కందనూలు/అచ్చంపేట రూరల్/కల్వకుర్తి టౌన్/ఉప్పునుంతల: జిల్లాలోని పేదలు, విద్యార్థులు, గర్భిణులకు ఆహార భద్రత కింద అందించే ఆహారంలో లోపాలను సరిచేసి.. నిర్దేశిత ప్రమాణాలు పాటించాలని రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్‌రెడ్డి ఆదేశించారు. జాతీయ ఆహార భద్రత చట్టం 2013 అమలుపై శుక్రవారం కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని కల్వకుర్తి, అచ్చంపేట ప్రాంతాల్లో విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజన అందడం లేదని గుర్తించడం జరిగిందన్నారు. విద్యార్థులకు పౌష్టికాహారం అందేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ప్రతి హాస్టల్, పాఠశాలల్లో తప్పనిసరిగా సంబంధిత అధికారుల ఫోన్ నంబర్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. సమావేశంలో రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యులు ఓరుగంటి ఆనంద్, రంగినేని శారద, అదనపు కలెక్టర్ అమరేందర్, జెడ్పీ సీఈఓ దేవసహాయం, డీఆర్డీఓ చిన్నఓబులేషు ఉన్నారు.
● అంతకు ముందు అచ్చంపేట పట్టణంలోని రేషన్ దుకాణం, అంగన్‌వాడీ కేంద్రం, సివిల్‌సప్లయ్ గోదాంలను ఫుడ్ కమిషన్ చైర్మన్ పరిశీలించారు. నిబంధనలు పాటించని రేషన్ డీలర్లపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలను సందర్శించి.. మధ్యాహ్న భోజనం నాణ్యతపై ఆరా తీశారు. కొందరు విద్యార్థినులు ఇంటి నుంచి ఆహారం తెచ్చుకోవడానికి గల కారణాలను తెలుసుకున్నారు.
● కల్వకుర్తి పట్టణంలోని జేపీ నగర్ గురుకుల పాఠశాలలో చైర్మన్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. విద్యార్థులకు మెనూ ప్రకారం గుడ్డు అందించకపోవడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. అనంతరం మరుగుదొడ్లను పరిశీలించగా.. శుభ్రంగా లేకపోవడంతో అసహనం వ్యక్తంచేశారు. ఆహార సరుకులు, తదితర వస్తువులు ఉన్న గదులతో పాటు విద్యార్థులు ఉండే వసతి గృహాలను శుభ్రంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు.
ఉప్పునుంతల కేజీబీవీలో విద్యార్థినులకు అందిస్తున్న భోజనంతో పాటు బియ్యం, ఇతర సరకులు, కూరగాయల నాణ్యతను పరిశీలించా రు. నిల్వ ఉన్న పప్పులు, అల్లం వెల్లుల్లి పేస్టులో పురుగులు ఉండటాన్ని గుర్తించిన వారు.. కేజీబీవీ ఎస్‌ఓపై ఆగ్రహం వ్యక్తంచేశారు. విద్యార్థినులు భోజనం చేసే హాలులో ఇతర వస్తువులు ఉండటం.. మెనూ ప్రకారం భోజనం అందించకపోవడంపై అసంతృప్తి వ్యక్తంచేశారు. విద్యార్థులతో మాట్లాడి సమస్య లు తెలుసుకున్నారు. అ నంతరం స్థానిక సీహెచ్‌సీని తనిఖీ చేశారు. కా ర్యక్రమాల్లో జిల్లా సివిల్ సప్లయ్ అధికారి రాజశేఖర్, ఆర్డీఓ యాదగిరి, డీఈఓ రమేశ్‌కుమార్, తహసీల్దార్లు సునీత, సైదులు, ఏటీడీఓ ఫిరంగి, ఆర్‌ఐలు శివకుమా ర్, బాల్‌రాం, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ తారాసింగ్, ఎంపీడీఓ రేవతిరెడ్డి, సర్పంచ్ శ్రీనివాసులు పాల్గొన్నారు.
రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్‌రెడ్డి


