breaking news
Yadadri District Latest News
-
ఆరు లేన్లుగా హైవే
కోదాడ, చిట్యాల : హైదరాబాద్– విజయవాడ జాతీయరహదారి(ఎన్‌హెచ్–65)ని నాలుగు నుంచి ఆరు లేన్లుగా విస్తరణకు ముందడుగు పడింది. బీవోటీ (బిల్డ్, ఆపరేట్, ట్రాన్స్ఫర్) విధానంలో రోడ్డు విస్తరించే పనులకు టెండర్లను ఆహ్వానిస్తూ ఎన్హెచ్ఏఐ ఈ నెల 23న నోటిఫికేషన్ జారీ చేసింది. ఎన్హెచ్ఏఐ రూపొందించిన విస్తరణ డీపీఆర్‌కు పబ్లిక్–ప్రైవేట్ భాగస్వామ్య అప్రైజర్ కమిటీ ప్రాథమికంగా ఆమోదం తెలిపింది. దీనిని కేంద్ర ఆర్థిక వ్యవహారాల క్యాబినేట్ కమిటీ (సీసీఈఏ) తుది అనుమతులు ఇవ్వాల్సి ఉంది. ఇది లాంఛనమేనని సమాచారం. నవంబర్ 25న టెండర్లు ఖరారు చేయనున్నారు. జాతీయ రహదారి–65ను దండు మల్కాపురం నుంచి ఏపీలోని మచిలీపట్నం వరకు మూడు ప్యాకేజీలుగా విభజించి విస్తరణ పనులు చేయపట్టనుండగా యాదాద్రి భువనగిరి జిల్లా దండు మల్కాపురం నుంచి ఏపీలోని ఎన్టీఆర్ కృష్ణాజిల్లా నందిగామ సమీపంలోని మునగచర్ల వరకు మొదటి ప్యాకేజీ కింద రోడ్డును ఆరు వరుసలుగా విస్తరించనున్నారు. మొదటి ప్యాకేజీలోనే.. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం నుంచి ఏపీలోని ఎన్టీఆర్ కృష్ణా జిల్లా నందిగామ వరకు మొదటి ప్యాకేజీ కింద పనులు చేపట్టనున్నారు. ఇందులో మొత్తం 181.300 కిలోమీటర్ల మేర విస్తరణ చేపట్టాల్సి ఉంది. ఇందుకు గానూ రూ. 6,792.52 కోట్ల అంచనా వ్యయంతో ఎన్‌హెచ్ అధికారులు టెండర్లు పిలిచారు. దండుమల్కాపురం నుంచి తెలంగాణ–ఏపీ సరిహద్దుగా ఉన్న కోదాడ మండలం రామాపురం క్రాస్‌రోడ్డు వరకు 155 కిలోమీటర్ల మేర రోడ్డును విస్తరించనున్నారు. పరిమిత సంఖ్యలో ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు జాతీయ రహదారిపై ప్రమాదాల సంఖ్యను తగ్గించడానికి రోడ్డు విస్తరణతో పాటు సర్వీస్రోడ్లను, అండర్‌పాస్‌లను పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయనున్నారు. రహదారిపైకి రావడానికి 15 నుంచి 18 కిలోమీటర్లకు ఒక ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ మాత్రమే ఉంటుందని, ఇష్టానుసారంగా రోడ్డుమీదకు రావడానికి వీలుండదని జాతీయ రహదారుల అధికారులు చెబుతున్నారు. రోడ్డు వెంట ఉన్నవారు సర్వీస్ రోడ్డను, రోడ్డు దాటేందుకు అండర్‌పాస్‌లను ఉపయోగించాల్సి ఉంటుంది. ప్రస్తుతం బ్లాక్స్పాట్లుగా గుర్తించిన ప్రాంతాలలో ప్రమాదాల నివారణకు తగిన చర్యలు తీసుకోవడంతో పాటు రోడ్డు నిర్మాణంలో లోపాలను సరిచేస్తామని అధికారులు పేర్కొంటున్నారు. దండు మల్కాపురం నుంచి నందిగామ వరకు 60 వెహికిల్ అండర్‌పాస్‌ల నిర్మాణం చేపట్టనుండగా .. ఉమ్మడి జిల్లా పరిధిలో అదనంగా మరో 36 అండర్‌పాస్‌లు రానున్నాయి. గుర్తించిన ప్రదేశాలలో పశువులు రోడ్డు దాటేందుకు ప్రత్యేకంగా 10 అండర్‌పాస్‌ల నిర్మాణం చేయనున్నారు. స్మార్ట్ హైవేగా.. ఎన్‌హెచ్–65ను ఆరులేన్లుగా విస్తరించే క్రమంలో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(ఏఐ) ఆధారిత హైసెక్యూరిటీ విధానాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇందులో భాగంగా ఏఐ అనుసంధాన సీసీ కెమెరాలను అమర్చి నిత్యం నిఘాను ఏర్పాటు చేయనున్నారు. ఏఎన్పీఆర్(ఆటోమెటిక్ నంబర్ప్లెట్ రికగ్నేషన్) కెమెరాల ద్వారా వాహనాల రిజిస్ట్రేషన్, ఇతర వివరాలను గుర్తించనున్నారు. ఈ కెమెరాలు ఇన్ఫ్రారెడ్ కాంతి ద్వారా పగలు, రాత్రి అనే తేడా లేకుండా వాహనాల చిత్రాలను వందశాతం క్లారిటీగా తీయగలుగుతాయి. ఫ రూ. 6,792.52 కోట్లతో 181.3 కి.మీ విస్తరణ ఫ దండుమల్కాపురం– నందిగామ వరకు మొదటి ప్యాకేజీ ఫ ఉమ్మడి జిల్లాలో 155 కి.మీ మేర వెడల్పు ఫ పూర్తిస్థాయిలో అండర్‌పాస్‌లు, సర్వీస్‌రోడ్ల నిర్మాణం జాతీయ రహదారి – 65 విస్తరణకు టెండర్లు2012లో విజయవాడ–హైదరాబాద్ హైవేను నాలుగు లేన్లుగా విస్తరించిన సమయంలోనే 6 వరుసలకు అవసరమయ్యే భూమిని ఎన్‌హెచ్ అధికారులు సేకరించారు. కల్వర్టులు, ప్లైఓవర్లు, వంతెనలు సైతం ఆరు వరుసలకు సరిపోయేలా నిర్మించారు. దాంతో ప్రస్తుతం ఆరు వరుసల రోడ్డు విస్తరణకు భూసేకరణ పెద్దగా అవసరం ఉండదని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం రోడ్డు విస్తరణకు ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో మొత్తం 25.8 హెక్టార్లు (సుమారు 64 ఎకరాల) భూమిని సేకరించనున్నారు. భూ సేకరణ బాధ్యతను ఉమ్మడి జిల్లాలోని నలుగురు ఆర్డీఓలకు అప్పగించారు. చిట్యాల, నార్కట్‌పల్లి, కట్టంగూర్, నకిరేకల్, కేతేపల్లి మండలాల పరిధిలో 6.32 హెక్టార్ల భూముల సేకరణకు నల్లగొండ ఆర్డీఓ నోటిఫికేషన్ జారీ చేశారు. భువనగిరి, సూర్యాపేట, కోదాడ ఆర్డీఓలు త్వరలోనే భూ సేకరణ నోటిఫికేషన్ జారీచేయనున్నారు. -
ఆర్ఐ సస్పెన్షన్
భువనగిరి టౌన్ : రెవెన్యూ రికార్డులను సమగ్రంగా పరిశీలించకుండా, క్షేత్రస్థాయి విచారణ చేపట్టకుండా ఉన్నతాధికారులను తప్పుదోవ పట్టించి అక్రమాలకు పాల్పడిన గుండాల మండల తహసీల్దార్ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్, ఇన్చార్జ్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ (ఆర్ఐ) బి.శ్రీనివాసరావును సస్పెండ్ చేస్తూ ఇన్చార్జ్ కలెక్టర్ ఎ.భాస్కర్‌రావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. వివరాలు.. గుండాల గ్రామం, మండల పరిధిలోని సర్వే నంబర్ 237 (విస్తీర్ణం 3.09 ఎకరాలు), సర్వే నంబర్ 238 (విస్తీర్ణం 5.36 ఎకరాలు) భూములకు సంబంధించి పాస్ పుస్తక డేటా సవరణ కోసం దరఖాస్తులు దాఖలయ్యాయి. ప్రాథమిక విచారణ ప్రకారం ఈ భూమికి సంబంధించి వారసుల మధ్య కుటుంబ వివాదాలు ఉన్నట్లు తేలింది. అయితే, ఆ వివాదాస్పద భూమి రికార్డులను నిశితంగా పరిశీలించకుండా, క్షేత్రస్థాయి విచారణ జరపకుండానే తప్పుడు విచారణ నివేదికలు, పంచనామాలను శ్రీనివాసరావు సిద్ధం చేశారు. అనంతరం భూ–భారతి పోర్టల్ ద్వారా ఉన్నతాధికారులకు తప్పుడు సిఫార్సులతో ఫైళ్లను పంపి, రికార్డులలో అక్రమంగా మార్పులు చేయడంతో పాటు తప్పుడు పాస్‌పుస్తకాలు జారీ అయ్యేలా చేశారు. ఈ వ్యవహారంపై భువనగిరి ఆర్డీఓ సమర్పించిన నివేదిక ఆధారంగా శ్రీనివాసరావును కలెక్టర్ సస్పెండ్ చేశారు. మానసిక వికలాంగుల ఆశ్రమం తనిఖీవలిగొండ: రామన్నపేట అదనపు జూనియర్ సివిల్ జడ్జి కమ్ ఫస్ట్ క్లాస్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ రత్నకుమారి శుక్రవారం వలిగొండ మండలంలోని టేకులసోమారంలో ఉన్న సాధన మానసిక వికలాంగుల ఆశ్రమాన్ని సందర్శించారు. అదేవిధంగా వలిగొండ మండల కేంద్రంలోని శాంతి నిలయంను సందర్శించి, అక్కడ చదువుకుంటున్న అనాథ పిల్లలకు అందుతున్న సేవలను పరిశీలించారు. ఆశ్రమాల్లోని వసతులు, భోజనశాల, వంటగది, మరుగుదొడ్లు, ఆహార పదార్థాలు, సిబ్బంది హాజరు రిజిస్టర్‌ను తనిఖీ చేశారు. సాధన సెంటర్లో భోజనశాల వద్ద తగినంత వెలుతురు లేకపోవడం, మరుగుదొడ్లు అపరిశుభ్రంగా ఉండి దుర్వాసన రావడం, వంటకు ఉపయోగించే నీటిని దుమ్ము, ధూళి పడేలా నీలిరంగు డ్రమ్ములో నిల్వ చేయడం వంటి లోపాలను గుర్తించారు. వికలాంగులకు, నాణ్య మైన ఆహారం అందించాలని ఆదేశించారు. పెన్షన్ల పరిశీలనకు తీవ్ర ఆటంకంభువనగిరిటౌన్ : దసరా పండుగ నాటికి లబ్ధిదారులకు కొత్త పెన్షన్లు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన అర్హుల పరిశీలన ప్రక్రియ క్షేత్రస్థాయిలో తీవ్ర ఇబ్బందుల నడుమ కొనసాగుతోంది. అధికారిక యాప్‌లో సర్వర్ సమస్యలు తలెత్తడంతో సిబ్బంది తీవ్ర అవస్థలు పడుతున్నారు. సర్వర్ మొరాయించడంతో జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. క్షేత్రస్థాయిలో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వివరాలు, ఫొటోలు, ధ్రువీకరణ పత్రాలు అప్లోడ్ చేస్తుంటే.. ఒక్కో వివరానికి ఐదు నుంచి పది నిమిషాల సమయం తీసుకుంటోందని సిబ్బంది వాపోతున్నారు. మరోవైపు ఈ నెల 30వ తేదీ నాటికి పరిశీలన పూర్తి చేయాల్సి ఉండడంతో గడువులోగా లక్ష్యాన్ని ఎలా పూర్తి చేయాలని క్షేత్రస్థాయి సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. దసరాలోపు నేతన్న భరోసా నిధులు భూదాన్‌పోచంపల్లి : దసరా పండుగ లోపు నేతన్న భరోసా, త్రిఫ్ట్ డబ్బులను కార్మికుల ఖాతాలో జమ చేయుటకు ప్రభుత్వం హామి ఇచ్చిందని పోచంపల్లి చేనేత కార్మిక సంఘం అధ్యక్షుడు అంకం పాండు తెలిపారు. శుక్రవారం ఆయన భూదాన్‌పోచంపల్లి పట్టణ కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. ఈ సమావేశంలో ఉపాధ్యక్షుడు భారత్ భూషణ్, ప్రధానకార్యదర్శి బొమ్మ హరిశంకర్, కోశాధికారి సూర్యప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు. -
నేనే బాస్.. రెండో లీడర్ లేడు : సామేల్
మోత్కూరు : ‘తుంగతుర్తి నియోజకవర్గానికి నేనే బాస్‌ను, రెండో లీడర్ అనే వారు లేరు. నేను చెప్పిందే వేదం’ అని ఎమ్మెల్యే మందుల సామేల్ ప్రకటించారు. శుక్రవారం మోత్కూరులో కాంగ్రెస్ మున్సిపాలిటీ శాఖ అధ్యక్షుడిగా బద్దం నాగార్జునరెడ్డిని నియామిస్తూ ఉత్తర్వులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎవరు కమిటీలు వేసినా చెల్లవని, మండల కమిటీల ద్వారానే నియామకాలు తాను ఆమోదిస్తానని స్పష్టం చేశారు. భువనగిరి డీసీసీ అధ్యక్షుడు బీర్ల ఐలయ్య ఆదేశాల మేరకు కమిటీల అధ్యక్షుల నియామకం చేసినట్లు తెలిపారు. తుంగతుర్తి నియోజకవర్గానికి తన జీవితాన్ని అంకితం చేశానని చెప్పారు. మోత్కూరులో 30 పడకల ఆసుపత్రి కోసం ఆరోగ్య శాఖ మంత్రితో చర్చించానని, మంజూరు చేస్తానని హామీ ఇచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సింగిల్‌విండో చైర్మన్ పేలపూడి వెంకటేశ్వర్లు, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రాచకొండ బాలరాజుగౌడ్, పట్టణ నూ తన అధ్యక్షుడు బద్దం నాగార్జునరెడ్డి పాల్గొన్నారు. -
పీఏసీఎస్‌లో అవకతవకలు
యాదగిరిగుట్ట రూరల్ : యాదగిరిగుట్ట ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (పీఏసీఎస్)లో యూరియా బస్తాల విక్రయానికి సంబంధించిన డబ్బులు రూ.23,50,000 గల్లంతైన ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో ఇటీవల బాధ్యతలు చేపట్టిన చైర్మన్ చీర శ్రీశైలంతో పాటు సహకార సంఘ రైతులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. శుక్రవారం పీఏసీఎస్ చైర్మన్ చీర శ్రీశైలం అధ్యక్షతన అర్ధవార్షిక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యతోపాటు డైరెక్టర్లు రైతులు కూడా పాల్గొన్నారు. ఈ సమావేశంలోనే అవకతవకల అంశం తెరపైకి వచ్చింది. 5 సేల్ పాయింట్లు యాదగిరిగుట్ట పీఏసీఎస్ పరిధిలో పట్టణంతో పాటు 12 గ్రామాలు ఉన్నాయి. కాచారం, మల్లాపురం, మసాయిపేట, బాహుపేట, యాదగిరిగుట్ట ప్రాంతాల్లో 5 సేల్ పాయింట్లు ఉన్నాయి. గత పాలకవర్గం హయాంలో, ఈ ఏడాది మార్చి నుంచి జూన్ నెల వరకు రైతులకు యూరియా, డీఏపీ బస్తాలను అమ్మారు. ఇందులో 2,700 యూరియా బస్తాలను, ఒక్కో బస్తా రూ.320 చొప్పున అమ్మగా రూ.8,64,000 వచ్చాయి. అదేవిధంగా గ్రోమోర్ డీఏపీ 420 బస్తాలను, ఒక్కో బస్తా రూ.2,100 చొప్పున విక్రయించగా రూ.8,82,000 వచ్చాయి. వీటితో పాటు మరికొన్ని బస్తాలు అమ్మినా కంప్యూటర్లో మాత్రం నమోదు చేయలేదు. మొత్తంగా రైతుల వద్ద నుంచి వసూలు చేసిన రూ.23,50,000 నగదును బ్యాంకులో జమ చేయలేదు. నూతన చైర్మన్ జూలైలో బాధ్యతలు చేపట్టారు. ఇటీవల ఆడిట్ చేయించడంతో ఈ విషయం బయటపడింది. ఈ డబ్బులు ఎవరు తీసుకున్నారని సిబ్బందిని, సీఈఓను అడిగినా ఎవరూ నోరు మెదపలేదు. నిలదీసిన విప్ అయిలయ్య రైతులకు యూరియా అమ్మగా వచ్చిన డబ్బులను బ్యాంకులో జమచేయకుండా ఏం చేశారని పీఏసీఎస్ సీఈఓను, సిబ్బందిని శుక్రవారం జరిగిన సమావేశంలో విప్ అయిలయ్య నిలదీశారు. అయితే వారి నుంచి స్పష్టత రాలేదు. దీంతో యాదగిరిగుట్ట పీఏసీఎస్‌లో యూరియా డబ్బులు మాయమయ్యాయని, దీనిపై వెంటనే సమగ్ర విచారణ జరిపించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో బీర్ల అయిలయ్య ఫోన్లో మాట్లాడారు. విచారణ జరిపించి బాధ్యులపై తక్షణమే చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. ఫ రైతులకు అమ్మిన యూరియా బస్తాల డబ్బులు బ్యాంకులో జమ చేయని సిబ్బంది ఫ రూ.23 లక్షల 50 వేలులెక్కలు చూపలేదని అంచనాయాదగిరిగుట్ట పీఏసీఎస్‌లో స్టాక్ వెరిఫికేషన్ నిర్వహించడంతోనే ఈ నిధుల వ్యత్యాసం బయటపడింది. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరుపుతాం. నిబంధనల ప్రకారం స్టాక్ అమ్మిన వెంటనే సేల్ పాయింట్ నిర్వాహకులు నగదును బ్యాంకులో జమ చేయాలి, కానీ ఇక్కడ అలా చేయలేదు. –నాగరాజు, డీసీఓ, యాదాద్రి భువనగిరి జిల్లా -
వైద్య వ్యవస్థలో ఫార్మసీ కీలకం
భువనగిరి: ఫార్మసీ వైద్య వ్యవస్థలో కీలకమైన విభాగమని డీఎంహెచ్ఓ డాక్టర్ మనోహర్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని ఎన్ఐసీ హాల్లో ప్రపంచ ఫార్మసిస్టుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరై ఆయన మాట్లాడారు. వైద్యులు, ఫార్మసిస్టులు, నర్సింగ్ సిబ్బంది, ల్యాబ్ సిబ్బంది, ఇతర ఆరోగ్య సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని సూచించారు. మందుల నిల్వ, పంపిణీ, వైద్యుల సూచనల మేరకు వాటి వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించడంలో ఫార్మసిస్టుల పాత్ర కీలకమైనదని అన్నారు. అనంతరం ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఫార్మసిస్టులు శ్రీనివాస్, సరిత, నిర్మల, ఉమారాణిలను సన్మానించారు. కార్యక్రమంలో డీఐఓ డాక్టర్ రామకృష్ణ, పీఓ డాక్టర్ వీణ, డెమో పద్మ, జిల్లా స్టోర్ ఇన్చార్జ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీ
వలిగొండ : మండల కేంద్రంలో ఆహార భద్రత ప్రమాణాల అమలుపై అధికారులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. జిల్లా ఇన్చార్జ్ ఫుడ్ సేఫ్టీ అధికారి శివ శంకర్ రెడ్డి శుక్రవారం వలిగొండలోని సంజయ్ బెంగళూరు బేకరీ, శ్రీ రాజశ్యామల హోటల్ అండ్ రెస్టారెంట్లను తనిఖీ చేశారు. ఆహార పదార్థాల తయారీ, పరిశుభ్రత ప్రమాణాలు సక్రమంగా పాటించకపోవడం వంటి లోపాలను గుర్తించారు. కేక్ తయారీ ప్రాంతం, హోటల్ వంటగది, రిఫ్రిజిరేటర్లు సక్రమంగా శుభ్రపరచకపోవడంతో స్వీట్లు, పఫ్‌లు, కేక్ క్రీములు, బిస్కెట్లు తదితర ఆహార పదార్థాలను ధ్వంసం చేశారు. పలు పదార్థాల నమూనాలను ప్రయోగశాలకు పంపించారు. ఆహార భద్రత ప్రమాణాలను పాటించని వారికి నోటీసులు జారీ చేశారు. చెన్నాయిపాలెం రేషన్ డీలర్ సస్పెన్షన్మఠంపల్లి : మండలంలోని చెన్నాయిపాలెం రేషన్ దుకాణం (నెం.8) డీలర్ భూక్యా అనితను సస్పెండ్ చేస్తూ ఆర్డీఓ శ్రీనివాసులు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. డీలర్ అనితకు పాలకీడు మండలం దేవ్లాతండాకు చెందిన మాలోతు రాజేష్‌తో ఈ ఏడాది మే 6వ తేదీన వివాహం జరిగింది. అప్పటి నుంచి ఆమె గ్రామంలో అందుబాటులో ఉండటం లేదని, ఆమె కుటుంబ సభ్యులే నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నారని గ్రామస్తుల నుంచి ఫిర్యాదులు అందాయి. డీలర్ అందుబాటులో లేకపోవడంతో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయని వచ్చిన ఫిర్యాదుల మేరకు అధికారులు విచారణ చేపట్టారు. విచారణ అనంతరం ఆమెను సస్పెండ్ చేసి, ప్రజలకు నిత్యావసర సరుకులు అందజేసే బాధ్యతను డీలర్ వడిత్యా శ్రీనుకు అప్పగించినట్లు ఆర్డీఓ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
ఉపాధ్యాయుల గైర్హాజరు.. విద్యార్థుల ఇబ్బందులు
మునుగోడు (మర్రిగూడ): మర్రిగూడ మండలంలోని బట్లపల్లి ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుల గైర్హాజరుతో శుక్రవారం విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పాఠశాలలో మొత్తం 17 మంది విద్యార్థులకు 13 మంది హాజరయ్యారు. అయితే ఇక్కడ పనిచేస్తున్న ఇద్దరు ఉపాధ్యాయుల్లో ఒకరు సెప్టెంబర్ 2 నుంచి ప్రసూతి సెలవులో (మెటర్నిటీ లీవ్) ఉండగా, ప్రధానోపాధ్యాయుడు శుక్రవారం సెలవు పెట్టారు. దీంతో పాఠశాలలో విద్యార్థుల బాధ్యతను అటెండరే చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు, ఉదయమే నమోదు చేయాల్సిన విద్యార్థుల ఎఫ్ఆర్ఎస్ (ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్) హాజరు ఫొటోలను.. మధ్యాహ్నం 2 గంటల తరువాత సీఆర్పీ కృష్ణ పాఠశాలకు వచ్చి తీయడం గమనార్హం. ఉపాధ్యాయుడు సెలవు తీసుకుంటున్న విషయాన్ని తనకు ఆలస్యంగా సమాచారం ఇచ్చారని సంబంధిత కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు రూప్సింగ్ పేర్కొన్నారు. టీచర్లు సెలవులో ఉన్నప్పుడు విద్యార్థుల భద్రత, బోధనకు ఆటంకం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉపాధ్యాయుల గైర్హాజరుపై స్థానిక ఎంఈఓ శారదను సంప్రదించగా ఆమె స్పందించలేదు. ఒకరు ప్రసూతి సెలవు.. మరొకరు ఆకస్మిక లీవ్ విద్యార్థుల బాధ్యత చూసుకున్న అటెండర్ -
మూసీకి 3వేల క్యూసెక్కుల వరద
కేతేపల్లి : మూసీ ప్రాజెక్టుకు వరదనీటి రాక కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో రెండు రోజులుగా మూసీకి వరద వస్తోంది. శుక్రవారం 3వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరింది. 645 అడుగుల గరిష్ట నీటిమట్టం గల మూసీ రిజర్వాయర్‌లో శుక్రవారం సాయంత్రానికి 641.60 అడుగులకు చేరుకుంది. మూసీ ఆయకట్టులో వానాకాలం పంటల సాగు కోసం మూసీ కుడి ప్రధాన కాల్వకు 138 క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 254 క్యూసెక్కుల చొప్పున మొత్తం 392 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. లీకేజీ, సీపేజీ, ఆవిరి రూపంలో 50 క్యూసెక్కుల నీరు వృథా అవుతుంది. మూసీ రిజర్వాయర్‌లో పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 4.46 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 3.57 టీఎంసీల నీరు నిల్వ ఉందని అధికారులు తెలిపారు. ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరిగితే రిజర్వాయర్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసే అవకాశం ఉందని, పరీవాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. గొర్రెలు, పశువుల కాపరులు, రైతులు, జాలర్లు మూసీ వాగులోకి వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. -
ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టాలి
భువనగిరిటౌన్ : గ్రామాల్లో ఫామ్ పాండ్లు, ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టడంతో పాటు భూగర్భ జలాలు పెంపొందే పనులకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని ఇన్చార్జ్ కలెక్టర్ భాస్కర్ రావు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో వికసిత్ గ్రామ పంచాయతీ ప్రణాళిక తయారీ, వీబీజీ రామ్‌జీ పనుల గుర్తింపుపై సర్పంచులు, గ్రామ కార్యదర్శులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీల సర్వతోముఖాభివృద్ధికి అందుబాటులో ఉన్న సహజ, సామాజిక వనరుల మ్యాపింగ్ ఆధారంగా శాసీ్త్రయ ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. ఈ ఏడాది వర్షపాతం తక్కువగా నమోదైన దృష్ట్యా భవిష్యత్‌లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు రక్షణ చర్యలు చేపట్టాలన్నారు. క్షేత్రస్థాయిలో గుర్తించిన పనులను అక్టోబర్ 2న నిర్వహించే గాంధీ జయంతి ప్రత్యేక గ్రామసభల్లో ఆమోదం పొందాలని స్పష్టం చేశారు. అనంతరం వీజీపీపీ రూపకల్పన, అమలు విధానాలపై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సర్పంచులు, కార్యదర్శులకు అవగాహన కల్పించారు. ఈ సదస్సులో డిప్యూటీ కమిషనర్ (పీఎంఓ) సరిత, జెడ్పీ సీఈఓ శోభారాణి, డీఆర్డీఓ నాగిరెడ్డి, అదనపు డీఆర్డీఓ సురేష్, డిప్యూటీ సీఈఓ శ్రీనివాస్, ఏపీడీ నవీన్, రిసోర్స్ పర్సన్ రాజశేఖర్ పాల్గొన్నారు.ఫ ఇన్చార్జ్ కలెక్టర్ భాస్కర్ రావు -
ఎస్‌ఎన్‌సీయూపై అలర్ట్
భువనగిరి : ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలోని ప్రత్యేక నవజాత శిశు సంరక్షణ యూనిట్ (ఎస్ఎన్సీయూ) లో ఐదుగురు పసికందులు మృతి చెందిన దారుణ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ నేపథ్యంలో భువనగిరి జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలోని మాతా శిశు సంరక్షణ కేంద్రం (ఎంసీహెచ్) భద్రతపై అధికారులు అప్రమత్తమ య్యారు. భువనగిరి ప్రభుత్వ జనర్ ఆస్పత్రిలోని ఎస్ఎన్సీయూ(స్పెషల్ న్యూ బార్న్ కేర్ యూనిట్) నిర్వహణపై విభాగ వైద్యులు, సిబ్బందితో అత్యవసర సమావేశం నిర్వహించి ముందస్తు జాగ్రత్తలపై దిశానిర్దేశం చేశారు. 18 మంది శిశువుల చికిత్సకు సామర్థ్యం గతంలో 100 పడకల ఏరియా ఆస్పత్రిగా ఉన్న ఈ వైద్యశాల, జిల్లాల పునర్విభజన అనంతరం జిల్లా కేంద్ర ఆస్పత్రిగా మారింది. 2024లో ప్రభుత్వ వైద్య కళాశాల మంజూరు కావడంతో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) పరిధిలోకి వెళ్లి జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిగా రూపాంతరం చెందింది. మాతా శిశు సంరక్షణ విభాగానికి ప్రత్యేక భవనం ఉండాల్సి ఉన్నా.. ప్రస్తుతానికి పాత ఆస్పత్రి భవనంలోనే చాలీచాలని వార్డుల్లో సేవలు అందిస్తున్నారు. 2022 మే 20న రూ.45 లక్షలతో ఆధునీకరించిన ఎస్ఎన్సీయూ కేంద్రాన్ని పునఃప్రారంభించారు. ఇందులో తక్కువ బరువుతో పుట్టిన, నెలలు నిండని సుమారు 18 మంది పసికందులకు వార్మర్లలో చికిత్స అందించే వెసులుబాటు ఉంది. పిడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో మరో 12 మంది పిల్లలకు వైద్యం అందించవచ్చు. రోజుకు 12 ప్రసవాలు.. ఈ ఆస్పత్రిలో ప్రసవాల సంఖ్య గణనీయంగా ఉంటోంది. రోజుకు సగటున 8 నుంచి 12 ప్రసవాలు జరుగుతున్నాయి. నెలలు నిండకుండా పుట్టడం, తక్కువ బరువు, శ్వాసకోశ లేదా ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడే పసికందులను ఎస్‌ఎన్‌సీయూలో చేర్చి వెంటిలేటర్లు, ఇతర అత్యాధునిక పరికరాలతో అత్యవసర వైద్యం అందిస్తున్నారు. తల్లి గర్భంలో ఉన్నట్లు వెచ్చదనాన్ని అందించే వార్మర్లు శిశువు త్వరగా కోలుకోవడానికి ఎంతగానో తోడ్పడుతున్నాయి. జిల్లాలోని వివిధ మండలాల నుంచి కూడా ఇక్కడికి రెఫరల్ కేసులు వస్తుండడంతో ఎస్‌ఎన్‌సీయూపై ఒత్తిడి పెరుగుతోంది. ఎస్ఎన్సీయూలోని వార్మర్లు, ఇంక్యుబేటర్లు, ఏసీలు, పల్స్ బీపీ మానిటర్లు, ఫోటోథెరపీ, వెంటిలేటర్లు, సిరంజి పంపులు వంటి పరికరాలన్నీ పూర్తిస్థాయిలో విద్యుత్‌పైనే ఆధారపడి పనిచేస్తాయి. ఏమాత్రం విద్యుత్ అంతరాయం ఏర్పడినా పసికందుల ప్రాణాలకే ప్రమాదం. దీంతో ఆస్పత్రి యాజమాన్యం ప్రత్యామ్నాయంగా నిరంతర విద్యుత్ సరఫరా కోసం ఆటోమేటిక్ జనరేటర్ సౌకర్యాన్ని అందుబాటులో ఉంచింది. ఎలాంటి సాంకేతిక లోపాలు తలెత్తకుండా ఎప్పటికప్పుడు విద్యుత్ పరికరాలను, కేబులింగ్‌ను తనిఖీ చేస్తున్నారు.జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలోని ఎస్‌ఎన్‌సీయూలో అన్ని వ్యవస్థలూ సక్రమంగా పనిచేస్తున్నాయి. విద్యుత్ అంతరాయం ఏర్పడినా సేవలకు భంగం కలగకుండా తక్షణమే జనరేటర్ బ్యాకప్ పనిచేసేలా ఏర్పాట్లు చేశాం. పసికందులకు ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా ఎప్పటికప్పుడు వార్డును స్వయంగా పర్యవేక్షిస్తున్నాం. ఇటీవలే ఎస్ఎన్సీయూ వైద్యులు, సిబ్బందితో సమావేశమై అత్యవసర సమయాల్లో వ్యవహరించాల్సిన తీరుపై పలు సూచనలు చేశాం. –డాక్టర్ లక్ష్మణ్, ఇన్చార్జ్ సూపరింటెండెంట్ ఫ భువనగిరి జిల్లా కేంద్ర ఆస్పత్రిలోని నవజాత శిశు సంరక్షణ విభాగంపై ప్రత్యేక పర్యవేక్షణ ఫ ఆస్పత్రి సిబ్బందితో ఇన్చార్జ్ సూపరింటెండెంట్ సమీక్ష ఫ ఆదిలాబాద్ రిమ్స్ ఘటనతో అప్రమత్తమైన వైద్యులు -
వ్యాపారులపై ట్రాఫిక్ చలాన్ల మోత
చౌటుప్పల్ : చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో ట్రాఫిక్ పోలీసుల తీరు వ్యాపారులకు, స్థానిక ప్రజలకు శాపంగా మారింది. ట్రాఫిక్ నియంత్రణను పక్కనబెట్టి, కేవలం చలాన్లు విధించడమే లక్ష్యంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని వ్యాపారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోజువారీ టార్గెట్లు పూర్తి చేసుకోవడమే ధ్యేయంగా దొంగచాటుగా సెల్ఫోన్లలో ఫొటోలు తీస్తూ వేధింపులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అండర్‌పాస్ పనులతో మూడేళ్లుగా నష్టాలు పట్టణంలో జాతీయ రహదారిపై అండర్‌పాస్ బ్రిడ్జి నిర్మాణం మూడేళ్లుగా సాగుతోంది. పనులు నత్తనడకన సాగుతుండటంతో జాతీయ రహదారి వెంట ఉన్న వ్యాపారాలు దెబ్బతిన్నాయి. అద్దెలు కూడా చెల్లించలేక పలువురు దుకాణాలు మూసివేయగా, మరికొందరు గల్లీల్లోకి మకాం మార్చారు. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ వ్యాపారం చేసుకుంటున్న వారికి ట్రాఫిక్ పోలీసుల చలాన్ల వేధింపులు మనశ్శాంతి లేకుండా చేస్తున్నాయి. సర్వీస్ రోడ్లే దిక్కు.. అండర్‌పాస్ పనుల వల్ల ప్రధాన రహదారి మూతపడటంతో వాహనాలన్నీ సర్వీస్ రోడ్ల మీదుగానే రాకపోకలు సాగిస్తున్నాయి. దీంతో హోల్‌సేల్ డీలర్లు, ఇతర ప్రాంతాల నుంచి సరుకులు తెచ్చే వాహనాలు తప్పనిసరి పరిస్థితుల్లో సర్వీస్ రోడ్డుపైనే వాహనాలు నిలిపి సరుకులు దింపాల్సి వస్తోంది. అయితే ప్రత్యామ్నాయం లేదన్న విషయం తెలిసి కూడా పోలీసులు రాంగ్ పార్కింగ్ పేరుతో చలాన్లు బాదుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. గతంలో కేవలం బస్టాండ్, తంగడపల్లి క్రాస్ రోడ్డు వద్ద మాత్రమే పరిమితమైన ఈ చలాన్ల గోల.. ఇప్పుడు ఆర్టీసీ బస్టాండ్ నుంచి వలిగొండ క్రాస్ రోడ్డు వరకు పట్టణమంతా విస్తరించింది. ఇటీవల స్థానిక హోల్‌సేల్ వ్యాపారికి చెందిన ఓ సరుకు రవాణా వాహనానికి గత రెండు నెలల్లోనే ఏకంగా 23 చలాన్లు విధించారు. వీటి ద్వారా రూ.6,105 పెండింగ్‌లో ఉండగా, ఈ నెలలో పడిన మరిన్ని చలాన్లు కలిపితే ఆ మొత్తం రూ.10 వేలు దాటేలా ఉంది. సరుకు రవాణా వాహనాలపై ఇష్టానుసారంగా జరిమానాలు నో పార్కింగ్, రాంగ్ పార్కింగ్ పేరుతో ఫొటోలు చౌటుప్పల్‌లో వాహనం బయటకు తీయాలంటేనే జంకుతున్న దుకాణదారులువెసులుబాటు కల్పిస్తాం చౌటుప్పల్‌లో అండర్‌పాస్ పనుల వల్ల నెలకొన్న పరిస్థితులు మా దృష్టికి వచ్చాయి. వ్యాపారులు సరుకులు దిగుమతి చేసుకునేందుకు నిబంధనల ప్రకారం వెసులుబాటు కల్పిస్తాం. ట్రాఫిక్ ఎక్కువగా ఉండే వేళల్లో కాకుండా, మిగతా సమయాల్లో సరుకులు దింపుకోవడానికి చర్యలు తీసుకుంటాం. – ప్రభాకర్ రెడ్డి, డీఎస్పీ -
రథసారథి మనోడే..
సూర్యాపేట (ఆత్మకూరు.ఎస్): ఆత్మకూరు.ఎస్ మండల పరిధిలోని ముక్కుడు దేవులపల్లి గ్రామానికి చెందిన మందడి వెంకట్‌రెడ్డి ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనం సందర్భంగా భారీ ట్రక్కు (టస్కర్) నడిపారు. ఈయన గత 26 సంవత్సరాలుగా విజయవాడకు చెందిన ఎస్టీసీ ట్రాన్స్‌పోర్ట్‌లో డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. వెంకటరెడ్డి నైపుణ్యాన్ని గుర్తించిన యాజమాన్యం బడా గణేష్ నిమజ్జనం సందర్భంగా లక్షలాది మందిలో టస్కర్ నడిపేందుకు అవకాశం కల్పించారు. దీంతో 2017, 2020, 2025, ప్రస్తుతం 2026 లో కూడా టస్కర్ నడిపే అవకాశం వెంకట్‌రెడ్డికే దక్కింది. ప్రస్తుత గణేష్ శోభాయాత్ర సందర్భంగా లక్షలాది భక్త జనం మధ్యలో ఖైరతాబాద్ నుంచి ట్యాంక్ బండ్ వరకు టస్కర్‌ను ఎలాంటి విఘాతాలు లేకుండా నడిపి వినాయకుడి నిమజ్జనం ప్రశాంతంగా జరగడానికి కృషి చేశారు. అబ్దుల్ బారి అంత్యక్రియలు పూర్తినల్లగొండ: మిర్యాలగూడకు చెందిన ప్రణయ్ హత్య కేసులో ఏ–ఫోర్ నిందితుడు, కేంద్ర మంత్రి అరుణ్ పాండే హత్య కేసులో నిందితుడు నల్లగొండకు చెందిన అబ్దుల్ బారి అంత్యక్రియలు శుక్రవారం రాత్రి పూర్తయ్యాయి. హైదరాబాదులోని చంచల్‌గూడ జైలులో ఉన్న బారికి గుండెపోటు రావడంతో అధికారులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే. శుక్రవారం గాంధీ ఆసుపత్రిలో ఆయన మృతదేహానికి పంచనామా నిర్వహించిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. నల్లగొండ పట్టణంలోని అవ్వల్ తాలూక్ దారీ మసీదులో నమాజ్ ఏ జనాజా నిర్వహించారు. అనంతరం మసీదు ఎదురుగా ఉన్న ఖబరస్తాన్‌లో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. -
ఉమ్మడి జిల్లా హ్యాండ్‌బాల్ జట్ల ఎంపిక
కట్టంగూర్ : మండలంలోని చెర్వుఅన్నారం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శుక్రవారం ఎస్జీఎఫ్ఐ (స్కూల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా) ఆధ్వర్యంలో నిర్వహించిన అండర్–14, 17 బాలబాలికల హ్యాండ్‌బాల్ పోటీల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లా జట్లను ఎంపిక చేశారు. వీరు త్వరలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని పాఠశాల హెచ్ఎం కందాల రమ తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఎస్జీఎఫ్ కార్యదర్శి శ్రీనివాసరెడ్డి, సర్పంచ్ చిలుముల సైదులు, ఆర్గనైజింగ్ సెక్రటరీ చింతకాయల పుల్లయ్య, కన్వీనర్ శ్రీనివాస్, నంధ్యాల రాజశేఖర్‌రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో విద్యుత్ లైన్మెన్కు తీవ్రగాయాలు
కట్టంగూర్ : మండలంలోని ముత్యాలమ్మగూడెం జీపీ పరిధి మాణిక్కాలమ్మగూడెం స్జేజీ సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డుప్రమాదంలో విద్యుత్ లైన్మెన్కు తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కట్టంగూర్కు చెందిన ముక్కాముల వెంకన్న మండలంలోని దుగినవెల్లి గ్రామంలో విద్యుత్ లైన్మెన్ విధులు నిర్వహిస్తున్నాడు. డ్యూటీలో భాగంగా దుగినవెల్లికి వెళ్లి స్వగ్రామానికి ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు. మార్గమధ్యంలో మాణిక్కాలమ్మగూడెం స్టేజీ వద్దకు రాగానే హైదరాబాద్ నుంచి సూర్యాపేట వైపు వెళ్తున్న కారు అతి వేగంగా వచ్చి వెంకన్న బైక్‌ను ఢీకొట్టింది. దీంతో అతడికి తీవ్రగాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం 108 వాహనంలో నార్కట్‌పల్లి ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. వెంకన్న కోడలు ముక్కాముల స్వాతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రవీందర్ తెలిపారు. గుండెపోటుతో ఫైర్ ఆఫీసర్ మృతివేములవాడరూరల్ : వేములవాడ స్టేషన్ ఫైర్ ఆఫీసర్ నాగు అనిల్‌కుమార్ శుక్రవారం గుండెపోటుతో హైదరాబాద్‌లో మృతిచెందారు. అనిల్‌కుమార్ స్వగ్రామం యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం తుమ్మలగూడెం కాగా.. ప్రస్తుతం హైదరాబాద్‌లో నివసిస్తున్నారు. 2008 బ్యాచ్‌కు చెందిన అనిల్‌కుమార్ డ్రైవర్‌గా విధుల్లో చేరి స్టేషన్ ఫైర్ ఆఫీసర్‌గా ఎదిగారు. గత రెండేళ్లుగా వేములవాడ అగ్నిమాపక అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. లారీ ఢీకొని వ్యక్తి దుర్మరణంమిర్యాలగూడ అర్బన్ : లారీ ఢీకొని వ్యక్తి మృతిచెందిన సంఘటన మిర్యాలగూడ పట్టణంలోని హనుమాన్‌పేట ఫ్లై ఓవర్ వద్ద చోటు చేసుకుంది. టూ టౌన్ పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. దామరచర్ల మండలం కేజేఆర్ కాలనీకి చెందిన ధనావత్ మంగ్తా(61) బ్యాంకులో గోల్డ్ లోన్ కట్టడానికి గాను తన కుమారుడికి డబ్బులు ఇచ్చేందుకు మిర్యాలగూడకు వచ్చాడు. డబ్బులు ఇచ్చిన అనంతరం హనుమాన్‌పేటలోని టీ స్టాల్‌కు వెళ్లేందుకు యూటర్న్ తీసుకుంటుండగా.. సాగర్ నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న లారీ మంగ్తా వాహనాన్ని ఢీ కొట్టింది. మంగ్తా కిందపడిపోగా అతడి తల పైనుంచి లారీ టైరు వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అతివేగం, అజాగ్రత్తగా లారీ నడిపిన షేక్ ఖాజాను అదుపులోకి తీసుకుని లారీని స్వాధీనం చేసుకున్నామని, మృతుడి కుమారుడు దనావత్ కృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు టూ టౌన్ సీఐ సోమనర్సయ్య తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు పేర్కొన్నారు. -
ఆయిల్ పామ్ సాగుకు సర్కార్ సాయం
గుర్రంపోడు : ఆయిల్‌పామ్ సాగు చేసే రైతులకు పెట్టుబడి భారాన్ని తగ్గించి, యాంత్రీకరణను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం భారీగా రాయితీలు ప్రకటిస్తోంది. తోటల పెంపకానికి మొక్కలు, డ్రిప్, అంతరపంటల సాగు, ఎరువుల ఖర్చు కోసం నాలుగేళ్ల పాటు హెక్టారుకు రూ.51 వేలు ఇస్తుండగా.. తాజాగా సాగు, కోత పరికరాలపై కూడా సబ్సిడీలను అందుబాటులోకి తెచ్చింది. జిల్లాలో ఆయిల్‌పామ్ సాగు చేస్తున్న రైతులకు నీటి కుంటల నిర్మాణం, ఆధునిక పరికరాల కొనుగోళ్లకు జిల్లా ఉద్యానవన, పట్టుపరిశ్రమ శాఖ ద్వారా రాయితీలు అందిస్తున్నారు. నీటి కుంటకు రూ.90 వేలుప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో ఆయిల్ పామ్ తోటల్లో నీటి లభ్యతను మెరుగుపర్చేందుకు, వర్షపు నీటిని నిల్వ చేసుకునేందుకు నీటి కుంటల నిర్మాణానికి ప్రభుత్వం రాయితీ అందిస్తోంది. నిర్దేశించిన కొలతలతో నిర్మించే ఒక్కో నీటి కుంటకు రూ.90 వేలు అందిస్తారు. కుంట అడుగుభాగం 14.14 మీటర్లు, లోతు 3.50 మీటర్లు, మధ్యభాగం 20.20 మీటర్లు , పై భాగం 21.21 మీటర్లు ఉండాలి . ఈ పరిమాణంలో 9 లక్షల లీటర్ల నీటిని నిల్వ చేసుకునే అవకాశం ఉంటుంది. ఆయిల్‌పామ్ తోటల్లో నీటి అవసరాలు తీర్చేందుకు కుంటలు ఉపయోగపడతాయని అధికారులు సూచిస్తున్నారు. పరికరాలపై రాయితీ ఇలా..కట్టర్ : గెలలు కోసే 50 అడుగుల పొడవు ఉండే కట్టర్ (టెలిస్కోపిక్ హర్వెస్టింగ్ పోల్)పై మొత్తం బిల్లులో 50 శాతం రాయితీగా రూ.2500 రాయితీ అందిస్తారు. మోటరైజ్డ్ చిసెల్ ఎత్తయిన ఆయిల్‌పామ్ తోటల్లో గెలలు కోసే మోటారు యంత్రం కొనుగోలుకు బిల్లులో 50 శాతం రాయితీగా గరిష్టంగా రూ.15 వేలు రాయితీ అందిస్తారు. అల్యూమినిమం పోర్టల్ నిచ్చెన 21,30 అడుగులు ఉండే అల్యూమినియం నిచ్చెనల కొనుగోలుకు బిల్లులో యాభై శాతం రాయితీగా గరిష్టంగా రూ.5 వేల రాయితీ ఉంటుంది. చాప్ కట్టర్ ఆయిల్ పామ్ మట్టలు, ఇతర వ్యర్ధాలను చిన్నచిన్న ముక్కలుగా కత్తిరించడానికి వాడే యంత్రం కొనుగోలుకు బిల్లులో యాభై శాతం గరిష్టంగా రూ.50 వేల రాయితీ అందిస్తారు.దరఖాస్తు చేసుకోవాలి ఆయిల్ పామ్ సాగు రైతులు నీటి కుంటలు, అవసరమైన పరికరాల కోసం ప్రాంతీయ ఉద్యానవనశాఖ అధికారులకు దరఖాస్తులు చేసుకోవాలి. మంజూరు లభించిన తర్వాత పరికరాలను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. క్షేత్రస్థాయిలో పరిశీలించి రాయితీలను అందిస్తాం. – మురళీ ప్రాంతీయ ఉద్యానవన శాఖాధికారి పరికరాల కొనుగోలుపై 50శాతం సబ్సిడీ నీటి కుంటలకు రూ.90 వేల ప్రోత్సాహకం -
ఫ్లెక్సీల రూపుమార్చిన ఏఐ
రామగిరి(నల్లగొండ): ఒకప్పుడు రాజకీయ సభలు, వివాహాలు, జన్మదిన వేడుకలు, వ్యాపార ప్రకటనలు.. ఏవైనా సరే బ్యానర్లు, ఫ్లెక్సీల కోసం ప్రింటింగ్ షాపులకు వెళ్లేవారు. గ్రాఫిక్ డిజైనర్లు గంటల తరబడి శ్రమించి వాటిని రూపొందించేవారు. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రాకతో ఈ రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. ఏఐ ఆధారిత సాధనాలు ప్రింటింగ్, ఫ్లెక్సీ వ్యాపారాల స్వరూపాన్నే మార్చేస్తున్నాయి. పడిపోతున్న రాబడి సాధారణ డిజైనింగ్ పనులకు డిజైనర్ల అవసరం క్రమంగా తగ్గుతోంది. కొందరు వ్యాపారులు, వినియోగదారులు తమ ఫోన్లలోనే ఏఐ యాప్‌ల ద్వారా స్వయంగా బ్యానర్లు, ఆహ్వాన పత్రాలు డిజైన్ చేసుకుంటున్నారు. షాపులకు వెళ్లి కేవలం ప్రింటింగ్ మాత్రమే చేయించుకుంటుండంతో డిజైనింగ్ ద్వారా వచ్చే అదనపు రాబడి పడిపోయి, చిన్న స్థాయి ఫ్లెక్సీ షాపులు తీవ్ర పోటీని ఎదుర్కొంటున్నాయి. పర్యావరణ నిబంధనల తోడుఏఐ సాంకేతికతతో పాటు ప్లాస్టిక్ నివారణలో భాగంగా సింగిల్ యూజ్ ఫ్లెక్సీలపై ప్రభుత్వం విధిస్తున్న నిషేధం కూడా ఈ రంగాన్ని ప్రభావితం చేస్తోంది. దీంతో కస్టమర్లు కంపోస్టబుల్ క్లాత్ (కాటన్) బ్యానర్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా డిజిటల్, కాటన్ ప్రింటింగ్ వైపు మారడం షాపు యజమానులకు తప్పనిసరిగా మారింది. పరిమితమైన సిబ్బందితోనే ఎక్కువ పనిగతంలో ఒక డిజైన్ పూర్తి చేయడానికి డిజైనర్‌కు 2 నుంచి 3 గంటల సమయం పట్టేది. ఇప్పుడు ఏఐ ఇమేజ్ జనరేటర్ల సాయంతో కొద్ది సెకన్లలోనే నాణ్యమైన కాన్సెప్ట్‌లు, బ్యాక్గ్రౌండ్లు సిద్ధమవుతున్నాయి. కస్టమర్లు ఇచ్చే స్పష్టత లేని ఫొటోలను సైతం ఏఐ క్లారిటీ టూల్స్ సాయంతో హై క్వాలిటీగా మార్చడం సులభమైంది. దీనివల్ల పరిమితమైన సిబ్బందితోనే ఎక్కువ పని పూర్తి చేసేందుకు షాపు యజమానులకు వీలవుతోంది. ఫోన్లోనే సొంతంగా జన్మదిన వేడుకలు, వ్యాపార ప్రకటనల బ్యానర్ల డిజైన్ ప్రింటింగ్ కోసమే షాపులను ఆశ్రయిస్తున్న వినియోగదారులు గ్రాఫిక్ డిజైనర్ల ఉపాధిపై తీవ్ర ప్రభావం ఏఐ యాప్‌ల వల్ల చాలామంది కస్టమర్లు ఫోన్లలోనే డిజైన్లు చేసుకుని, కేవలం ప్రింటింగ్ కోసమే వస్తున్నారు. దీనివల్ల మార్జిన్ తగ్గింది. అందుకే మేం కూడా ఏఐ టూల్స్ నేర్చుకుని, వేగంగా ఆర్డర్లు పూర్తి చేస్తున్నాం. ఎల్ఈడీ బోర్డులు, డిజిటల్ బ్రాండింగ్ వంటి కొత్త సేవలు ప్రారంభించాం. – సురేష్, ఫ్లెక్సీ షాపు యజమాని గతంలో డిజైన్ కోసం బ్యాక్గ్రౌండ్స్ వెతకడం, ఎడిటింగ్‌కు గంటలు పట్టేది. ఏఐతో సమయం ఆదా అవుతోంది. అయితే సాధారణ డిజైనింగ్ పనులకు ఆదరణ తగ్గడం ఉపాధి పరంగా ఆందోళన కలిగిస్తోంది. స్థానిక సంస్కృతి, కస్టమర్ ఆలోచనలకు తగ్గట్టుగా మానవ మేధస్సుతోనే క్రియేటివిటీ జోడించగలమని నమ్ముతున్నాం. – విశ్వరూప చారి, గ్రాఫిక్ డిజైనర్ -
మేము.. మా కూతురు
ప్రతీ తల్లి, తండ్రికి వారి కూతుళ్లతో ప్రత్యేక అనుబంధం ఉంటుంది. కూతురు ఉన్నత స్థానానికి ఎదిగితే ఆ విజయం చూసి ఎంతో మురిసిపోతారు. కూతురితో గడిపిన ప్రతీది ఓ తీపిజ్ఞాపకం. అలాంటి తీపి జ్ఞాపకాలు ‘సాక్షి’తో పంచుకోండి. మీ కూతురు గురించి నాలుగు వాక్యాలు రాసి మీ కూతురుతో దిగిన సెల్ఫీఫొటో పంపండి. మీ పేరు, ప్రాంతం వివరాలను పేర్కొంటూ 26వ తేదీ సాయంత్రం 4గంటల్లోగా కింది వాట్సాప్ నంబర్‌కు పంపండి. వచ్చిన వాటిని స్క్రూటినీ చేసి డాటర్స్ డే (కూతుళ్ల దినోత్సవం) సందర్భంగా 27వ తేదీ సంచికలో ప్రచురిస్తాం.మీరు పంపాల్సిన వాట్సాప్ నంబర్ : 81431 22530 -
అద్దె చెల్లించలేదని ఈఎస్ఐ ఆస్పత్రికి తాళం
మిర్యాలగూడ: 18 నెలలుగా అద్దె చెల్లించకపోవడంతో మిర్యాలగూడ పట్టణంలోని పాత లలిత టాకీస్ వద్ద గల భాగ్యలక్ష్మీ కాంప్లెక్స్‌లో కొనసాగుతున్న ఈఎస్ఐ ఆస్పత్రి భవనానికి యజమాని కర్నాటి కృష్ణ శుక్రవారం తాళం వేశారు. ఈఎస్ఐ ఆస్పత్రి నిర్వహణకు సంబంధించి 18 నెలల అద్దెతోపాటు కరెంట్ బిల్లు రూ.1.75 లక్షలతో కలిపి మొత్తం రూ.15లక్షల వరకు బకాయిలు రావాల్సి ఉందని భవన యజమాని తెలిపాడు. పలుమార్లు ఈఎస్ఐ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా, నిరసనగా నోటీసులు ఇచ్చినప్పటికీ అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వివరించారు. ఆస్పత్రికి వచ్చే రోగులు ఇబ్బందులు పడకూడదనే మానవతా దృక్పథంతో ఈనెల 29 వరకు గడువు ఇస్తున్నామని, ఈలోగా బకాయిలు చెల్లించకుంటే ఈనెల 30 నుంచి భవనానికి శాశ్వతంగా తాళాలు వేస్తామని హెచ్చరించారు. ఆస్పత్రి డాక్టర్ నాగేందర్ మాట్లాడుతూ.. ఆస్పత్రి కిరాయి బకాయిల అంశాన్ని ఇప్పటికే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. నిధులు మంజూరు కాగానే భవన యజమానికి చెల్లింపులు పూర్తిచేస్తామని తెలిపారు. ఈ డిస్పెన్సరీ పరిధిలో సుమారు 45వేల మంది కార్మికులు వైద్యసేవలు పొందుతున్నారని, ప్రతిరోజూ 100 నుంచి 200 మంది వరకు రోగులు వైద్య పరీక్షల కోసం వస్తుంటారని పేర్కొన్నారు. కిరాయి బకాయిల సమస్యను త్వరలోనే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. -
చట్టబద్ధమైన దత్తత శ్రేయస్కరం
ఫ హన్మకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ హన్మకొండ అర్బన్: చట్టబద్ధమైన దత్తత శ్రేయస్కరమని హన్మకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ అన్నారు. హన్మకొండలోని ప్రభుత్వ బాలికల సదనంలో విద్యాబుద్ధులు నేర్చుకున్న బాలికను గురువారం దత్తత ప్రాధికార సంస్థ ఆదేశాల మేరకు నల్లగొండ జిల్లాకు చెందిన దంపతులకు కలెక్టర్ సమక్షంలో దత్తత ఇచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. దత్తత తీసుకున్న తల్లిదండ్రులు బాలికను బాగా చదివించి, భవిష్యత్‌లో ఉన్నతంగా ఎదిగేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి ఎం. విశ్వజ, బాల రక్షా భవన్ కోఆర్డినేటర్ సీహెచ్. అవంతి, ప్రభుత్వ బాలికల సదనం సూపరింటెండెంట్ ఎం. కల్యాణి, ఇన్చార్జ్ డీసీపీఓ ఎస్. ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. వానకు కూలిన ఇళ్లుమోతె : ఎడతెరపి లేకుండా కురిసిన భారీ వర్షానికి గురువారం తెల్లవారుజామున మోతె మండల కేంద్రంలో లింగాల లక్ష్మి, యాదగిరి దంపతుల ఇంటి గోడ కూలిపోయింది. దీంతో ఇంట్లోని వస్తువులు, దుస్తులు, బియ్యం కూలిన గోడ శిథిలాల కింద నలిగిపోయాయి. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అదేవిధంగా అదే గ్రామానికి చెందిన కొప్పు సతీష్, నాగమణి దంపతుల రేకుల ఇల్లు వర్షానికి తడిసి కూలిపోయింది. ప్రభుత్వం తమకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని బాధిత కుటుంబాలు కోరుతున్నాయి. కారు ఢీకొని వలస కార్మికుడు మృతిచౌటుప్పల్ : గణేష్ నిమజ్జన వేడుకలు చూసేందుకు వచ్చిన వలస కార్మికుడు రోడ్డు దాటుతుండగా కారు ఢీకొని మృతిచెందాడు. ఈ ఘటన హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై చౌటుప్పల్ మండలం లింగోజిగూడెం గ్రామ పరిధిలో బుధవారం రాత్రి జరిగింది. గురువారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఒడిశా రాష్ట్రానికి చెందిన రాంభీయాష్ కేవత్(37) రెండు నెలలుగా లింగోజిగూడెం గ్రామంలోని ఓ టిఫిన్ సెంటర్లో పనిచేస్తున్నాడు. బుధవారం రాత్రి గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని చూసేందుకు విజయవాడ–హైదరాబాద్ హైవే దాటుతుండగా.. హైదరాబాద్ వైపు వేగంగా వెళ్తున్న కారు అతడిని ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. టిఫిన్ సెంటర్ యజమాని ప్రభుచరణ్ ఫిర్యాదు మేరకు సీఐ మన్మథకుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మరమ్మతులు మూన్నాళ్ల ముచ్చటే..
మోత్కూరు : మోత్కూరులోని చెరువు కట్ట రహదారి మరమ్మతులు మూన్నాళ్ల ముచ్చటగా మారాయి. గత వర్షకాలంలో మోత్కూరు పెద్ద చెరువు కట్ట రహదారి కుంగిపోయింది. రెండు నెలల క్రితం చెరువు కట్ట మరమ్మతుల పనులను కాంట్రాక్టర్ పూర్తి చేశారు. ఈ పనుల కోసం రూ.36 లక్షలు ప్రభుత్వం వెచ్చించింది. 30 మీటర్ల దూరం కుంగిన చెరువు కట్ట రహదారి పనులు పూర్తిచేశారు. అయినా చెరువు కట్టపై ఉన్న రహదారి భారీ వర్షాలకు కోతకు గురై ప్రమాదకరంగా మారింది. దీంతో వాహనదారులు, ముఖ్యంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారు ఆందోళన చెందుతున్నారు. -
పత్తి కొనుగోళ్లకు ఏర్పాట్లు చేయాలి
భువనగిరిటౌన్ : జిల్లాలో పత్తి కొనుగోళ్లకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఇన్చార్జ్ కలెక్టర్ భాస్కర్ రావు అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని మినీ మీటింగ్ హాల్లో రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకారెడ్డి, సంబంధిత శాఖల అధికారులతో కలిసి పత్తి కొనుగోళ్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో పత్తి సాగు, అంచనా దిగుబడి, మద్దతు ధర, కొనుగోలు కేంద్రాల ఏర్పాట్లపై సమగ్రంగా చర్చించారు. ఇన్చార్జి కలెక్టర్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది పత్తికి క్వింటాకు రూ.8,667 మద్దతు ధర నిర్ణయించిందని, గత సంవత్సరంతో పోలిస్తే రూ.557 పెరిగిందని తెలిపారు. జిల్లాలో ఈ ఏడాది సుమారు 1.12 లక్షల ఎకరాల్లో పత్తి సాగు జరిగిందని, దాదాపు 6.75 లక్షల క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశం ఉందన్నారు. దీని ద్వారా జిల్లాలోని సుమారు 35 వేల మంది రైతులకు ప్రయోజనం చేకూరనుందన్నారు. రైతులు తమ పంటను మద్దతు ధరకు అమ్ముకునేందుకు వీలుగా జిల్లాలోని 13 జిన్నింగ్ మిల్లులను కొనుగోలు కేంద్రాలుగా ఏర్పాటు చేయాలని సూచించారు. సమావేశంలో రెవెన్యూ డివిజనల్ అధికారి కృష్ణారెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి రమణారెడ్డి, మార్కెటింగ్ అధికారి సారంగపాణి, సీసీఐ మహబూబ్‌నగర్ బ్రాంచ్ డిప్యూటీ మేనేజర్, పత్తి జిన్నింగ్ మిల్లుల అసోసియేషన్ ప్రతినిధులు, మార్కెట్ కమిటీ కార్యదర్శులు ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలి జిల్లాలో ఇందిరమ్మ ఇళ్లు, రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఇన్చార్జి కలెక్టర్ భాస్కర్ రావు అధికారులకు సూచించారు. గురువారం కలెక్టర్ ఛాంబర్లో సంబంధిత అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో అర్హులైన గుడిసెదారులందరినీ గుర్తించి, ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రాధాన్యత క్రమంలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలన్నారు. ఇళ్ల మంజూరు, నిధుల విడుదలలో సాంకేతిక సమస్యల పరిష్కారానికి మూడో స్థాయి నుంచి మొదటి స్థాయికి సడలింపు కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ఫ ఇన్చార్జ్ కలెక్టర్ భాస్కర్ రావు -
ఆంధ్రా ప్రాంతం వారికే ఉద్యోగాలు
మిర్యాలగూడ : దామరచర్ల మండలం వీర్లపాలెం గ్రామ పరిధిలో నిర్మించిన యాదాద్రి థర్మల్ పవర్‌ప్లాంట్‌లో(వైటీపీఎస్) స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వకుండా ప్రస్తుత ఎమ్మెల్యే ఆంధ్రా ప్రాంతం వారికి ఉద్యోగాలు అమ్ముకుంటున్నాడని మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి ఆరోపించారు. బొగ్గు కొరత కారణంగా యాదాద్రి థర్మల్ పవర్‌ప్లాంట్‌లో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోవడంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు గురువారం పవర్‌ప్లాంట్‌ను ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిఽధిలోని మాజీ ఎమ్మెల్యేలతో కలిసి మాజీ మంత్రి పరిశీలించారు. అనంతరం పవర్‌ప్లాంట్ ఎదుట ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జగదీష్‌రెడ్డి మాట్లాడారు. మిర్యాలగూడ ఎమ్మెల్యే ఆంధ్రాకు చెందిన వారు కావడంతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక యాదాద్రి పవర్‌ప్లాంట్‌లో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వకుండా ఆంధ్రా వారికి అమ్ముకుంటూ స్థానికులకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. నాగార్జునసాగర్ ఆయకట్టులో సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నా జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్ర భవిష్యత్‌ను తాకట్టు పెట్టి తాను అనుకున్న వారికి బొగ్గు సరఫరా చేస్తూ ఇక్కడి ప్రజలకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. గృహ, పరిశ్రమలకు కరెంట్ కోతలు విధిస్తుండడంతో జనరేటర్లను వినియోగించాల్సి వస్తోందన్నారు. తెలంగాణ వచ్చేనాటికి 6,700 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి మాత్రమే ఉందని, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో విద్యుత్ ఉత్పత్తిని 21,500 మెగావాట్లకు పెంచినట్లు తెలిపారు. అన్ని రంగాలకు 24గంటల నాణ్యమైన విద్యుత్ అందించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనన్నారు. ప్రపంచ స్థాయి అత్యుత్తమ సాంకేతికతతో వైటీపీఎస్ నిర్మాణం జరిగిందన్నారు. ప్రస్తుతం 4యూనిట్లు నడవడానికి సిద్ధంగా ఉన్నాయని అధికారులు సైతం తెలిపినట్లు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం సాంకేతిక కారణాలు చూపుతూ విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేసిందని విమర్శించారు. సింగరేణితో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం బొగ్గు సరఫరాలో ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపారు. ప్లాంట్‌ను ప్రైవేట్ పరం చేస్తే ఊరుకోం : నల్లమోతు భాస్కర్‌రావు యాదాద్రి థర్మల్ పవర్‌ప్లాంట్‌ను ప్రైవేట్‌పరం చేస్తే ఊరుకునేది లేదని మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు హెచ్చరించారు. 3200 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తే 2వేల మెగావాట్లను వినియోగించుకున్నారని, అదే 2వేల మెగావాట్ల విద్యుత్‌ను బయట నుంచి కొనుగోలు చేస్తే ఎంత ఖర్చవుతుందో ఆలోచించాలన్నారు. ప్లాంట్ కోసం భూములు కోల్పోయిన నిర్వాసితులకు డబ్బులతో పాటు ఉద్యోగాలు కల్పిస్తామని కేసీఆర్ హయాంలో ఒప్పందం జరిగిందని పేర్కొన్నారు. ప్లాంట్‌లోని బూడిదను ఎవరు తరలించుకుంటున్నారని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు తిప్పన విజయసింహారెడ్డి, రమావత్ రవీంద్రకుమార్, గాదరి కిశోర్, నోముల భగత్, కంచర్ల భూపాల్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్య, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, గొంగిడి సునీత, పైళ్ల శేఖర్‌రెడ్డి, హుజూర్నగర్ బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి ఒంటెద్దు నర్సింహారెడ్డి, నాయకులు చింతరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, మట్టపల్లి సైదులుయాదవ్, పాలుట్ల బాబయ్య, నామిరెడ్డి కరుణాకర్‌రెడ్డి, దుర్గంపూడి నారాయణరెడ్డి, బాలాజీనాయక్, ఎండీ యూసుఫ్, సోము సైదిరెడ్డి, అనుముల శ్రీనివాస్‌రెడ్డి, వీరకోటిరెడ్డి, చిర్ర మల్లయ్యయాదవ్, హాతీరాం, కొండారపు నాగేశ్వర్రావు తదితరులు ఉన్నారు. పోలీసులు ముందస్తుగానే పవర్‌ప్లాంట్ ప్రధాన ద్వారం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బారికేడ్లను ఏర్పాటు చేసినప్పటికీ బీఆర్ఎస్ శ్రేణులు ప్లాంట్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించగా వారిని అడ్డుకున్నారు. కేవలం మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలను లోనికి వెళ్లేందుకు అనుమతించారు. మధ్యాహ్నం 4గంటల సమయంలో కాంగ్రెస్ శ్రేణులు కూడా పవర్‌ప్లాంట్‌కు వద్దకు చేరుకున్నారు. దీంతో ప్రధాన ద్వారాన్ని మూసివేసి పోలీసులను భారీగా మోహరించారు. దీంతో పవర్‌ప్లాంట్ వద్ద హైటెన్షన్ నెలకొంది. ఫ మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి ఫ యాదాద్రి థర్మల్ పవర్‌ప్లాంట్ పరిశీలన -
విద్యార్థుల ప్రవేశాల సంఖ్య పెంచాలి
దేవరకొండ : అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో విద్యార్థుల ప్రవేశాల సంఖ్యను పెంచాలని నోడల్ అధికారి బి. ధర్మానాయక్ సూచించారు. గురువారం ఆయన దేవరకొండ ఎంకేఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలను సందర్శించారు. కళాశాల అధ్యాపకులు, స్టడీ సెంటర్ సిబ్బందితో ఆయన సమావేశమై పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చదువుకు దూరమైన వారిని దూరవిద్య ద్వారా మళ్లీ చదువుకు చేరువ చేసేందుకు ప్రతిఒక్క అధ్యాపకుడు కృషిచేయాలన్నారు. దూరవిద్యలో విద్యార్థులకు అందుబాటులో ఉన్న నూతన కోర్సులు, అవకాశాలపై విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. వైస్ చాన్స్‌లర్ ఘంటా చక్రపాణి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ బలోపేతానికి ఎంతగానో కృషి చేస్తున్నారని అన్నారు. ఈ సమావేశంలో ప్రిన్సిపాల్ రమావత్ రవి, అధ్యాపకులు పాల్గొన్నారు. ఫ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నోడల్ అధికారి ధర్మానాయక్ -
మహిళలను కోటీశ్వరులను చేస్తాం
గుండాల : మహిళా సంఘాలను బలోపేతం చేసి కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అన్నారు. గురువారం గుండాల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మహిళా రైతుల ఉత్పత్తిదారుల కంపెనీని ప్రారంభించారు. అదేవిధంగా 92 సంఘాలకు రూ.8.29 కోట్లు వడ్డీ లేని రుణాల చెక్కును పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో బీర్ల ఐలయ్య మాట్లాడుతూ.. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మహిళా ఉత్పత్తదారుల కేంద్రంలో రైతులకు కావాల్సిన విత్తనాలను, ఎరువులను విక్రయించి లాభాలు పొందాలన్నారు. రైతులకు అందుబాటులో ఉండేందుకు ఉత్పత్తిదారుల కేంద్రాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రతి పేదవాడి ఆత్మ గౌరవం రేషన్ కార్డే అని, అందుకు కుటుంబ వివరాలతో స్మార్ట్‌కార్డ్ అందజేస్తున్నట్లు చెప్పారు. ఆలేరును అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి దేశానికే ఆదర్శంగా నిలుపుతానని చెప్పారు. ప్రజా ప్రభుత్వంలో అర్హుల వద్దకే సంక్షేమ పథకాలు అందిస్తుందని, పైరవీలకు తావు లేకుండా పాలన సాగిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు దేవనబోయిన అయిలయ్య, అల్లంశెట్టి మహేష్, గూడెపు కుమార్, వల్లాల రమేష్, కాలి మంజూల, మద్దెపురం కొండమ్మ, మచ్చ నాగిరెడ్డి, లింగాల అనిల్‌కుమార్, కాలి పద్మ, తాండ్ర నారాయణ స్వామి, మోత్కూరు మార్కెట్ చైర్పర్సన్ నూనెముంతల విమల, గుండాల పీఏసీఎస్ చైర్మన్ అండెం సంజీవరెడ్డి, చేనేత సహకార సంఘం చైర్మన్ చిందం ప్రకాష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఈరసరపు యాదగిరి గౌడ్, మండల పార్టీ అధ్యక్షులు ఇమ్మడి దశరథ గుప్తా, ఎస్బిఐ డీజీఎం అనిల్‌కుమార్, ఏపీడీ జంగారెడ్డి, ఎంపీడీవో చండీరాణి పాల్గొన్నారు. ఫ ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య -
వృద్ధులతో బాధ్యతగా వ్యవహరించాలి
భువనగిరిటౌన్ : సమాజంలో వృద్ధుల పట్ల ప్రతిఒక్కరూ ఆదరణ, రక్షణ, బాధ్యతతో వ్యవహరించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మాధవీలత, అదనపు కలెక్టర్ వెంకారెడ్డి అన్నారు. అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం కలెక్టరేట్లో సీనియర్ సిటిజన్ వెల్బీయింగ్, ఎంపవర్మెంట్ వీక్–2026 కార్యక్రమాలను గురువారం ప్రారంభించారు. అనంతరం తల్లిదండ్రులు, వయోవృద్ధుల పోషణ సంక్షేమ చట్టం 2007 సవరణ నియమావళి పుస్తకాలు, ఎల్డర్ ఫ్రెండ్లీ కరపత్రాలు, వృద్ధుల సంరక్షణ–గౌరవ ప్రతిజ్ఞ ప్రతులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చట్టపరంగా వృద్ధులకు కల్పించిన హక్కులు, సంక్షేమ పథకాలపై ప్రజల్లో విస్తృత చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. వృద్ధులకు అనుకూలమైన వాతావరణం కల్పించడం, వారి ఆత్మగౌరవాన్ని కాపాడటం కుటుంబ సభ్యుల ప్రాథమిక విధి అని తెలిపారు. ఈ వారోత్సవాల ద్వారా జిల్లావ్యాప్తంగా వృద్ధుల ఆరోగ్యం, మానసిక ఉల్లాసం, భద్రత, సామాజిక గౌరవంపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి సీహెచ్. శ్రీనివాస్, అధికారులు, సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ప్రతినిధులు, కోఆర్డినేటర్, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు. -
రెడ్‌క్రాస్ ఎన్నికలకు 22 నామినేషన్లు
భువనగిరిటౌన్ : జిల్లా భారతీయ రెడ్ క్రాస్ సొసైటీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ పూర్తయినట్లు ఎన్నికల అధికారి, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్‌రెడ్డి గురువారం తెలిపారు. ఎన్నికల కోసం మొత్తం 22 నామినేషన్లు దాఖలయ్యాయని, వీటిలో 5 సింగిల్ నామినేషన్లు, 17 డబుల్ నామినేషన్లు ఉన్నాయని పేర్కొన్నారు. దాఖలైన నామినేషన్లను నిబంధనలు, మార్గదర్శకాల ప్రకారం పరిశీలించి తదుపరి ఎన్నికల ప్రక్రియను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కాగా.. జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ డైరెక్టర్ పదవికి రిటైర్డ్ ఉపాధ్యాయుడు వెల్లంకి పురుషోత్తం రెడ్డి గురువారం కలెక్టరేట్లోని ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. యాదగిరిగుట్టలో సంప్రదాయ పూజలు యాదగిరిగుట్ట రూరల్: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో సంప్రదాయ పూజలు గురువారం ఘనంగా కొనసాగాయి. వేకువజామునే ప్రధానాలయంలో అర్చకులు సుప్రభాత సేవ చేపట్టారు. గర్భాలయంలో మూలవర్యులకు, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు ఆగమశాస్త్రానుసారంగా అభిషేకాలు చేశారు. స్వామి అమ్మవార్లకు సహస్త్ర నామార్చన, తులసీదళాలతో, అర్చన జరిపించారు. ఆలయ ముఖమండపంలోని ఉత్సవమూర్తులకు సువర్ణ పుష్పార్చన, అష్టోత్తర పూజలు నిర్వహించారు. ప్రాకార మండపాల్లో శ్రీ సుదర్శన నారసింహ హోమం, నిత్యకల్యాణం, గజవాహనసేవ, బ్రహ్మోత్సవం వంటి సేవలు చేశారు. సాయంత్రం స్వామి అమ్మవార్లకు వారికి జోడు సేవోత్సవం, సాయంత్రం శయనోత్సవం నిర్వహించి ఆలయాన్ని ద్వారబంధనం చేశారు. ఆయా పూజల్లో భక్తులు పాల్గొని తమ మొక్కులు చెల్లించుకున్నారు. చరిత్రను అధ్యయనం చేయాలిరామన్నపేట : విద్యార్థులు చరిత్రను అధ్యయనం చేయాలని ప్రముఖ సాహితీవేత్త తెలుగుశాఖ అధ్యక్షుడు డాక్టర్ తండు కృష్ణకౌండిన్య అన్నారు. రామన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు గురువారం విష్ణుకుండినుల రాజధానిగా వెలుగొందిన ఇంద్రపాలనగరంలోని చారిత్రక ప్రదేశాలను, పురాతన శివాలయాన్ని సందర్శించారు. ఇంద్రపాలనగరం చరిత్రను విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ కో ఆర్డినేటర్ డాక్టర్ డి.కిషన్ పరిపాలనా అధికారి జి.కరుణాకర్ అధ్యాపకులు అమర్, నరేష్, రాంబాబు, కిరణ్ పాల్గొన్నారు. -
అదృశ్యమైన మహిళ ఆచూకీ లభ్యం
మర్రిగూడ : మండల పరిధిలోని యరగండ్లపల్లి గ్రామానికి చెందిన తోకల లక్ష్మి ఈ నెల 19న ఇంట్లో ఎవరికి చెప్పకుండా వెళ్లిపోగా.. ఆమె ఆచూకీ లభ్యమైనట్లు ఎస్ఐ బి. రాంబాబు గురువారం తెలిపారు. లక్ష్మి కనిపించట్లేదని ఆమె భర్త యాదయ్య ఈ నెల 20న మర్రిగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ వివరించారు. ప్రత్యేక బృందాలతో గాలించి లక్ష్మి ఆచూకీ కనిపెట్టి, ఆమెకు కౌన్సిలింగ్ నిర్వహించి గురువారం కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు పేర్కొన్నారు. -
జింక్ లోపం నివారిస్తేనే మంచి దిగుబడులు
గుర్రంపోడు : పంటల సాగులో సేంద్రియ ఎరువుల వినియోగం తగ్గిపోవడం దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. రైతులు ఎక్కువగా నత్రజని, భాస్వరం, పొటాష్ ఉండే రసాయన ఎరువుల మీదే ఆధారపడుతుండటంతో నేలలో సూక్ష్మపోషకాల లోపాలు ఏర్పడుతున్నాయి. తక్కువ పరిమాణంలోనే అవసరమైనా.. పైరు ఎదుగుదలకు, మంచి దిగుబడులకు జింక్, బోరాన్, మెగ్నీషియం తదితర పోషకాలు ఎంతో కీలకం. ముఖ్యంగా వరి మాగాణుల్లో జింక్ లోపం ఎక్కువగా కనిపిస్తోంది. దీన్ని సకాలంలో గుర్తించి తగిన నివారణ చర్యలు చేపట్టాలని గుర్రంపోడు వ్యవసాయాధికారి కంచర్ల మాధవరెడ్డి సూచిస్తున్నారు. లోపానికి కారణాలు ఇవే.. వరిలో జింక్ లోపం రావడానికి ప్రధాన కారణం సేంద్రియ ఎరువుల వినియోగం లేకపోవడమే. కేవలం పెసర, అలసంద, జీలుగ లాంటి పచ్చిరొట్ట పైర్లను నేలలో కలియదున్నడం మినహా, సేంద్రియ ఎరువుల వాడకం నామమాత్రంగానే మారింది. వరి సాగు చేసే నేలల్లో చౌడు ఉండటం మరో ముఖ్య కారణం. చౌడు వల్ల నేలలో ఉన్న జింక్ మొక్కలకు సులభంగా అందుబాటులోకి రాదు. దీనికి తోడు రసాయనిక ఎరువులను అసమతుల్యంగా వాడటం, పొలంలో మురుగు నీరు సరిగా బయటకు వెళ్లకపోవడం, వాతావరణంలో ఉష్ణోగ్రతలు తగ్గడం వల్ల కూడా జింక్ లోపం కనిపిస్తుంది. నేలలో జింక్ లోపం ఉంటే.. రసాయన ఎరువులను తీసుకునే శక్తి మొక్కకు తగ్గిపోయి, ఆ ఎరువులన్నీ వృథా అవుతాయి. నాటిన పైరు అనారోగ్యంగా, కళతప్పి కనిపిస్తుంది. పిలకలు ఆలస్యంగా రావడమే కాకుండా తక్కువగా వస్తాయి. వచ్చిన పిలకలు కూడా సరిగా ఎదగక పైరు గిడసబారిపోతుంది. లేత ఆకులు ఈనెల మధ్య భాగంలో పసుపు రంగులోకి మారిపోతాయి. జింక్ లోపం తీవ్రంగా ఉన్నచోట అడుగు ఆకులు ఎండిపోతాయి. తద్వారా దిగుబడులు గణనీయంగా తగ్గుతాయి. నివారణ చర్యలు.. పంటకు అవసరమైన పోషకాల్లో కనీసం 30 శాతం సేంద్రియ ఎరువుల ద్వారా (పశువుల ఎరువు, జీవన ఎరువులు) అందించాలి. సేంద్రియ ఎరువులు అందుబాటులో లేనప్పుడు, వరి నాటడానికి ముందు ఆఖరి దమ్ములో ఎకరాకు 20 కిలోల జింక్ సల్ఫేట్‌ను వేసుకోవాలి. దమ్ములో జింక్ సల్ఫేట్ వేసినప్పుడు దానిని ఎట్టి పరిస్థితుల్లోనూ భాస్వరం ఎరువులతో కలిపి వేయరాదు. జింక్ సల్ఫేట్ వేయడానికి ముందు గానీ, లేదా తర్వాత గానీ రసాయన ఎరువులు వేయడానికి కనీసం నాలుగు రోజుల విరామం ఉండాలి. జింక్ సల్ఫేట్‌ను ఖరీఫ్, రబీ రెండు సీజన్లకు కలిపి ఏడాదొకసారి వేస్తే సరిపోతుంది. దమ్ములో జింక్ సల్ఫేట్ వేయని పొలాల్లో.. వరి నాటిన తర్వాత ఈ లోపం కనిపిస్తే పిచికారీ ద్వారా నివారించుకోవచ్చు. లీటరు నీటికి 2 గ్రాముల శ్రీచిలేటెడ్ జింక్శ్రీ చొప్పున కలిపి ఆకులపై పిచికారీ చేయాలి. అవసరమైతే 20 రోజుల వ్యవధిలో మరోసారి అదే మోతాదులో పిచికారీ చేయాలి. జింక్‌ను పిచికారీ చేసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ పురుగు మందులు లేదా తెగుళ్ల మందులతో కలిపి కొట్టకూడదు. చౌడు నేలల్లో జింక్ సల్ఫేట్‌ను దమ్ములో వేయడం కంటే, పైరుపై రెండు దఫాలుగా పిచికారీ చేసుకోవడమే లాభదాయకం. ఫ గుర్రంపోడు వ్యవసాయాధికారి కంచర్ల మాధవరెడ్డి సూచనలు -
‘చేయూత’పై 360 డిగ్రీల నిఘా
భువనగిరిటౌన్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న చేయూత పింఛన్ల పథకంలో అర్హుల ఎంపిక ప్రక్రియ తుది దశకు చేరింది. గత ప్రభుత్వంలో ఆసరా దరఖాస్తుల స్వీకరణ నిలిచిపోవడం, ప్రస్తుత ప్రజా ప్రభుత్వం కొత్త పింఛన్లకు అవకాశం కల్పించడంతో జిల్లా వ్యాప్తంగా దరఖాస్తులు పోటెత్తాయి. పైరవీలకు తావులేకుండా, కేవలం అసలైన నిరుపేదలకే పింఛన్ లబ్ధి చేకూరాలనే లక్ష్యంతో అధికార యంత్రాంగం శ్రీ360 డిగ్రీల సమగ్ర సర్వేశ్రీను తీసుకువచ్చింది. అత్యాధునిక సాంకేతికతతో కూడిన ప్రత్యేక మొబైల్ యాప్ ద్వారా క్షేత్రస్థాయి ఆస్తుల వివరాలను నిశితంగా పరిశీలిస్తోంది. 30వ తేదీ వరకు సర్వే దసరా పండుగ కానుకగా లబ్ధిదారులకు కొత్త పింఛన్లు ఇవ్వాలన్న ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా అధికారులు పనుల్లో వేగం పెంచారు. వాస్తవానికి ఈ నెల 25 లోపు సర్వే పూర్తి చేయాల్సి ఉంది. ప్రక్రియను మరింత పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రభుత్వం సర్వే గడువును ఈ నెల 30వ తేదీ వరకు పొడిగించింది. తుది నివేదికలను ప్రభుత్వానికి సమర్పించిన వెంటనే అర్హుల జాబితాను విడుదల చేయనున్నారు. వితంతు పింఛన్లే ఎక్కువ జిల్లా వ్యాప్తంగా చేయూతకు మొత్తం 18,308 దరఖాస్తులు నమోదయ్యాయి. మొత్తం దరఖాస్తుల్లో ఎక్కువ వితంతు పింఛన్ల కోసమే రావడం గమనార్హం. వితంతు పింఛన్లు 8,478, దివ్యాంగుల పింఛన్లు 4,410, గీత కార్మికుల పింఛన్లు 2,930, చేనేత కార్మికుల పింఛన్లు 1,573, ఒంటరి మహిళల పింఛన్లు 917 చొప్పున నమోదయ్యాయి. ఇందులో వలిగొండ మండలం 1,438, మోత్కూరు రూరల్ 310, రామన్నపేట 1,338, భువనగిరి రూరల్ 1,220, చౌటుప్పల్ రూరల్ 1,206, భువనగిరి మున్సిపాలిటీ 1,178, నారాయణపూర్ 1,162, యాదగిరిగుట్ట రూరల్ 927, బీబీనగర్ 918, రాజాపేట 907, భూదాన్ పోచంపల్లి 775, ఆత్మకూరు (ఎం) 750, గుండాల 722, చౌటుప్పల్ మున్సిపాలిటీ 702, బొమ్మలరామారం 628, అడ్డగూడూరు 618, ఆలేరు రూరల్ 595, పోచంపల్లి మున్సిపాలిటీ 582, ఎం.తుర్కపల్లి 565, మోటకొండూరు 534, ఆలేరు మున్సిపాలిటీ 454, యాదగిరిగుట్ట మున్సిపాలిటీ 390, మోత్కూరు మున్సిపాలిటీ 389 చొప్పున దరఖాస్తులు అందాయి.దరఖాస్తుదారుల ఆర్థిక స్థితిగతులను కచ్చితంగా అంచనా వేసేందుకు ‘360 డిగ్రీల సాఫ్ట్వేర్’ ను వినియోగిస్తున్నారు. విచారణ అధికారులు నేరుగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి జీవన ప్రమాణాలు, కుటుంబ నేపథ్యం, ఉపాధి వివరాలను యాప్‌లో నమోదు చేస్తున్నారు. దరఖాస్తుదారుల పేరిట కార్లు గానీ, ఇతర వాణిజ్య వాహనాలు గానీ ఉంటే ఈ సాఫ్ట్వేర్ తక్షణమే గుర్తిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం రూ. 1.50 లక్షలు, పట్టణాల్లో రూ. 2 లక్షల పరిమితి దాటినట్లు తేలితే ఆ దరఖాస్తులను క్షేత్రస్థాయి విచారణలోనే తిరస్కరిస్తున్నారు. ఫ అనర్హుల ఏరివేతకు అత్యాధునిక సాఫ్ట్వేర్ అస్త్రం ఫ పకడ్బందీ సర్వే కోసం ఈ నెలాఖరు వరకు గడువు పెంపు -
81431 22530
ప్రతీ తల్లిదండ్రికి తమ కూతుళ్లతో ప్రత్యేక అనుబంధం ఉంటుంది. అల్లారుముద్దుగా పెంచిన కూతురు ఉన్నతస్థానానికి ఎదిగితే ఆ విజయం చూసి మురిసిపోవడంలో ఉన్న ఆనందం మరెక్కడా ఉండదు. కూతురితో గడిపిన ప్రతీ విషయం ఓ తీపిజ్ఞాపకం. మీకూ అలాంటి తీపి జ్ఞాపకాలు, మీ కూతురు గొప్పతనం గురించి డాటర్స్ డే (కూతురు దినోత్సవం) సందర్భంగా ‘సాక్షి’తో పంచుకోండి. దీంతోపాటు తల్లిదండ్రి తమ కూతురుతో దిగిన సెల్ఫీఫొటో, మీ పేరు, ప్రాంతం వివరాలను ఈ నెల 26వ తేదీ సాయంత్రం 4గంటల్లోగా కింది వాట్సాప్ నంబర్‌కు పంపండి. వచ్చిన వాటిని స్క్రూటినీ చేసి 27వ తేదీ పత్రికలో ప్రచురిస్తాం.మీరు పంపాల్సిన వాట్సాప్ నంబర్ : -
డ్రగ్స్ మహమ్మారిని తరిమికొడదాం
నల్లగొండ టౌన్ : యువతను పట్టిపీడిస్తున్న డ్రగ్స్ మహమ్మారిని తరిమికొట్టేందుకు అందరూ ఏకమై దండోరా వేయాల్సిన సమయం ఆసన్నమైందని ప్రజా గాయకుడు ఏపూరి సోమన్న అన్నారు. నల్లగొండలోని పీఆర్టీయూ భవన్లో గురువారం నిర్వహించిన అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. గంజాయి, డ్రగ్స్ మత్తులో యువత భవిష్యత్ నాశనమవుతోందన్నారు. ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నా, ప్రజల్లో చైతన్యం రావాల్సిన అవసరం ఉందన్నారు. డ్రగ్స్‌పై ఏపూరి దండోరా అనే నినాదంతో ఈ నెల 29న నల్లగొండలోని గడియారం సెంటర్లో సభ నిర్వహించనున్నట్లు, ఈ సభకు అన్నివర్గాల ప్రజలు, ప్రజా సంఘాల నాయకులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. గ్రామ గ్రామాన డ్రగ్స్ అనర్థాలపై దండోరా వేయాలన్నారు. టీఎస్ఈఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు గూడపూరి సంజయ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అఖిలపక్ష, వివిధ సంఘాల నాయకులు గట్టిగుండ్ల రవి, పాలడుగు నాగార్జున, బకరం శ్రీను, మేడి నరసింహ, కందుల మోహన్, పుల్లెంల సందీప్, ఐతగోని జనార్దన్‌గౌడ్, తలారి రాంబాబు, కట్టిల శివకుమార్, కుడుతాల నాగరాజు, అనుముల సురేష్, బొజ్జ దేవయ్య, ఎర్రోళ్ల శ్రీను పాల్గొన్నారు. ఫ ప్రజా గాయకుడు ఏపూరి సోమన్న -
విద్యార్థినికి రూ.లక్ష నగదు బహుమతి
మఠంపల్లి : మండలంలోని రఘునాథపాలెంకు చెందిన రెడ్డిచర్ల నరేందర్‌రాజు కుమార్తె హరిణి స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదివి ఈ ఏడాది పదో తరగతి ఫలితాల్లో హుజూర్నగర్ నియోజకవర్గంలో ప్రథమ స్థానంలో నిలిచింది. దీంతో శ్రీరామ్ గ్రూప్ సంస్థ వారు హరిణికి రూ.లక్ష బహుమతి ప్రకటించారు. ఈ మేరకు గురువారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ శివప్రతాప్శుక్లా చేతులమీదుగా హరిణి రూ.లక్ష నగదు, ప్రశంసాప్రతం అందుకుంది. ఈ కార్యక్రమంలో జెడ్పీహెచ్ఎస్ హెచ్ఎం బుడిగె పిచ్చయ్య, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కాలం చెల్లిన మందులపై నిర్లక్ష్యంయాదగిరిగుట్ట రూరల్ : మండలంలోని మసాయిపేట గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం వెనకాల కాలం చెల్లిన మందులను వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా పడేస్తున్నారు. ఇలా ఎక్కడ పడితే అక్కడ నిర్లక్ష్యంగా పడేయంతో, పర్యావరణానికి హాని కలగడంతో పాటు మూగజీవాలు వాటిని తినే ప్రమాదం ఉంది. కాలం చెల్లిన మందులను నిబంధనల ప్రకారం డిస్పోజ్ చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
నేలకూలిన వందేళ్ల నాటి మర్రిచెట్టు
మఠంపల్లి : మండలంలోని రఘునాథపాలెం గ్రామ శివారులో క్రిష్టాపురం వెళ్లే రహదారి పక్కన ఉన్న శతాబ్దాల చరిత్ర కలిగిన చారిత్రక వట (మర్రి) వృక్షం నేలకూలింది. రాత్రి కురిసిన భారీ వర్షం, ఈదురు గాలులకు గురువారం తెల్లవారుజామున ఈ భారీ చెట్టు వేర్లతో సహా రోడ్డుపై అడ్డంగా పడింది. గ్రామంలో ఏటా జరిగే శ్రీరామనవమి ఉత్సవాలు, ఎడ్ల పందేలు, కబడ్డీ పోటీలు, తాడులాగుడు పోటీలు, నాటక ప్రదర్శనలు.. అంతేకాకుండా ఊరి పెద్దల పంచాయతీలు, రచ్చబండ తీర్పులకు ఈ మర్రిచెట్టే సాక్షీభూతంగా నిలిచింది. ఎన్నో భారీ గాలివానలను తట్టుకుని నిలబడిన తమ ఊరి పెద్ద చెట్టు నేలవాలిపోవడంతో గ్రామస్తులు విచారవదనాలతో కనిపించారు. సమాచారం అందుకున్న వెంటనే సర్పంచ్ కమనీ నరసింహారావు, ఉప సర్పంచ్ రమణా శ్రీనివాసరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ రామచంద్రయ్యలతో పాటు పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో సంఘటన స్థలానికి చేరుకుని చెట్టును పరిశీలించారు. అనంతరం సర్పంచ్ కమనీ నరసింహారావు సహకారంతో పంచాయతీ సిబ్బంది జేసీబీలు, రంపాలతో చెట్టు కొమ్మలను తొలగించి, రోడ్డుకు అడ్డంగా ఉన్న భాగాన్ని క్లియర్ చేసి రాకపోకలను పునరుద్ధరించారు. -
అక్టోబర్ 1 నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
సాక్షి, యాదాద్రి: వానాకాలం ధాన్యం కొనుగోలు సీజన్‌కు పౌర సరఫరాలు, మార్కెటింగ్, తదితర శాఖల అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. అక్టోబర్ 1 నుంచే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలన్న కేంద్ర ప్రభుత్వ నూతన మార్గదర్శకాల అమలుకు జిల్లా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈమేరకు ఈ నెల 29న సంబంధిత కొనుగోలు కేంద్రాల నిర్వహణ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 325 వరకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఎల్‌నినో ప్రభావంతో వరి దిగుబడి తగ్గే అవకాశం ఉన్నా.. మూసీ ఆయకట్టులో మాత్రం దిగుబడి ఏమాత్రం తగ్గదని అధికారులు అంచనా వేశారు. మొత్తంగా 2.80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా చర్యలు ప్రారంభించారు. ‘పీసీఎస్ ఏపీ’ యాప్‌తో పర్యవేక్షణ.. కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన పీసీఎస్ ఏపీ (ప్రొక్యూర్మెంట్ సెంటర్ సెల్ఫ్ అసెస్మెంట్ పోర్టల్) యాప్ ద్వారా ఈసారి కొనుగోలు కేంద్రాల వసతులను పర్యవేక్షించనున్నారు. యాప్ ద్వారా ప్రతి కేంద్రాన్ని జియో–ట్యాగింగ్ చేసి విశ్లేషిస్తారు. రైతులకు అవసరమైన 16 రకాల సౌకర్యాలను పరిశీలించి యాప్‌లో అప్లోడ్ చేస్తారు. కేంద్రంలో తాగునీరు, నీడ, విద్యుత్, టార్పాలిన్లు, గోనె సంచులు, తేమ కొలిచే యంత్రాలు, బరువు తూచే యంత్రాలు, సెక్యూరిటీ, రవాణా సదుపాయాలు వంటి ప్రాథమిక వసతులు ఉన్నాయో లేదో పరిశీలించి, ఫొటోలను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. వసతులను బట్టి గ్రేడింగ్.. యాప్‌లో అప్లోడ్ చేసిన సౌకర్యాల ఆధారంగా కొనుగోలు కేంద్రాలకు ఎల్–1 నుంచి ఎల్–5 వరకు గ్రేడింగ్ ఇస్తారు. సాధారణ కొనుగోలు కేంద్రాలు కనీసం ఎల్–3 గ్రేడ్ కలిగి ఉండాలి. వ్యవసాయ మార్కెట్ యార్డుల కేంద్రాలకు తప్పనిసరిగా అత్యున్నతమైన ఎల్–5 గ్రేడ్ (పూర్తి స్థాయి సౌకర్యాలు) ఉండాల్సిందే. పీసీఎస్ ఏపీ యాప్ ప్రక్రియను అక్టోబర్ 15 లోపు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇది పూర్తయిన తర్వాతే కొనుగోలు ప్రక్రియకు సంబంధించిన ట్యాబ్‌లు ఓపెన్ అవుతాయని పౌరసరఫరాల అధికారులు స్పష్టం చేస్తున్నారు. మెరుగైన వసతులుంటేనే నిధులు కొనుగోలు కేంద్రాల్లో మెరుగైన వసతులు కల్పించి గ్రేడింగ్ పెరిగితేనే, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే మార్కెట్ ఫీజు 1 శాతం నుంచి 2 శాతం వరకు పెరిగే అవకాశం ఉంటుంది. దీనివల్ల కొనుగోలు కేంద్రాలకు అదనపు నిధులు సమకూరుతాయి. ఈ వానాకాలం సీజన్లో 2.80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయ, పౌరసరఫరాల శాఖ అధికారులు అంచనా వేశారు. ఇందులో దొడ్డు రకం సుమారు 2.50 లక్షల మెట్రిక్ టన్నులు కాగా, మూసీ ఆయకట్టు పరిధి నుంచే దాదాపు 2 లక్షల మెట్రిక్ టన్నుల వరకు ధాన్యం వస్తుందని అంచనా. దీంతోపాటు ఈ సీజన్లో రైతులు అధికంగా సాగు చేసే సన్న రకం ధాన్యం దాదాపు 30 వేల మెట్రిక్ టన్నుల వరకు వస్తుందని భావిస్తున్నారు. గత సీజన్ తరహాలోనే ప్రాథమికంగా 325 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. అయితే వర్షాభావ పరిస్థితుల వల్ల నాన్–ఆయకట్టులో సాగు తగ్గి, దిగుబడి కూడా కాస్త తగ్గొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఫ జిల్లాలో 325 కేంద్రాల ఏర్పాటుకు అధికారుల సన్నాహాలు ఫ 2.80 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా ఫ ఈసారి కొత్తగా ‘పీసీఎస్–ఏపీ’ యాప్‌తో పర్యవేక్షణ ఫ 29న కొనుగోలు కేంద్రాల సిబ్బందికి ప్రత్యేక శిక్షణ -
మిల్లర్లకు ‘ధాన్యం’ షాక్!
సాక్షి, యాదాద్రి: ఈ వానాకాలం సీజన్లో సేకరించిన ధాన్యాన్ని మిల్లులకు పంపకుండా నేరుగా ప్రభుత్వ, ప్రైవేట్ గోదాముల్లోనే నిల్వ చేయాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో జిల్లా యంత్రాంగం గోదాముల అన్వేషణను ముమ్మరం చేసింది. జిల్లాలో ఇప్పటికే గత యాసంగికి చెందిన 85 వేల టన్నుల ధాన్యం నిల్వలు ఉన్నాయి. దీనికి తోడు 50 నుంచి 60 వేల టన్నుల మొక్కజొన్న, పత్తి నిల్వలు పేరుకుపోయాయి. వంగపల్లి, బీబీనగర్ గోదాముల్లో భారీగా పత్తి నిల్వలు ఉన్నాయి. టెండర్ ధాన్యం ఖాళీ చేయడం ద్వారా జిల్లాలో సుమారు 75 వేల నుంచి 80 వేల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యం మాత్రమే అందుబాటులోకి వస్తుంది. మిగిలిన కనీసం 2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని భద్రపరిచేందుకు ప్రైవేట్ గోదాములను అద్దెకు తీసుకునేందుకు అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. లోటును భర్తీ చేసుకోవాలని యోచిస్తున్న మిల్లర్లు పౌరసరఫరాల శాఖ తాజా నిర్ణయం ప్రకారం ఇప్పటివరకు మిల్లర్లకు ధాన్యం ఇవ్వకూడదని భావిస్తున్నారు. మరోవైపు మిల్లుల్లో ఇప్పటికే ధాన్యం నిల్వ ఉందనే నెపంతో సీఎంఆర్, రా రైస్ తీసుకోవడానికి ఎఫ్‌సీఐ నుంచి సరైన ప్రోత్సాహం లభించడం లేదని మిల్లర్లు ఆరోపిస్తున్నారు. సమస్యల పరిష్కారానికి ఇటీవల మిల్లులు మూసివేసిన మిల్లర్లు, ఫిజికల్ వెరిఫికేషన్ నిబంధనల్లో ప్రభుత్వం కొంత సడలింపు ఇవ్వడంతో మళ్లీ తెరిచారు. ఈ సీజన్లో ఎలాగైనా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి తమ లోటును భర్తీ చేసుకోవాలని మిల్లర్లు ఆలోచిస్తున్నారు. ఫ ఈ సారి మిల్లులకు ధాన్యం ఇవ్వకుండా నేరుగా గోదాముల్లోకే ఫ జిల్లాలో ప్రైవేట్ గోదాముల వేటలో నిమగ్నమైన అధికారులు -
తరంగ్–2 పర్వతాన్ని అధిరోహించిన అన్వితారెడ్డి
భువనగిరి : హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలోని 6,027 మీటర్ల ఎత్తైన తరంగ్–2 పర్వతాన్ని 10 మందితో కూడిన బృందం ట్రాన్సెండ్ అడ్వెంచర్స్ యాత్ర సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 22న అధిరోహించింది. ఇందులో తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారు నలుగురు ఉండగా.. మిగిలిన ఆరుగురు నార్త్ స్టేట్లకు చెందిన వారున్నారు. తెలంగాణకు చెందిన వారిలో రాజ్‌కుమార్, మోతికుమార్(ఖమ్మం), ఫణి(నిజామాబాద్), భువనగిరికి చెందిన పడమటి అన్వితారెడ్డి ఉన్నారు. ఈ నెల 10న మనాలీ నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమం 22న పర్వతాన్ని అధిరోహించడంతో ముగిసింది. గురువారం తిరిగి మనాలీకి చేరుకున్నారు. ఇప్పటి వరకు ఈ పర్వతానికి చేరుకోవడానికి మార్గం లేకపోవడంతో సాంకేతిక పరిజ్ఞానంతో లాజిస్టిక్స్ ఉపయోగిస్తూ పర్వతాన్ని అధిరోహించి ఇండియాలో మొదటిసారిగా ఈ పర్వతానికి కొత్త మార్గాన్ని కనిపెట్టి రికార్డు సృష్టించారు. కాగా ఇప్పటికే పడమటి అన్వితారెడ్డి ప్రపంచంలోనే ఎత్తైన ఎవరెస్టు పర్వతాన్ని అధిరోహించిన విషయం తెలిసిందే. -
విద్యుత్ సబ్‌స్టేషన్ ముట్టడి
శాలిగౌరారం : మండల కేంద్రంలోని బీసీ కాలనీలో విద్యుత్ ట్రాన్స్పార్మర్ పేలిపోయి బుధవారం రాత్రి కాలనీ మొత్తం పూర్తిగా అంధకారంలోనే ఉంది. స్థానికులు విద్యుత్ సిబ్బందికి సమాచారం ఇవ్వగా.. వర్షం కురుస్తుండటంతో విద్యుత్ సరఫరాను పునురుద్ధరించలేదు. గురువారం రాత్రి వరకు కూడా కరెంట్ రాకపోవడంతో విషయాన్ని సంబంధిత ఏఈ, లైన్మెన్ దృష్టికి తీసుకెళ్లారు. వారి నుంచి నిర్లక్ష్యంగా సమాధానం రావడంతో ఆగ్రహానికి గురైన కాలనీవాసులు సుమారు 200 మంది 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. సబ్‌స్టేషన్‌లోని లైన్మెన్, సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. సబ్‌స్టేషన్ యార్డు ఆవరణలోకి చొచ్చుకొని వెళ్లి విద్యుత్ సరఫరా మొత్తం నిలిపివేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో విద్యుత్ సిబ్బందికి, కాలనీవాసులకు తోపులాట జరిగింది. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పాటు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. విద్యుత్ సబ్‌స్టేషన్‌కు చేరుకున్న పోలీసులు కాలనీవాసులతో మాట్లాడి నచ్చజెప్పారు. నల్లగొండ నుంచి మరో ట్రాన్స్ఫార్మర్ను తీసుకొచ్చి రాత్రి ఆలస్యంగా విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. -
షార్ట్ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం
భువనగిరిటౌన్ : వినాయక నిమజ్జనోత్సవ శబ్దాలు ఆ దంపతుల ప్రాణాలను కాపాడాయి. ఇంట్లో అగ్నిప్రమాదం జరిగి మంటలు వ్యాపిస్తున్న సమయంలో ఊరేగింపు సందడికి మేల్కొన్న దంపతులు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఈ ఘటన భువనగిరి పట్టణంలోని 33వ వార్డు విద్యానగర్‌లో బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. బాధితులు, అగ్నిమాపక శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని వినాయక చౌరస్తా సమీపంలో గల విద్యానగర్‌కు చెందిన ఎండీ జలాల్ దంపతులు తమ ఇంట్లోని మొదటి అంతస్తులో నివాసముంటున్నారు. బుధవారం తెల్లవారుజామున ఇంట్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు చెలరేగాయి. నిమిషాల వ్యవధిలోనే మంటలు వేగంగా వ్యాపించాయి. అదే సమయంలో పట్టణ ప్రధాన రహదారి మీదుగా సాగుతున్న వినాయక నిమజ్జనం ఊరేగింపు శబ్దాలకు జలాల్ దంపతులు నిద్రలేచారు. అప్పటికే ఇల్లంతా పొగ, మంటలు వ్యాపించడాన్ని గమనించి బయటకు పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. రూ. 6 లక్షల నగదు, ఫర్నీచర్, ధ్రువపత్రాలు కాలి బూడిదయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు భువనగిరి పట్టణ సీఐ రమేష్ తెలిపారు. ఫ గణేష్ నిమజ్జన ఊరేగింపు సందడితో మేల్కొన్న దంపతులు ఫ అప్రమత్తమై బయటకు పరుగులు తీయడంతో తప్పిన ప్రాణాపాయం -
మాతృ మరణాల నివారణకు చర్యలు
ఫ ఇన్చార్జి కలెక్టర్ భాస్కర్‌రావు భువనగిరిటౌన్ : జిల్లాలో మాతృ మరణాల నివారణకు పకడ్బందీ ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ భాస్కర్ రావు వైద్యాధికారులను ఆదేశించారు. మాతృ మరణాలపై బుధవారం కలెక్టరేట్లో డీఎంహెచ్ఓ మనోహర్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ ఏడాది జిల్లాలో నమోదైన రెండు మాతృ మరణాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఇన్చార్జి కలెక్టర్ మాట్లాడారు. గర్భిణుల వివరాలు, రక్త, మూత్ర పరీక్షలు, స్కానింగ్ నివేదికలను తప్పనిసరిగా మాతాశిశు సంరక్షణ కార్డుల్లో నమోదు చేయాలని స్పష్టం చేశారు. సమావేశంలో జిల్లా అధికారులు శ్రీనివాస్, సూర్యశ్రీరావు, సుమన్ కళ్యాణ్, ప్రోగ్రామ్ ఆఫీసర్ శ్రీలక్ష్మి, వైద్య నిపుణులు డాక్టర్ ఆబిద్ అలీ, డాక్టర్ వీణ, డాక్టర్ ఉమామహేశ్వరి పాల్గొన్నారు. నారసింహుడికి నిత్యారాధనలుయాదగిరిగుట్ట రూరల్: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహాస్వామి వారి ఆలయంలో నిత్యపూజలను శాస్త్రోక్తంగా ఆలయ అర్చకులు బుధవారం నిర్వహించారు. వేకువజామునే స్వామి వారిని మేల్కొల్పిన అర్చకులు, ప్రధానాలయంలోని స్వయంభువులకు సుప్రభాత సేవ చేపట్టారు. బిందెతీర్థం, నిజాభిషేకం, ఆరాధన, అర్చనలు చేశారు. ప్రధానాలయం ముఖమండపంలోని ఉత్సవ మూర్తులకు సువర్ణ పుష్పార్చన సేవలు నిర్వహించారు. ఇక ప్రాకార మండపాల్లో శ్రీ సుదర్శన నారసింహా హోమం, నిత్యకల్యాణం, గజవాహాన సేవలు జరిపించారు. ఇక సాయంత్రం జోడు సేవలను అర్చకులు ఊరేగించారు. రాత్రి స్వామి అమ్మవార్లకు శయనోత్సవం జరిపించి, ఆలయాన్ని ద్వార బంధనం చేశారు. ఆయా పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులను చెల్లించుకున్నారు. నాణ్యమైన విత్తనోత్పత్తితో అధిక దిగుబడులుమోత్కూరు : నాణ్యమైన విత్తనోత్పత్తితోనే రైతులు మెరుగైన దిగుబడులు సాధించొచ్చని ఆత్మ జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ దేవ్‌సింగ్ అన్నారు. వరిలో నాణ్యమైన విత్తనోత్పత్తి అంశంపై మోత్కూరు మండలం అనాజిపురం గ్రామంలో బుధవారం రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాస్త్రవేత్తలు శ్రీలత, వి.శ్రీధర్, శివకుమార్ , ఆలేరు ఏడీఏ కె.నిర్మల, ఏఓ కీర్తి, పీఏసీఎస్ డైరెక్టర్ జె.లక్ష్మయ్య, సీఈవో వరలక్ష్మి, రైతులు, అధికారులు పాల్గొన్నారు. -
రూ.5 వేలు ఇస్తేనే బైక్ ఇస్తామంటున్నారు
సీజింగ్ పేరుతో బైక్‌లను తీసుకెళ్లి వేరే వారికి విక్రయిస్తున్నారు. మరికొందరు కుదవపెట్టి డబ్బులు పంచుకుంటున్నారు. ఇటీవల మా బైక్‌ను తీసుకెళ్లిన ఓ వ్యక్తి, దాన్ని విడిచిపెట్టాలంటే రూ.5 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఆ డబ్బుల్లో ఫైనాన్స్ మేనేజర్‌కు కొంత, తమకు కొంత వస్తాయని, తిరిగి మీరు ఫైనాన్స్ కట్టుకోవాలని సదరు వ్యక్తి చెబుతున్నాడు. – గుండా నాగరాజు, మిర్యాలగూడ ఫైనాన్స్ సీజింగ్ పేరుతో బైక్‌లను అక్రమంగా తీసుకెళ్తున్నారనే సమాచారం మా దృష్టికి వచ్చింది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. – నాగభూషణరావు, వన్‌టౌన్ సీఐ, మిర్యాలగూడ -
బండి సీజ్ చేసి.. తాకట్టు పెట్టి
మిర్యాలగూడ అర్బన్ : ఫైనాన్స్‌లో తీసుకున్న వాహనాల కిస్తీలు చెల్లించని వారిని లక్ష్యంగా చేసుకుని కొందరు కేటుగాళ్లు ఇలాంటి నయా దందాకు తెరలేపారు. సదరు ఫైనాన్స్ సంస్థల సిబ్బందితో కుమ్మకై ్క, రికవరీ ఏజెంట్ల పేరుతో దౌర్జన్యంగా వాహనాలను లాక్కెళ్తున్నారు. అలా సీజ్ చేసిన వాహనాలను కంపెనీలకు అప్పగించకుండా వేరే వ్యక్తులకు విక్రయించడం లేదా కుదవబెట్టి సొమ్ము చేసుకుంటున్నారు. మిర్యాలగూడలో ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో ఈ మోసం వెలుగులోకి వచ్చింది. దందా సాగుతోందిలా.. ఫైనాన్స్‌లో వాహనం తీసుకున్న వ్యక్తులు కొద్ది నెలలు బాగానే కిస్తీలు కట్టినా, ఆర్థిక ఇబ్బందుల వల్ల చెల్లింపులు ఆగిపోతే ఆ వాహనం నంబర్‌ను ఓ ప్రత్యేక యాప్‌లో అప్లోడ్ చేస్తున్నారు. సీజింగ్ ఏజెంట్లుగా చెలామణి అవుతున్న కొందరు ఒక ముఠాగా ఏర్పడి, ఆ యాప్ ద్వారా బైక్ ఎక్కడ తిరుగుతుందో పసిగడతారు. పలు కూడళ్లలో కాపుకాసి దౌర్జన్యంగా వాహనాలను లాక్కెళ్తున్నారు. బండిపై కుటుంబ సభ్యులు ఉన్నా సరే నడిరోడ్డుపై దించేసి తీసుకెళ్తున్నారు. నిబంధనల ప్రకారం.. సీజ్ చేసిన వాహనాన్ని ఫైనాన్స్ కార్యాలయంలో అప్పగించి, సీజింగ్ లెటర్‌ను వాహనదారుడికి ఇవ్వాలి. కానీ, ఫైనాన్స్ మేనేజర్లతో కుమ్మక్కవుతున్న ఈ వ్యక్తులు ఆ బైక్‌లను అమ్ముకోవడం లేదా కుదవబెట్టి డబ్బులు పంచుకుంటున్నారు. వీరికి స్థానిక రాజకీయ నాయకుల అండదండలు కూడా ఉండటంతో ఇన్నాళ్లూ అడ్డూఅదుపు లేకుండా పోయింది. మహిళ ఫిర్యాదుతో వెలుగులోకి.. మిర్యాలగూడకు చెందిన ఓ మహిళ తన పేరిట ఫైనాన్స్‌లో బైక్ తీసుకుంది. కొన్ని కిస్తీలు కట్టాక ఆర్థిక ఇబ్బందులతో చెల్లింపులు ఆగిపోయాయి. దీంతో ఫైనాన్స్ సీజింగ్ పేరుతో వచ్చిన వ్యక్తి ఆమె బైక్‌ను తీసుకెళ్లాడు. అనంతరం దాన్ని తన సొంత ఖర్చుల కోసం మరొకరి వద్ద కుదవబెట్టాడు. కొద్దిరోజుల తర్వాత ఆ బైక్ వేరొకరి వద్ద కనిపించడంతో ఆమె సదరు ఫైనాన్స్ సంస్థను నిలదీసింది. బైక్ సీజింగ్ వ్యవహారం తమకు తెలియదని వారు చెప్పడంతో మోసపోయానని గ్రహించిన మహిళ మిర్యాలగూడ వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు సదరు యువకుడిని అదుపులోకి తీసుకుని నాలుగు బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. నల్లగొండకు చెందిన ఓ మధ్యతరగతి కుటుంబం ప్రైవేట్ ఫైనాన్స్‌లో ఓ స్కూటీని తీసుకుంది. కిస్తీలన్నీ సక్రమంగా చెల్లించినా చివరి కిస్తీ రూ.3,300 ఆగిపోయింది. రెండు నెలల తర్వాత ఆ స్కూటీపై వెళ్తున్న సదరు కుటుంబ సభ్యులను కొందరు వ్యక్తులు అడ్డగించి.. కిస్తీ పెండింగ్ ఉందని చెప్పి స్కూటీని లాక్కెళ్లారు. బాధితుడు రెండు రోజుల తర్వాత సదరు ఫైనాన్స్ కార్యాలయానికి వెళ్లి డబ్బులు చెల్లిస్తానని అడగగా.. ‘మేము బండి సీజ్ చేయలేదు.. చేస్తే ఇక్కడే ఉండాలి కదా’ అని వారు సమాధానం చెప్పారు. దీంతో అతడు అవాక్కయ్యాడు. కాగా.. ఆ స్కూటీ ఏడాది తర్వాత మిర్యాలగూడ పట్టణంలో మరో వ్యక్తి వద్ద కనిపించడం గమనార్హం. ఫ రికవరీ ఏజెంట్ల పేరిట ఘరానా మోసం ఫ ప్రత్యేక యాప్‌తో వాహనాల గుర్తింపు.. దౌర్జన్యంగా పట్టివేతఫ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి సీజ్ చేసిన వాహనాలు ఫ ఫైనాన్స్ సంస్థల కనుసన్నల్లోనే వ్యవహారం ఫ ఓ మహిళ ఫిర్యాదుతో కదిలిన డొంక ఫ నాలుగు బైక్‌లను స్వాధీనం చేసుకున్న పోలీసులు -
డ్రగ్స్‌కు దూరంగా ఉండండి భక్తులారా..
సూర్యాపేటటౌన్ : వినాయకుని నిమజ్జన వేడుకలను పురస్కరించుకుని సూర్యాపేట పట్టణంలోని మినీ ట్యాంక్‌బండ్‌పై ప్రభుత్వ ఉపాధ్యాయుడు బుధవారం వినూత్న అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మద్దిరాల మండలం గోరంట్ల జెడ్పీహెచ్ఎస్ తెలుగు ఉపాధ్యాయుడు, సామాజిక కార్యకర్త రాచకొండ ప్రభాకర్ వినాయకుని వేషధారణలో.. వాహనదారులు హెల్మెట్ పెట్టుకోవాలని, డ్రగ్స్, గంజాయికి దూరంగా ఉండాలని అవగాహన కల్పించారు. వినాయకుడికి తల తొలగితే మరో తల వచ్చినా.. మనుషులకు అలా జరగదని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. కార్లలో ప్రయాణించే వారు సీట్‌బెల్ట్ పెట్టుకో వాలని, మద్యం, మత్తు పదార్థాలు సేవించి వాహనాలు నడపరాదన్నారు. అతివేగాన్ని నియంత్రించి రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తూ క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని కోరారు. యువత, విద్యార్థులు డ్రగ్స్, గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ప్రభాకర్ సూచించారు. కరపత్రాలు, ఫ్లెక్సీలు, మైక్‌సెట్ ద్వారా ప్రజలకు సందేశాన్ని అందించారు. హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోండి నాయనా.. గణపయ్య వేషధారణలో ప్రజలకు అవగాహన కల్పించిన ఉపాధ్యాయుడు -
ప్రజల కోసం పనిచేస్తే చిరస్థాయిగా నిలిచిపోతారు
రామన్నపేట: ప్రజల కోసం పనిచేసిన కమ్యూనిస్టులు వారి హృదయాలలో చిరస్థాయిగా నిలిచి పోతారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ పేర్కొన్నారు. బుధవారం రామన్నపేట మండలంలోని శోభనాద్రిపురం గ్రామంలో అనారోగ్యంతో మృతిచెందిన మాజీ వైస్‌ఎంపీపీ పబ్బతి లింగయ్య మృతదేహం వద్ద ఆయన పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులు అర్పించారు. అనంతరం నిర్వహించిన సంతాపసభలో జాన్‌వెస్లీ మాట్లాడారు. లింగయ్య తుది శ్వాసవరకు నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఎర్రజెండాను చేబూని ప్రజల కోసం పనిచేసిన ఆదర్శ నాయకుడని కొనియాడారు. పార్టీ మాజీ కేంద్రకమిటీ సభ్యుడు సీతారాములు మాట్లాడుతూ లింగయ్య మృతి .. పార్టీకి ప్రజా ఉద్యమానికి తీరని లోటని అన్నారు. గ్రామంలో నిర్వహించిన అంత్యక్రియల్లో పార్టీశ్రేణులు పెద్దసంఖ్యలో పాల్గొన్నాయి. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి ఎం.డీ జహంగీర్, నాయకులు మేక అశోక్‌రెడ్డి, కల్లూరి మల్లేశం, కొండమడుగు నర్సింహ, పైళ్ల ఆశయ్య, జెల్లెల పెంటయ్య పి. అచ్చాలు, రాగిరి కిష్టయ్య, బి.జయరాములు, సిర్పంగి స్వామి, వెంకటేశం, కల్లూరి నాగేష్, కందుల హన్మంత్, ఆనంద్, నాగటి ఉపేందర్, ఐలయ్య, రశీద్, రజిత, మల్లేశం, ఉదయ్‌కుమార్, అంజయ్య, లింగస్వామి పాల్గొన్నారు. ఫ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ -
స్పేస్ ఆన్ వీల్స్
ఫ ఎన్ఆర్ఎస్సీ ఆధ్వర్యంలో అంతరిక్ష పరిశోధనలు, ఉపగ్రహాలపై పాఠశాల విద్యార్థులకు అవగాహన ఫ స్లాట్ బుక్ చేసుకుంటే బస్సు ద్వారా నేరుగా పాఠశాలల్లోనే ఇస్రో నమూనాల ప్రదర్శనచిలుకూరు : ఇస్రో చేస్తున్న అద్భుతమైన అంతరిక్ష పరిశోధనలు, సాధిస్తున్న ప్రగతిని విద్యార్థులకు, యువతకు కళ్లకు కట్టినట్లు వివరించేందుకు ఎన్ఆర్ఎస్సీ (నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్) ‘స్పేస్ ఆన్ వీల్స్’ బస్సు ద్వారా విస్తత ప్రచారం నిర్వహిస్తోంది. శ్రీహరికోట లాంటి రాకెట్ ప్రయోగ కేంద్రాలకు నేరుగా వెళ్లి చూసే అవకాశం అందరికీ ఉండదు కాబట్టి, ఆయా ప్రయోగాల నమూనాలను విద్యార్థుల ముంగిటకు తీసుకెళ్లడమే లక్ష్యంగా ఎన్ఆర్ఎస్సీ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా మంగళవారం చిలుకూరు జిల్లా పరిషత్ పాఠశాలలో శక్తి యూత్ చొరవతో ఈ బస్సును ప్రదర్శనకు ఉంచారు. జీడిమెట్ల ఔట్రీచ్ ఫెసిలిటీ కేంద్రంగా.. హైదరాబాద్‌లోని జీడిమెట్లలో ఎన్ఆర్ఎస్సీకి చెందిన ఔట్రీచ్ ఫెసిలిటీ కేంద్రం ఉంది. ఇస్రో పరిశోధనల నమూనాలతో అక్కడ ప్రత్యేక ఎగ్జిబిషన్లు ఉంటాయి. పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలు ముందుగా ఈ–మెయిల్ ద్వారా స్లాట్ బుకింగ్ చేసుకుంటే, ప్రతిరోజూ 180 నుంచి 200 మంది విద్యార్థులకు (8, 9, 10, ఇంటర్ విద్యార్థులకు) ఆ కేంద్రాన్ని సందర్శించే అవకాశం కల్పిస్తారు. అయితే, నగరానికి వెళ్లలేని గ్రామీణ ప్రాంత విద్యార్థుల కోసం ఈ ‘స్పేస్ ఆన్ వీల్స్’ బస్సును నేరుగా పాఠశాలలకే తీసుకెళ్లి ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలోనే స్థానిక చిలుకూరు శక్తి యూత్ సభ్యులు ఎన్ఆర్ఎస్సీ ప్రతినిధులను సంప్రదించి, జెడ్పీ పాఠశాలలో విద్యార్థుల కోసం ఈ ప్రదర్శనను ఏర్పాటు చేశారు. భావి భారత శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దేలా.. విద్యార్థులు, యువతను భావి భారత శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఎన్ఆర్ఎస్సీ అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల్లోని పాఠశాలలకు వెళ్లి ఈ ఎగ్జిబిట్ల ద్వారా ప్రచారం చేస్తున్నారు. ప్రపంచ దేశాల్లో భారత అంతరిక్ష పరిశోధనలకు ఉన్న గుర్తింపును, ప్రయోగాలను నిపుణులు విద్యార్థులకు వివరిస్తున్నారు. ప్రధానంగా ఇస్రో మిషన్స్, అంతరిక్ష ప్రయోగ వాహక నౌకలు (లాంచింగ్ వెహికల్స్), గగన్‌యాన్, చంద్రయాన్, భారత అంతరిక్ష స్టేషన్, ఉపగ్రహాల నమూనాలతో పాటు భూమి, చంద్రుడికి సంబంధించిన త్రీడీ నమూనాలను విద్యార్థులు స్వయంగా వీక్షించే అవకాశం కల్పిస్తున్నారు. -
పునరావాస గ్రామాన్ని అభివృద్ధి చేస్తాం
భువనగిరి: బీఎన్ తిమ్మాపురం పునరావాస గ్రామాన్ని సకల హంగులతో అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి తెలిపారు. బుధవారం భువనగిరి పట్టణ శివారులోని బస్వాపూర్ రిజర్వాయర్‌లో ముంపునకు గురవుతున్న బీఎన్ తిమ్మాపురం పునరావాస కాలనీలో మౌలిక వసతుల కల్పన పనులను ప్రారంభించి మాట్లాడారు. గ్రామాన్ని ఖాళీ చేస్తే రిజర్వాయర్‌లోకి నీటిని నింపే అవకాశం ఉంటుందన్నారు.అందువల్ల ప్రభుత్వం ముందుగా పరిహారం కింద రూ. 30కోట్లు, అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌లను కోరితే వెంటనే రూ. 206 కోట్లు మంజూరు చేశారన్నారు. ఇందులో రూ. 45 కోట్లతో కాలనీలో మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ తంగళ్లపల్లి శ్రీవాణిరవికుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అవెజ్చిస్తీ, పీఏసీఎస్ చైర్మన్ ఫక్కీర్ కొండల్‌రెడ్డి,మున్సిపల్ వైస్ చైర్పర్సన్ పోతంశెట్టి మంజుల, కాంగ్రెస్‌పార్టీ పట్టణ, మండల కమిటీల అధ్యక్షులు కూర వెంకటేశం, ఎల్లంల జంగయ్య, గ్రామ సర్పంచ్ ఎడ్ల వెంకట్‌రెడ్డి, కౌన్సిలర్ తుమ్మెటి పాండు తదితరులు పాల్గొన్నారు. -
మంటలంటుకొని వృద్ధ దంపతులు మృతి
దేవరకొండ : మంటలంటుకొని వృద్ధ దంపతులు మృతిచెందారు. ఈ ఘటన దేవరకొండ పట్టణంలో బుధవారం జరిగింది. దేవరకొండలోని బీఎన్ఆర్ కాలనీకి చెందిన ఎండీ దాదుమియా(80), సఫియాబేగం(68) దంపతులకు తొమ్మిది మంది సంతానం. అందరికీ వివాహాలు అయ్యాయి. దాదుమియా దంపతులు గతంలో గాజులు అమ్మే వ్యాపారం చేసేవారు. ప్రస్తుతం వారి చిన్న కుమారుడు అఫ్జల్ ఈ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. మంగళవారం రాత్రి దాదుమియా దంపతులు ఇంట్లోని తమ గదిలో నిద్రించగా.. బుధవారం తెల్లవారుజామున వారి గది నుంచి పొగలు వస్తుండటాన్ని చిన్న కోడలు చూసి భర్తను నిద్ర లేపింది. వెంటనే తలుపులు తెరిచి చూడగా అప్పటికే దాదుమియా దంపతులు కాలిన గాయాలతో మృతిచెంది ఉన్నారు. దేవరకొండ సీఐ వెంకట్‌రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే గదిలో మంటలు చెలరేగి వృద్ధ దంపతులు మృతిచెందినట్లు పోలీసులు భావిస్తున్నాడు. మృతుల పెద్ద కుమారుడు మునీర్ ఫిర్యాదు మేరకు.. క్లూస్‌టీంను పిలిపించి ఆధారాలు సేకరించినట్లు పోలీసులు పేర్కొన్నారు. -
కంకర తేలి.. గుంతలు పడి..
మోత్కూరు: మోత్కూరు పట్టణంలోని పెద్ద చెరువు కట్ట రోడ్డు పరిస్థితి అధ్వానంగా తయారైంది. సూర్యాపేట, ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలకు వెళ్లాలంటే ఇదే ప్రధాన రహదారి. ప్రతిరోజూ వందలాది వాహనాలు, వేలాది మంది ప్రయాణికులు ఈ మార్గం గుండానే ప్రయాణిస్తుంటారు. సరైన నిర్వహణ లేక ఈ రోడ్డుపై ప్రయాణించాలంటేనే జంకుతున్నారు. కంకరతేలి ప్రమాదకరంగా.. గత ప్రభుత్వ హయాంలో మినీ ట్యాంక్‌బండ్ ప్రాజెక్టులో భాగంగా సుమారు రూ. 6 కోట్లతో చెరువు కట్ట మరమ్మతులు, ఫుట్‌పాత్‌లు, రెయిలింగ్ నిర్మాణం వంటి అభివృద్ధి పనులు చేపట్టారు. కానీ ప్రస్తుతం కట్టంతా గుంతలమయమై, కంకర తేలి ప్రమాదకరంగా మారింది. ఫుట్‌పాత్‌లు పూర్తిగా పగిలిపోయి నడవడానికి వీలులేకుండా ఉన్నాయి. ఇనుప రెయిలింగ్ తుప్పుపట్టి, పలు చోట్ల విరిగిపోయింది. రూ. 36 లక్షలు వెచ్చించినా తీరని బురద తిప్పలు గత వర్షాకాలంలో కట్ట రోడ్డు కుంగిపోవడంతో, ఇటీవల అధికారులు రూ. 36 లక్షలతో సుమారు 20 మీటర్ల మేర బీటీ వేయకుండా మట్టితో మరమ్మతులు చేసి వదిలేయడంతో పరిస్థితి యథాస్థితికి వచ్చింది. కొద్దిపాటి వర్షం పడినా బురదమయంగా మారి వాహనాలు జారిపడే ప్రమాదం పొంచి ఉంది. ప్రధానంగా ఫుట్‌పాత్‌లు మధ్య మధ్యన తెగి నామరూపాలు లేకుండా పోయాయి. సిమెంటు స్లాబు, పలు చోట్ల ఇనుప రెయిలింగ్ ధ్వంసమైంది. రోడ్డుపై పలు చోట్ల గుంతలు ఏర్పడ్డాయి. మినీ ట్యాంక్‌బండ్ వద్ద ప్రకృతిని ఆస్వాదిండ లేకుండా పోయింది. ఇరిగేషన్, రోడ్లు, భవనాల శాఖల అధికారులు స్పందించి మరమ్మతులు చేయించాలి. – సోమిరెడ్డి, సీనియర్ సిటిజన్ అధ్వానంగా మోత్కూరు పెద్ద చెరువు కట్ట రోడ్డు ఫ ధ్వంసమైన ఫుట్‌పాత్‌లు ఫ తుప్పుపట్టి విరిగిన రెయిలింగ్ ఫ ఇబ్బందుల్లో పాదచారులు, వాహనదారులు -
కలెక్టరేట్‌పై మూడో కన్ను
భువనగిరిటౌన్ : కలెక్టరేట్లో ఉద్యోగుల సమయపాలనను కట్టుదిట్టం చేసేందుకు పటిష్ట చర్యలు చేపట్టారు. వివిధ శాఖల అధికారులు, సిబ్బంది విధులకు ఆలస్యంగా రావడం, సాయంత్రం వేళల్లో నిర్దేశిత సమయం కంటే ముందే కార్యాలయాన్ని విడిచి వెళ్తున్నారనే ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఇటీవల సిబ్బంది తీరుపై కఠినంగా వ్యవహరించిన అధికారులు ఉదయం 10:45 గంటలకే ప్రధాన గేటుకు తాళం వేసిన విషయం తెలిసిందే. సిబ్బందిలో క్రమశిక్షణ, జవాబుదారీతనం పెంచే లక్ష్యంతో కలెక్టరేట్ ఆవరణలోని ప్రధాన గేటు వద్ద ప్రత్యేకంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. కార్యాలయ ప్రవేశ మార్గం గుండా ఎవరు వస్తున్నారు? ఎవరు బయటకు వెళ్తున్నారు? అనే అంశాలను కలెక్టర్ తన చాంబర్‌లోని టీవీ మానిటర్ల ద్వారా నిరంతరం ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు. కలెక్టర్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారుబాధితులకు న్యాయం చేస్తాంఫ ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య భువనగిరి: బస్వాపూర్ ప్రాజెక్టు నిర్మాణంలో భూములు కోల్పోతున్న ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు న్యాయం జరిగేలా చూస్తానని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య హామీ ఇచ్చారు. భువనగిరి మండలం బస్వాపూర్ ప్రాజెక్టు పరిధిలోని ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు నష్టపరిహారం, పునరావాసం అందించడంలో జరుగుతున్న అలసత్వం, ప్రాజెక్టు నిర్మాణంలో నాణ్యతా లోపాలపై పలు ఫిర్యాదులు అందడంతో బుధవారం ఆయన క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు వాస్తవ పరిస్థితులను తెలుసుకోవడానికే వచ్చానన్నారు. ఎస్సీ, ఎస్టీల హక్కులు, ప్రయోజనాలకు ఎలాంటి భంగం కలగకుండా చూస్తామన్నారు. సమగ్ర నివేదికను సీఎంకు అందజేస్తామని తెలిపారు. యాదగిరి క్షేత్రంలో పూజలుయాదగిరిగుట్ట రూరల్: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామిని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య బుధవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆయనకు సంప్రదాయ రీతిలో స్వాగతం పలికారు. ప్రధానాలయంలోని స్వయంభువులను దర్శించుకున్న చైర్మన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మొక్కులు చెల్లించుకున్నారు. ప్రధానాలయం ముఖ మండపంలో ఉన్న ఉత్సవ మూర్తుల వద్ద అష్టోత్తర పూజల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత వేదమండపంలో వేదపండితులు వేద ఆశీర్వచనం చేశారు. ఆలయ అధికారులు స్వామి వారి లడ్డూ ప్రసాదం అందజేశారు. ఫ ప్రధాన గేటు వద్ద సీసీ కెమెరాల నిఘా ఫ ఉద్యోగుల రాకపోకలపై కలెక్టర్ పర్యవేక్షణ ఫ సమయపాలన పాటించకుంటే చర్యలు తప్పవని హెచ్చరిక -
పండ్ల తోటల సాగుకు దన్ను
బిందు సేద్యం ద్వారా మొత్తం 13 రకాల పండ్ల తోటలను సాగు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఇందులో మామిడి, దానిమ్మ, కొబ్బరి, జామ, సపోట, సీతాఫలం, డ్రాగన్ ఫ్రూట్, మునగ, బత్తాయి, జీడిమామిడి, అల్లనేరేడు, నిమ్మ తదితర రకాలు ఉన్నాయి.ఆలేరు రూరల్: పండ్లు, కూరగాయల కొరత తీవ్రంగా ఉంది. వాతావరణ మార్పులు, తెగుళ్ల కారణంగా దిగుబడి తగ్గి పండ్ల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దీంతో ఇతర రాష్ట్రాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనిని అధిగమించేందుకు ప్రతి జిల్లాలో పండ్ల తోటల సాగును తప్పనిసరి చేస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాయి. వీబీజీ రాంజీ పథకం కింద జిల్లాలో ఈ ఏడాది 300 ఎకరాల్లో పండ్ల తోటలను సాగు చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. ఇప్పటి వరకు 135 మంది రైతులు దరఖాస్తు చేసుకోగా, 179 ఎకరాల్లో 29 వేల మొక్కలు నాటారు. రాయితీలు, ఆర్థిక సాయం రైతులు ఆసక్తి మేరకు మొక్కలను ఎంచుకుని నాటుకుంటే, కొనుగోలు ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుంది. ఉపాధి హామీ కూలీలతో ఉచితంగా గుంతలు తవ్విస్తారు. మొక్కల నిర్వహణ కోసం ఒక్కో మొక్కకు నెలకు రూ. 12 చొప్పున ఆర్థిక సాయం అందజేస్తారు. ఎరువుల కొనుగోలు కోసం మొక్కకు ఏడాదికి రూ. 50 చొప్పున చెల్లిస్తారు. ఈ సారి కొత్తగా బిందు సేద్యంపై ఎస్సీ, ఎస్టీలకు 90 శాతం, బీసీ చిన్న, సన్నకారు రైతులకు 80 శాతం ఇతర సామాజిక వర్గాలకు పెద్ద రైతులకు 70 శాతం రాయితీపై పరికరాలు అందజేయనున్నారు. రైతులు పండ్ల తోటల మధ్య ఖాళీ స్థలంలో అంతర పంటలు వేసుకుని అదనపు ఆదాయం పొందవచ్చు.ఆసక్తి ఉన్న రైతులు స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. అనంతరం ఫీల్డ్ అసిస్టెంట్లు క్షేత్రస్థాయిలో భూమిని పరిశీలించి అర్హులను ఎంపిక చేస్తారు. ఎల్‌నినో కారణంగా ఆశించిన మేర వర్షాలు కురవడం లేదు. దీంతో జిల్లాలో పండ్ల తోటల పెంపకాన్ని పోత్సహిస్తున్నాం. ఆసక్తి ఉన్న వారు పండ్ల తోటల సాగుకు ముందుకు రావాలి. అర్హులైన చిన్న, సన్నకారు రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. – నాగిరెడ్డి, డీఆర్డీఓ ఫ ఈ ఏడాది లక్ష్యం 300 ఎకరాలు ఫ ఇప్పటి వరకు 135 మంది దరఖాస్తు ఫ వీబీజీ రాంజీ పథకం కింద ఉచితంగా మొక్కలు, గుంతల తవ్వకం పనులు ఫ రాయితీపై బిందుసేద్యం పరికరాలు -
ఆలేరు స్టడీసెంటర్‌కు పూర్వవైభవం తేవాలి
ఆలేరు : అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆలేరు స్టడీ సెంటర్‌కు పూర్వవైభవం తేవాలని ఓపెన్ యూనివర్సిటీ జాయింట్ డైరెక్టర్(అడ్మిషన్ ఇన్చార్జి) ప్రొఫెసర్ ధర్మానాయక్ కోరారు. మంగళవారం ఆయన ఆలేరు స్టడీసెంటర్లో కౌన్సిలర్లతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. వర్సిటీ టీసీఎస్,ఐయాన్,వి–హబ్, రాశి తదితర సంస్థలతో కుదిరిన ఒప్పందాల ద్వారా విద్యార్థులకు చదువుతోపాటు శిక్షణ, ఉద్యోగ, నైపుణ్యాభివృద్ధి,ఉపాధి అవకాశాలు కల్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని వివరించారు. జియో ఫిజిక్స్ వంటి కొత్త కోర్సులను అందుబాటులోకి తీసుకువస్తున్నట్టు పేర్కొన్నారు. ఆలేరు విద్యార్థులకు ప్రాక్టికల్స్ భువనగిరిలో నిర్వహించే అవకాశం కల్పించినట్టు తెలిపారు. సమావేశంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రాజారామ్, స్టడీ సెంటర్ సిబ్బంది పాల్గొన్నారు. -
పారిశ్రామిక భవ్య కాంతి
సాక్షి, యాదాద్రి: రాష్ట్రంలో పారిశ్రామిక రంగాన్ని బలోపేతం చేసే దిశగా తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీజీఐఐసీ) జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన ప్రతిష్టాత్మక భవ్య పథకం కింద అభివృద్ధి చేయడానికి జిల్లాలోని దండుమల్కాపురం, ఎం. తుర్కపల్లి ఎంపికయ్యాయి. దీంతో జిల్లా రూపురేఖలు మారడమే కాకుండా స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పుష్కలంగా లభించనున్నాయి. తొలి ప్రాధాన్యతగా దండుమల్కాపురం విస్తరణ భూముల లభ్యత అనుకూలంగా ఉండటంతో చౌటుప్పల్ మండలంలోని దండుమల్కాపురం విస్తరణకు అధికారులు తొలి ప్రాధాన్యమిచ్చారు. ఇప్పటికే ఇక్కడ 2019లో 1,850 ఎకరాల్లో ఏర్పాటు చేసిన గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్‌లో మైక్రో, స్మాల్, మీడియం పరిశ్రమల కోసం 580 ఎకరాలు కేటాయించగా, 550 పరిశ్రమలకు భూమి కేటాయింపులు పూర్తయ్యాయి. ప్రస్తుతం అందులో 300కు పైగా పరిశ్రమలు ఉత్పత్తులను కొనసాగిస్తున్నాయి. ఈ పార్క్‌కు అనుబంధంగా అందుబాటులో ఉన్న దాదాపు 450 ఎకరాలను కేంద్ర భవ్య పథకం కింద ప్రాసెస్ చేయడానికి టీజీఐఐసీ ఎంపిక చేసింది. ప్రత్యేక కన్సల్టెన్సీ ద్వారా డీపీఆర్ రూపొందించి ఇప్పటికే కేంద్రానికి పంపారు. ఆరు నెలల నుంచి ఏడాది కాలంలో అనుమతులతో పాటు కేంద్రం ప్రకటించే రాయితీలు కూడా ఖరారయ్యే అవకాశముంది. రెండో విడతలో తుర్కపల్లి ఇండస్ట్రియల్ పార్క్ భవ్య పథకం రెండో విడతలో భాగంగా ఎం. తుర్కపల్లి మండలంలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు సంబంధించి దాదాపు 150 ఎకరాల భూసేకరణ ఇప్పటికే పూర్తయింది. దండుమల్కాపురం ప్రాజెక్టు పరిమాణంలో పెద్దది కావడంతో తొలి ప్రాధాన్యం ఇవ్వగా, ఎం. తుర్కపల్లిని రెండో ప్రాధాన్యత కింద వేగవంతంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అనుకూలత అంశాలు ఏమిటంటే.. దండుమల్కాపురం, తుర్కపల్లి ప్రాంతాలు హైదరాబాద్ నగరానికి సమీపంలో ఉండటం అతిపెద్ద ప్లస్ పాయింట్. జాతీయ రహదారులు, రైల్వే నెట్వర్క్, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం అతి చేరువలో ఉండటం వల్ల పారిశ్రామికవేత్తలు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇక్కడ ప్రధానంగా ఏరోస్పేస్, ఇంజనీరింగ్, ఎలక్ట్రిక్ వాహనాలు, ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదక ఇంధన పరికరాల ఉత్పత్తి పరిశ్రమలు రానున్నాయి.ఫ కేంద్ర భవ్య పథకం కింద దండుమల్కాపురం, తుర్కపల్లి ఎంపిక ఫ ఇప్పటికే డీపీఆర్ సిద్ధం ఫ ఈవీ, ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్స్ రంగాలకు ప్రాధాన్యం ఫ స్థానిక యువతకు భారీగా ఉపాధి అవకాశాలు ఫ పారిశ్రామిక ప్రగతి దిశగా జిల్లా ముందడుగుదండుమల్కాపురం, తుర్కపల్లి ఇండస్ట్రియల్ పార్క్‌లు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే జిల్లా ఆర్థిక పరిస్థితి గణనీయంగా పుంజుకుంటుంది. పారిశ్రామికవేత్తలకు అవసరమైన భూమి, మౌలిక వసతులు కల్పించడాన్ని ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత అంశంగా తీసుకుంది. రాబోయే రోజుల్లో ఈ పార్కుల ద్వారా వేలాది మంది స్థానిక యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. -
యాదగిరి క్షేత్రంలో లక్ష పుష్పార్చన
యాదగిరిగుట్ట: ఏకాదశిని పురస్కరించుకొని యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో మంగళవారం లక్ష పుష్పార్చనను అర్చకులు పాంచరాత్ర ఆగమశాస్త్ర రీతిలో నిర్వహించారు. ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చన మూర్తులను ప్రత్యేకంగా అలంకరించి సుగ్రంధ పరిమళాలు వెదజల్లె రంగురంగుల పుష్పాలతో లక్ష పుష్పార్చన పూజలు చేశారు. తులసీ దళాలతో శ్రీస్వామి అమ్మవార్లను విశేషంగా పూజించారు. ఇక ఆలయంలో స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు ఉదయం నుంచి రాత్రి వరకు నిత్య పూజలు జరిపించారు. ఆలయ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, నిత్య కల్యాణం, గజవాహనసేవ, బ్రహ్మోత్సవం, వెండి జోడు సేవలను వైభవంగా నిర్వహించారు. మంగళవారం కావడంతో క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామికి ఆకుపూజను చేపట్టారు. -
యాదగిరిగుట్ట క్షేత్రానికి రూ.12.41లక్షల విరాళం
యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులకు హైదరాబాద్‌లోని బడంగ్‌పేటకు చెందిన ఆశయంగారి నర్సింహారెడ్డి, కృష్ణారెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి సోదరులు రూ.12.41 లక్షల విరాళం అందజేశారు. మంగళవారం యాదగిరీశుడిని దర్శించుకున్న అనంతరం వారు ఈఓ భవానీశంకర్‌ను కలిసి చెక్కులు ఇచ్చారు. కొండ కింద నిర్మించనున్న రెండవ కల్యాణ కట్టకు రూ.9లక్షలు, విష్ణు పుష్కరిణి వద్ద కోతుల బెడద నుంచి రక్షించేందుకు సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటుకు రూ.3.41లక్షలు అందించారు. దాతలు యాదగిరి క్షేత్ర అభివృద్ధికి ముందుకు రావాలని ఈఓ కోరారు. నేడు మంత్రి ఉత్తమ్ రాకఅడ్డగూడూరు: అడ్డగూడూరు మండలం ధర్మారంలో బుధవారం పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి నీటిపారుదల, పౌరసరఫరా శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్‌రెడ్డి, భువనగగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్‌రెడ్డి రానున్నట్లు ఎమ్మెల్యే మందుల సామేల్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ధర్మారంలో బిక్కేరు వాగుపై నిర్మించిన చెక్ డ్యామ్‌ను ప్రారంభించి, గ్రామ ఊరు చెరువు అభివృద్ధి పనులను పరిశీలించనున్నట్లు పేర్కొన్నారు. 24గంటలు మద్యం దుకాణాలు బంద్భువనగిరిటౌన్ : వినాయక నిమజ్జనోత్సవాల నేపథ్యంలో జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల పరిధిలో 24 గంటల పాటు మద్యం దుకాణాలు మూసివేయాలని ఇన్చార్జి కలెక్టర్ ఎ. భాస్కర్ రావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. బుధవారం ఉదయం 10:00 గంటల నుంచి ఈనెల 24వ తేదీ ఉదయం 10:00 గంటల వరకు అన్ని మున్సిపాలిటీలు, వాటి సరిహద్దు నుంచి 2 కిలోమీటర్ల పరిధిలోని ఏ4 మద్యం దుకాణాలు, 2బీ బార్లు, కల్లు దుకాణాలు, కల్లు డిపోలతో పాటు మద్యం విక్రయాలు, సరఫరా చేసే అన్ని కేంద్రాలు మూసిఉంచాలని ఆదేశించారు. పోచంపల్లిని సందర్శించిన స్విట్జర్లాండ్ దేశస్తులుభూదాన్పోచంపల్లి: పోచంపల్లి ఇక్కత్ పరిశ్రమ తీరు తెన్నులను తెలుసుకోవడానికి స్విట్జర్లాండ్ దేశానికి చెందిన ముగ్గురు పర్యాటకులు పోచంపల్లిని సందర్శించారు. టూరిజం పార్కులో గల మగ్గాలను పరిశీలించారు. అక్కడ వస్త్ర తయారీ ప్రక్రియల ఫొటోగ్యాలరీని తిలకించారు. అనంతరం ఇక్కత్ వస్త్రాలు, డిజైన్లు, పోచంపల్లి సాంస్కృతిక, చారిత్రక నేపథ్యాన్ని, చేనేత కళాకారుల నేత నైపుణ్యాలను అడిగితెలుసుకొని అభినందించారు. దివ్యాంగ విద్యార్థుల సంరక్షణ తల్లిదండ్రుల బాధ్యతభువనగిరి: దివ్యాంగ విద్యార్థుల సంరక్షణ తల్లిదండ్రుల బాధ్యత అని ఇన్చార్జి కలెక్టర్ భాస్కర్‌రావు పేర్కొన్నారు. మంగళవారం రాయగిరి జెడ్పీ ఉన్నత పాఠశాలలో సమగ్ర శిక్ష, అలింకో సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దివ్యాంగ విద్యార్థుల ఉపకరణాల గుర్తింపు శిబిరానికి హాజరై మాట్లాడారు. కార్యక్రమంలో డీఈఓ భిక్షపతి, సమన్వయకర్త లింగారెడ్డి, ఎంఈఓ రంగరాజన్, హెచ్ఎం అండాలు, శివరాజు, షాజహాన్, నరేష్, జ్యోతి, సంధ్యారాణి, బాలరాజు, రవీందర్‌రెడ్డి, శ్రీనివాస్,సత్యం, సుజాత, షబానా పాల్గొన్నారు. -
అదనంగా అండర్‌పాస్‌లు నిర్మించాలి
చౌటుప్పల్ : హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై చౌటుప్పల్ మండల పరిధిలో అదనంగా అండర్‌పాస్‌లు నిర్మించాలని బీజేపీ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ గంగిడి మనోహర్‌రెడ్డి కోరారు. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్‌లోని ఎన్హెచ్ఏఐ కార్యాలయానికి వెళ్లిన బీజేపీ బృందం హైవే అఽథారిటీ రీజినల్ ఆఫీసర్ శివశంకర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పట్టణంలో తంగడపల్లి క్రాస్ రోడ్డు నుంచి వలిగొండ క్రాస్‌రోడ్డు మధ్యన యూపీసీ, వీపీసీ అండర్‌పాస్‌లు ఏర్పాటు చేయాలన్నారు. ఎల్లగిరి గ్రామ స్టేజీ వద్ద మనుషులు, మూగజీవాలు దాటేందుకు పీయూపీ కేటాయించాలన్నారు. అదే విధంగా కొయ్యలగూడెంలో ప్రస్తుతం ఉన్న అండర్‌పాస్ ఇరుకుగా మారినందున అక్కడ అండర్‌పాస్ ఎత్తు, వెడల్పు పెంచి కొత్తగా నిర్మాణం చేయాలని సూచించారు. ప్రస్తుతం జరుగుతున్న అండర్‌పాస్ నిర్మాణ పనులను మరింత వేగంగా జరిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో దూడల భిక్షం, రమనగోని శంకర్, పోలోజు శ్రీధర్‌బాబు, కది లక్ష్మారెడ్డి, రిక్కల సుధాకర్‌రెడ్డి, కడారి అయిలయ్య, బుడ్డ సురేష్, పోలేపల్లి ముత్తయ్య, చెరుకు శివ, బొడ్డు అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వ్యవసాయానికి కరెంటు ఇవ్వని కాంగ్రెస్
ఫ మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి చౌటుప్పల్ : రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయానికి సక్రమంగా కరెంటు ఇవ్వకుండా రైతాంగాన్ని ఇబ్బందులకు గురిచేస్తుందని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ద్వజమెత్తారు. రైతుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. చౌటుప్పల్ పట్టణ పరిధిలోని తంగడపల్లి రోడ్డులోగల విద్యుత్ సబ్‌స్టేషన్‌ను బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం ముట్టడించారు. ఈ సందర్భంగా కూసుకుంట్ల మాట్లాడారు. ఓవైపు వర్షాభావం, మరోవైపు విద్యుత్ కోతల కారణంగా పంటలు ఎండి రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితులు దాపురించాయన్నారు. వ్యవసాయానికి కోతలు లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని, లేనిపక్షంలో సబ్స్టేషన్లను ఎక్కడకక్కడ ముట్టడిస్తామని హెచ్చరించారు. కాగా లాగ్ బుక్ చూపించాలని డీఈని కోరగా ..సరఫరా వివరాలను ఆన్లైన్లో అప్డేట్ చేస్తామని చెప్పి పంపించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు గిర్కటి నిరంజన్, మున్సిపల్ కన్వీనర్ బొమ్మిరెడ్డి వెంకట్‌రెడ్డి, సింగిల్‌విండో మాజీ చైర్మన్ చింతల దామోదర్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ పెద్దిటి బుచ్చిరెడ్డి, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు సుర్వి మల్లేష్, నారాయణపురం మండల పార్టీ అధ్యక్షుడు నర్రి నర్సింహ, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, మున్సిపల్ కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు. -
వీధిలోకి రావాలంటే వణుకే
● భువనగిరి పట్టణంలోని 27వ వార్డుకు చెందిన నసీర్ కుమారుడు బషీర్ (2.5 సంవత్సరాలు) మంగళవారం ఇంటి ఎదుట ఆడుకుంటున్నాడు. ఒక్కసారిగా వీధి కుక్కలు బాలుడిపై దాడి చేసి గాయపరిచాయి. గాయాలపాలైన బాలుడిని భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స అందించారు. ● గత నెల 7న మున్సిపాలిటీలోని 25వ వార్డులో విధులు నిర్వహిస్తున్న మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికురాలు వడ్డేపల్లి అలివేలుపై వీధి కుక్క దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. ● ఆరు నెలల క్రితం తారకరామ నగర్‌కు చెందిన ప్రియాన్ష్ అనే చిన్నారి ఇంటి బయట ఆడుకుంటుండగా కుక్క దాడి చేసింది. దీంతో చిన్నారి కన్ను బయటికి వచ్చేసింది. దీంతో ఆ బాలుడు శాశ్వతంగా చూపు కోల్పోయాడు. భువనగిరిటౌన్: భువనగిరి మున్సిపాలిటీ పరిధిలో వీధి కుక్కల బెడద రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతోంది. ప్రధాన రహదారులతో పాటు అంతర్గత వీధుల్లోనూ పదుల సంఖ్యలో కుక్కలు గుంపులు గుంపులుగా సంచరిస్తున్నాయి. ప్రజలు, పాదచారులు, ద్విచక్ర వాహనదారులపై దాడులు చేసి గాయపరుస్తున్నాయి. దీంతో జనం రోడ్లపైకి రావాలంటేనే జంకుతున్నారు. లక్షల నిధులు వృథా.. వీధి కుక్కల నియంత్రణకు, వాటికి కుటుంబ నియంత్రణ (ఏబీసీ) శస్త్రచికిత్సలు చేయడానికి మున్సిపాలిటీ ఖాతా నుంచి లక్షల రూపాయల నిధులు ఖర్చు చేస్తున్నారు. అయినా ఎలాంటి ఫలితాలు కన్పించడంలేదు.అధికారులు కుక్కలను పట్టుకెళ్లి ఆపరేషన్లు చేసి, మళ్లీ పట్టుకొచ్చిన ప్రాంతాల్లోనే వదిలేయడం వల్ల దాడుల సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్భువనగిరి మున్సిపల్ అధికారులు యుద్ధప్రాతిపదికన ప్రత్యేక బృందాలను రంగంలోకి దించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. వీధి కుక్కల బెడద నుంచి తమకు శాశ్వత విముక్తి కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.ఫ భువనగిరిలో తీవ్రమైన కుక్కల బెడద ఫ తాజాగా చిన్నారిపై దాడి ఫ గతంలో కుక్కల దాడిలో కన్ను కోల్పోయిన మరో చిన్నారి.. పారిశుద్ధ్య కార్మికురాలికి గాయాలు ఫ శునకాల నియంత్రణకు రూ.లక్షలు వెచ్చిస్తున్నా కానరాని ఫలితం -
యాదగిరీశుడి హుండీ ఆదాయం రూ.2.59కోట్లు
యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ హుండీల్లో భక్తులు సమర్పించుకున్న నగదు, నగలను మంగళవారం కొండ దిగువన సత్యనారాయణస్వామి వ్రత మండపంలో లెక్కించారు. ఈ లెక్కింపులో రూ.2,59,03,628 నగదు వచ్చినట్లు యాదగిరిక్షేత్రం కార్యనిర్వహణ అధికారి భవానీ శంకర్ వెల్లడించారు. మిశ్రమ బంగారం 32గ్రాములు, మిశ్రమ వెండి 3 కిలోల 950 గ్రాములు వచ్చినట్లు ఆయన వివరించారు. వీటితో పాటు వివిధ దేశాలకు చెందిన కరెన్సీ కూడా వచ్చినట్లు ఈఓ పేర్కొన్నారు. ఈ హుండీల ఆదాయం 33 రోజులదని చెప్పారు. -
నేడే గణేశ్ నిమజ్జనం
భువనగిరి: తొమ్మిది రోజుల పాటు భక్తుల విశేష పూజలందుకున్న గణనాథులు బుధవారం గంగమ్మ ఒడికి చేరనున్నారు. వినాయక నవరాత్రోత్సవాలు మంగళవారంతో ముగియడంతో 23న జిల్లా వ్యాప్తంగా నిమజ్జన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సారి ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఉండటంతో, తగినంత నీటి వసతి ఉన్న చెరువులను మాత్రమే నిమజ్జనం కోసం ఎంపిక చేశారు. మున్సిపల్, విద్యుత్, పోలీస్, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల సమన్వయంతో ఏర్పాట్లు పూర్తయ్యాయి. సిద్ధంగా గజ ఈతగాళ్లు జిల్లా వ్యాప్తంగా మొత్తం 3,964 మండపాలను ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రమైన భువనగిరి పట్టణంలోనే 200లకు పైగా విగ్రహాలు కొలువుదీరాయి. చెరువుల వద్ద భారీ బారికేడ్లతో పాటు క్రేన్లు, విద్యుత్, తాగునీరు, బోట్లు, లైటింగ్ తదితర సదుపాయాలు కల్పించారు. అగ్నిమాపక, ఆరోగ్య, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో పాటు భువనగిరి పెద్ద చెరువు వద్ద 15 మంది, రాయగిరి చెరువు వద్ద 5 గురు గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచారు. శోభాయాత్ర మార్గాల్లో విద్యుత్ వైర్లు తగలకుండా హై రైజింగ్ చేయడంతో పాటు, చెట్ల కొమ్మలను తొలిగించారు. శోభాయాత్ర వెళ్లేది ఇలా.. భువనగిరి పట్టణంలో గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ప్రధాన రహదారులు, కూడళ్లలో కాషాయ తోరణాలు, స్వాగత వేదికలు ఏర్పాటు చేశారు. పాత బస్టాండ్, హనుమాన్ వాడ, సంజీవనగర్, గంజ్ ఏరియా నుంచి వచ్చే విగ్రహాలు నేరుగా ప్రిన్స్ చౌరస్తా మీదుగా చెరువు వైపు వెళ్తాయి. శ్రీరామ్ తండా చౌరస్తా, జంఖానగూడెం, ఇందిరానగర్, ఎల్బీనగర్ తదితర ప్రాంతాల నుంచి వచ్చే విగ్రహాలు శంకర్ విలాస్, సమ్మద్ చౌరస్తాల మీదుగా ప్రిన్స్ చౌరస్తాకు చేరుకుని అక్కడినుంచి చెరువుకు వెళ్లేలా రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. భువనగిరితో పాటు చౌటుప్పల్, ఆలేరు, యాదగిరిగుట్ట, పోచంపల్లి, మోత్కూర్ తదితర ప్రాంతాల్లో కూడా నిమజ్జనానికి నిర్వాహకులు సిద్ధమయ్యారు. పటిష్టమైన పోలీస్ బందోబస్తు నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. శోభాయాత్ర జరిగే మార్గంలో సీసీ కెమెరాల నిఘా ఉంచారు. ఇద్దరు అదనపు ఎస్పీలు, నలుగురు డీఎస్పీలు, 15 మంది సీఐలు, 30 మంది ఎస్సైలతో పాటు సుమారు 500 మంది ట్రాఫిక్ పోలీస్, సాయుధ బలగాలు, స్పెషల్ పార్టీ, ఉమెన్స్ టీమ్ రంగంలోకి దిగాయి. నిర్వాహకులు డీజేలు ఏర్పాటు చేయడానికి అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. నేడు విద్యా సంస్థలకు సెలవు.. జిల్లాలో వినాయక నిమజ్జనాన్ని పురస్కరించుకుని కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు బుధవారం సెలవు ప్రకటిస్తున్నట్లు డీఈవో భిక్షపతి, డీఐఈఓ సురేష్‌రెడ్డి వెల్లడించారు. దీనికి బదులు వచ్చే రెండో శనివారం స్కూళ్లు, కాలేజీలు నడపాలని సూచించారు. ఇప్పటికే 750 విగ్రహాల నిమజ్జనం పూర్తయింది. బుధవారం 2 వేల నుంచి 3 వేల వరకు విగ్రహాలు నిమజ్జనానికి వచ్చే అవకాశం ఉంది. కార్యక్రమం ప్రశాంతంగా జరిగేలా ఉత్సవ కమిటీలు, యువజన సంఘాలు పోలీసులకు సహకరించాలి. – అక్షాంశ్ యాదవ్, ఎస్పీపెద్ద చెరువు వద్ద నిమజ్జనానికి వివిధ శాఖలు, మున్సిపాలిటీకి చెందిన 180 మంది సిబ్బందిని, 15 మంది గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచాం. ఇక్కడ 7 క్రేన్లు, రాయగిరి చెరువు వద్ద 2 క్రేన్లు ఏర్పాటు చేశాం. –చంద్రప్రకాష్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్, భువనగిరి ఫ జిల్లావ్యాప్తంగా శోభాయాత్రగా తరలనున్న 3,964 వినాయక విగ్రహాలు ఫ నిమజ్జనం కోసం 14 ప్రదేశాల ఎంపిక ఫ భారీ పోలీస్ బందోబస్తు.. డీజేలకు అనుమతి నిరాకరణభువనగిరి పట్టణంలోని పెద్ద చెరువు, బస్వాపురం చెరువు, రాయగిరి చెరువు, బీబీనగర్ పెద్ద చెరువు, చౌటుప్పల్ మండలం పెద్దకొండూరు, మల్కాపురం, పోచంపల్లి చెరువు, రామన్నపేట మండలం తుమ్మలగూడెం చెరువు, వలిగొండ మండలం సంగెం గ్రామం వద్ద మూసీ కెనాల్, మోత్కూర్ చెరువు, యాదగిరిగుట్ట నల్ల చెరువు, గోధుమకుంట, ఆలేరు మండలంలోని సాయిగూడెం చెరువు, బాహుపేట పరిధిలో గోధుమకుంటలను అధికారులు ఎంపిక చేశారు. ప్రశాంత వాతావరణంలో నిమజ్జనం చేయాలిభువనగిరి: ప్రశాంత వాతావరణంలో వినాయక నిమజ్జనం చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఇన్చార్జి కలెక్టర్ భాస్కర్‌రావు సూచించారు. మంగళవారం భువనగిరి పట్టణంలోని పెద్ద చెరువు వద్ద నిమజ్జనం ఏర్పాట్లను పరిశీలించి మాట్లాడారు. నిమజ్జన ప్రాంతంలో భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా వసతులు కల్పించాలన్నారు. ట్రాఫిక్ సమస్య ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ చంద్రప్రకాష్‌రెడ్డి, డీఈ, సిబ్బంది ఉన్నారు. -
పరిహారం చెల్లించిన తర్వాతే పనులు చేపట్టాలి
భువనగిరిటౌన్ : ఎన్‌హెచ్–930పీ నిర్మాణంలో భూములు కోల్పోతున్న తమకు పూర్తిస్థాయిలో పరిహారం ఇచ్చిన తర్వాతే పనులు చేపట్టాలని భూ నిర్వాసితులు డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్ ఎదుట పోచంపల్లి, వలిగొండ మండలాల రైతులు ధర్నా నిర్వహించారు. రూ. 12 లక్షలే ఇస్తారా.. బహిరంగ మార్కెట్లో ఎకరాకు రూ. 2 కోట్లకు పైగా విలువ పలుకుతున్నా తమ భూములకు ప్రభుత్వం కేవలం రూ. 11 లక్షల నుంచి రూ. 12 లక్షలు పరిహారంగా ఇవ్వడం అన్యాయమని కలెక్టర్‌తో నిహించిన సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్ఆర్ఆర్, చౌటుప్పల్ పరిధిలో మాదిరిగా పరిహారాన్ని ఇవ్వాలని అప్పటి వరకు పనులు కొనసాగనివ్వబోమన్నారు. ఇన్చార్జ్ కలెక్టర్ భాస్కర్ రావు మాట్లాడుతూ వారం రోజుల్లోగా ఆర్బిట్రేషన్ ప్రక్రియ ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకారెడ్డి, ఆర్డీఓ శేఖర్‌రెడ్డి, భూబాధితుల జేఏసీ కన్వీనర్ వారాల శేఖర్ రెడ్డి, పాక మల్లేశ్ యాదవ్, సామ మధుసూదన్ రెడ్డి, కోట రామచంద్ర రెడ్డి, సామ రవీందర్ రెడ్డి, సుర్కంటి వెంకట్ రెడ్డి, తనేషా, నోముల జంగా రెడ్డి, మహేశ్, రవీందర్, బుచ్చి రెడ్డి పాల్గొన్నారు, -
ఐక్యంగా అడుగులేద్దాం..
సాక్షి, యాదాద్రి : బీఆర్ఎస్ పార్టీలో నాయకుల మధ్య ఐక్యతకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు హరీష్‌రావు రంగంలోకి దిగారు. ఆదివారం మోటకొండూరు మండల కేంద్రంలో జరిగిన సభ ద్వారా ఆయన ఈ ప్రయత్నాలు చేశారు. జిల్లాలోని సీనియర్ నాయకులను ఒకే వేదికపైకి తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు. కేవలం స్థానిక నాయకులే కాకుండా, ఉమ్మడి జిల్లాకు చెందిన కొందరు మాజీ ఎమ్మెల్యేలను కూడా ఆహ్వానించారు. కొంతకాలంగా మాట్లాడుకోని నాయకులను.. ఒకరినొకరు కలుసుకునేలా చేశారు. మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, మాజీ ఎమ్యెల్యేలు కుసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్య, పైళ్ల శేఖర్‌రెడ్డి, బూడిద భిక్షమయ్యగౌడ్, సీనియర్ నాయకులు బండా నరేందర్‌రెడ్డి, కంచర్ల రామకృష్ణారెడ్డిని ఒకే వేదికపైకి తీసుకువచ్చారు. శ్రీమేమంతా ఒక్కట్ఙే అనే బలమైన సందేశాన్ని పార్టీ క్యాడర్లో కల్పించారు. పదవులు కోల్పోయిన తర్వాత తొలిసారిగా ఇంత భారీ స్థాయిలో మాజీ ప్రజాప్రతినిధులందరినీ ఆహ్వానించి కార్యక్రమంలో భాగస్వాములను చేయడం విశేషం. నాయకుల మధ్య అంతర్గతంగా విభేదాలు ఉన్నప్పటికీ, బహిరంగంగా మాత్రం పార్టీ ప్రయోజనాలకే మొదటి ప్రాధాన్యం అనే భావనను కలిగించడంలో హరీష్‌రావు వ్యూహాత్మకంగా వ్యవరించారు. అందరిని ఒకే వేదికపైన కూర్చో బెట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడాలంటే ముందుగా బీఆర్ఎస్లో ఐక్యత అవసరమని భావించిన ఆయన మోటకొండూరు వేదిక ద్వారా గులాబీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపారు. ప్రజా సమస్యలపై దృష్టి ప్రభుత్వ వైఫల్యాలపై బీఆర్ఎస్ క్యాడర్‌ను హరీష్‌రావు అప్రమత్తం చేశారు. ప్రస్తుతం ఎదురవుతున్న విద్యుత్ కోతలపై ఆందోళనలు చేయాల్సిన అవసరాన్ని చెప్పారు. రైతులకు రుణమాఫీ, ఎరువుల కొరత, 22–ఏ నిషేధిత భూముల వివాదాలు, రైతు భరోసా, ఆరు గ్యారంటీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ ప్రజా ఉద్యమాలకు పిలుపునిచ్చారు. తమపై వ్యక్తిగతంగా జరుగుతున్న ఇతర ఆరోపణలను పక్కనపెట్టి, కేవలం ప్రజల నిత్య సమస్యల ఆధారంగానే ప్రభుత్వాన్ని నిలదీయాలని దిశానిర్దేశం చేశారు. ఎన్నికలకు ఇంకా సమయం ఉండగానే చేరికలకు శ్రీకారం చుట్టారు. బీఆర్ఎస్లో చేరిన వారికి స్వయంగా గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన హరీష్‌రావు.. క్షేత్రస్థాయిలో పార్టీకి ఇంకా బలమైన మద్దతు ఉందని నిరూపించే ప్రయత్నం చేశారు. అధికారం కోల్పోయిన తర్వాత శ్రేణుల్లో నెలకొన్న నిరాశను, నాయకుల మధ్య విభేదాలను తొలగించడమే లక్ష్యంగా మోటకొండూరు సభ సాగింది. ఒకవైపు సొంత పార్టీ నాయకులను సమన్వయం చేస్తూ, మరొకవైపు అధికార పార్టీ విధానాలపై సూటిగా విమర్శలు గుప్పించడంలో హరీష్ రావు తన మార్కును చూపించారు. ఫ హరీష్‌రావు సభతో బీఆర్ఎస్ పార్టీకి కొత్త ఊపు ఫ ప్రజా సమస్యలపై పోరుకు దిశానిర్దేశం ఫ చేరికలతో క్యాడర్లో ఉత్సాహం -
పోచంపల్లి చేనేత వస్త్రాలు బాగున్నాయి
భూదాన్‌పోచంపల్లి : పోచంపల్లి సంప్రదాయ చేనేత వస్త్రాలు ఎంతో బాగున్నాయని తమిళనాడు రాష్ట్ర చేనేత, జౌళిశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ టీఎన్. వెంకటేశ్ కొనియాడారు. సోమవారం పోచంపల్లి పట్టణంలోని చేనేత సహకార సంఘం, టూరిజం పార్కును ఆయన సందర్శించి మగ్గాలు, చేనేత వస్త్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తమిళనాడులో ఎక్కువగా ధోతీ కల్చర్ ఉంటుందని, కానీ తెలంగాణలోని పోచంపల్లి ఇక్కత్, నారాయణపేట, గద్వాల, సిద్దిపేట గొల్లభామ చీరలకు ప్రాంతాల వారీగా అనేక ప్రత్యేకతలు ఉంటాయన్నారు. తెలంగాణలోని త్రిఫ్ట్ పథకం తరహాలోనే తమిళనాడులో కూడా ‘సొసైటీ బెనిఫిట్ స్కీమ్’ కింద చేనేత కార్మికులు తమ ఆదాయం నుంచి 8 శాతం జమచేస్తే, ప్రభుత్వం 16 శాతం ఇస్తుందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా చేనేత, జౌళిశాఖ ఏడీ శ్రీనివాసరావు, చేనేత సహకార సంఘం అధ్యక్షుడు భారత లవకుమార్, వెంకటరమణ సిల్క్ సొసైటీ అధ్యక్షుడు చింతకింది రమేశ్ తదితరులు పాల్గొన్నారు.ఫ తమిళనాడు చేనేత, జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ టీఎన్. వెంకటేశ్ -
మన పన్నులు.. మన ఊరికే..
రామన్నపేట, ఆలేరురూరల్ : పన్నుల రూపంలో వసూలు చేసిన నిధులను ఇక నుంచి ట్రెజరీలలో కాకుండా గ్రామ పంచాయతీ సేవింగ్ ఖాతాలో జమ చేసుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. ఈ మేరకు ఇటీవల చట్టం చేసింది. గ్రామసభల ఆమోదంతో నిధులు డ్రా చేసుకొని అభివృద్ధికి వాడుకోవచ్చు. ప్రభుత్వ నిర్ణయంతో గ్రామాల్లో అభివృద్ధి పనులు శరవేగంగా జరిగే అవకాశం ఉంది. గతంలో ట్రెజరీల్లో జమ జిల్లాలోని 17 మండలాల పరిధిలో 427 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. గ్రామ పంచాయతీలకు ఇంటిపన్నులు, నల్లా బిల్లులు, మ్యుటేషన్లు, ట్రేడింగ్, షాపింగ్, తైబజార్, లే అవుట్, పరిశ్రమలు నుంచి అనేక రకాల ఆదాయం వస్తుంది. ఈ ఆదాయాన్ని గతంలో పంచాయతీలు తమకు అవసరమైన సమయంలో వాడుకునే అవకాశం లేకుండా ట్రెజరీల్లో జమ చేయాల్సి ఉండేది. దీంతో వీధిదీపాల నిర్వహణ, పారిశుద్ధ్యం మెరుగునకు, తాగునీటి అవసరాలు తీర్చడం వంటి అవసరాలకు ఉపయోగపడేవి కావు. పల్లెల ప్రగతికి అవరోధంగా మారిన చట్టాన్ని సవరించడం శుభపరిణామం. గ్రామ సభ నిర్మాణంతో నిధులు ఖర్చుప్రభుత్వ ఆదేశాలతో ఇకపై పంచాయతీ సొంత ఆదాయాన్ని ఖజానాలో కాకుండా ఏదేని జాతీయ బ్యాంకులో జమ చేయాల్సి ఉంటుంది. అందుకోసం అవసరమైతే పంచాయతీలు ప్రత్యేకంగా బ్యాంకు ఖాతాలు తెరిచి పన్నుల రూపంలో వసూలైన ఆదాయాన్ని అందులో జమచేయాలి. ఒకవేళ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు సకాలంలో విడుదల కాకపోతే జనరల్ ఫండ్ కింద అత్యవసర పనులు చేసి వెంటనే డబ్బులు డ్రా చేసుకోవచ్చు. ఇందుకు పంచాయతీలు గ్రామసభ తీర్మానం చేయాల్సి ఉంటుంది. దీంతో గ్రామాల్లో సమస్యలు సత్వర పరిష్కారానికి నోచుకునే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్టంలో తీసుకొచ్చిన సవరణ వల్ల పల్లెల ప్రగతికి తోడ్పాటు ఇస్తుంది. ఈ చట్టం ద్వారా మన నిధులను మనమే ఉపయోగించుకొని గ్రామాలను అభివృద్ధి చేసుకునే వీలు ఉంది. పంచాయతీరాజ్ చట్టానికి సవరణ చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు. – మారెపల్లి మల్లారెడ్డి, సర్పంచ్ కొమ్మాయిగూడెం ఫ గ్రామ పంచాయతీ సేవింగ్ ఖాతాలో జమ చేసుకునే అవకాశం ఫ పల్లెల్లో వేగవంతం కానున్న అభివృద్ధి పనులు ఫ జిల్లాలో 427 గ్రామ పంచాయతీలు -
వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ సరఫరా
చౌటుప్పల్ : వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తామని ఎస్పీడీసీఎల్ సీఎండీ జితేష్‌పాటిల్ తెలిపారు. ఇందులో ఎలాంటి రాజీ ఉండబోదన్నారు. చౌటుప్పల్ మండల పరిధిలోని జైకేసారం గ్రామంలోని విద్యుత్ సబ్‌స్టేషన్‌ను సోమవారం సందర్శించారు. విద్యుత్ సరఫరాపై అక్కడి ఆపరేటర్లు, అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతులతో మాట్లాడి విద్యుత్ సరఫరాపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వ్యవసాయానికి అనుకున్న ప్రకారంగా సరఫరా ఉంటుందన్నారు. ఎక్కడ కూడా చిన్నపాటి అంతరాయం లేకుండా సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు. రైతులు ఎలాంటి సమస్యలు ఉన్నా తమ అధికారులు, సిబ్బంది దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. తమ శాఖ నిరంతరం అప్రమత్తంగా ఉంటూ అన్ని కేటగిరీలకు నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేస్తుందన్నారు. ఆయన వెంట ట్రాన్స్‌కో రూరల్ జోన్ సీజీఎం బాలస్వామి, ఎస్ఈ సురేష్, డీఈ మల్లికార్జున, ఏడీఈ పద్మ, ఏఈ రాజుల సతీష్‌యాదవ్, సిబ్బంది, రైతులు ఉన్నారు. ఫ ఎస్పీడీసీఎల్ సీఎండీ జితేష్‌పాటిల్ -
యువత రాజకీయాల్లోకి రావాలి
యాదగిరిగుట్ట: ప్రధాని నరేంద్రమోదీని ఆదర్శంగా తీసుకొని నేటి యువత సేవా కార్యక్రమాలు చేస్తూ రాజకీయాల్లోకి రావాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్రమోడీ ప్రజా జీవితంలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా యాదగిరిగుట్ట పట్టణంలో సోమవారం సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా రక్త దాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా రాంచందర్‌రావు మాట్లాడుతూ యువమోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 25వేల మంది యువకులతో రక్త దానం చేయాలని సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమం నిర్వహిస్తోందన్నారు. యాదగిరీశుడి సన్నిధిలోని వైకుంఠద్వారం వద్ద చాలా మంది రక్తదానం చేసేందుకు ముందుకు వచ్చారని తెలిపారు. దేశ వ్యాప్తంగా పేద ప్రజల కోసం ప్రధాన మంత్రి జన్‌ధన్ యోజన, ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్, కిసాన్ యోజన్ వంటి పథకాలను తీసుకువచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ఉట్కూరి అశోక్‌గౌడ్, ప్రధాన కార్యదర్శులు కాధూరి అచ్చయ్య, చందా మహేందర్, జిల్లా మాజీ అధ్యక్షుడు పాశం భాస్కర్, సీనియర్ నాయకులు మాయ దశరథ, రచ్చ శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు కర్రె ప్రవీణ్, జిల్లా కార్యవర్గ సభ్యుడు బెలిదె అశోక్, జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు మాధూరి, గుంటిపల్లి సత్యం, నల్ల వెంకట్‌రెడ్డి, మందోజు నరేష్, సురేష్, కర్ణ, బుచ్చిబాఆబు, సూధగాని శివ, వినోద్, శ్రీశైలం, విజయ్, దేవేందర్ పాల్గొన్నారు.ఫ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు -
ఎమ్మెల్సీ అభ్యర్థులపై కసరత్తు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : వరంగల్ – ఖమ్మం – నల్లగొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం నుంచి ఎవరిని బరిలో ఉంటారన్నది త్వరలోనే తేలనుంది. మూడు ప్రధాన రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ.. పోటీలో నిలిపే అభ్యర్థి విషయంలో ఓ స్పష్టతకు రాగా, కాంగ్రెస్ పార్టీ ఇంకా సర్వేలు చేస్తోంది. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి విషయంలో ఆలోచనలు చేస్తోంది. ఈ నెల 28వ తేదీన ఓటర్ల జాబితా ఖరారుకు నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో అభ్యర్థులను ప్రకటించేందుకు ప్రధాన పార్టీలు సిద్ధం అవుతున్నాయి. అధికార పార్టీలో ఆశావహులపై సర్వే ఎమ్మెల్సీగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్న వారు కాంగ్రెస్ పార్టీలో ఎక్కువ మంది ఉన్నారు. దీంతో ఆ పార్టీ ఆశావహుల పేర్లతో సర్వే చేస్తోంది. నల్లగొండ జిల్లా నుంచి గుత్తా అమిత్‌రెడ్డి, పున్నా కై లాష్ నేత, సూర్యాపేట జిల్లా నుంచి పటేల్ రమేష్‌రెడ్డి, రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి, వరంగల్ జిల్లా నుంచి సింగారపు ఇందిర, దొమ్మాటి సాంబయ్య, ఖమ్మం జిల్లా నుంచి లోకేష్‌యాదవ్ పేర్లపై చేపట్టిన సర్వే పూర్తి కావచ్చింది. ఎమ్మెల్సీ ఓటర్ల జాబితా రూపకల్పనకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ను విడుదల చేయడానికి ముందే కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది. అభ్యర్థిపై స్పష్టతతో బీఆర్ఎస్ బీఆర్ఎస్ తరఫున పోటీలో ఉండబోయే అభ్యర్థి విషయలో ఆ పార్టీ ఇప్పటికే ఓ స్పష్టతకు వచ్చినట్లు తెలుస్తోంది. గతంలో పోటీ చేసి రెండో స్థానానికి పరిమితమైన రాకేష్రెడ్డినే బరిలో నిలిపే అవకాశం ఉంది. అందుకు అనుగుణంగా ఆయన ఇప్పటికే క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. అయితే బీఆర్ఎస్ ఇంకా అధికారికంగా మాత్రం ప్రకటన చేయలేదు. అనధికారికంగా రాకేష్‌రెడ్డికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. ఆలోచనలు చేస్తున్న బీజేపీ పోటీలో నిలిపే అభ్యర్థి విషయంలో బీజేపీ ఇంకా ఆలోచనలు చేస్తోంది. బీజేపీ అభ్యర్థినికి ప్రకటించకపోగా, పార్టీ పరంగానే మెంబర్షిప్ డ్రైవ్ చేపట్టాలని భావిస్తున్నట్లు తెలిసింది. అయితే సీనియర్ నాయకులు గంగిడి మనోహర్‌రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు పేర్లు బీజేపీ నుంచి ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వరంగల్ నుంచి రాణి రుద్రమ కూడా పోటీకి ఉత్సాహం చూపుతున్నట్లు తెలిసింది. గతంలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా వరంగల్ వారికే అవకాశం ఇచ్చిన నేపథ్యంలో ఈసారి నల్లగొండ వారికే అవకాశం ఇవ్వాలని కోరుతున్నట్లు తెలిసింది. ఫ వరంగల్–ఖమ్మం–నల్లగొండ గ్రాడ్యుయేట్ స్థానంలో కాంగ్రెస్ పార్టీ సర్వే ఫ ఇప్పటికే ఓ అభిప్రాయానికి వచ్చిన బీఆర్ఎస్ ఫ బరిలో ఎవరిని నిలుపాలన్న దానిపై బీజేపీ కసరత్తు ఫ ఓటర్ల జాబితా షెడ్యూల్ జారీతో పెరిగిన రాజకీయ వేడిబీఆర్ఎస్ నుంచి ఓసీ అభ్యర్థిని పోటీలో నిలిపే అంశంపై స్పష్టత రాగా, కాంగ్రెస్, బీజేపీలో బీసీ అంశంపైనా చర్చ జరుగుతోంది. ఈ స్థానంలో ఏ సామాజికవర్గానికి చెందిన అభ్యర్థిని బరిలో నిలుపాలన్న విషయంలో చర్చ జరుగుతోంది. హైదరాబాద్ – రంగారెడ్డి – మహబూబ్‌నగర్ స్థానంలో బీసీని పోటీలో నిలిపితే వరంగల్ – ఖమ్మం – నల్లగొండ స్థానంలో ఓసీకి ఇవ్వాలని, ఇక్కడ బీసీకి ఇస్తే, అక్కడ ఓసీ అభ్యర్థిని బరిలో దింపాలని రెండు పార్టీలు ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది. -
నీటి పన్ను బకాయిలు.. రూ. 6.12 కోట్లు
ఫ భువనగిరి మున్సిపాలిటీలో రికార్డు స్థాయికి చేరిన నల్లా బకాయిలు ఫ స్పెషల్ డ్రైవ్ చేపట్టిన అధికారులు భువనగిరిటౌన్ : భువనగిరి మున్సిపాలిటీ పరి ధిలో తాగునీటి (నల్లా) పన్ను బకాయిలు గుదిబండలా మారా యి. అధికా రుల నిర్లక్ష్యం, బకాయిల వసూళ్లలో జాప్యం కారణంగా పాత, కొత్త బకాయిలు కలిపి ఏకంగా రూ. 6.12 కోట్లకు చేరుకున్నాయి. దీంతో అధికారులు స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నారు. రూ.11.55లక్షలు మాత్రమే వసూలు మున్సిపాలిటీ రికార్డుల ప్రకారం పట్టణంలో మొత్తం 10,226 అధికారిక నల్లా కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో 10,098 సాధారణ గృహ కనెక్షన్లు, 128 వాణిజ్య కనెక్షన్లు ఉన్నాయి. గతానికి సంబంధించి పాత బకాయిలు ఏకంగా రూ. 4.98 కోట్లు పేరుకుపోగా.. ప్రస్తుత డిమాండ్ రూ. 1.26 కోట్లుగా ఉంది. మొత్తంగా రూ. 6.24 కోట్లు రావాల్సి ఉండగా, ఇప్పటివరకు కేవలం రూ. 11.55 లక్షలు మాత్రమే వసూలయ్యాయి. ఇంకా రూ. 6.12 కోట్లు రావాల్సి ఉంది.. మున్సిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు ప్రస్తుతం ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. పట్టణంలోని అన్ని వార్డుల్లో బిల్ కలెక్టర్లు ఇంటింటికీ వెళ్లి బకాయిదారులకు నేరుగా డిమాండ్ నోటీసులు అందజేస్తున్నారు. -
నిషేధిత జాబితాలోకి ఈడీ కేసు భూములు
ఫ తూప్రాన్ పేటలో 5.5 ఎకరాలు గుర్తింపు సాక్షి, యాదాద్రి: చౌటుప్పల్ మండలం తూప్రాన్‌పేటలో 5.5 ఎకరాల ఈడీ కేసు భూమిని నిషేధిత జాబితాలో అధికారులు చేర్చారు. ‘ఈడీ, సిట్ కేసులు ఉన్నా ఆగని రిజిస్ట్రేషన్లు’ అనే శీర్షికన ఈనెల 19న జిల్లా పేజీలో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. దీనికి స్పందించి విచారణ ప్రారంభించిన ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టర్, ఇన్‌కం టాక్స్డిపార్ట్ మెంట్లు తూప్రాన్ పేటలో 5. 5 ఎకరాల భూమిని 22 ఏ నిషేధిత జాబితాలో యథావిధిగా చేర్చారు. 13 ఇ,1లో 2.250 ఎకరాలు, 14.అ,1 లో2.200 ఎకరాలు ఇందులో ఉన్నాయి. కాగా ఈ భూములను రిజిస్ట్రేషన్ చేయడానికి స్లాట్ బుక్ కాగా హోల్డ్‌లో పెట్టడంతో విషయం బయటపడింది. విషయం వెలుగు చూడడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమై భూములను ఈనెల 20న నిషేధిత జాబితాలో తిరిగి చేర్చారు. కాగా నిషేధిత జాబితాలో ఉన్న భూములు ఎలా తొలగించారు, స్లాట్ఎలా బుక్ అయ్యింది అనే కోణంలో విచారణ జరుగుతోంది.భూ సేకరణ పనులు వేగవంతం చేయాలిసాక్షి, యాదాద్రి : రాష్ట్రంలోని నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న భూసేకరణ, అటవీ భూముల పరిహారం, సహాయ–పునరావాస (ఆర్అండ్ఆర్) పనులను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం రాష్ట్ర సచివాలయం నుంచి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజులతో కలిసి మంత్రి ఉత్తమ్ అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సాగునీటి ప్రాజెక్టుల పురోగతి, అటవీ క్లియరెన్సులు, నిర్వాసితులకు పరిహారం పంపిణీపై చర్చించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టరేట్లో ఇన్చార్జ్ కలెక్టర్ భాస్కర్ రావు, రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకా రెడ్డి , రెవెన్యూ డివిజనల్ అధికారి కృష్ణా రెడ్డి, ఇరిగేషన్ ఎస్ఈ రవీందర్, భువనగిరి తహసీల్దార్ జగన్ మోహన్ ప్రసాద్ పాల్గొన్నారు. ప్రజల భద్రతకు ప్రాధాన్యంవలిగొండ : నిమజ్జన కేంద్రాల వద్ద ప్రజల భద్రతకే మొదటి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు ఎస్పీ అక్షాంశ్‌యాదవ్ పేర్కొన్నారు. వినాయక నిమజ్జనాన్ని పురస్కరించుకొని వలిగొండ మండల పరిధిలోని అక్కాచెల్లెళ్ల చెరువు, సంగెం చెరువు వద్ద ఏర్పాటు చేసిన ఘాట్లను సోమవారం ఆయన పరిశీలించిమాట్లాడారు. గణేశ్ నిమజ్జన కార్యక్రమాలను అత్యంత ప్రశాంతంగా, సురక్షితంగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్వహించుకోవాలని ఉత్సవ కమిటీ నిర్వాహకులకు సూచించారు. నిమజ్జనం సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో చౌటుప్పల్ డీఎస్పీ మధుసూదన్ రెడ్డి, రామన్నపేట సీఐ రవి, ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి, ఎంపీడీఓ జలంధర్ రెడ్డి పాల్గొన్నారు. గడువులోగా ఎస్ఐఆర్ ప్రక్రియ సాక్షి, యాదాద్రి : ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియను 30 నుంచి 40 రోజుల్లోగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ నుంచి కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. ఈ సమీక్షలో కలెక్టరేట్లో జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ భాస్కర్ రావు, అదనపు కలెక్టర్ వెంకారెడ్డి, ఆర్డీఓ కృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఓపెన్ టెన్త్, ఇంటర్లో 2,380 ప్రవేశాలే లక్ష్యం భువనగిరి: ఓపెన్ టెన్త్, ఇంటర్లో 2026–27లో 2,380మంది ప్రవేశాలే లక్ష్యమని ఓపెన్‌స్కూల్ సొసైటీ రాష్ట్ర ఇన్చార్జి, విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ రాజీవ్ వెల్లడించారు. ఓపెన్ టెన్త్, ఇంటర్ ప్రవేశాలపై సోమవారం భువనగిరి పట్టణంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓపెన్ టెన్త్, ఇంటర్లో ఇప్పటి వరకు 26శాతం మంది ప్రవేశాలు పొందారని, మిగిలిన 74శాతం మంది అడ్మిషన్లు పొందేలా మహిళా సమాఖ్య ద్వారా కృషి చేయాలన్నారు. టాస్కు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డీఈఓ భిక్షపతి, ఎంఈఓలు పాల్గొన్నారు. -
ప్రజావాణి అర్జీలను పెండింగ్ పెట్టొద్దు
భువనగిరిటౌన్ : ప్రజావాణిలో ప్రజల నుంచి అందిన అర్జీలను పెండింగ్‌లో పెట్టకుండా సత్వరమే పరిష్కరించాలని జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ భాస్కర్ రావు అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకారెడ్డితో కలిసి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఇన్చార్జ్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల నుంచి వచ్చిన వినతులను సంబంధిత అధికారులు బాధ్యతతో పరిశీలించి, నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని స్పష్టం చేశారు. మొత్తం 94 అర్జీలు అందినట్లు తెలిపారు. ప్రజావాణికి ఆరుగురు మున్సిపల్ కమిషనర్లు హాజరు కావాల్సి ఉండగా ఎవరూ రాలేదు. కాగా భువనగిరి మున్సిపాలిటీ నుంచి ఆర్వో హాజరయ్యారు. కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్లు కృతిక, సాత్విక్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.ఫ ఇన్చార్జ్ కలెక్టర్ భాస్కర్‌రావు -
బాలికల ఆరోగ్యానికి భరోసా
ఆలేరు రూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద, మధ్యతరగతి కుటుంబాల బాలికల ఆరోగ్యం, వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యమిస్తోంది. బాలికల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది నుంచి ఉచితంగా శానిటరీ ప్యాడ్ల సరఫరాకు శ్రీకారం చుట్టింది. 7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థినులకు ఏడాదికి సరిపడా ప్యాడ్లను అందించేందుకు ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర విద్యాశాఖ కార్యాలయం నుంచి సరఫరా అయిన ప్యాడ్లు ఇప్పటికే మండల వనరుల కేంద్రాలకు చేరగా, అక్కడ నుంచి పాఠశాలల వారీగా పంపిణీ చేస్తున్నారు. వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం అవసరం యుక్తవయస్సులో బాలికలు రుతుస్రావం సమయంలో వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం అవసరం. సరైన శానిటరీ ఉత్పత్తులు అందుబాటులో లేకపోవడం వల్ల ఎదురయ్యే ఇబ్బందులు తగ్గించేందుకు ప్రభుత్వం ఉచితంగా ప్యాడ్లను అందిస్తుంది. ఒక్కో విద్యార్థినికి ప్రతి త్రైమాసికానికి 4 చొప్పున నాలుగు త్రైమాసికాలకు కలిపి 16 ప్యాడ్లను అందజేస్తున్నారు. విద్యార్థినుల సంఖ్య ఆధారంగా ప్యాడ్లను పాఠశాలల వారీగా కేటాయించారు. ఎమ్మార్పీకి సరఫరా అయినా ప్యాడ్లను ఆయా ప్రధానోపాధ్యాయులకు సిబ్బంది పంపిణీ చేస్తున్నారు. పాఠశాలల్లో నీటి సదుపాయం, పరిశుభ్రమైన మరుగుదొడ్లు, ప్యాడ్లను సురక్షితంగా పారవేసే ఏర్పాట్లు ఉంటే కార్యక్రమం మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. ప్యాడ్ల పంపిణీతో పాటు వాటి వినియోగం, పారవేతపై అవగాహన కల్పించి అవసరమైన మౌలిక సదుపాయాలను అందుబాటులో ఉంచితేనే కార్యక్రమం పూర్తిస్థాయిలో సత్ఫలితాలు ఇస్తుందని ఉపాధ్యాయులు, పోషకులు పేర్కొంటున్నారు. ఎమ్మార్సీల ద్వారా పంపిణీ జిల్లాలో 17 ఎమ్మార్సీలు ఉండగా 35,571 శానిటరీ ప్యాడ్ల ప్యాకెట్లను మంజూరు చేసింది. ఒక్కో ప్యాకెట్లో 8 శానిటరీ ప్యాడ్లు ఉంటాయి. ఎంఈఓల ద్వారా ఆయా పాఠశాలలకు పంపిణీ చేయనున్నారు. ఎంపిక చేసిన మహిళా ఉపాధ్యాయురాలు, ఓ విద్యార్థిని బాధ్యత తీసుకొని శానిటరీ ప్యాడ్లను అవసరమైన బాలికలకు అందిస్తారు. ఫ ఉచితంగా శానిటరీ ప్యాడ్ల పంపిణీ ఫ ఇప్పటికే పాఠశాలలకు చేరిన ప్యాడ్లు ఫ ఒక్కో విద్యార్థినికి ఏడాదికి 16చొప్పున అందించేలా ఏర్పాట్లు -
అసత్య ప్రచారాలు మానుకోవాలి
యాదగిరిగుట్ట : తిరుమల వేంకటేశ్వరస్వామి భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఏపీ సీఎం చంద్రబాబునాయుడు వ్యవహరిస్తున్నారని టీటీడీ లోకల్ అడ్వైజరీ కమిటీ మాజీ సభ్యుడు వడ్లోజు వెంకటేష్ ఆరోపించారు. తిరుమల శ్రీవారి ప్రసాదాల తయారీలో ఉపయోగించిన నెయ్యిలో ఎలాంటి జంతు కొవ్వు లేదని ఈడీ తేల్చడంపై యాదగిరిగుట్టలో ఆదివారం వేంకటేశ్వరస్వామి, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వడ్లోజు వెంకటేష్ మాట్లాడుతూ.. ఈడీ ఇచ్చిన తీర్పుతో చంద్రబాబునాయుడు అసత్య ప్రచా రాలను మానుకోవాలని సూచించారు. స్వామి వారి బ్రహ్మోత్సవాల వేళ వైఎస్ జగన్మోహన్రెడ్డికి తిరుమలేశుడి ఆశీస్సులు ఉన్నాయని, అందుకే చంద్రబాబు చేసిన అసత్య ఆరోపణలకు బుద్ధి చెప్పే విధంగా నెయ్యిలో జంతు కొవ్వు కలవలేదని తీర్పు వచ్చిందన్నారు. -
విద్యుత్ సామగ్రి కొనాలంటే ‘షాక్’
సూర్యాపేట అర్బన్ : మార్కెట్లో విద్యుత్ సామగ్రి ధరలు అమాంతం పెరగడంతో సామాన్యులు, మధ్యతరగతి కుటుంబాలతో పాటు రైతులపై తీవ్ర ఆర్థిక భారం పడుతోంది. గృహ అవసరాలకు వాడే ఎలక్ట్రికల్ వస్తువులపై 20 నుంచి 30 శాతం వరకు ధరలు పెరగ్గా, వ్యవసాయానికి ఉపయోగించే కేబుల్ వైర్లు, స్టార్టర్లు, బుష్‌ల ధరలు ఏకంగా 40 శాతానికి పైగా పెరిగాయి. దీనికి తోడు కూలీల చార్జీలు కూడా తోడవడంతో కొత్తగా ఇల్లు నిర్మించుకునేవారు, బోరు మోటార్లు మరమ్మతు చేయించుకునే రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొత్త ఇంటి నిర్మాణదారులకు కష్టం..విద్యుత్ సామగ్రి ధరల మంట కొత్తగా నిర్మిస్తున్న ఇళ్లపై ప్రత్యక్ష ప్రభావం చూపుతోంది. గతంలో ఒక సింగిల్ బెడ్రూమ్ ఇంటికి పూర్తిస్థాయి ఎలక్ట్రికల్ వైరింగ్ చేసేందుకు సుమారు రూ.45,000 నుంచి రూ.50,000 వరకు ఖర్చయ్యేది. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో అది రూ.65,000 నుంచి రూ.70,000 వరకు చేరుకుంది. అంటే ప్రతి ఇంటిపై సగటున రూ.20,000 మేర అదనపు భారం పడుతోంది. పైపులు, వైర్లు, స్విచ్ బోర్డులు, లేబర్ చార్జీలు అన్నీ కలసి బడ్జెట్‌ను దాటిపోతున్నాయి. రైతన్నపై రెట్టింపు భారంవ్యవసాయ రంగానికి అత్యవసరమైన మోటారు కేబుల్ వైర్లు, వైండింగ్ వైర్లు, స్టార్టర్లు, బుష్‌లు వంటి సామగ్రి ధరలు విపరీతంగా పెరిగాయి. పంట పొలాల్లో బోరు మోటారు ఏ చిన్న సమస్యకు గురైనా రిపేరు చేయించడం రైతులకు గగనంగా మారింది. వైండింగ్ చార్జీలతో పాటు విడిభాగాల ధరలు పెరగడంతో ప్రతి చిన్న మరమ్మతుకు వేలాది రూపాయలు సమర్పించుకోవాల్సి వస్తోంది. ఇప్పటికే ఎరువులు, విత్తనాలు, సాగు ఖర్చులు పెరిగి ఇబ్బందుల్లో ఉన్న రైతులకు ఈ ధరల పెరుగుదల మరింత అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. 40 శాతం వరకు పెరిగిన విద్యుత్ పరికరాలు, కేబుల్ వైర్లు, స్టార్టర్ల ధరలు సామాన్యులు, రైతులపై అదనపు భారం -
రోడ్ల మరమ్మతులు చేపట్టాలని నిరసన
రామన్నపేట : రామన్నపేట మండల కేంద్రం నుంచి పల్లెపాడు వరకు దెబ్బతిన్న రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు జెల్లెల పెంటయ్య, మునిపంపుల, దుబ్బాక సర్పంచులు బొడ్డుపల్లి వెంకటేశం, గట్టు నర్సింహ డిమాండ్ చేశారు. ఆదివారం దుబ్బాక, మునిపంపుల గ్రామాల్లో గుంతలమయంగా మారిన రోడ్లు, మురుగునీరు నిలిచిన ప్రదేశాల్లో సీపీఎం నాయకులు నిరసన వ్యక్తం చేశారు. గుంతలు ఏర్పడి వాహనదారులు ఇబ్బంది పడుతున్నారని, అధికారులు కనీసం గుంతలను పూడ్చే ప్రయత్నం కూడా చేయకపోవడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కల్లూరి నాగేష్, జంపాల అండాలు, తొల్పునూరి శ్రీనివాస్, మేడి గణేష్, పావిరాల మత్స్యగిరి, తాళ్లపల్లి జితేందర్, తొల్పునూరి చంద్రశేఖర్, పుట్టల ఉదయ్, గంటెపాక శివకుమార్, దండిగ నర్సింహ, ఉండ్రాతి నర్సింహ, జోగుల శ్రీనివాస్, గాదె పరమేష్, మేడి బాషయ్య తదితరులు పాల్గొన్నారు. -
పోరాటాలతోనే సమస్యలు పరిష్కారం
ఆత్మకూరు(ఎం) : పోరాటాల మార్గంతోనే సమస్యలు పరిష్కారమవుతాయని సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి అన్నారు. ఆత్మకూరు(ఎం) మండలంలో లోలెవల్ బ్రిడ్జిలను హైలెవల్ బ్రిడ్జిలుగా నిర్మించాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఉప్పల ముత్యాలు, మండల కార్యదర్శి మారుపాక వెంకటేశం ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా ఆదివారం రాయిపల్లి వద్ద సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రజా పోరాటాలతోనే చట్టాలు వస్తాయని, వాటి అమలు కోసం పోరాటాలు చేయాల్సి వస్తుందన్నారు. పాదయాత్రలో నాయకులు ఎండీ నయీం, గుర్రం రాజమణి, జక్క దయాకర్‌రెడ్డి, కల్వల నర్సయ్య, జల్ధి రాములు, బొబ్బల లాల్‌రెడ్డి, సోలిపురం లింగారెడ్డి, గాజుల సిద్దులు పాల్గొనగా.. సీపీఐ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్‌రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శులు బొలగాని సత్యనారాయణ, చేడె చంద్రయ్య, చేనేత కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు పాశికంటి లక్ష్మీనర్సయ్య, జిల్లా కార్యవర్గ సభ్యులు కళ్లెం కృష్ణ, ఎండీ ఇమ్రాన్, చెక్క వెంకటేష్, కుసుమరి హరిశ్చంద్ర, పేరబోయిన మహేందర్, బండి జంగమ్మ, బబ్బురి శ్రీధర్ పాల్గొన్నారు. సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి -
పర్మిషన్ రాలేదని చెబుతున్నారు
మా నాన్న రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్, నా పేరు మీ, భువనగిరి దగ్గర్లో ఉన్న రియల్ వెంచర్లో 150 గజాల ప్లాట్‌ను నా పేరు మీద, 2017 సంవత్సరంలో తీసుకున్నాడు. మొత్తం ఈఎంఐ రూపంలో డబ్బులు అన్నీ యాజమాన్యానికి చెల్లించాడు. ఆఫీసుకు వెళ్లి అడిగితే, ఇంకా టైం పడుతుంది. పర్మిషన్ రాలేదు అనే సమాధానాలు చెబుతున్నారు. వెంచర్ డైరెక్టర్‌ను అడిగితే, నేను డైరెక్టర్‌ను కాదు అని సమాధానం చెబుతున్నాడు. మమ్మల్ని మోసం చేశారు. అరుణ్ కుమార్, హైదరాబాద్, బాలాజీనగర్ -
రియల్ మాయాజాలం
యాదగిరిగుట్ట రూరల్ : జిల్లాలో కొంతమంది రియల్టర్లు కొనుగోలుదారుల నుంచి డబ్బులు తీసుకుని ప్లాట్లను వారికి అప్పగించకుండా మోసం చేస్తున్నారు.. తాజాగా తుర్కపల్లి మండలం పెద్ద తండాలో ఓ రియల్ సంస్థ గత పన్నెండేళ్ల క్రితం ఓ వెంచర్‌ను ఏర్పాటు చేశారు. ఈ వెంచర్లో సామాన్యులకు, ఈఎంఐ రూపంలో ఆశ చూపి, తక్కువ ధరలో వస్తుందని, బ్రోచర్లను చూపించి, ప్లాట్లను విక్రయించారు. తీరా ప్లాట్లను తీసుకున్న తర్వాత, పూర్తిగా డబ్బులు చెల్లించినా, విక్రయదారులకు మాత్రం ప్లాట్‌ను ఇవ్వడం లేదు. గత కొన్ని సంవత్సరాలుగా ఆఫీసుల చుట్టూ తిప్పుకుంటున్నారని, తమకు మాత్రం పొజిషన్ ప్లాట్లను ఇవ్వడం లేదని ప్లాట్లు తీసుకున్న బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వెంచర్ యాజమాన్యం, తుర్కపల్లి, పెద్దతండాతో పాటుగా, రుస్తాపురం, రాళ్లజనగాం, జంగంపల్లి, తిమ్మాపురం శివారుల వరకు సుమారుగా 200 ఎకరాల వరకు పలు సర్వే నెంబర్లల్లో, పన్నెండేళ్ల క్రితం వెంచర్‌ను ఏర్పాటు చేశారు. ఆర్మీ ఉద్యోగులే అధికం.. ఫ తుర్కపల్లి మండలంలో వెంచర్ ఏర్పాటు చేసిన ప్రముఖ సంస్థ ఫ డబ్బులు చెల్లించినా.. ప్లాట్లు ఇవ్వని వైనం ఫ ప్లాట్లు చూపించకపోవడంతో లబోదిబోమంటున్న బాధితులు -
యాదగిరీశుడి క్షేత్రంలో భక్తుల కోలాహలం
యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి క్షేత్రంలో ఆదివారం శ్రీసుదర్శన నారసింహ హోమం నిర్వహించారు. స్వయంభూ పంచనారసింహులకు బిందే తీర్థం, ఆరాధన, బాలభోగం నిర్వహించి, నిజాభిషేకం జరిపించారు. సహస్రనామార్చన చేపట్టి, తులసీ దళాలతో అర్చించారు. అనంతరం గజ వాహన సేవ, నిత్య కల్యాణం, జోడు సేవలు చేపట్టారు. రాత్రి స్వామి వారికి శయనోత్సవం నిర్వహించి ఆలయాన్ని ద్వార బంధనం చేశారు. ఇక.. ఆదివారం సెలవు రోజు కావడంతో యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో భక్తుల కోలాహలం నెలకొంది. హైదరాబాద్ – సికింద్రాబాద్ జంట నగరాలతో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు అధికంగా శ్రీస్వామిని దర్శించుకునేందుకు తరలివచ్చారు. దీంతో శ్రీస్వామి వారి ధర్మ దర్శనానికి 3గంటలు, వీఐపీ దర్శనానికి 30నిమిషాల సమయం పట్టింది. శ్రీస్వామి వారిని 30వేలమందికి పైగా భక్తులు దర్శించుకొని తమ మొక్కులు తీర్చుకున్నారు. వివిధ పూజలతో శ్రీనృసింహస్వామికి నిత్యాదాయం రూ.30,06, 857 వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. -
రైతులను పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం
నార్కట్‌పల్లి : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో రైతులకు కష్టాలు పెరిగాయని, వ్యవసాయానికి అవసరమైన విద్యుత్, సాగునీరు సక్రమంగా అందకపోవడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. నార్కట్‌పల్లి మండలం కొండపాకగూడెం గ్రామంలో ఆదివారం ఆయన పలువురు రైతుల పొలాలను పరిశీలించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బ్రాహ్మణవెల్లెంల గ్రామ పరిధిలోని ఉదయ సముద్రం ప్రాజెక్టుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిధులు కేటాయించి పనులు పూర్తిచేసి ట్రయల్ రన్ నిర్వహించామని తెలిపారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వ హయాంలో పూర్తయిన పనులకు కొత్తగా ప్రారంభోత్సవాలు, రిబ్బన్ కటింగ్‌లు చేయడం తప్ప రైతులకు సాగునీరు అందించడంలో పూర్తిగా విఫలమైందన్నారు. రోజుకు 12 గంటల విద్యుత్ ఇస్తామని చెప్పి, కనీసం 5 గంటలు కూడా సక్రమంగా విద్యుత్ అందించడం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంపై దృష్టి పెట్టకుండా రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం సరికాదన్నారు. ప్రజలకు ఇచ్చిన 420 హామీల అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారించాలన్నారు. ఈ కార్యక్రమంలో చెర్వుగట్టు ఆలయ మాజీ చైర్మన్ మేకల రాజిరెడ్డి, కొండూరు శంకర్, వెంకట్‌రెడ్డి, దశరథరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య -
విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలి
సంస్థాన్ నారాయణపురం : మండలంలోని సర్వేల్ గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు కష్టపడి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ఆకాంక్షించారు. ఆదివారం సర్వేల్ గురుకుల పాఠశాలను బక్కి వెంకటయ్యతో పాటు కమిషన్ పభ్యులు జిల్లా శంకర్, కొంకటి లక్ష్మీనారాయణ, నేనవత్ రాంబాబునాయక్ సందర్శించి పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం తరగతి గదులు, వసతి గదులు, డైనింగ్ హాల్‌ను పరిశీలించారు. విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు, సమస్యలపై ఆరా తీశారు. డైనింగ్ హాల్లో భోజనం చేసి ఆహారం నాణ్యతను పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడుతూ.. సర్వేల్ గురుకుల పాఠశాలలో చదివిన విద్యార్థులు ఆలిండియా సర్వీసులతో పాటు ప్రజాప్రతినిధులుగా సేవలందించారని, సర్వేల్ గురుకులానికి ఎంతో పేరుప్రతిష్టలు ఉన్నాయని అన్నారు. తరగతి గదిలోనే దేశ భవిష్యత్తు ఉందని పేర్కొన్నారు. తల్లిదండ్రులతో పాటు పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులకు సూచించారు. పాఠశాలలో ఏమైనా సమస్యలు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలన్నారు. గురుకులాల్లో ఇప్పటి వరకు గుర్తించిన సమస్యలను ఈ నెల 22న జరిగే హైపవర్ సమావేశంలో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఈ సందర్భంగా బక్కి వెంకటయ్యతో పాటు కమిషన్ సభ్యులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వీ మునుగోడు నియోజకవర్గ అధ్యక్షుడు నలపరాజు రమేష్, సర్వేల్ మాజీ సర్పంచ్ కట్టెల భిక్షపతి, బీఆర్ఎస్వీ మునుగోడు నియోజకవర్గ కార్యదర్శి గుమ్మాల ప్రవీణ్‌కుమార్, మల్లేష్ తదితరులు ఉన్నారు. రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య -
రెవెన్యూ గ్రామాలుగా గుర్తించాలి
మిర్యాలగూడ : నూతన గ్రామ పంచాయతీలను రెవెన్యూ గ్రామాలుగా గుర్తించాలని తెలంగాణ పంచాయతీరాజ్ చాంబర్స్ అధ్యక్షుడు సత్యనారాయణరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. నల్లగొండలోని ఎస్బీఆర్ గార్డెన్లో ఆదివారం చాంబర్స్ జిల్లా కన్వీనర్ బెజ్జం సాయి అధ్యక్షతన జరిగిన సర్పంచుల సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో అమలు చేసిన విధంగానే గ్రామ పంచాయతీల విద్యుత్ బిల్లులను ప్రభుత్వమే చెల్లించాలన్నారు. స్థానిక సెస్‌లు, స్టాంపు డ్యూటీలు, సీనరేజ్, మైనింగ్ తదితర పన్నుల నిధులను నేరుగా పంచాయతీల ఖాతాల్లోకే జమ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే 73వ రాజ్యాంగ సవరణ చట్టంలోని 243 ఆర్టికల్, 11వ షెడ్యూల్లో పేర్కొన్న 29 అధికారాలు, విధులు, నిధులను పంచాయతీలకు బదలాయించాలని కోరారు. ఈ సమావేశంలో సర్పంచుల సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు పురుషోత్తంరెడ్డి, రాష్ట్ర పంచాయతీరాజ్ చాంబర్స్ ప్రధాన కార్యదర్శి బాదేపల్లి సిద్ధార్థ, రాష్ట్ర చాంబర్స్ కార్యదర్శి మందిపల్లి వెంకట్, బత్తుల వెంకట్రాములు తదితరులు పాల్గొన్నారు.ఫ తెలంగాణ పంచాయతీరాజ్ చాంబర్స్ అధ్యక్షుడు సత్యనారాయణరెడ్డి -
విద్యుదాఘాతంతో రైతు మృతి
వలిగొండ : విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ వద్ద ఏబీ స్విచ్ ఆన్ చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై రైతు మృతిచెందాడు. ఈ ఘటన వలిగొండ మండలం వేములకొండ గ్రామంలో శనివారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వేములకొండకు చెందిన ఎనుగుల ఐలయ్య(41) శనివారం రాత్రి తన కుమారుడితో కలిసి వ్యవసాయ బావి వద్దకు వెళ్లారు. అక్కడ బోరు మోటారు ఆన్ చేయగా.. విద్యుత్ సరఫరా కావట్లేదని గమనించారు. దీంతో ఐలయ్య పక్కనే ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ వద్దకు వెళ్లి ఏబీ స్విచ్ ఆన్ చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై స్పృహతప్పి కింద పడిపోయాడు. అతడి కుమారుడు వెంటనే చికిత్స నిమిత్తం ఐలయ్యను రామన్నపేట ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందాడు. ఆదివారం మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. భార్య కనిపించడం లేదని భర్త ఫిర్యాదు మర్రిగూడ : తన భార్య కనిపించడం లేదని ఓ వ్యక్తి ఆదివారం మర్రిగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మర్రిగూడ మండలం యరగండ్లపల్లి గ్రామానికి చెందిన తోకల లక్ష్మి ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఎంత వెతికినా లక్ష్మి ఆచూకీ లభించకపోవడంతో ఆమె భర్త యాదయ్య స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ రాంబాబు తెలిపారు. మోసగాడి రిమాండ్ మర్రిగూడ : తక్కువ ధరకే బంగారం ఇస్తానని నమ్మించి ఓ వ్యక్తి వద్ద రూ.6,20,000 కాజేసిన మోసగాడిపై కేసు నమోదు చేసి ఆదివారం రిమాండ్‌కు తరలించినట్లు నాంపల్లి సీఐ దూది రాజు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం మందపాక గ్రామానికి చెందిన మాచర్ల వెంకటేష్.. మర్రిగూడ మండలం శివన్నగూడెం గ్రామానికి చెందిన ఒక వ్యక్తితో పరిచయం పెంచుకున్నాడు. తక్కువ ధరకే బంగారు నాణాలు ఇప్పిస్తానని నమ్మించి అతడి వద్ద నుంచి సొమ్మును తీసుకుని మోసం చేసినట్లు సీఐ తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. వెంకటేష్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. -
చేయూత అర్జీలు 18,308
భువనగిరి, రామన్నపేట: రాష్ట్ర ప్రభుత్వం దసరా నాటికి కొత్తగా చేయూత పింఛన్లు మంజూరు చేయనున్న నేపథ్యంలో జిల్లాలో విచారణ ప్రక్రియ వేగవంతమైంది. ఈ నెల 15 వరకు అర్హుల నుంచి కొత్తగా దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే. గడువు ముగిసిన తర్వాత పరిశీలిస్తే జిల్లా వ్యాప్తంగా 18,308 అర్జీలు వచ్చాయి. వీటిలో అత్యధికంగా వితంతువులే 8,478 మంది పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తుదారుల్లో 35 నుంచి 50 సంవత్సరాల వయస్సు కలిగిన మహిళలే ఎక్కువగా ఉండటం గమనార్హం. వీరే కాకుండా ఒంటరి మహిళలు 917 మంది పింఛన్ కోసం ఎదురుచూస్తున్నారు. దివ్యాంగులు 4410, చేనేత 1573, కల్లుగీత కార్మికులు 2930 మంది దరఖాస్తులు చేసుకున్నారు. క్షేత్రస్థాయి పరిశీలన వేగవంతం జిల్లాలోనే అత్యధికంగా వలిగొండ మండలం నుంచి 1,438 దరఖాస్తులు రాగా, అతి తక్కువగా మోత్కూరు మండలం నుంచి 310 దరఖాస్తులు నమోదయ్యాయి. అందిన దరఖాస్తులను ఎంపీడీఓ, మున్సిపల్ కార్యాలయాల్లోని సిబ్బంది ఇప్పటికే ఆన్లైన్లో నమోదు చేశారు. ప్రస్తుతం మండల స్థాయి అధికారులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్లి నేరుగా విచారణ చేపడుతున్నారు. నిశితంగా తనిఖీ లబ్ధిదారుల రేషన్ కార్డు, కుల, ఆదాయ వివరాలు, కుటుంబంలో ఎవరైనా ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు ఉన్నారా?.. 7.5 ఎకరాల కంటే ఎక్కువ వ్యవసాయ భూమి ఉందా? ఇంట్లో వేరే ఎవరైనా పింఛన్ పొందుతున్నారా? అనే అంశాలను నిశితంగా తనిఖీ చేస్తున్నారు. నాలుగు చక్రాల వాహనం ఉన్నా, పరిమితికి మించి భూమి ఉన్నా దరఖాస్తులను తిరస్కరిస్తున్నారు. వివరాలన్నింటినీ నేరుగా చేయూత యాప్‌లో నమోదు చేస్తూ దరఖాస్తుదారుల ఫొటోలను అప్లోడ్ చేస్తున్నారు. ఈ విచారణ ప్రక్రియను ఈ నెలాఖరు నాటికి పూర్తి చేసి, అర్హులైన ప్రతి ఒక్కరికీ దసరా పండుగ నాటికి నూతన పింఛన్లను అందించేలా అధికారులు చర్యలు వేగవంతం చేశారు. ఫ వితంతు దరఖాస్తులే అధికం ఫ ముమ్మరంగా క్షేత్రస్థాయి విచారణ ఫ మండల స్థాయి అధికారులతో ప్రత్యేక బృందాల ఏర్పాటు ఫ చేయూత యాప్‌లో దరఖాస్తుదారుల వివరాలు నమోదు ఫ దసరా నాటికి కొత్త పింఛన్ల మంజూరుకు చర్యలు -
ప్రభుత్వ రంగ సంస్థల రక్షణకు పోరాడుదాం
భువనగిరిటౌన్ : ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ, నాలుగు లేబర్ కోడ్ల రద్దుకు ఉద్యోగులు, కార్మికులు సంఘటితంగా పోరాడాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఈశ్వర్రావు పిలుపునిచ్చారు. ఆదివారం భువనగిరిలో జిల్లా అధ్యక్షుడు కోమటిరెడ్డి చంద్రారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విద్యుత్, రైల్వే, ఎల్ఐసీ వంటి కీలక ప్రభుత్వ రంగాలను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకు చూస్తోందని మండిపడ్డారు. విద్యుత్ సంస్కరణలు, స్మార్ట్ మీటర్లతో వినియోగదారులపై చార్జీల భారం పడటంతో పాటు రైతులకు ఉచిత విద్యుత్ దూరం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో డిసెంబర్ 1, 2, 3 తేదీల్లో జరిగే నిరసన కార్యక్రమాలకు విద్యుత్, రైల్వే, ఎల్ఐసీ, ఆర్టీసీ సహా అన్ని రంగాల ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు దాసరి పాండు, మాయ కృష్ణ, శ్రీనివాస్, మల్లేశం, యాదప్ప, మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఫీజుల నియంత్రణకు కమిషన్ ఏర్పాటు చేయాలినల్లగొండ : ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో ఫీజుల నియంత్రణతోపాటు సీట్ల నియంత్రణకు ప్రత్యేక కమిషన్లను ఏర్పాటు చేయాలని డెమొక్రటిక్ ఆల్ టీచర్స్ అసోసియేషన్ (డేటా) సంఘం నాయకులు అన్నారు. ఆదివారం నల్లగొండలోని టీఎన్యూటీఓ భవన్లో నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో వారు మాట్లాడారు. ఈ సమావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మహ్మద్ మొహినొద్దీన్, డీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏడుకొండలు, ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ వెంకటదాసు, హైకోర్టు న్యాయవాది పద్మారావు, డి.రాములు, డీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏడుకొండలు, టీపీఎఫ్ జిల్లా అధ్యక్షుడు సీహెచ్.సుధాకర్, టీజేఎస్ నాయకులు పన్నాల గోపాల్‌రెడ్డి, రవి కిశోర్, పన్నాల గోపాల్‌రెడ్డి, నాగలక్ష్మి, పి.రజిత, సీహెచ్.సుధాకర్ పాల్గొన్నారు. -
ఎరలతో.. పంటల రక్షణ
గుర్రంపోడు : పంట దిగుబడి తగ్గడానికి తెగుళ్లు, చీడపీడలే ప్రధాన కారణం. వీటి నివారణకు రైతులు విచ్చలవిడిగా క్రిమిసంహారక మందులు వాడుతుండటంతో పెట్టుబడి పెరగడమే కాకుండా, మిత్ర పురుగులు నశిస్తున్నాయి. దీనికితోడు ఆశించిన ఫలితాలు కూడా రావడం లేదు. ఈ క్రమంలో రైతులు ఖర్చు తగ్గించుకుని, మిత్ర పురుగులను కాపాడుకుంటూ పంటను రక్షించుకోవడానికి లింగాకర్షణ బుట్టలు, పసుపు రంగు అట్టలు (ఎల్లో స్టిక్కీ ట్రాప్స్) ఎంతగానో ఉపయోగపడతాయని ప్రాంతీయ ఉద్యానవన అధికారి మురళి సూచిస్తున్నారు. వాటి వినియోగంపై రైతులకు పలు సూచనలు చేశారు. లింగాకర్షణ బుట్టలు (ఫిరమోన్ ట్రాప్స్)పంటలను ఆశించే పురుగులు.. ఒకదాని నుంచి మరో దానికి వచ్చే వాసనల ద్వారా ఆకర్షితమై వృద్ధి చెందుతాయి. వీటిని అరికట్టేందుకు లింగాకర్షణ బుట్టలు అమర్చాలి. ఇందులో ఉండే ఆడ పురుగు వాసనకు మగ పురుగులు ఆకర్షితమై బుట్టలో పడిపోతాయి. పురుగుల ఉధృతిని ప్రాథమికంగా గుర్తించేందుకు ఎకరాకు 4 బుట్టలు, వాటిని పూర్తిగా నివారించేందుకు ఎకరాకు 10 బుట్టలు అమర్చాలి. ప్రతి 25 నుంచి 30 రోజులకు ఒకసారి ఇందులో ఎరను (ల్యూర్) మార్చాలి. వరి, మొక్కజొన్న, పత్తితో పాటు అన్ని రకాల కూరగాయల పంటలకు వీటిని ఉపయోగించవచ్చు. ఆయా పంటలను ఆశించే పురుగును బట్టి దానికి సంబంధించిన ఎరను బుట్టలో అమర్చుకోవాలి. పసుపు రంగు అట్టలు (ఎల్లో స్టిక్కీ ట్రాప్స్)రసం పీల్చే పురుగుల నివారణకు ఇవి అద్భుతంగా పనిచేస్తాయి. తెల్లదోమ, పచ్చదోమ, పేనుబంక, తామర పురుగు, ఆకుముడత, పచ్చదీపపు పురుగులను వీటితో అరికట్టవచ్చు. పురుగులు పసుపు రంగుకు ఆకర్షితమై అట్టలకు ఉన్న జిగురుకు అతుక్కుపోతాయి. పంట తొలిదశ నుంచే వీటిని వాడాలి. ఎకరాకు 10 చొప్పున తూర్పు, పడమర దిశల్లో వీటిని అమర్చాలి. అమర్చిన తర్వాత మొక్కలను కదల్చడం ద్వారా ఆకులపై ఉన్న తెల్లదోమ, ఇతర పురుగులు ఎగిరి అట్టలకు అంటుకుంటాయి. అట్టపై 50 శాతానికి మించి పురుగులు అతుక్కున్న తర్వాత పాతవి తీసేసి కొత్తవి అమర్చుకోవాలి. కూరగాయలు, పండ్లతోటల్లో కాయతొలుచు పురుగుల నివారణకు ఈ ఎరలు ఎంతో మేలు చేస్తాయి. లింగాకర్షణ బుట్టల వినియోగంపై ప్రాంతీయ ఉద్యానవన అధికారి మురళి సూచనలు -
నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు
భువనగిరి: జిల్లా వ్యాప్తంగా ఈ నెల 23న గణనాథుల నిమజ్జనం జరగనుంది. గతేడాది జిల్లాలో సుమారు 4 వేల వరకు మండపాలు ఏర్పాటు కాగా, ఈ సారి ఆన్లైన్ ద్వారా 3,695 మండపాలు నమోదయ్యాయి. మ్యాపింగ్, జియో ట్యాగింగ్‌తో భద్రత ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగానే శాంతిభద్రతల పరిరక్షణ కోసం జిల్లాలోని అన్ని మండపాలను జియో ట్యాగింగ్ చేసి, గూగుల్ మ్యాప్‌లో గుర్తించారు. అంతేకాకుండా శోభాయాత్ర ప్రశాంత వాతావరణంలో సాగేలా ఆయా మార్గాల్లో సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా ఈసారి చాలా చెరువుల్లో నీరు లేకపోవడంతో నీటి లభ్యత ఉన్న ప్రధాన చెరువులు, జలాశయాలను మాత్రమే నిమజ్జనానికి ఎంపిక చేశారు. ఆయా ప్రాంతాల్లో క్రేన్లు, బారికేడ్లు, లైటింగ్, తాగునీరు, బోటింగ్, అగ్నిమాపక శకటాలు, వైద్య సిబ్బంది, గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచుతున్నారు. ఉత్సవాల్లో డీజేల వాడకాన్ని పూర్తిగా నిషేధించారు. నిమజ్జనానికి ఎంపిక చేసిన చెరువులివే.. భువనగిరి పట్టణంలో పెద్ద చెరువు, బస్వాపురం చెరువు, రాయగిరి, బీబీనగర్ చెరువు, పెద్ద యాదగిరిగుట్ట మండలం కందుకూరు చెరువు, చౌటుప్పల్ మండలం మల్కాపురం చెరువు, పోచంపల్లి చెరువు, రామన్నపేట మండలం తుమ్మలగూడెం చెరువు, వలిగొండ మండలం సంగెం వద్ద మూసీ నది, మోత్కూర్ చెరువు, యాదగిరిగస్టీ వద్ద నల్ల చెరువు, గోధుమకుంట, ఆలేరులోని సాయిగూడెం చెరువు, ఆలేరు మండలంలోని బాహుపేటవద్ద గోధుమకుంటలో నిమజ్జనం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఫ శోభాయాత్ర మార్గాల్లో సీసీ కెమెరాలు ఫ ఉత్సవాల్లో డీజేల వాడకం నిషేధం సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నాం వినాయక నిమజ్జనం ప్రశాంతవాతావరణంలో జరిగే విధంగా ప్రణాళికలు రూపొందించాం. ఇప్పటికే మండలపాలను జియో ట్యాగింగ్ చేయడం పూర్తయింది. నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా శోభాయాత్ర జరిగే మార్గంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నాం. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు ఉంటుంది. – రవీందర్, డీఎస్పీ, భువనగిరి -
ప్రశ్నిస్తే కేసులు.. అడిగితే అరెస్ట్‌లు
మోటకొండూర్ : కాంగ్రెస్ ప్రభుత్వ కుంభ కోణాలను, తప్పులపై ప్రశ్నిస్తే అరెస్టులు, ప్రజల సమస్యలను, ఇచ్చిన హామీలను అడిగితే కేసులు పెడుతూ బీఆర్ఎస్ నాయకులను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు అన్నారు. ఆదివారం మోటకొండూర్ మండల కేంద్రంలో సిరబోయిన మల్లేష్ యాదవ్ ఆధ్వర్యంలో 150 మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో హరీష్‌రావు మాట్లాడుతూ.. హామీలు అమలు చేతకాక సీఎం రేవంత్‌రెడ్డి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. రోజుకు 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ను కేసీఆర్ ప్రభుత్వం అందిస్తే.. ప్రస్తుతం 7 గంటలు మాత్రమే, అది కూడా లోఓల్టేజ్ విద్యుత్ సరఫరా చేస్తుంటే కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డికి కనిపించటం లేదా అని నిలదీశారు. అన్ని వర్గాల ప్రజలు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చీదరించుకుంటున్నారని ఎప్పులు ఎన్నికలు వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం రావడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మండల కేంద్రానికి వచ్చిన హరీష్ రావుకు పార్టీ శ్రేణులు హైస్కూల్ వద్ద ఘన స్వాగతం పలికి ర్యాలీగా సభా స్థలానికి వచ్చారు. అంబేద్కర్ చౌరస్తా వద్ద విగ్రహానికి పూలమాల వేసి నివాళ్లు అర్పించారు. అనంతరం సభలో పార్టీలో చేరిన 150 మందికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. మాజీ ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మాట్లాడుతూ.. రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి అండ్ కో కలిసి భూదందాలు చేస్తున్నారని, స్థానిక ఎమ్మెల్యే భూదందాలలో పాటు, క్రషర్లు, చెరువు మట్టి, సెటిల్మెంట్లు, దోపిడీలకు పాల్ప డుతున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్, పైళ్ల శేఖర్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్య, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, కర్నె ప్రభాకర్, క్యామ మల్లేష్, మహేందర్‌రెడ్డి, రామకృష్ణారెడ్డి, విద్యాసాగర్, ఎర్రోల శ్రీనివాస్, బాలు, కల్లూరి రామచంద్రారెడ్డి, బొట్ల యాదయ్య, అనంతుల శోభన్‌రెడ్డి, గాజుల వెంకటేష్, తండ రాజు, శ్రీకర్‌రెడ్డి, పల్లా వెంకట్‌రెడ్డి, శ్రీలత పాల్గొన్నారు. ఫ బీఆర్ఎస్ నాయకులను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఫ మాజీ మంత్రి తన్నీరు హరీష్‌రావు -
జూదరుల అరెస్ట్
కట్టంగూర్ : మండలంలోని మునుకుంట్ల గ్రామ శివారులో చెరువు కట్టపై శనివారం రాత్రి కొందరు వ్యక్తులు పేకాట ఆడుతున్నారని పక్కా సమాచారం అందడంతో టాస్క్‌ఫోర్స్ సిబ్బంది, కట్టంగూర్ పోలీసులు దాడి చేసి 8మందిని పట్టుకున్నారు. మరో నలుగురు పరారైనట్లు ఎస్ఐ రవీందర్ తెలిపారు. పట్టుబడిన వారి నుంచి రూ.5,610 నగదు, ఆరు సెల్ఫోన్లు, 6 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకుని, 12 మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు. అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చౌటుప్పల్ : మండల పరిధిలోని దండుమల్కాపురం గ్రామంలో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం మధ్యాహ్నం సమయంలో దండుమల్కాపురం గ్రామంలోని వైన్స్ సమీపంలో చెట్ల పొదల్లో వ్యక్తి మృతదేహాన్ని గుర్తించిన స్థానికుడు వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఘటనా స్థలంలో లభించిన ఆధారాల మేరకు మృతుడు ఏపీలోని కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలం కుమ్మమూరు గ్రామానికి చెందిన అన్నవరపు నాగరాజు(35)గా పోలీసులు గుర్తించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారని, వెల్డింగ్ పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నట్లు పేర్కొన్నారు. మృతుడి భార్యాపిల్లలు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఉంటుండగా.. అతడు మాత్రం వెల్డింగ్ పని నిమిత్తం దండుమల్కాపురంలో ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని.. నాగరాజు ఎలా మృతిచెందాడనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు చౌటుప్పల్ సీఐ మన్మథకుమార్ తెలిపారు. డివైడర్‌ను ఢీకొని కారు బోల్తా ● వృద్ధురాలికి గాయాలు అడ్డగూడూరు : కారు అదుపుతప్పి డివైడర్ ఢీకొని పల్టీ కొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న వృద్ధురాలికి గాయాలయ్యాయి. ఈ ఘటన అడ్డగూడూరు మండలం చౌల్లరామరం గ్రామ స్టేజీ ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తుంగతుర్తి మండలం గొట్టిపర్తి గ్రామానికి చెందిన డ్రైవర్ పొన్నం సందీప్ తన అమ్మమ్మ బండారి సోమక్కతో కలిసి కారులో హైదరాబాద్ నుంచి తిరుమలగిరికి వెళ్తుండగా.. అడ్డగూడూరు మండలం చౌల్లరామారం గ్రామ స్టేజీ వద్దకు రాగానే కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో సోమక్క తలకు గాయాలయ్యాయి. వెంటనే ఆమెకు ఆస్పత్రికి తరలించారు. కారు ఢీకొని మహిళ మృతి నాంపల్లి : కారు ఢీకొని మహిళ మృతిచెందిన ఘటన నాంపల్లి మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని బండ తిమ్మాపురం గ్రామ పంచాయతీ ఆవాస గ్రామమైన పాటిమీదగూడేనికి చెందిన గుణబోయిన లక్ష్మమ్మను అదే గ్రామానికి చెందిన బోదాసు రాజు అనే వ్యక్తి గ్రామంలో కారుతో ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. మెరుగైన చికిత్స కోసం లక్ష్మమ్మను దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ కె. లింగారెడ్డి తెలిపారు. -
యాదగిరి క్షేత్రంలో శ్రీసుదర్శన హోమం
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి క్షేత్రంలో ఆదివారం శ్రీసుదర్శన నారసింహ హోమం నిర్వహించారు. స్వయంభూ పంచనారసింహులకు బిందే తీర్థం, ఆరాధన, బాలభోగం నిర్వహించి, నిజాభిషేకం జరిపించారు. సహస్రనామార్చన చేపట్టి, తులసీ దళాలతో అర్చించారు. అనంతరం గజ వాహన సేవ, నిత్య కల్యాణం, జోడు సేవలు చేపట్టారు. ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చన, ప్రథమ ప్రాకార మండపంలో వేద ఆశీర్వచనం పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. రాత్రి స్వామి వారికి శయనోత్సవం నిర్వహించి ఆలయాన్ని ద్వార బంధనం చేశారు. -
ఎవరి పాలన బాగుంది?
యాదగిరిగుట్ట రూరల్: మోటకొండూర్ మండల కేంద్రం పర్యటనకు వెళ్లిన మాజీ మంత్రి హరీష్ రావు యాదగిరిగుట్ట మండంలంలోని మహబూబ్‌పేట గ్రామంలో కొద్దిసేపు ఆగారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఆరు గ్యారంటీలు అమలవుతున్నాయా అని మహిళలను అడిగారు. కేసీఆర్ పాలన బాగుందా..? రేవంత్ రెడ్డి పాలన బాగుందా.. అని, పెన్షన్లు ఎంత వస్తున్నాయి? మహిళలకు రూ.2500 వస్తున్నాయా? అని అడిగారు. అంతకుముందు ఆయనకు వంగపల్లి గ్రామం వద్ద ఘన స్వాగతం పలికారు. అనంతరం బైక్ ర్యాలీగా మోటకొండూర్ మండల కేంద్రానికి చేరుకున్నారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు కర్రె వెంకటయ్య, మిట్ట వెంకటయ్య, బీమగాని నర్సింహ, కవిడె మహేందర్, కానుగు లక్ష్మణ్, మదర్ డెయిరీ డైరెక్టర్ కందాల అలివేల రంగారెడ్డి, ఉపసర్పంచ్ సోకం అనిత పాల్గొన్నారు. -
ఆగని రిజిస్ట్రేషన్లు
ఈడీ, సిట్ కేసులు ఉన్నా.. 22ఏ నిషేధిత జాబితా సవరణపై అనుమానాలు సాక్షి, యాదాద్రి : 22ఏ నిషేధిత జాబితాను సవరించిన అధికారుల తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చౌటుప్పల్ మండలం తూప్రాన్‌పేటలో నిషేధిత జాబితాలో ఉన్న ఈడీ, సిట్ కేసుల భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియ వివాదం శుక్రవారం తెరపైకి వచ్చింది. గత డిసెంబర్లో వ్యవసాయ భూములు, నివేశన స్థలాలను రిజిస్ట్రేషన్ యాక్ట్–1908 సెక్షన్ 22ఏలో చేర్చి రిజిష్ట్రేషన్లకు అడ్డుకట్ట వేసిన విషయం తెలిసిందే. ప్రతిపక్షాలు, ప్రజలు, సొంతపార్టీ ఎమ్మెల్యే నుంచి వచ్చిన వినతుల నేపథ్యంలో ప్రభుత్వం నిషేధిత జాబితాను ఈ వారంలోనే సవరించింది. 422 గ్రామ పంచాయతీల్లో.. జిల్లాలో 17 మండలాలు, ఆరు మున్సిపాలిటీల్లో మొత్తం 319 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. ఇందులో 422 గ్రామ పంచాయతీల్లో నిషేధిత జాబితాల్లో 39,468 ఇళ్లు, 2450 సర్వే నంబర్లలో 28,549 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. వ్యవసాయ భూములు, ఇళ్ల స్థలాలను ఈడీ, సీఐడీ, సిట్, ఆర్ఆర్, ఏసీబీ కేసుల్లో ఉన్న భూములు 258 ఎకరాలు, ప్రభుత్వ స్థలాలు 964 ఎకరాలు నిషేధిత జాబితాలో చేర్చారు. వీటీతోపాటు అసైన్డ్ భూములు, భూదాన్, ఇనామ్, వక్ఫ్, దేవాదాయ శాఖ, చెరువులు, అటవీ, ప్రభుత్వ, భూములు, రోడ్లు, శ్మశానాలు వంటివి చేర్చారు. చిక్కుల్లో తూప్రాన్‌పేట భూములు నయీమ్ కేసుకు సంబంధించి ప్రత్యేక విచారణ కమిటీ (సిట్ )నుంచి క్లియరెన్స్ ఉన్నా, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆంక్షల కారణంగా చౌటుప్పల్ మండలం తూప్రాన్‌పేట భూముల రిజిస్ట్రేషన్ల వ్యవహారం మళ్లీ చిక్కుల్లో పడింది. ఆ ఐదెకరాల భూమి వివాదాస్పదం.. తూప్రాన్‌పేట పరిధిలోని సర్వే నంబర్లు 12, 13, 14లో ఉన్న సుమారు 45 ఎకరాల నాన్ అగ్రికల్చర్ (లేఅవుట్, ప్లాట్లు) భూములు 22ఏ నిషేధిత జాబితాలో ఉన్నాయి. గతంలో నయీమ్ ముఠా బెదిరింపుల ద్వారా ఈ భూములను ఆక్రమించినట్లు కేసులు నమోదయ్యాయి. సీసీఎల్ఏ విచారణ తర్వాత సిట్ అధికారులు ఈ భూములకు క్లియరెన్స్ ఇస్తూ, నిషేధిత జాబితా నుంచి మినహాయింపు ఇచ్చినట్లు సమాచారం. అయితే సిట్ క్లియరెన్స్ ఇచ్చి నిషేధిత జాబితా నుంచి తొలగించినప్పటికీ, ఈ 45 ఎకరాల భూమిలోనే 5 ఎకరాల భూమిపై ఈడీ ముందే ఆంక్షలు విధించినట్లు వెలుగు చూసింది. గతంలో సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయానికి ఈడీ పంపిన జాబితా ఆధారంగా పాత ఐజీఆర్ఎస్ డేటాలో ఈ వివరాలు ఉన్నాయి. సిట్ నిషేధిత జాబితా నుంచి తొలగించిందని కొందరు వ్యాపారులు రిజిస్ట్రేషన్లకు సిద్ధమయ్యారు. ఇందుకు చౌటుప్పల్ రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అధికారులు సహకరించినట్లు తెలుస్తోంది. అయితే ఈడీ ఆంక్షలు స్పష్టంగా తేలకపోవడంతో సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయ అధికారులు ఈ భూముల రిజిస్ట్రేషన్లను హోల్డ్‌లో పెట్టారని తెలుస్తోంది. అయితే నిషేధిత జాబితాలో ఉన్న వాటిని ఎలా రిజిస్ట్రేషన్‌కు అనుమతించారనే కోణంలో విచారణ ప్రారంభమైంది. రిజిష్ట్రేషన్లు జరిగాయని వాదన కూడా వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలో జిల్లా రెవెన్యూ యంత్రాంగం అప్రమత్తమై విచారణ చేపట్టింది. చౌటుప్పల్ తహసీల్దార్, సబ్ రిజిస్ట్రార్లను విచారిస్తోంది. ఇప్పటివరకు ఎలాంటి కొత్త రిజిస్ట్రేషన్లు జరగలేదని వారు తెలిపినట్లు సమాచారం. ఫ తూప్రాన్‌పేటలో 45 ఎకరాల వివాదాస్పద భూములకు రెవెన్యూ క్లియరెన్స్! ఫ అందులోని 5 ఎకరాలపై ముందు నుంచే ఉన్న ‘ఈడీ’ ఆంక్షలు ఫ ఆ ప్లాట్ల రిజిస్ట్రేషన్ స్లాట్ బుకింగ్‌తో విషయం వెలుగులోకి.. ఫ అధికారుల సహకారంపై విచారణ -
సమయానికి రావాలి్సందే..
ఉదయం 10.40 గంటలకు కలెక్టరేట్ గేటుకు తాళం సాక్షి, యాదాద్రి : భువనగిరి కలెక్టరేట్ ఉద్యోగుల సమయపాలనపై జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించారు. మీ ప్రమాణం లొకేషన్ ఆధారిత హాజరు విధానం తీసుకొచ్చినా కొందరు ఉద్యోగులు 10.30 గంటలకు కార్యాలయానికి రావాల్సిన ఉన్నా ఆలస్యంగా వస్తున్నారు. దీన్ని నివారించడానికి శుక్రవారం ఉదయం 10:40 గంటలకు కలెక్టరేట్ ప్రధాన గేటుకు తాళం వేశారు. దీంతో ఆలస్యంగా వచ్చిన వివిధ శాఖలకు చెందిన కొందరు ఉద్యోగులు గేటుబయటే నిలబడాల్సి వచ్చింది. పది నిమిషాల తర్వాత గేట్ తీయడంతో ఉద్యోగులు విధులకు హాజరయ్యారు. మీ ప్రమాణంలో 900 మందే నమోదు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్న ఉద్యోగుల హాజరు విధానం మీ ప్రమాణంలోకి ఉద్యోగులు చేరడంలేదు. జిల్లా కలెక్టరేట్లోని విభాగాల్లో 1250 మంది వరకు ఉద్యోగులు, అధికారులు, సిబ్బంది ఉన్నారు. వీరిలో సుమారు 900 మంది వరకు మీ ప్రమాణంలో నమోదయ్యారు. ఇందులో కేవలం 500లోపే ముఖ ఆధారిత హాజరు ఉదయం, సాయంత్రం వేస్తున్నారు. సకాలంలో రాని ఉద్యోగులపై ప్రజావాణిలో పలు రకాల ఫిర్యాదులు అందాయి. ఇక.. హాజరు ఆధారంగానే జీతం మీ ప్రమాణం హాజరు అధారంగానే జీతం చెల్లించాలని ఆయా శాఖల హెచ్ఓడీలకు, జిల్లా ట్రెజరీ అఽధికారులకు ఇన్చార్జి కలెక్టర్ భాస్కర్‌రావు సర్క్యులర్ జారీచేశారు. దీంతో ఉద్యోగుల్లో అలజడి ప్రారంభమైంది. కాగా సాంకేతిక కారణాలు, ఆనారోగ్యం, డిప్యుటేషన్లతో వివిధ ప్రాంతాల్లో ఉన్న ఉద్యోగులకు మీ ప్రమాణం హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని ఉద్యోగ సంఘాల నాయకులు కోరుతున్నారు. సమయపాలన పాటించని ఉద్యోగులపై నిబంధనల ప్రకారం చర్యలు ఉంటాయి. హెచ్ఓడీలు ఇచ్చే బయోమెట్రిక్ హాజరు ఆధారంగా జీతాలు చెల్లించేలా నిబంధనలు కఠినతరం చేస్తాం. – భాస్కర్‌రావు, ఇన్చార్జి కలెక్టర్ ఫ ఆలస్యంగా వచ్చిన పలువురు ఉద్యోగులు గేటు బయటే.. ఫ పది నిమిషాల తర్వాత తాళం తీయడంతో లోపలికి.. ఫ ‘మీ ప్రమాణం’ హాజరు ఆధారంగా జీతం చెల్లించాలని ఇన్చార్జి కలెక్టర్ ఆదేశాలు -
యాదాద్రి భువనగిరి
‘సర్’లో సందేహాలా.. పోరాట స్ఫూర్తితో ప్రజాపాలనపట్టభద్రుల ఓటరు నమోదు షెడ్యూల్శుక్రవారం శ్రీ 18 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026ఓటరు జాబితా ప్రత్యేక సవరణ(సర్)లో భాగంగా అనామలీస్, నో మ్యాపింగ్ జాబితాలోని ఓటర్లకు నోటీసులు జారీ అయ్యాయి. దీంతో తమ ఓటు ఉంటుందా పోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నోటీసులు అందుకున్న వారు ఎలాంటి ధ్రువీకరణ పత్రాలతో హియరింగ్(విచారణ)కు హాజరుకావాల్సి ఉంటుందని ఓటర్లు ఆరా తీస్తున్నారు. ఓటర్ల సందేహాలకు సాక్షి ఆధ్వర్యంలో నిర్వహించే ఫోన్ ఇన్ కార్యక్రమం ద్వారా అదనపు కలెక్టర్ వెంకారెడ్డి సమాధానాలు ఇవ్వనున్నారు. సాక్షి, యాదాద్రి: రాచరిక నిరంకుశ పాలన సంకెళ్లను తెంచుకుని ప్రజాస్వామ్య వ్యవస్థ వైపు అడుగులు వేసిన చారిత్రక ఘట్టం సెప్టెంబర్ 17 అని, నాటి అమరుల పోరాట స్ఫూర్తితోనే రాష్ట్రంలో ప్రజా పాలన కొనసాగుతోందని రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి స్పష్టం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్లో గురువారం నిర్వహించిన తెలంగాణ ప్రజా పాలన దినోత్సవానికి సుఖేందర్ రెడ్డి హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం అమరవీరులు, తెలంగాణ తల్లి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గుత్తా మాట్లాడుతూ సెప్టెంబర్ 17 కేవలం క్యాలెండర్లో ఒక తేదీ కాదని, అది తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం, విముక్తి పోరాటానికి సజీవ సాక్ష్యమని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ పరమావధి ప్రస్తుత ప్రభుత్వం ప్రజల సంక్షేమం, సామాజిక న్యాయమే పరమావధిగా ముందుకు సాగుతోందన్నారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, రూ 500లకే గ్యాస్ సిలిండర్, గృహజ్యోతి కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వంటి సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేస్తున్నట్లు చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ కొత్త రేషన్ కార్డులు, కార్డుదారులకు నాణ్యమైన సన్నబియ్యం, విద్యార్థులకు నాణ్యమైన భోజనం, యువతకు ఉపాధి కల్పన దిశగా ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందన్నారు. ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి ఎల్‌నినో నేపథ్యంలో నీటి వినియోగం తక్కువగా ఉండే ఆయిల్ పామ్ సాగుపై రైతులు దృష్టి సారించాలన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలపడానికి అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. అనంతరం ఇంటర్ పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన 28 మంది విద్యార్థులను, విధి నిర్వహణలో విశిష్ట సేవలందించిన వివిధ శాఖలకు చెందిన 8 మంది ఉద్యోగులను సత్కరించారు. ఈ వేడుకల్లో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, జిల్లా ఇన్చార్జి కలెక్టర్ భాస్కర్ రావు, జిల్లా ఎస్పీ అక్షాంశ్ యాదవ్, అదనపు కలెక్టర్ వెంకారెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ శ్రీవాణి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అవేజ్ చిస్తీ, అడిషనల్ ఎస్పీ లక్ష్మీనారాయణ, ఆర్డీఓ కృష్ణారెడ్డి, జేఏసీ చైర్మన్ మందడి ఉపేందర్ రెడ్డి పాల్గొన్నారు. జెండాకు సెల్యూట్ చేస్తున్న మండలి చైర్మన్ గుత్తా, ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌రెడ్డి, ఇన్చార్జి కలెక్టర్ భాస్కర్‌రావు, ఎస్పీ అక్షాంశ్ యాదవ్విద్యార్థినుల నృత్య ప్రదర్శన తేది. 19.09.2026 (శనివారం) సమయం : ఉదయం 9.00 నుంచి 10.00 గంటల వరకు డయల్ చేయాల్సిన ఫోన్ నంబర్ : 83319 97002ఎంజీయూ పీజీ ఫలితాలు విడుదలనల్లగొండ టూటౌన్ : నల్లగొండలోని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయ పరిధిలోని పీజీ 4వ సెమిస్టర్ రెగ్యులర్, 1, 2, 3 బ్యాక్లాగ్ పరీక్ష ఫలితాలను రిజిస్ట్రార్ కొప్పుల అంజిరెడ్డి గురువారం విడుదల చేశారు. పీజీ 4వ సెమిస్టర్లో మొత్తం 1265 మంది విద్యార్థులకు 967 మంది, (76.44శాతం), బ్యాక్‌లాగ్‌లో మొదటి సెమిస్టర్లో 427 మంది విద్యార్థులకు 158 మంది (37శాతం), 2వ సెమిస్టర్లో 382 మందికి 65 మంది (17.02శాతం), 3వ సెమిస్టర్లో 34 మంది విద్యార్థులకు 168 మంది (48.84శాతం) ఉత్తీర్ణత సాధించినట్లు సీఈఓ జి.ఉపేందర్‌రెడ్డి తెలిపారు. ఫలితాల పూర్తి వివరాలను ఎంజీయూ వెబ్సైట్లో పొందుపరిచినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో పరీక్షల విభాగం అధికారులు డి.సంధ్యారాణి, కళ్యాణి, ప్రవళిక పాల్గొన్నారు. సాక్షి ప్రతినిధి, నల్లగొండ : వరంగల్ – ఖమ్మం – నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక వేడి మొదలు కానుంది. ఈ నియోజవర్గంలో ఓటరు జాబితా రూపకల్పనకు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం షెడ్యూల్ ప్రకటించింది. ఈనెల 28వ తేదీన ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ను జారీ చేయనుంది. వెంటనే నమోదు నమోదు ప్రక్రియ ప్రారంభం కానుంది. నవంబరు 6వ తేదీ వరకు ఓటరుగా పేరు నమోదు చేసుకోవాల్సి ఉటుంది. నవంబర్ 20వ తేదీన ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటిస్తారు. డిసెంబర్ 10 వరకు ముసాయిదా జాబితాపై అభ్యంతరాల స్వీకరించి, 25వ తేదీలోగా పరిష్కరిస్తారు. డిసెంబర్ 30వ తేదీన తుది ఓటర్ల జాబితాను ప్రకటిస్తారు. గతంలో పట్టభద్రుల నియోజకవర్గ ఓటర్లుగా నమోదైన వారు కూడా మళ్లీ కొత్తగా ఫారం–18 ద్వారా పేరు నమోదు చేసుకోవాల్సిందే. వరంగల్ – ఖమ్మం – నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ పరిధిలో 2024 ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. అప్పుడు 4,63,839 ఓట్లుండగా 3,36,013 ఓట్లు పోలయ్యాయి. ఈసారి ఎంత మంది ఓటర్లుగా పేర్లు నమోదు చేసుకుంటారో చూడాల్సిందే. భూమిని మింగేస్తున్నారు! ఆలేరు మున్సిపాలిటీ పరిధిలో విలువైన ప్రభుత్వ, మున్సిపల్ స్థలాలకు రక్షణ లేకుండాపోయింది.- 8లోఫ శాసన మండలి చైర్మన్ సుఖేందర్‌రెడ్డి ఫ కలెక్టరేట్లో ఘనంగా తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం ఫ 28న నోటిఫికేషన్ ఫ డిసెంబర్ 30న తుది ఓటరు జాబితా ఫ పాత ఓటర్లు కూడా నమోదు చేసుకోవాల్సిందే.. -
నిరుద్యోగులకు కొలువుల పండుగ
సాక్షి, యాదాద్రి : గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నత విద్యనభ్యసించిన నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించి వారి జీవితాల్లో వెలుగులు నింపడమే ప్రజా ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్‌కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాతో పాటు పరిసర ప్రాంతాల నిరుద్యోగుల కోసం ఈనెల19న సూర్యాపేట జిల్లా కోదాడలోని కేఆర్ఆర్ కళాశాల ప్రాంగణంలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్లో భువనగిరి, ఆలేరు ఎమ్మెల్యేలు కుంభం అనిల్ కుమార్ రెడ్డి, బీర్ల ఐలయ్య, జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఎ. భాస్కర్‌రావు, ఎస్పీ అక్షాంశ్‌యాదవ్, జిల్లా ఉన్నతాధికారులు, విద్యాసంస్థల ప్రతినిధులతో కలిసి జాబ్ మేళాపై మంత్రి సమీక్షించి మాట్లాడారు. గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫాక్స్‌కాన్, ఐటీసీ, అపోలో, విప్రో, ఐసీఐసీఐ బ్యాంక్ వంటి 300 ప్రముఖ కంపెనీలు ఈ మేళాకు వస్తున్నాయని వివరించారు. దాదాపు 15 వేల నుంచి 20 వేల మంది నిరుద్యోగులు ఆన్లైన్లో పేర్లు నమోదు చేసుకుని ఇంటర్వ్యూలకు హాజరయ్యేలా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ఇందులో కనీసం 3 వేల నుంచి 4 వేల మందికి పైగా యువతకు ఉద్యోగాలు లభిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. జాబ్ మేళా ప్రారంభోత్సవానికి శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి హాజరవుతారని, ఎంపికై న అభ్యర్థులకు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు చేతుల మీదుగా సాయంత్రం ఆఫర్ లెటర్లు అందజేస్తామని చెప్పారు. మంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు భువనగిరి, ఆలేరు ఎమ్మెల్యేలు కుంభం అనిల్ కుమార్ రెడ్డి, బీర్ల ఐలయ్య మాట్లాడుతూ యాదాద్రి భువనగిరి జిల్లా ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించిన మంత్రి ఉత్తమ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ వెంకారెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ తంగళ్ళపల్లి శ్రీవాణి తదితరులు పాల్గొన్నారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సాగునీటి ప్రాజెక్టులకు నిధుల కొరత లేకుండా చూస్తామన్నారు. గంధమల్ల రిజర్వాయర్ కోసం రూ. 530 కోట్ల సవరించిన అంచనాలతో సీఎం శంకుస్థాపన చేశారని, తాజాగా రూ. 130 కోట్లు విడుదల చేసి పనులను ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు. బస్వాపూర్ రిజర్వాయర్‌కు రూ. 206 కోట్లు కేటాయించామని, 5.5 టీఎంసీల నీటిని నిల్వ చేసి ఆలేరు, భువనగిరి నియోజకవర్గాల్లో ఆయకట్టును సస్యశ్యామలం చేస్తామన్నారు. బునాదిగాని, పిలాయిపల్లి, ధర్మారెడ్డి కాలువల పునరుద్ధరణకు రూ. 480 కోట్లు విడుదల చేశామన్నారు. పేద ప్రజలకు ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున నాణ్యమైన సన్నబియ్యం అందిస్తున్న ఘనత ప్రజా ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 3.42 కోట్ల మంది లబ్ధిదారుల కోసం 1.06 కోట్ల స్మార్ట్ రేషన్ కార్డులను ముద్రించి సిద్ధం చేశామని, త్వరలోనే స్థానిక ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా పంపిణీ చేస్తామని తెలిపారు. ఫ 19న కోదాడలో మెగా జాబ్ మేళా ఫ హాజరుకానున్న 300 కంపెనీలు ఫ ఎన్ని ఇబ్బందులెదురైనా సాగునీటి ప్రాజెక్టులకు నిధుల కొరత రానివ్వం ఫ కలెక్టరేట్లో నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమీక్ష -
20న అలయ్ బలయ్
కోదాడ : హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఈ నెల 20న జరిగే బీసీ కవులు అలయ్ బలయ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్ కోరారు. బుధవారం కోదాడలో జరిగిన ఓ కార్యక్రమంలో ‘వెంటాడే కలాలు–వెనుకబడిన కులాలు’ సంకలన రజతోత్సవ పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. తెలంగాణ సాహిత్యంలో చరిత్ర సృష్టించిన వెంటాడే కలాలు–వెనుకబడిన కులాలు సంకలనం రజతోత్సవంతో పాటు బీసీ కవుల అలయ్ బలయ్ కార్యక్రమాన్ని నిర్వహించ తలపెట్టామన్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి 300 మంది బీసీ కవులు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారన్నారు. 25 మంది బీసీ కవుల ఆత్మఘోషగా ఆవిష్కరించబడిన ఈ కవితా సంకలనానికి పుట్టినిల్లు కోదాడ కావడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో రాయపూడి చిన్ని, బంగారు నాగమణి, బాణాల వసంత, వేముల వెంకటేశ్వర్లు, జీఎల్ఎన్ రెడ్డి, సిరికొండ శ్రీనివాస్, పుప్పాల కృష్ణమూర్తి, సరికొండ నరసింహారాజు పాల్గొన్నారు. -
చెమటోడి్చనా.. చేతికి రాకపాయె !
దయనీయంగా బత్తాయి రైతుల పరిస్థితి ఫ పెట్టుబడులు భారీగా పెరిగి.. దక్కని గిట్టుబాటు ధర ఫ అప్పుల ఊబిలో రైతులు.. తోటల నరికివేత ఫ 3లక్షల నుంచి 35వేల ఎకరాలకు పడిపోయిన సాగునాగార్జునసాగర్ : ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బత్తాయి రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. బత్తాయి తోటలను ఏళ్ల తరబడి కంటికి రెప్పలా కాపాడుకున్న రైతులు.. గిట్టుబాటు ధర లేక, పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి రాక అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ఒకప్పుడు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సుమారు 3 లక్షల ఎకరాల్లో బత్తాయి సాగు జరిగేది. కానీ ప్రస్తుతం జిల్లాలో బత్తాయి సాగు విస్తీర్ణం 35వేల ఎకరాల దిగువకు పడిపోయింది. ఎరువులు, పురుగు మందులు, తెగుళ్ల నివారణ, అంతర సేద్యం, కలుపు నివారణ మందులు, కూలీల రేట్లు, నీటి నిర్వహణ ఖర్చులు ఏటేటా పెరుగుతున్నాయి. మరోవైపు మార్కెట్లో ధర మాత్రం రైతు చేతిలో ఉండటం లేదు. పంట చేతికొచ్చిన సమయంలో ధరలు పడిపోవడంతో రైతులు తమ సరుకును తక్కువ ధరకే విక్రయించాల్సి వస్తోంది. ధర తగ్గే సమయానికి మార్కెట్లో సరుకు వెల్లువెత్తుతోంది. దళారుల చేతుల్లో ధర.. బత్తాయి ధరను మార్కెట్లో మధ్యవర్తులు, దళారులు నిర్ణయిస్తున్నారు. ఉత్పత్తుల నిల్వ, రవాణా, కోల్డ్ స్టోరేజీలు, ప్రాసెసింగ్ సదుపాయాలు లేకపోవడంతో రైతుకు పంటను ఎక్కువ కాలం నిల్వ ఉంచుకునే అవకాశం దక్కడం లేదు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వస్తోంది. ఐదు వేల ఎకరాలకు పైగా తోటల తొలగింపు వర్షాభావ పరిస్థితులు, భూగర్భజలాలు అడుగంటడం, బోర్ల తవ్వకాల కోసం భారీగా ఖర్చు చేయాల్సి రావడం బత్తాయి రైతులను మరింత కుంగదీస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో ఈ ఏడాదిలోనే ఇప్పటికే సుమారు 5,000 ఎకరాలకు పైగా బత్తాయి తోటలను తొలగించినట్లు రైతులు చెబుతున్నారు. మరికొన్ని వేల ఎకరాల తోటలు కూడా తొలగింపు దశలో ఉన్నట్లు సమాచారం. ఆయకట్టు ప్రాంతాల్లో నీటి వసతి పుష్కలంగా ఉన్న చోట కూడా కొందరు రైతులు బత్తాయి సాగును వదులుకుంటున్నారు. బత్తాయి సాగుపై పూర్తిగా నమ్మకం కోల్పోతున్న రైతులు నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో వరి సాగు వైపు, మరికొందరు ఆయిల్ పామ్ వైపు వెళ్తున్నారు. ‘అమూల్’ తరహాలో రైతు సహకార వ్యవస్థ గుజరాత్‌లోని ‘అమూల్’ తరహాలో రైతులే యజమానులు, భాగస్వాములుగా ఉండే బలమైన సహకార మార్కెటింగ్ వ్యవస్థను బత్తాయి సాగు చేసే ప్రాంతాల్లో ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఉంది. ప్రతి పట్టణానికి సమీపంలోని ప్రధాన రహదారులపై రైతుల ఆధ్వర్యంలోనే విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేయాలి. ఏ మార్కెట్లో ఎంత ధర ఉంది? ఎక్కడ ఎంత డిమాండ్ ఉంది? ఎప్పుడు ఎంత సరుకు అవసరం? వంటి సమాచారాన్ని రైతులకు అందుబాటులోకి తీసుకురావాలి. ముందస్తు బుకింగ్, రవాణా, నిల్వల వంటి సదుపాయాలను ఈ సంఘం ద్వారానే నిర్వహించేలా చర్యలు తీసుకోవాలి. బత్తాయి రైతును కాపాడాలంటే కేవలం తాత్కాలిక సబ్సిడీలతో సరిపెట్టకుండా, రైతుకు అండగా నిలిచే సమగ్ర వ్యవస్థను ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. చీడపీడల నివారణకు సబ్సిడీపై నాణ్యమైన పురుగు మందులు సరఫరా చేయాలి. నీటి వసతి కల్పనకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వాలి. పంట నష్టపోతే తక్షణమే అందేలా సమర్థవంతమైన బీమా పరిహారాన్ని వర్తింపజేయాలి. గిట్టుబాటు ధర కోసం ప్రభుత్వమే మార్కెట్ జోక్యం చేసుకోవాలి. శీతల గిడ్డంగులు, గ్రేడింగ్, ప్యాకింగ్ కేంద్రాలు, బత్తాయి రసం/జ్యూస్ మరియు ఇతర ఉత్పత్తుల ప్రాసెసింగ్ యూనిట్లను తక్షణమే నెలకొల్పాలి. రైతు నుంచి వినియోగదారుడికి నేరుగా విక్రయించే మార్కెటింగ్ వ్యవస్థను బలోపేతం చేయాలి. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పాటు విదేశీ మార్కెట్లకు బత్తాయి ఎగుమతి అయ్యేలా ప్రోత్సాహకాలు అందించాలి. పంట ధరలు, మార్కెట్ డిమాండ్‌పై ముందస్తు సమాచారాన్ని రైతులకు అందించే వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావాలి. -
సాయుధ పోరాట యోధుల స్ఫూర్తిని కొనసాగిస్తాం
మునగాల : తెలంగాణ సాయుధ రైతాంగ సాయుధ పోరాట యోధుల స్ఫూర్తిని కొనసాగిస్తామని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం(ఐద్వా) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి స్పష్టం చేశారు. బుధవారం ఐద్వా ఆధ్వర్యంలో మునగాల మండలం నర్సింహలగూడెంలో నిర్వహించిన పోరు వనితల స్ఫూర్తి యాత్ర బాటలో ఆమె పాల్గొని మాట్లాడారు. భూమి కోసం, భూస్వామ్య దోపిడీకి వ్యతిరేకంగా తెలంగాణ రైతాంగ సాయధ పోరాటం సాగిందిన్నారు. ఈ పోరాటంలో వేలాది మంది ప్రజలు ప్రాణత్యాగం చేశారని, అనేక గ్రామాలను వెట్టిచాకిరి నుంచి విముక్తి చేశారని, ఫలితంగా లక్షలాది ఎకరాల భూమి పేదలకు పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో అమరవీరుల స్మారక స్థూపాల వద్ద నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు ఆర్. అరుణ, రాష్ట్ర సహాయ కార్యదర్శి బుగ్గవీటి సరళ, కేఎన్ ఆశాలత, జిల్లా ప్రధాన కార్యదర్శి మద్దెల జ్యోతి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపల్లి సైదులు, సీఐటీయూ జిల్లా నాయకురాలు చెరుకు లక్ష్మి, ఐద్వా రాష్ట్ర కమిటీ సభ్యులు జూలకంటి విజయలక్ష్మి, మేకనబోయిన సైదమ్మ పాల్గొన్నారు. ఫ ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి -
తూప్రాన్‌పేట అండర్‌పాస్ ప్రారంభానికి సిద్ధం
చౌటుప్పల్ : హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు చేపట్టిన తూప్రాన్‌పేట అండర్‌పాస్ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం తుదిమెరుగులు మాత్రమే మిగిలాయి. త్వరలోనే దీనిని ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. చౌటుప్పల్ మండలం తూప్రాన్‌పేట నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నందిగామ శివారు వరకు అధికారులు గుర్తించిన 17బ్లాక్స్పాట్లలో తూప్రాన్‌పేట బ్లాక్‌స్పాట్ ఒకటి. ఇక్కడ ప్రమాదాలను అరికట్టేందుకు గతేడాది ఈ అండర్‌పాస్ నిర్మాణాన్ని ప్రారంభించారు. బ్రిడ్జి పైభాగంలో పనులు పూర్తి కావడంతో ప్రస్తుతం హైదరాబాద్ మార్గంలో వాహనాలను అనుమతిస్తూ అధికారులు ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు. బ్రిడ్జిపై వెలుతురు కోసం హైమాస్ట్ లైట్లను బిగించడమే కాకుండా, మధ్యలోని డివైడర్‌పై పటిష్టమైన ఇనుప కంచె (ఐరన్ బారికేడ్) ఏర్పాటు చేశారు. బ్రిడ్జి కింది భాగంలో అండర్‌పాస్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఇవి పూర్తయిన వెంటనే పూర్తిస్థాయి రాకపోకలు మొదలుకానున్నాయి. ఈ బ్రిడ్జి అందుబాటులోకి వస్తే జాతీయ రహదారి వాహనాలు పైనుంచి, స్థానిక మరియు చుట్టుపక్కల గ్రామాల వాహనాలు కింద ఉన్న సర్వీస్ రోడ్డు ద్వారా వెళ్తాయి.ఇదిలా ఉండగా మండలంలో మరో రెండు బ్లాక్స్పాట్లు అయిన ధర్మోజిగూడెం, చౌటుప్పల్ ప్రాంతాలలో మాత్రం పనులు కొనసాగుతున్నాయి. -
బైక్‌ను ఢీకొట్టిన లారీ.. ముగ్గురికి గాయాలు
భూదాన్‌పోచంపల్లి : బైక్‌ను లారీ ఢీకొనడంతో ఇద్దరు విద్యార్థులతో పాటు మరో యువకుడికి గాయాలయ్యాయి. ఈ ఘటన భూదాన్‌పోచంపల్లి మండలం జూలూరు గ్రామ శివారులో బుధవారం ఉదయం జరిగింది. బాధితుల కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. భూదాన్‌పోచంపల్లి మండలం కప్రాయిపల్లి గ్రామానికి చెందిన పోశమోని నందువర్ధన్ పోచంపల్లిలోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. అతడి అన్న చరణ్ కూడా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్నాడు. అన్నదమ్ములిద్దరు ప్రతిరోజు ఆర్టీసీ బస్సులో పాఠశాలకు, కళాశాలకు వచ్చేపోయేవారు. బుధవారం బస్సు వెళ్లిపోవడంతో గ్రామం నుంచి బైక్‌పై లిఫ్ట్ అడిగి జూలూరు వరకు వచ్చారు. తిరిగి జూలూరు వద్ద అలీనగర్‌కు చెందిన ఎలక్ట్రీషియన్ చిలువేరు శివకుమార్ బైక్‌పై పోచంపల్లికి వెళ్తుండగా.. లిఫ్ట్ అడిగి అతడి బైక్ ఎక్కారు. జూలూరు శివారులోకి రాగానే ఎదురుగా వేగంగా వచ్చిన లారీ బైక్‌ను ఢీకొట్టింది. దీంతో ముగ్గురు ఎగిరి కిందపడటంతో కాళ్లు విరిగి నుజ్జునుజ్జయ్యాయి. అటుగా వెళ్తున్న వాహనదారులు గమనించి వారిని అంబులెన్స్‌లో ఉప్పల్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని చౌటుప్పల్ మండలం తేరట్‌పల్లికి చెందిన లారీ డ్రైవర్ బొడ్డుపల్లి శంకర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడితో పాటు లారీని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. యువతి అదృశ్యం.. కేసు నమోదుహుజూర్నగర్ : పట్టణానికి చెందిన యువతి అదృశ్యమైంది. ఎస్ఐ నరేష్ తెలిపిన వివరాల ప్రకారం.. హుజూర్నగర్ పట్టణంలోని పీర్ల కొట్టం బజారులో నివాసముంటున్న బత్తుల మానస బుధవారం కనిపించకుండా పోయింది. ఎంత వెతికినా మానస ఆచూకీ లభించకపోవడంతో దీంతో ఆమె తల్లి రమణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. చెరువులో మునిగి వ్యక్తి మృతిమోతె : పశువులను తోలుకొచ్చేందుకు చెరువులోకి వెళ్లిన వ్యక్తి నీటిలో మునిగి మృతిచెందాడు. ఈ ఘటన మోతె మండలం నామవరం గ్రామంలో బుధవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నామవరం గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ చిట్యాల ఉప్పయ్య (40) తన పశువులను గ్రామ శివారులో మేపుతుండగా.. అవి నీటి కోసమని చెరువులోకి వెళ్లాయి. ఆ పశువులను బయటకు తీసుకొచ్చే క్రమంలో ఉప్పయ్య చెరువులోకి దిగగా.. ఆయన కట్టుకున్న లుంగీ నీటిలో కాళ్ల మధ్య చిక్కుకోవడంతో ఈత రాక నీటిలో మునిగి మృతిచెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ లచ్చిరెడ్డి తెలిపారు. -
మా నాయకుని గురించి తెలుసుకోవాలని ఉంది
మాగ్రామం లో వీరుడు చింతలపురి రామిరెడ్డి విగ్రహం ఉంది. రజాకార్లకు వ్యతిరేకంగా ఆరోజు వీరోచిత పోరాటం చేసి అమరులయ్యారు. ఆయన సార్మకంగా మా గ్రామంలో విగ్రహం ఏర్పాటు చేశామని మా పెద్దలు చెప్పారు. ప్రజల స్వేచ్ఛా స్వాతంత్య్రాల కోసం ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన గొప్పనాయకుని గురించి తెలుసుకోవాలని ఉంది. –దాసరి రాకేష్ రేణికుంటరజాకార్ల సైన్యానికి వ్యతిరేకంగా పోరాడిన వీరుడు చింతలపురి రామిరెడ్డి. ఆయన గురించి భావి తరాలకు తెలియడానికి గ్రామంలో విగ్రహం ఏర్పాటు చేశారు. పోరాటంలో ప్రాణాలు కూడా వదిలేశారని చెప్పారు.ఇలాంటి నాయకుని గురించి పా ఠ్యాంశాల్లో చేర్చి రేపటి తరాలకు భోదించాలి. –బి. హేమంత్ కుమార్, ఇంటర్ విద్యార్థి, రేణికుంట గ్రామంలో పోరాట వీరుడు రామిరెడ్డి విగ్రహం చూస్తే మాలో చైతన్యం కలుగుతుంది. నిజాం మిలటరీకి వ్యతిరేకంగా ఆయన సాగించిన పోరాటంపై గ్రామంలో ఇప్పటికీ పాటలు పాడుతారు. కథలు కథలుగా చెబుతారు. – బి. సంజీవరెడ్డి -
నయా జమీందారీ శక్తులపై పోరాడాలి
మిర్యాలగూడ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చిన్న, సన్నకారు రైతుల నుంచి బలవంతపు భూసేకరణ చేస్తుందని, ఇటువంటి నయా జమీందారీ శక్తులపై పోరాడాలని అఖిల భారత కిసాన్ సభ(ఏఐకేఎస్) జాతీయ కార్యదర్శి విజ్జు కృష్ణన్ అన్నారు. బుధవారం మిర్యాలగూడ మండలం గూడూరు గ్రామంలో తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవం, నల్లగొండలో జరిగే ఏఐకేఎస్ జాతీయ మహాసభల జయప్రదం కోసం ఫండ్ క్యాంపెయినింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని అమరవీరుల స్థూపాలకు ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి నివాళులర్పించారు. అనంతరం విజ్జు కృష్ణన్ మాట్లాడుతూ.. భూమి, భుక్తి, విముక్తి కోసం నాడు జరిగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ఆదర్శనీయమని అన్నారు. ఈ పోరాట ఫలితంగా 10లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచారని, 4వేల గ్రామ స్వరాజ్యాలు ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా భూసంస్కరణలు, భూదానోద్యమానికి పాలకులు పూనుకోవాల్సిన పరిస్థితిని ఈ పోరాటం కల్పించిందన్నారు. దేశంలోని ఖనిజ సంపదను బడా కార్పొరేట్లకు కేంద్రం కట్టబెడుతుందని ఆరోపించారు. నల్లగొండలో జరిగే అఖిల భారత మహాసభలను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు వెంకట్, పోతినేని సుదర్శన్, తీగల సాగర్, ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, వీరేపల్లి వెంకటేశ్వర్లు, నూకల జగదీశ్చంద్ర, బొగ్గారపు కృష్ణయ్య, వరలక్ష్మి, గోవర్ధన, అరుణ, కౌసల్య తదితరులు పాల్గొన్నారు. రైతు సమస్యలపై ఐక్య పోరాటాలు అవసరం మేళ్లచెరువు : రైతాంగ సమస్యలపై ఐక్య పోరాటాలు అవసరమని అఖిల భారత కిసాన్ సభ(ఏఐకేఎస్)జాతీయ ప్రధాన కార్యదర్శి విజ్జు కృష్ణన్ అభిప్రాయపడ్డారు. బుధవారం చింతలపాలెం మండల కేంద్రానికి వచ్చిన ఆయన గ్రామంలో రైతాంగ పోరాటంలో ప్రాణాలర్పించిన రైతుల స్థూపం వద్దకు చేరుకొని నివాళులర్పించి మాట్లాడారు. భూముల పరిరక్షణ, ఉచిత విద్యుత్, గిట్టుబాటు ధరపై రైతులను సమీకరించి దేశవ్యాప్త ఉద్యమాలు నిర్వహిహిస్తామన్నారు. ఆయన వెంట రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మల్లు నాగార్జునరెడ్డి, పల్లె వెంకట్‌రెడ్డి, వట్టెపు సైదులు, సుందరమౌళేశ్వరరెడ్డి తదితరులు ఉన్నారు. ఫ ఏఐకేఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి విజ్జు కృష్ణన్ -
కార్మికులకు అండగా ఈ–శ్రమ్ ఇన్సూరెన్స్
హుజూర్నగర్ : సంఘటిత, అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న కార్మిక కుటుంబాలకు ఈ–శ్రమ్ ఇన్సూరెన్స్ అండగా నిలుస్తుందని దత్తోపంత్ టెంగడీ నేషనల్ బోర్డు ఫర్ వర్కర్స్ ఎడ్యుకేషన్ అండ్ డెవలప్మెంట్ (డీటీఎన్బీడబ్ల్యూడీ) తెలంగాణ రీజనల్ డైరెక్టర్ ఎంఆర్ దేశ్‌పాండే అన్నారు. బుధవారం జాతీయ కార్మిక విద్యా దినోత్సవాన్ని పురస్కరించుకుని హుజూర్నగర్ పట్టణంలోని పద్మశాలీ భవన్లో ఐఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యరగాని నాగన్నగౌడ్ అధ్యక్షతన కార్మికులకు ఈ–శ్రమ్ ఇన్సూరెన్స్ కార్డులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 18 నుంచి 59 ఏళ్ల లోపు వివిధ రంగాల్లో పనిచేసే కార్మికులందరూ ఈ–శ్రమ్ ఇన్సూరెన్స్ కార్డులు తీసుకోవాలన్నారు. ఈ–శ్రమ్ కార్డు ఉంటేనే మిగతా ఇన్సూరెన్స్‌లు కూడా కార్మిక కుటుంబాలకు సులభంగా అందుతాయన్నారు. కార్మికులకు వారి హక్కులు, చట్టాలు గురించి కార్మిక విద్యాసంస్థల ద్వారా అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. భారత కార్మిక రంగ అభ్యున్నతకై తమ సంస్థ ద్వారా ఎంతగానో కృషి చేస్తున్నామని తెలిపారు. సమావేశంలో వర్కర్స్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మహేశ్వర్ బాబు, సీనియర్ ఆఫీసర్లు సంశీర్, అభిలాష్, నరసింహ, మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్, నాయకులు యరగాని నాగరాజు, యరగాని మురళి, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు బాలకృష్ణ, రాష్ట్ర ప్రచార కార్యదర్శి బంటు చుక్కయ్య, నియోజకవర్గ, మండల నాయకులు బెల్లంకొండ గురవయ్య, అమర్నాథ్రెడ్డి, మేళ్లచెర్వు ముక్కంటి, మద్దం నాగేందర్, ఎస్.జానయ్య, జి.కరుణాకర్‌రెడ్డి, శ్రీనివాస్, కె.రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. ఫ డీటీఎన్బీడబ్ల్యూడీ రీజనల్ డైరెక్టర్ ఎంఆర్ దేశ్‌పాండే -
సబ్ స్టేషన్ ఎదుట రైతుల ఆందోళన
కనగల్ : కనగల్ మండలం తిమ్మన్నగూడెం సబ్‌స్టేషన్ ఎదుట బుధవారం సాయంత్రం రైతులు ఆందోళనకు దిగారు. వారం రోజులుగా విద్యుత్ కోతలు విధిస్తున్నారంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ కోతల కారణంగా పంటలు ఎండిపోతున్నాయన్నారు. రాత్రివేళ కూడా విద్యుత్ కోతలు విధించడంతో పొలాలకు నీరు పారించుకోలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. సమస్యను అధికారులకు తెలియజేసినప్పటికీ పరిష్కారం కాలేదని రైతులు వాపోయారు. సక్రమంగా విద్యుత్ సరఫరా చేసి పంటలను కాపాడాలని డిమాండ్ చేశారు. ఏడీ శ్రీనివాస్, ఏఈ సుధాకర్, ఎస్ఐ రాజీవ్‌రెడ్డి సబ్ స్టేషన్ వద్దకు చేరుకొని రైతులతో మాట్లాడారు. గురువారం నుంచి విద్యుత్ కోతలు లేకుండా చూసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. -
భవనంపై నుంచి పడి కూలీ మృతి
నేరేడుచర్ల : నూతనంగా నిర్మిస్తున్న భవనంపై నుంచి పడి వ్యక్తి కూలీ మృతిచెందాడు. ఈ ఘటన నేరేడుచర్ల మండలం దిర్శించర్ల గ్రామంలో జరిగింది. బుధవారం ఎస్ఐ గోపాల్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. దిర్శించర్ల గ్రామానికి చెందిన పత్తేపురం వెంకటేశ్వర్లు నూతనంగా ఇంటిని నిర్మించుకుంటున్నాడు. అదే గ్రామానికి చెందిన అంతని సావిత్రి(27) అనే వ్యక్తి ఈ నెల 14న వెంకటేశ్వర్లు నిర్మిస్తున్న ఇంటికి సుతారీ పనికి వెళ్లాడు. రెండో అంతస్తు స్లాబ్ వేస్తుండగా సావిత్రి ప్రమాదవశాత్తు భవనంపై నుంచి కిందపడ్డాడు. ఈ ప్రమాదంలో అతడి తలకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి నల్లగొండ ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ అదే రోజు రాత్రి మృతిచెందాడు. మృతుడి తల్లి కోటమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మృతుడు అవివాహితుడు. అతడు తన తల్లి వద్దనే ఉంటూ సుతారీ పనికి వెళ్తూ జీవనం సాగిస్తున్నాడు. మృతుడి అన్న, చెల్లెలు ఇతర ప్రాంతాల్లో ఉంటుండటంతో మృతదేహాన్ని ఆస్పత్రి మార్చురీలోనే ఉంచి బుధవారం అంత్యక్రియల నిమిత్తం స్వగ్రామానికి తరలించారు. అయితే బిల్డింగ్ యాజయాని మొదట ఇస్తానన్న నష్టపరిహారం ఇవ్వనని చెప్పడంతో సావిత్రి మృతదేహంతో నూతనంగా నిర్మిస్తున్న భవనం ఎదుట బుధవారం కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. ఫ మృతదేహంతో కుటుంబ సభ్యుల ధర్నా -
నిర్బంధాలతో ఉద్యమాలను అణచలేదు
భువనగిరిటౌన్ : రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధాలతో కార్మిక ఉద్యమాలను అణచలేదని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వీరయ్య అన్నారు. సీఐటీయూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బుధవారం భువనగిరి జిల్లా కేంద్రంలోని రైతు బజార్ వద్ద జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరసన దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ అంగన్వాడీ, ఆశా, గ్రామ పంచాయతీ కార్మికులు ఆందోళనలు చేస్తుంటే ప్రభుత్వం అణచివేతకు దిగడం దారుణమన్నారు. మహిళలని కూడా చూడకుండా ముందస్తు అరెస్టులు చేయడం, లాఠీచార్జీ లకు పాల్పడటం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమన్నారు. అనంతరం ఇన్చార్జి కలెక్టర్ భాస్కర్ రావు, జిల్లా ఎస్పీ అకాంక్ష యాదవ్‌లకు వినతిపత్రాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి, కల్లూరి మల్లేశం, నాయకులు దాసరి పాండు, ఎం.డి. పాషా, దోనూరి నర్సిరెడ్డి, మాయ కృష్ణ, తుర్కపల్లి సురేందర్, గొరిగే సోములు, సిలివేరు రామకుమారి, చెక్క రమేష్, పైళ్ళ గణపతి రెడ్డి, పొట్ట యాదమ్మ, ఆదిమూలం నందీశ్వర్, మంచాల మధు, తూటి వెంకటేష్, మారయ్య, మెంటే ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు. ఫ సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వీరయ్య -
వృద్ధురాలు అదృశ్యం
వలిగొండ : మండలంలోని రెడ్లరేపాక గ్రామానికి చెందిన 76 ఏళ్ల వృద్ధురాలు ఊదరి నర్సమ్మ అదృశ్యమైంది. ఈ నెల 11న ఆమె ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఎంత వెతికినా నర్సమ్మ ఆచూకీ లభించకపోవడంతో బుధవారం ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. నర్సమ్మ ఆచూకీ తెలిసిన వారు 87126 62484 87126 62810 నంబర్లకు సమాచారం ఇవ్వాలని సూచించారు. గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యంవేములపల్లి : మండలంలోని అన్నపరెడ్డిగూడెం గ్రామ శివారులో సాగర్ ఎడమ కాల్వలో బుధవారం గుర్తుతెలియని మహిళా మృతదేహం లభ్యమైనట్లు ఎస్ఐ డి. వెంకటేశ్వర్లు తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం.. సుమారు 35 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు గల మహిళ మృతదేహం కాల్వలో కొట్టుకొస్తుండగా స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించి మార్చురీలో భద్రపర్చినట్లు ఎస్ఐ తెలిపారు. మృతురాలి వివరాలు తెలిసిన వారు వేములపల్లి పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని లేదా 87126 70190, 87126 70808 నంబర్లకు సమాచారం ఇవ్వాలని సూచించారు. బుజిలాపురంలో వ్యక్తి మృతదేహం లభ్యంమోత్కూర్ : మోత్కూర్ మున్సిపాలిటీ పరిధిలోని బుజిలాపురంలో బుధవారం ఓ వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడు అడ్డగూడూరు మండలం గోవిందపురానికి చెందిన పొట్టపాక మల్లేష్(35)గా గుర్తించారు. మల్లేష్ తన భార్య, కుమారుడితో విడిపోయి సుమారు పదేళ్లుగా ఒంటరిగా జీవిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మద్యానికి బానిసై తరచూ రోడ్లపై తిరుగుతుండేవాడని పేర్కొన్నారు. బుజిలాపురంలో ఉంటున్న తన చిన్నమ్మ గుగ్గిళ్ల ఎల్లమ్మ ఇంటికి అప్పుడప్పుడు వచ్చి వెళ్లేవాడని, మంగళవారం ఉదయం కూడా ఆమె ఇంటికి వచ్చినట్లు తెలిపారు. సరైన ఆహారం తీసుకోకపోవడంతో మల్లేష్ మృతిచెంది ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రామన్నపేట ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. పాత కక్షలతో వ్యక్తిపై దాడికనగల్ : పాత కక్షలతో ఓ వ్యక్తిపై కత్తితో దాడి జరిగింది. కనగల్ ఎస్ఐ రాజీవ్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కనగల్ మండలం బుడుమర్లపల్లి గ్రామానికి చెందిన బొంత అంజయ్యకు అదే గ్రామానికి చెందిన నకిరేకంటి రాములు కుటుంబానికి కొన్నేళ్లుగా బాట పంచాయితీ జరుగుతోంది. ఈ క్రమంలో బుధవారం ఉదయం గ్రామ శివారు వ్యవసాయ భూముల వద్ద రాములు అంజయ్యతో ఘర్షణకు దిగాడు. ఈ సమయంలో చేతిలో ఉన్న కల్లు గీసే కత్తితో అంజయ్యపై రాములు దాడి చేయడంతో అంజయ్య ఎడమ భుజానికి గాయాలయ్యాయి. చుట్టుపక్కల వారు గమనించి 108 వాహనంలో అంజయ్యను నలగొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అంజయ్య భార్య ముత్తమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వివరించారు. -
బిచినేపల్లి ప్రకాష్‌రావు కన్నుమూత
నకిరేకల్ : నకిరేకల్‌కు చెందిన సీపీఎం నాయకుడు బిచినేపల్లి ప్రకాష్‌రావు (85) అనారోగ్యంతో బుధవారం మృతిచెందారు. ప్రకాష్‌రావు మండల పరిషత్ సూపరిండెంట్‌గా పనిచేసి 28 ఏళ్ల క్రితం ఉద్యోగ విరమణ పొందారు. సీనియర్ సిటిజన్స్ డివిజన్ అధ్యక్షుడిగా, లయన్స్ క్లబ్ అధ్యక్షుడిగా కూడా ఆయన పనిచేశారు. ఉద్యగ విరమణ అనంతరం లాయర్‌గా ప్రాక్టీస్ చేయడంతో పాటు సీపీఎంలో కూడా క్రియాశీలకంగా పనిచేశారు. ప్రకాష్‌రావు అంత్యక్రియలు ఆయన స్వగ్రామం మంగళపల్లిలో నిర్వహించారు. ప్రకాష్‌రావు భౌతికకాయానికి సీపీఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి, మాజీ జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు నారి అవిలయ్య, కందాల ప్రమీల, బొజ్జ చినవెంకులు, మాజీ ఎంపీపీ మర్రి వెంకటయ్య, ఆలిండియా బ్లైండ్ డెవలప్మెంట్ అసోసియేషన్(డ్వాబ్) ప్రధాన కార్యదర్శి పొనుగోటి చొక్కారావు, అసోసియేషన్ ప్రతినిధులు తదితరులు నివాళులర్పించారు. నేత్రాలు దానం.. స్థానిక లయన్స్ క్లబ్, నవ్య క్లబ్ ఆధ్వర్యంలో నల్లగొండ లయన్స్ చారిటబుల్ ట్రస్ట్, ఐ డోనేషన్ సెంటర్ డాక్టర్లు వచ్చి ప్రకాష్‌రావు నేత్రాలను సేకరించారు. ఈ క్రార్యక్రమంలో ఆయా క్లబ్‌ల అధ్యక్షులు ఎన్. సూర్యచంద్రరావు, పద్మజ తదితరులు ఉన్నారు. వాచ్యాతండా లిఫ్టుకు రూ.25.20 లక్షలుమిర్యాలగూడ : వాచ్యాతండా లిఫ్టు మరమ్మతులకు రూ.25.20 లక్షలు మంజూరు చేసినట్లు నీటిపారుదల శాఖ డివిజన్ 3, ఈఈ గోపయ్య తెలిపారు. మూసీ నదిపై ఏర్పాటు చేసిన వాచ్యాతండా ఎత్తిపోతల పథకం వద్ద రెండు ట్రాన్స్ఫార్మర్లను దుండగులు ధ్వంసం చేసి కాపర్ వైరు, ఆయిల్ చోరీ చేశారు. జూలై 6న రైతుల ఫిర్యాదు మేరకు వాడపల్లి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. దీనిపై నిరుపయోగంగా వాచ్చాతండా లిఫ్టు శీర్షికన గత నెల 31న ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. రెండు ట్రాన్స్ఫార్మర్లను మరమ్మతు చేసి లిఫ్టును నడిపించేందుకు ఈఎన్సీ నిధులు మంజూరు చేసినట్లు ఈఈ తెలిపారు. -
స్వాతంత్య్ర సమరయోధుడి వందో పుట్టినరోజు వేడుకలు
మర్రిగూడ : మర్రిగూడ మండల కేంద్రానికి చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు పొనుగోటి మాధవరావు 100వ పుట్టినరోజు వేడుకలను బుధవారం ఆయన నివాసంలో గ్రామస్తులు, వివిధ పార్టీల నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. మాధవరావు స్వాతంత్రోద్యమంలో, నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా చేసిన పోరాటం చిరస్మరణీయమని కొనియాడారు. అంతేకాకుండా ఆయన మర్రిగూడకు మూడుసార్లు సర్పంచ్‌గా పనిచేసి అభివృద్ధికి పాటుపడ్డారని అన్నారు. ఈ సందర్భంగా మాధవరావు కేక్‌ను కట్ చేశారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది పొనుగోటి విజయరామారావు, పందుల రాములుగౌడ్, మాజీ సర్పంచ్ నల్ల యాదయ్య, శర్మ, గ్రామస్తులు పాల్గొన్నారు. -
3లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యం
సాక్షి, యాదాద్రి : జిల్లాలో వానాకాలానికి సంబంధించి 3లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఇన్చార్జి కలెక్టర్ భాస్కర్‌రావు తెలిపారు. వానాకాలం 2026–27 ధాన్యం కొనుగోళ్ల ఏర్పాట్లపై మంగళవారం కలెక్టరేట్లో రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకారెడ్డితో కలిసి నిర్వహించిన సమీక్ష సమావేశంలో భాస్కర్‌రావు మాట్లాడారు. జిల్లాలో 325 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. అక్టోబర్ నుంచి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేస్తున్నారని తెలిపారు. అదనపు టార్పాలిన్లు, ఆటోమేటిక్ ప్యాడీ క్లీనర్లు , గ్రెయిన్ కాలిపర్స్ , తేమ యంత్రాలు, ఎలక్ట్రానిక్ వేయింగ్ యంత్రాలు, డ్రయ్యర్స్ అందుబాటులో ఉండాలని సూచించారు. కొనుగోలు చేసిన ధాన్యం నిల్వచేసేందుకు గోదాములను గుర్తించాలన్నారు. ఈ సమావేశంలో డీఆర్డీఓ నాగిరెడ్డి, డీసీఎస్ఓ రోజారాణి , డీఎం హరికష్ణ , డీఏఓ రమణా రెడ్డి పాల్గొన్నారు. 17న ప్రజాపాలన దినోత్సవాన్ని నిర్వహించాలి ఈనెల 17న తెలంగాణ ప్రజా పాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ భాస్కర్ రావు ఆదేశించారు. తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం ఏర్పాట్లపై మంగళవారం కలెక్టరేట్లో రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకా రెడ్డితో కలిసి నిర్వహించిన సమావేశంలో భాస్కర్‌రావు మాట్లాడారు. వేడుకలకు ముఖ్య అతిథిగా శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి హాజరు కానున్నట్లు తెలిపారు. సమావేశంలో డీఆర్ఓ జయమ్మ, డీఆర్డీఓ నాగిరెడ్డి, అడ్మినిస్ట్రేటివ్ అధికారి అంజిరెడ్డి పాల్గొన్నారు. ఫ ఇన్చార్జి కలెక్టర్ భాస్కర్‌రావు -
సాఫ్ట్వేర్ లోపాలు.. ఓటర్లకు తిప్పలు!
