రేపు ఉద్యోగమేళా | - | Sakshi
Sakshi News home page

రేపు ఉద్యోగమేళా

Mar 12 2026 8:47 AM | Updated on Mar 12 2026 8:47 AM

కందనూలు: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆర్ట్స్‌ డిగ్రీ కళాశాలలో ఈ నెల 13న ఉద్యోగమేళా నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ గీతాంజలి తెలిపారు. ఇందుకు సంబంధించిన బ్రోచర్లను బుధవారం స్థానిక ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి చేతులమీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్‌ మాట్లాడుతూ.. ప్రైవేటు కంపెనీలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు జాబ్‌మేళా ఏర్పాటుచేసినట్లు పేర్కొన్నారు. పదో తరగతి, ఇంటర్‌, డిగ్రీ ఉత్తీర్ణులైన వారు అర్హులని.. ఈ అవకాశాన్ని జిల్లాలోని యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

డ్రగ్స్‌ మహమ్మారికి

అడ్డుకట్ట వేద్దాం

కందనూలు: డ్రగ్స్‌ మహమ్మారిని అరికట్టడంలో విద్యార్థులు కీలక పాత్ర పోషించాలని సీఐ శంకర్‌నాయక్‌ అన్నారు. నాగర్‌కరూ్‌న్‌ల్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో బుధవారం జిల్లా విద్యాశాఖ, ఈగల్‌ టీం ఆధ్వర్యంలో డ్రగ్స్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. డ్రగ్స్‌, ఇతర మత్తు పదార్థాలతో భవిష్యత్‌ నాశనమవుతుందన్నారు. విద్యార్థులు, యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని సూచించారు.కార్యక్రమంలో ఎంఈఓ త్యాగరాజు, రిసోర్స్‌పర్సన్లు తిరుపతయ్య, లక్ష్మీప్రసన్న, వెంకటయ్య, నార్కోటిక్‌ కానిస్టేబుల్‌ వీరయ్య తదితరులు పాల్గొన్నారు.

గ్రానైట్‌ తవ్వకాలు

నిలిపివేయాలి

చారకొండ: మండలంలోని సిర్సనగండ్ల శివారులో సర్వేనం 182లో చేపట్టిన బ్లాక్‌ గ్రానైట్‌ తవ్వకాలను నిలిపివేసి.. వన్యప్రాణులను రక్షించాలని సిర్సనగండ్ల, శాంతిగూడెం గ్రామాల రైతులు కోరారు. ఈ మేరకు బుధవారం ఫారెస్టు అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గుట్ట ప్రాంతంలో మైనింగ్‌ తవ్వకాలతో పర్యావరణ దెబ్బతినడంతో పాటు వన్యప్రాణులకు హాని చేకూరుతుందన్నారు. పశు సంపద, వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న రైతులకు తీవ్ర నష్టం కలుగుతుందని వాపోయారు. అధికారులు స్పందించి అటవీ సంరక్షణ చర్యలు చేపట్టాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement