నేడు జిల్లాకు సీఎం రేవంత్‌రెడ్డి | - | Sakshi
Sakshi News home page

నేడు జిల్లాకు సీఎం రేవంత్‌రెడ్డి

Mar 14 2026 8:27 AM | Updated on Mar 14 2026 8:27 AM

గద్వాల: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శనివారం జిల్లాలో పర్యటించనున్నారు. స్థానిక ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి కుమారుడి వివాహానికి సీఎం హాజరు కానున్నారు. ఈ సందర్భంగా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటుచేశారు. సీఎం పర్యటన ఏర్పాట్లను శుక్రవారం రాత్రి ఎమ్మెల్యే బండ్లతో కలిసి కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా షేక్‌, ఎస్పీ శ్రీనివాసరావు పర్యవేక్షించారు. ముఖ్యమంత్రి పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

సమాజంలో మహిళల పాత్ర కీలకం

నాగర్‌కర్నూల్‌ క్రైం: మహిళలు సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నారని అదనపు ఎస్పీ నోముల వెంకటేశ్వర్లు అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో మహిళా పోలీసు సిబ్బందికి వైద్య పరీక్షలతో పాటు క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ.. మహిళలు కుటుంబ వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తూ, అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. పోలీసుశాఖలో మహిళా సిబ్బంది ధైర్యం, నిబద్ధతతో విధులు నిర్వర్తిస్తూ.. ప్రజల భద్రతకు విశేషంగా సేవలు అందిస్తున్నారని కొనియాడారు. మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందుకుసాగితే ఏ రంగంలోనైనా విజయం సాధించగలరని అన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ డా.రవికుమార్‌, ప్రభుత్వ మెడికల్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డా.రమాదేవి, డీఎస్పీ శ్రీనివాసులు పాల్గొన్నారు.

మంత్రి క్యాంపు కార్యాలయం ముట్టడి

కొల్లాపూర్‌: పట్టణంలోని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు క్యాంపు కార్యాలయాన్ని శుక్రవారం ఆశావర్కర్లు ముట్టడించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు శివవర్మ, ఆశావర్కర్ల సంఘం జిల్లా ఉపాధ్యక్షురాలు శ్రీదేవి మాట్లాడుతూ.. ఆశావర్కర్లకు పెండింగ్‌ వేతనాలు చెల్లించడంతో పాటు ఉద్యోగ భద్రత, ప్రమాద బీమా, రిటరైమెంట్‌ బెనిఫిట్స్‌ కల్పించాలని డిమాండ్‌ చేశారు. అదే విధంగా ఎన్‌హెచ్‌ఎంకు సరిపడా నిధులు కేటాయించాలని, పీఆర్సీ, ఎన్నికల డ్యూటీ డబ్బులు చెల్లించాలని, మెడికల్‌, క్యాజువల్‌ సెలవులు ఇవ్వాలన్నారు. లేనిపక్షంలో ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామన్నారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని మంత్రి క్యాంపు కార్యాలయ అధికారి నాగరాజుకు అందజేశారు. కార్యక్రమంలో శివలీల, చెన్నమ్మ, గౌరమ్మ, నిర్మల, మమత, మంజులత, వకులాదేవి, సుజాత, ఉమాలక్ష్మి, వరలక్ష్మి పాల్గొన్నారు.

కుమ్మెర బాధితులకు రక్షణ కల్పించాలి

నాగర్‌కర్నూల్‌ క్రైం: కుమ్మెర మల్లన్న జాతరలో దాడికి గురైన బాధిత కుటుంబానికి పోలీసులు రక్షణ కల్పించడంతో పాటు స్వగ్రామంలో స్వేచ్ఛగా పనిచేసుకునేందుకు అవకాశం కల్పించాలని ధర్మసమాజ్‌ పార్టీ అధ్యక్షుడు విశారదన్‌ మహారాజ్‌ అన్నారు. శుక్రవారం బాధితులతో కలిసి స్థానిక డీఎస్పీని కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కుమ్మెర మల్లన్న జా తరలో జరిగిన దాడిలో 8 మంది ఉండగా, ఇప్పటివరకు ఐదుగురిని మాత్రమే రిమాండ్‌ చేశారన్నారు. మిగతా వారిని పట్టుకోవడంలో పోలీసు ల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందని ఆరోపించా రు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితులపై ఎస్సీ, ఎస్టీ కేసుతో పాటు హత్య కేసు నమోదు చేయాలన్నారు. నిందితులను అరెస్టు చేసి జైలుకు పంపే వరకు, బాధితులకు న్యా యం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామన్నా రు. వారి వెంట సోషల్‌ జస్టిస్‌ ఫర్‌ హ్యూమన్‌ రైట్‌ కమిటీ అధ్యక్షురాలు లక్ష్మీశ్రావణి ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement