సేవల్లో సాంకేతికత..! | - | Sakshi
Sakshi News home page

సేవల్లో సాంకేతికత..!

Mar 9 2026 7:41 AM | Updated on Mar 9 2026 7:41 AM

విద్యుత్‌శాఖ సరికొత్తగా టెక్నాలజీ వినియోగం

వాట్సప్‌ ద్వారా

ఫిర్యాదులు ఇలా..

వినియోగదారులు తమ మొబైల్‌ ఫోన్‌లో 87124 41912 నంబర్‌ను సేవ్‌ చేసుకుని.. వాట్సప్‌లో హాయ్‌ అని మెసేజ్‌ పంపాలి. వెంటనే ఎస్పీడీసీఎల్‌ కాల్‌ సెంటర్‌కు స్వాగతం అని మెసేజ్‌ వస్తుంది. ఇందులోనే రిజిస్టర్‌ కంప్లెయిట్‌, ట్రాక్‌ కంప్లెయిట్‌, చాట్‌ ఏజెంట్‌ అనే ఆప్షన్లు వస్తాయి. రిజిస్టర్‌ కంప్లెయిట్‌ సెలెక్ట్‌ చేశాక.. మీ విద్యుత్‌ కనెక్షన్‌ వివరాలు ఉన్నా.. లేకున్నా ఫిర్యాదు చేయవచ్చు. నిరంతర సమీక్షల ద్వారా ఫిర్యాదులకు త్వరగా పరిష్కారం చూపడంతో పాటు వినియోగదారుల అభిప్రాయాలను కూడా సేకరిస్తూ.. సేవల మెరుగుదలపై చర్యలు తీసుకొనున్నారు.

అచ్చంపేట/కల్వకుర్తి టౌన్‌: విద్యుత్‌ వినియోగదారులకు మరింత వేగవంతంగా, పారదర్శకంగా సేవలు అందించేందుకు విద్యుత్‌శాఖ సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగిస్తోంది. వినియోగదారుల సమస్యలను సత్వరమే పరిష్కరించడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. అందులో భాగంగా డిజిటల్‌ సేవలను ఆధునికీకరిస్తోంది. ఫిర్యాదుల స్వీకరణ నుంచి మొదలుకొని.. సమస్యల పరిష్కారం వరకు మొత్తం ప్రక్రియను సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా నిర్వహించడంతో సేవల నాణ్యత మెరుగుపడుతోందని సంబంధిత అధికారులు చెబుతున్నారు.

వినియోగదారులకు డిజిటల్‌ సేవలు

అందుబాటులోకి టోల్‌ఫ్రీ 1912

వాట్సప్‌లోనూ కరెంటు సమస్యలు తెలియజేసే అవకాశం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement