పారదర్శకంగా భూముల రీసర్వే | - | Sakshi
Sakshi News home page

పారదర్శకంగా భూముల రీసర్వే

Mar 14 2026 8:27 AM | Updated on Mar 14 2026 8:27 AM

● అతి పురాతనమైన జటప్రోల్‌ మదనగోపాలస్వామి ఆలయాన్ని అన్నివిధాలా తీర్చిదిద్దుతామని మంత్రి జూపల్లి అన్నారు. మదనగోపాలస్వామి ఆలయంలో రూ. 2కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులను దేవాదాయశాఖ అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆలయంలో చేపట్టిన పనులు దాదాపు 80శాతం పూర్తయ్యాయని తెలిపారు. మిగతా పనులను త్వరగా పూర్తిచేసి.. భక్తులు, పర్యాటకులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. మంత్రి వెంట ఈఓ జైపాల్‌, ఆర్డీఓ భన్సీలాల్‌, తహసీల్దార్‌ రాజుకుమార్‌, గోవింద్‌గౌడ్‌, సర్పంచ్‌ చంద్రకళ, రామన్‌గౌడ్‌, భీంరెడ్డి, గోపినాయక్‌, గోపాల్‌, నాగిరెడ్డి ఉన్నారు.

కొల్లాపూర్‌/కొల్లాపూర్‌ రూరల్‌/పెంట్లవెల్లి: భూము ల రీసర్వే పారదర్శంగా నిర్వహించాలని రాష్ట్ర ఎకై ్సజ్‌, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులకు సూచించారు. శుక్రవారం కొల్లాపూర్‌ మండలం మొలచింతపల్లిలో భూముల రీసర్వేపై పట్టాదారులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు గాను ప్రభుత్వం అధునాతన సాంకేతికతతో భూముల రీసర్వేకు శ్రీకారం చుట్టిందన్నారు. సర్వేలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా భూముల వివరాలు పక్కాగా నమోదు చేయాలని అధికారులకు సూచించారు. ఇదిలా ఉంటే, గత పాలకులు గ్రామంలో అశాంతి నెలకొల్పి.. దాడులను ప్రోత్సహించారని మంత్రి వ్యాఖ్యానించడంతో బీఆర్‌ఎస్‌ నాయకులు అభ్యంతరం వ్యక్తంచేశారు. కొంతసేపు మంత్రి, బీఆర్‌ఎస్‌ నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు కల్పించుకోవడంతో వివాదం సద్దుమణిగింది. అంతకు ముందు మంత్రి జూపల్లి ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించారు. నూతన నిర్మాణాలకు భూమిపూజ చేశారు. మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు. కాగా, మొలచింతపల్లి, ముక్కిడిగుండం గ్రామాలకు జీవనాధారంగా ఉన్న జీల్దార్‌ తిప్ప చెరువుకు కేఎల్‌ఐ ద్వారా సాగునీరు అందించాలని గ్రామ సర్పంచ్‌ వరలక్ష్మి మంత్రిని కోరగా.. సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ అమరేందర్‌, ఆర్డీఓ భన్సీలాల్‌ పాల్గొన్నారు.

శుద్ధమైన తాగునీటి సరఫరా

కొల్లాపూర్‌ నియోజకవర్గ ప్రజలకు శుద్ధమైన తాగునీరు అందిస్తున్నట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శుక్రవారం పట్టణంలోని 9, 10 వార్డుల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా వాటర్‌ ట్యాంకులను పరిశీలించి, శుభ్రం చేయించారు. అనంతరం నల్లాలకు నీటిని వదిలారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా తాగునీరు సరఫరా చేయాలని.. పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టిసారించాలని మున్సిపల్‌ పాలకవర్గానికి సూచించారు. మంత్రి వెంట మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రెడ్డి జ్యోతి సత్యనారాయణ, వైస్‌చైర్మన్‌ షేక్‌ రహీంపాషా, కమిషనర్‌ యాదగిరి, కౌన్సిలర్‌ లహరి వేణుగోపాల్‌గౌడ్‌ ఉన్నారు.

రాష్ట్ర ఎకై ్సజ్‌, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement