వంటగ్యాస్‌ ధరలు తగ్గించాలని రాస్తారోకో | - | Sakshi
Sakshi News home page

వంటగ్యాస్‌ ధరలు తగ్గించాలని రాస్తారోకో

Mar 9 2026 7:41 AM | Updated on Mar 9 2026 7:41 AM

బల్మూర్‌: ప్రభుత్వం పెంచిన వంటగ్యాస్‌ సిలిండర్‌ ధరలను తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ ఆదివారం బల్మూర్‌ మండల కేంద్రంలో సీపీఎం నాయకులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వర్ధం పర్వతాలు, కార్యదర్శివర్గ సభ్యుడు దేశానాయక్‌ మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాకముందు వంటగ్యాస్‌ సిలిండర్‌ ధర రూ. 500 ఉండగా.. ప్రస్తుతం రూ.వెయ్యికి పెరిగిందన్నారు. బీజేపీ ప్రభుత్వం ఇష్టానుసారంగా ధరలు పెంచుతూ.. పేదలపై పెనుభారం మోపడం సరైంది కాదన్నారు. పెంచిన వంటగ్యాస్‌ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి శంకర్‌నాయక్‌, ఎండీ లాల్‌ ఆహ్మద్‌, బాబర్‌, ఆంజనేయులు, శ్రావణ్‌ కుమార్‌, శేఖర్‌, రాములు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement