తెలకపల్లి: నానో డీఏపీ, యూరియా వినియోగంతో రైతులకు ఎంతో మేలు చేకూరుతుందని రాష్ట్ర మార్కెటింగ్ మేనేజర్ కృపాశంకర్, డీఏఓ యశ్వంత్‌రావు అన్నారు. తెలకపల్లి సింగిల్‌విండో కార్యాలయంలో మంగళవారం నానో ఎరువుల వినియోగంపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నానో యూరియా, డీఏపీ వినియోగంతో పంటల దిగుబడి పెరగడంతో పాటు రసాయన ఎరువుల వినియోగం, పెట్టుబడి తగ్గుతుందన్నారు. రైతులు నానో ఎరువుల వినియోగంపై దృష్టిసారించాలని సూచించారు. అనంతరం సుస్థిర వ్యవసాయంలో నానో ఎరువుల వినియోగంతో కలిగే ప్రయోజనాలను డీసీఓ రఘునాథరావు, డీహెచ్‌ఓ వెంకటేశ్వర్లు వివరించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ మాజీ చైర్మన్ భాస్కర్‌రెడ్డి, సీఈఓ ధర్మవీర్, ఫీల్డ్ ఆఫీసర్ శివరాజు, హరినాథరావు పాల్గొన్నారు.


