కొల్లాపూర్: పవిత్ర రంజాన్ మాసం ఆత్మశుద్ధి, సహనం, దాతృత్వానికి ప్రతీకగా నిలుస్తుందని.. అల్లాహ్ ఆశీస్సులు అందరిపై ఉండాలని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆదివారం కొల్లాపూర్‌లోని ఖాదర్‌పాషా దర్గా వద్ద ముస్లింలకు ప్రభుత్వపరంగా ఏర్పాటుచేసిన ఇఫ్తార్‌కు మంత్రి జూపల్లి, కలెక్టర్ బదావత్ సంతోష్ హాజరయ్యారు. ముందుగా దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ముస్లింలను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ.. అన్ని మతాల ప్రజలు గంగా జమున తహజీబ్ స్ఫూర్తితో, పరస్పర గౌరవంతో కలిసిమెలిసి పండుగలను జరుపుకోవాలని పిలుపునిచ్చారు. రంజాన్ మాసంలో పాటించే ఉపవాస దీక్షలు శరీర నియంత్రణ, సేవాభావం, సహనం వంటి అంశాలను నేర్పుతాయని అన్నారు. అంతకుముందు ముస్లింలకు రంజాన్ కానుకలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆర్డీఓ భన్సీలాల్, తహసీల్దార్ భరత్‌కుమార్, మున్సిపల్ చైర్‌పర్సన్ రెడ్డి జ్యోతి సత్యనారాయణ, వైస్‌చైర్మన్ షేక్ రహీంపాషా, జామె మసీదు కమిటీ అధ్యక్షుడు ఖాజా చావుష్‌తో పాటు మున్సిపల్ కౌన్సిలర్లు, ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు.


