్రాంతి తీసుకుని శ్రీశైలం క్షేత్రానికి బయలుదేరి వెళ్లారు.

స్వాగతం పలికిన నాగర్‌కర్నూల్‌

కలెక్టర్‌, ఎస్పీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement