పదవుల కోసం కాంగ్రెస్ నేతల ముమ్మర ప్రయత్నాలు
పల్లె, పట్టణాల్లో
కో‘ఆప్షన్’ ఎవరికో..
గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తయ్యి సర్పంచ్, పాలక వర్గాలు కొలువుదీరి రెండు నెలలు గడిచింది. ఇప్పటివరకు గ్రామపంచాయతీల కోఆప్షన్ సభ్యుల నియామకాలపై స్పష్టత రాలేదు. రాష్ట్రవ్యాప్తంగా నియామకాలపై ప్రభుత్వం జీఓ విడుదల చేయాల్సి ఉంది. మున్సిపాలిటీల్లోనూ ఎన్నికలు పూర్తయ్యి కొత్త పాలకవర్గాలు కొలువుదీరాయి. ఈ క్రమంలో పల్లెలతో పాటు పట్టణాల్లోనూ కోఆప్షన్ సభ్యుల నియామకం కోసం ఆశావహులు ఎదురుచూస్తున్నారు. గ్రామాలతో పాటు జిల్లాలోని మున్సిపాలిటీల్లో కోఆప్షన్ సభ్యులుగా అవకాశం కోసం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నుంచి తీవ్రమైన పోటీ నెలకొంది.
సాక్షి, నాగర్‌కర్నూల్: కాంగ్రెస్ పార్టీలో ముఖ్యనేతలు, సీనియర్ నాయకుల దృష్టి ప్రభుత్వ నామినేటెడ్ పదవులపై పడింది. రాష్ట్రస్థాయిలో కార్పొరేషన్ల చైర్మన్లుగా అవకాశం కల్పించాలని ఇప్పటికే పలువురు కాంగ్రెస్ నేతలు అధిష్టానానికి విజ్ఞప్తి చేసుకున్నారు. ఈ సారి తమకు ఎలాగైనా అవకాశం కల్పించాలని స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేల మెప్పు పొందేందుకు ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు. పెద్దసంఖ్యలో ఖాళీగా ఉన్న కార్పొరేషన్లు, ఇతర నామినేటెడ్ పదవులను ప్రభుత్వం భర్తీ చేయనుందన్న ఊహాగానాల నేపథ్యంలో జిల్లాలోని కాంగ్రెస్ నేతల ప్రయత్నాలు ఊపందుకున్నాయి.
కార్పొరేషన్, జిల్లాస్థాయిపదవులకు పోటాపోటీ
ఇప్పటికే పార్టీ అధిష్టానానికి విజ్ఞప్తులు
పల్లెల్లో కోఆప్షన్ నియామకాలపై నెలకొన్న ఆశలు