సాక్షి, యాదాద్రి: ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో చోటుచేసుకుంటున్న సాంకేతిక లోపాలు, సాఫ్ట్వేర్ అనువాద పొరపాట్లు గ్రామీణ ప్రాంత ప్రజలకు తీవ్ర ఇబ్బందులు సృష్టిస్తున్నాయి. ఊర్లలో ఓటర్లు భౌతిక డిక్లరేషన్ ఫామ్‌లను సరిగ్గా నింపి ఇచ్చినప్పటికీ, సిస్టమ్‌లోని ఆటో–ట్రాన్స్లేషన్ లోపాల కారణంగా వేలాది మందికి నోటీసులు జారీ అవుతుండటం తీవ్ర ఆందోళనకు దారితీస్తోంది. పేర్ల అనువాదంలో దొర్లిన తప్పులు ప్రజలు సర్వే ఫామ్‌లలో తమ పేర్లను తెలుగులో స్పష్టంగా రాసిచ్చినప్పటికీ, పాత రికార్డుల్లోని ఇంగ్లిష్ పేర్లను ఆటోమేటిక్ సాఫ్ట్వేర్ ద్వారా తెలుగులోకి తర్జుమా చేయడం వల్ల తీవ్ర వ్యత్యాసాలు వచ్చాయి. ఇంటిపేర్లు మారడం, పేర్లలో ఒత్తులు, దీర్ఘాలు ఎగిరిపోవడం (ఉదాహరణకు ‘చంద్రయ్య’ అనే పేరులో ‘య’ వత్తు దూరంగా జరగడం) వంటి చిన్న చిన్న తప్పులను కూడా సాఫ్ట్వేర్ తేడాగా గుర్తించి ఆటోమేటిక్‌గా నోటీసులను జనరేట్ చేసింది.అధికారులు క్షేత్రస్థాయిలో సేకరించిన కొత్త భౌతిక డిక్లరేషన్ ఫామ్‌ల డేటాను పక్కనబెట్టి, పాత ఆటోమేషన్ సిస్టమ్‌నే వాడటంతో సమస్య మొదటికి వచ్చింది. క్షేత్రస్థాయిలో సర్టిఫికెట్ల రగడ ఎన్నికల సంఘం ఓటరు గుర్తింపు ధ్రువీకరణ కు 14 రకాల కార్డుల్లో ఒకటి ఆధారంగా చూపవచ్చని తెలిపింది. క్షేత్రస్థాయి అధికారులు మాత్రం కులం సర్టిఫికెట్ తీసుకురావాలని ఒత్తిడి చేస్తుండటంతో కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. 97,102 మందికి నోటీసులు ఆలేరు, భువనగిరి నియోజకవర్గాల వ్యాప్తంగా 4.59 లక్షల మందికి పైగా ఓటర్లున్నారు. వీరిలో 97,102 మందికి నోటీసులు జారీ చేసే ప్రక్రియను ప్రారంభించారు. ఇప్పటివరకు 77,518 మందికి నోటీసులు అందజేశారు.కేవలం 15,000 మందికి మాత్రమే హియరింగ్ ప్రక్రియ పూర్తయ్యింది. సమస్యకు పరిష్కార మార్గాలు పాత ఇంగ్లిష్–తెలుగు ఆటో–ట్రాన్స్‌లేషన్‌ను నిలిపివేసి, ఏఐ ఆధారిత వాయిస్, తెలుగు టైపింగ్ టూల్స్ ద్వారా డేటాను సరిచేయాలి. ఓటర్లు బీఎల్ఓలకు అందించిన భౌతిక డిక్లరేషన్ ఫామ్‌ల ఆధారంగానే సిస్టమ్‌లో మార్పులు చేపట్టాలి. సాఫ్ట్వేర్ పంపే నోటీసులపైనే ఆధారపడకుండా, నిజమైన దొంగ ఓట్లను అరికట్టేందుకు బీఎల్ఓలు, ఉన్నతాధికారులు స్వయంగా క్షేత్రస్థాయి విచారణ జరిపి సవరణలు చేయాలి. ఫ ఆటో–ట్రాన్స్లేషన్ లోపాల వల్ల వేలాది మందికి నోటీసులు ఫ సర్టిఫికెట్ల కోసం మీసేవ కేంద్రాలకు పరుగులు ఫ 97 వేల మందిపై నోటీసుల భారం ఫ భౌతిక డిక్లరేషన్ ఫామ్‌ల ఆధారంగా మార్పులు చేయాలని వినతి -
భక్తులకు ఇబ్బందులు కలగనీయవద్దు
భువనగిరి: నిమజ్జన సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగనీయవద్దని జిల్లా ఎస్పీ అక్షాంశ్ యాదవ్ సూచించారు. మంగళవారం బీబీనగర్ పెద్ద చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్లను ఎస్పీ పరిశీలించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సీఐ ప్రభాకర్‌రెడ్డి, తహసీల్దార్ శ్యామ్ సుందర్‌రెడ్డి, ఎంపీడీఓ శ్రీనివాస్‌రెడ్డి, పీఏసీస్ చైర్మన్ శ్యామ్‌గౌడ్ పాల్గొన్నారు. సాయుధ రైతాంగ పోరాట చరిత్రను వక్రీకరిస్తున్న బీజేపీ భువనగిరిటౌన్ : తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని బీజేపీ, ఆర్ఎస్ఎస్లు హిందూ–ముస్లింల ఘర్షణగా చిత్రీకరిస్తూ చరిత్రను వక్రీకరిస్తున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జహంగీర్ విమర్శించారు. మంగళవారం భువనగిరిలో సీపీఎం నేత సీతారాం ఏచూరి వర్ధంతి సందర్భంగా సెమినార్ నిర్వహించారు. కార్యక్రమంలో కె. నర్సింహ, బట్టుపల్లి అనురాధ, బాలరాజు, బట్టు రామచంద్రయ్య, వెంకటేష్, సురేష్, అనిల్ కుమార్, అంజయ్య, వి.వెంకటేష్ పాల్గొన్నారు. -
యువత చెంతకు కంపెనీలు
ఫ 3,500కు పైగా యువతకు ఉద్యోగావకాశాలు ఫ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్‌రెడ్డి వెల్లడి భానుపురి (సూర్యాపేట) : గ్రామీణ ప్రాంత యువతలో ప్రతిభకు కొదవ లేదని.. ఉపాధి కల్పించే లక్ష్యంతో కంపెనీలను వారి చెంతకు తీసుకొస్తున్నామని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాలశాఖ మంత్రి ఎన్న్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఈ నెల 19న కోదాడలో నిర్వహించనున్న మెగా జాబ్‌మేళా ఏర్పాట్లపై మంగళవారం సూర్యాపేట కలెక్టరేట్లో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. అభ్యర్థుల విద్యార్హత, నైపుణ్యాలకు అనుగుణంగా ఒక్కొక్కరు ఐదు సంస్థల్లో ఇంటర్వ్యూలకు హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కోదాడలో నిర్వహించే జాబ్‌మేళాకు సుమారు 300 కంపెనీలను ఆహ్వానించినట్లు మంత్రి వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం, పరిశ్రమల శాఖ, సింగరేణి సంస్థ సమన్వయంతో ఈ జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జాబ్‌మేళా ద్వారా 3,500 మందికి పైగా యువతకు ఉద్యోగాలు లభించే అవకాశం ఉందని మంత్రి చెప్పారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ముఖ్య అతిథిగా హాజరై ఎంపికై న అభ్యర్థులకు ఆఫర్ లెటర్లు అందజేస్తారని వెల్లడించారు. -
శ్రీనృసింహుడికి శతఘటాభిషేకం
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి జన్మ నక్షత్రం స్వాతిని పురస్కరించుకొని ఆలయంలో శతఘటాభిషేకం పూజను ఆలయ అర్చకులు మంగళవారం పాంచరాత్ర ఆగమశాస్త్రానుసారంగా నిర్వహించారు. వేకువజామునే ఆలయాన్ని తెరచిన అర్చకులు శ్రీస్వామి అమ్మవార్లకు సుప్రభాత సేవను జరిపించి మేల్కొల్పారు. అనంతరం ఆలయ ముఖ మండపంలో స్వాతి హోమంతో పాటు బంగారు, వెండి కలశాలలో నింపిన శుద్ధ జలాలు, సుగ్రంధ పరిమళాలు వెదజల్లే పంచామృతాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం కలశాలతో స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు శతఘటాభిషేకం పూజ చేపట్టారు. అనంతరం సహస్ర నామార్చన, కుంకుమార్చన, ప్రథమ ప్రాకార మండపంలో గజవాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం వంటి పూజలు చేశారు. సాయంత్రం వేళ జోడు సేవలను ఆలయ తిరు, మాడ వీధుల్లో ఊరేగించారు. -
నిలువునా ఎండిపోతున్నాయ్
అడుగంటిన భూగర్భ జలాలకుతోడు విద్యుత్ లోవోల్టేజీ, సరఫరాలో అంతరాయంఈ చిత్రంలోని రైతు సంస్థాన్‌నారాయణపురం మండలం జనగామ గ్రామానికి చెందిన నెల్కంటి బాబు. ఆయన తనకున్న 15 ఎకరాలతోపాటు, మరో ఏడు ఎకరాలు కౌలుకు తీసుకుని మొత్తం 22 ఎకరాలకు 18 ఎకరాల్లో పత్తి సాగు చేశాడు. రెండు ఎకరాలు వరి, ఎకరం కంది, ఎకరం దోస సాగు చేశాడు. ఈ పంటలన్నింటికీ పెట్టుబడిగా సుమారు రూ.5 లక్షల వరకు పెట్టాడు. వర్షాలు పడక పత్తి, కంది చేలు ఎదగలేదు. కరెంట్ కోతలతో వరి, దోస ఎండిపోయింది. సంస్థాన్‌నారాయణపురం మండలం జనగాంలో ఎండిపోయిన పత్తి మొక్కలుఅనాజిపురంలో నెర్రెలు బారిన వరి పొలం సాక్షి, యాదాద్రి: జిల్లాలో బోరు, బావుల ఆధారంగా సాగు చేసిన వరి, వర్షాధారంగా సాగు చేసిన పత్తి చేలు నీరు లేక ఎండిపోతున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఈ వానాకాలం సీజన్లో 2.26 లక్షల ఎకరాల్లో వరి, 1.12 లక్షల ఎకరాల్లో పత్తి, 17 వేల ఎకరాల్లో కంది సాగు చేశారు. విత్తనాలు, కలుపు తీత, మందులు, కూలీలు తదితర ఖర్చుల కోసం రైతులు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టారు. అడుగంటిన భూగర్భ జలాలకు తోడు, లో–వోల్టేజీ, విద్యుత్ సరఫరాలో అంతరాయాలతో చేతికొచ్చే దశలో పంటలు ఎండిపోతున్నాయి. కొన్నిచోట్ల ఎండిపోయిన వరిని పశువులకు మేతగా వదిలేస్తున్నారు. నాన్ ఆయకట్టు ప్రాంతాల్లో.. నాన్ ఆయకట్టు ప్రాంతాల్లో పరిస్థితి దయనీయంగా ఉంది. ఆలేరు, తుంగతుర్తి, భువనగిరి, మునుగోడు నియోజకవర్గాల్లోని మండలాల్లో భూగర్భ జలాలు, వర్షాలపై ఆధారపడి సాగు చేసిన వరి, పత్తి, కంది పంటలతో పాటు కూరగాయలు పంటలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. కాలిపోతున్న స్టార్టర్లు విద్యుత్ సరఫరాలో నిరంతరం ఏర్పడుతున్న హెచ్చుతగ్గులు, సాంకేతిక లోపాల కారణంగా వ్యవసాయ విద్యుత్ మోటార్లు, స్టార్టర్లు కాలిపోతున్నాయి. భువనగిరి మండలం నాగిరెడ్డిపల్లి, గౌస్ నగర్, భువనగిరి తదితర గ్రామాల్లో పదుల సంఖ్యలో స్టార్టర్లు, మోటార్లు కాలిపోతుండటంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక్కో స్టార్టర్, మోటార్ బాక్స్ మరమ్మతు చేయడానికి రూ.5 వేల నుంచి రూ.8 వేల వరకు ఖర్చవుతుండటంతో రైతులపై అదనపు భారం పడుతోంది. సబ్ స్టేషన్ల ఎదుట నిరసనలు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు ప్రతిపక్షాల ఆధ్వర్యంలో సబ్స్టేషన్ల ఎదుట ధర్నాలకు దిగుతున్నారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భువనగిరి మండలం తుక్కాపురం, ఆలేరు మండలం కొలనుపాక, సంస్థాన్ నారాయణపురం, జనగాం సబ్ స్టేషన్ల వద్ద రైతులు ఆందోళనలు చేపట్టారు. అలాగే బీజేపీ ఆధ్వర్యంలో పోచంపల్లి, బీబీనగర్ మండలాల్లో రైతులు ధర్నాలు నిర్వహించారు.ఫ నీరు లేక బీటలు వారుతున్న వరిచేలు ఫ నిలువునా ఎండిపోతున్న పత్తి మొక్కలు ఫ దిక్కుతోచని స్థితిలో రైతులు -
అంజయ్య సంకల్పం.. మట్టి విగ్రహాలు ఉచితం
యాదగిరిగుట్ట రూరల్ : పర్యావరణాన్ని పరిరక్షణే ధ్యేయంగా యాదగిరిగుట్ట మండలం కాచారం గ్రామానికి చెందిన ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, రాష్ట్ర ధార్మిక పరిషత్ చైర్మన్ వంగపల్లి అంజయ్యస్వామి కృషి చేస్తున్నారు. ప్రతి ఏటా మట్టి గణపతులను ఉచితంగా పంపిణీ చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. గత పదేళ్లుగా ఆలేరు నియోజకవర్గంలోని యాదగిరిగుట్ట, ఆలేరు, రాజాపేట మండలాలతో పాటు కొలనుపాక, రాఘవపురం, తూర్పుగూడెం, భువనగిరి ప్రాంతాల్లో ఏటా 1,500 మట్టి విగ్రహాలను సొంత ఖర్చులతో పంచుతున్నారు. ఏపీలోని గుంటూరు జిల్లా పొన్నూరుకు చెందిన కళాకారులను రప్పించి, తన స్వగృహంలోనే ఎలాంటి రసాయనాలు, కృత్రిమ రంగులు వాడకుండా ఈ మట్టి విగ్రహాలను తయారు చేయిస్తున్నారు. గతంలో సాక్షి దినపత్రిక ఆధ్వర్యంలో కూడా అంజయ్యస్వామి ఈ మట్టి విగ్రహాలు పంపిణీ చేశారు. -
హైవేపై పండుగ బారులు
చౌటుప్పల్ : చౌటుప్పల్‌లో హైదరాబాద్– విజయవాడ హైవేపై పండుగ రద్దీ నెలకొంది. హైదరాబాద్ నుంచి చౌటుప్పల్‌కు వచ్చేందుకు సాధారణ సమయాలతో పోలిస్తే శనివారం గంట అదనపు సమయం పట్టింది. తూప్రాన్‌పేట, ధర్మోజిగూడెం, చౌటుప్పల్ ప్రాంతాల్లో అండర్‌పాస్ నిర్మాణ పనులు కొనసాగుతుండడంతో విజయవాడ మార్గం పూర్తిగా ట్రాఫిక్ మయంగా మారింది. ఇదిలా ఉండగా.. లక్కారం శివారులో హైదరాబాద్ వైపు వెళ్తున్న రాజస్తాన్‌కు చెందిన కెమికల్ ట్యాంకర్ ఎయిల్లాక్ అయి ఆగిపోయింది. మరికొద్ది సేపటికే అటుగా వెళ్తున్న డీసీఎం ఇంజిన్‌లో పొగలు రావడంతో నడిరోడ్డులో ఆగిపోయింది. ఒకే చోట రెండు వాహనాలు ఆగడంతో వెనుక వైపు నుంచి వచ్చే వాహనాలు బారులుదీరాయి. -
ఫిన్లాండ్ ఎక్స్పోజర్ విజిట్‌కు ఆలేరు ఉపాధ్యాయుడు
ఆలేరు : ఆలేరు పీఎంశ్రీ జెడ్పీహెచ్ఎస్(బాలుర) పాఠశాల ఉపాధ్యాయుడు సైదులు తెలంగాణ పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘టీచర్స్ ఎక్స్పోజర్ విజిట్ అండ్ ఎడ్యుకేషనల్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్–ఫిన్లాండ్(బ్యాచ్–2)’కు ఎంపికయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 33మంది ఉపాధ్యాయుల్లో ఆయనకు చోటు దక్కింది. విద్యారంగంలో ప్రత్యేక గుర్తింపు పొందిన ఫిన్లాండ్లో అమలవుతున్న ఆధునిక విద్యావిధానాలు, బోధనా పద్ధతులు, పాఠశాలల నిర్వహణ, విద్యార్థి కేంద్రిత బోధన తదితర అంశాలను అధ్యయనం చేయనున్నారు. ఈనెల 26 నుంచి వచ్చే నెల 3వ వరకు ఈ పర్యటన కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. ఫిన్లాండ్లో అమలవుతున్న విద్యావిధానాలను ప్రత్యక్షంగా పరిశీలించి, వాటి ద్వారా పొందిన అనుభవాలను స్థానిక పాఠశాల విద్యకు అన్వయించుకోవడమే ఈ పర్యటన ఉద్దేశమని సైదులు తెలిపారు. పోచంపల్లిని సందర్శించిన బిహార్ ట్రైనీ అధికారులు భూదాన్‌పోచంపల్లి: హైదరాబాద్‌లోని మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల సంస్థలో భారత్ దర్శన్ ప్రోగ్రాంలో పాల్గొన్న 114 మంది బిహార్ రాష్ట్రానికి ట్రైనీ సివిల్ సర్వీసెస్ అధికారుల బృదం శనివారం భూదాన్‌పోచంపల్లిని సందర్శించారు. ఈ సందర్భంగా చేనేత వస్త్రాలు, డిజైన్లను పరిశీలించారు. జిల్లా చేనేత, జౌళిశాఖ ఏడీ శ్రీనివాసరావు.. ఇక్కత్ పరిశ్రమ ప్రాముఖ్యతను వారికి వివరించారు. -
మట్టి మేలు తలపెట్టి
కులవృత్తిపై మమకారం.. పర్యావరణానికి ఉపకారంరాజాపేట : ప్రస్తుత సాంకేతిక యుగంలో యువత చదువు పూర్తిచేసి ఉద్యోగాల వైపు పరుగులు తీస్తుంటే.. ఓ యువకుడు మాత్రం తన కులవృత్తిపై ఉన్న మమకారాన్ని చాటుకుంటున్నాడు. రాజాపేట మండలం కుర్రారం గ్రామానికి చెందిన తరిగొప్పుల భాస్కర్ ఇటు పర్యావరణ హితాన్ని, అటు తన పూర్వీకుల వృత్తిని బతికిస్తూ శభాష్ అనిపించుకుంటున్నాడు. భాస్కర్ తల్లిదండ్రులు మల్లయ్య, లక్ష్మి వ్యవసాయం చేస్తుంటారు. పూర్వీకుల నుంచి వస్తున్న కుమ్మరి వృత్తిని కొనసాగించాలనే ఉద్దేశంతో ఎమ్మెస్సీ చదువుతూనే మట్టి విగ్రహాల తయారీని ఎంచుకున్నాడు భాస్కర్. చెరువులు, కుంటల నుంచి బంకమట్టిని సేకరించి తన స్వగ్రామంలోనే గణనా థులను తయారు చేస్తున్నాడు. రంగులు కూడా సహజ సిద్ధమైనవే వాడుతున్నాడు. మట్టి వినాయకులను తక్కువ ధరలతో అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాడు. అంతేకాకుండా భాస్కర్ యూట్యూబ్‌లో ఫోక్ సాంగ్స్‌కు దర్శకత్వంతో పాటు పొలిటికల్ సాంగ్స్‌కు మ్యూజిక్ డైరెక్టర్‌గా పనిచేసి పలు అవార్డులు కూడా అందుకున్నాడు. ఫ ఎకో–ఫ్రెండ్లీ వినాయకుడికి పెద్దపీట వేస్తున్న పర్యావరణ ప్రేమికులు ఫ పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా అడుగులువినాయక చవితి అనగానే వాడవాడలా వెలిసే మండపాలు, కోలాహలం కళ్ల ముందు కదలాడుతుంది. అయితే పండుగ ఉత్సాహంతో పాటు పర్యావరణ పరిరక్షణ కూడా ఎంతో ముఖ్యమని చాటిచెబుతున్నారు ఉమ్మడి జిల్లా వాసులు. మట్టి గణపతులను ప్రతిష్ఠించడమే కాకుండా.. మట్టి విగ్రహాలను ఉచితంగా పంచుతూ పర్యావరణ పరిక్షణకు పాటు పడుతున్నారు. పర్యావరణ హితంగా వినాయక ఉత్సవాలను జరుపుకుంటున్న వారిపై సాక్షి ప్రత్యేక కథనం.. భువనగిరి : భువనగిరి పట్టణంలోని కిసాన్‌నగర్‌కు చెందిన కిసాన్ యూత్ అసోసియేషన్ ఏర్పడి 48 సంవత్సరాలు అవుతోంది. అప్పటి నుంచి నవరాత్రోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్న యువకులు.. గత 20 సంవత్సరాలుగా కేవలం మట్టి విగ్రహాలనే ప్రతిష్ఠిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణే ప్రధాన ధ్యేయంగా ఒడిశాకు చెందిన కళాకారులతో 30 నుంచి 40 రోజుల పాటు శ్రమించి మండపం వద్దే విగ్రహాన్ని తయారు చేయిస్తారు. మట్టి విగ్రహాల తయారీకి పట్టణ శివారులోని హన్మాపురం చెరువు నుంచి మట్టి తీసుకొస్తారు. మట్టితో పాటు గడ్డిని ఉపయోగించి, సహజ రంగులు అద్దుతారు. దీంతో నిమజ్జనం చేసిన వెంటనే విగ్రహం కరిగిపోతుంది. మట్టితో ఎత్తైన విగ్రహాలను తయారు చేయడం కష్టమనే అపోహలను తొలగిస్తూ.. ఈసారి ఖైరతాబాద్ తరహాలో 26 అడుగుల ఎత్తైన పంచముఖ సంకటహర వినాయక విగ్రహాన్ని తీర్చిదిద్దారు. ఏటా గణనాథుడితో పాటు ఇతర దేవతామూర్తుల ప్రతిమలను కూడా మట్టితోనే రూపొందిస్తారు. ఈసారి మహాకాళి, రుద్రావతారం, సుబ్రహ్మణ్య స్వామి ప్రతిమలను మట్టితోనే సుందరంగా తయారు చేశారు. పర్యావరణ హితం కోసమే మట్టి వినాయక విగ్రహాలను ఏర్పాటు చేస్తూ ఇతర మండపాల నిర్వాహకులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. -
భూ పరిహారం పెంచేలా..
సాక్షి, యాదాద్రి : భూ సేకరణకు ప్రధాన అడ్డంకిగా మారుతున్న భూముల విలువల పెంపు కోసం యంత్రాంగం చర్యలు ప్రారంభించింది. భూమి మార్కెట్ విలువల సవరణ కమిటీ చర్చలు ప్రారంభించింది. వివిధ ప్రాజెక్టులు, కాలువల నిర్మాణానికి భూములిచ్చిన నిర్వాసితులకు న్యాయం చేకూర్చేలా మార్కెట్ విలువు పెంచేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తోంది. భూములు, గజాల విలువ పెంచడం ద్వారా నిర్వాసితులకు అవార్డు, ఆర్బిట్రేషన్‌లో ఎక్కువ పరిహారం ఇచ్చే వీలుంటుంది. ఇప్పటి వరకు వచ్చిన భూసేకరణ నోటిఫికేషన్లకు ఇది వర్తించదు. కొత్తగా వచ్చే భూసేకరణ నోటిఫికేషన్లకు వర్తిస్తుంది. తాజాగా భూముల విలువల పెంపు ప్రభుత్వం వ్యవసాయ, వాణిజ్య భూముల విలువను ఈ సంవత్సరం పెంచింది. గత ప్రభుత్వంలో 2022, 2021, 2015లో భూముల విలువలను సవరించారు. అయితే భూసేకరణ సందర్భంగా పరిహారం తక్కువగా వస్తుందని బాధితులు ఆందోళనలకు దిగుతున్నారు. బహిరంగ మార్కెట్లో రూ.కోట్లు పలుకుతున్న భూములకు రూ.లక్షల్లో పరిహారం ఇవ్వడం అన్యాయమని రైతులు వాపోతున్నారు. దీంతో భూ సేకరణ ప్రక్రియను అడ్డుకోవడంతో ప్రాజెక్టుల పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఈ క్రమంలో కలెక్టర్, రెవెన్యూ అదనపు కలెక్టర్, జిల్లా రిజిస్టార్ల అధ్వర్యంలో భూమి మార్కెట్ విలువ సవరణ కమిటీ (అనామలీ కమిటీ) సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కమిటీ బేసిక్ వాల్యూమీద అదనపు రేట్లు పెంచడానికి నిర్ణియించింది. బాధితులకు భూ సేకరణ పరిహారం మరింత ఇవ్వాలన్నది ప్రభుత్వ లక్ష్యం. అయితే ఎంత పెంచారు అనేది ప్రభుత్వం ఆమోదం పొందిన తర్వాత తెలియనుంది. అనామలి కమిటీ పరిశీలన భూసేకరణ నోటిఫికేషన్ సమయంలో నిర్దేశించిన భూమి విలువ తక్కువగా ఉంటే, ల్యాండ్ అక్విజిషన్ చట్టంలోని నిబంధనల ప్రకారం అనామలి కమిటీ ద్వారా రేట్లను సమీక్షించి, రివైజ్ చేయడానికి అవకాశం ఉంది. ఇక్కడ రేట్లు పెరిగితే దాని ఆధారంగా అవార్డు పాస్ చేసే సమయంలో కమిటీ పెంచిన రేటు ఆధారంగా ఎక్కువ పరిహారం బాధితులకు లభిస్తుంది. భూమి మార్కెట్ విలువలు సవరించిన తర్వాత పెంచిన భూసేకరణ అవార్డు పరిహారం తక్కువని భావిస్తే, బాధితులు ఆర్బిట్రేషన్ కు వెళ్లే అవకాశం ఉంటుంది. కమిటీలో సభ్యులు ఎవరంటే.. భూముల రేట్లను సమీక్షించేందుకు అనామలీ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో గ్రామీణ ప్రాంతాల్లో అదనపు(రెవెన్యూ) కలెక్టర్ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. ఆర్డీఓ, డీఐజీ (రిజిస్ట్రేషన్ల శాఖ), సబ్ రిజిస్ట్రార్, స్థానిక అధికారులు సభ్యులుగా ఉంటారు. అలాగే మున్సిపాలిటీల్లో జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా ఉంటారు. మున్సిపల్ కమిషనర్, హెచ్ఎండీఏ అఅధికారులు, డీఐజీ (రిజిస్ట్రేషన్ల శాఖ), తహసీల్దార్ సంబంధిత అధికారులు సభ్యులుగా వ్యవహరిస్తారు. నోటిఫికేషన్ సమయానికే మార్కెట్ విలువలను పెంచి రివైజ్డ్ రేట్లు అమలు చేయడం ద్వారా పరిహారం పెరిగి బాధితులకు, రైతులకు ఆర్థికంగా న్యాయం జరగనుంది. జిల్లాలో తాజాగా రైల్వే మార్గాల విస్తరణ, రోడ్ల వెడల్పు, ఆధునీరకరణ, సాగునీటి కాలువల భూసేకరణ, ఇంకా వివిధ ప్రాజెక్టులకు మరికొన్ని ప్రజా ప్రయోజనాల కోసం తీసుకునే భూములు, ఓపెన్ ప్లాట్లకు తాజా భూముల సవరణ వర్తిస్తుంది. ఫ భూముల విలువల సవరణకు కార్యాచరణ ఫ కొత్తగా భూ సేకరణకు అడ్డంకులు రాకుండా చర్యలు ఫ రేట్లను సమీక్షించేందుకు అనామలీ కమిటీ ఏర్పాటు ఫ బేసిక్ విలువ పెంపునకు నిర్ణయం రానున్న రోజుల్లో భూసేకరణ సందర్భంగా పరిహారం మరింత పెంచి ఇవ్వాలనే లక్ష్యంతో అనామలి కమిటీ రేట్లను సమీక్షిస్తుంది. నోటిఫికేషన్ వేసే నాటికి ఉన్న రేట్లను పెంచడానికి కమిటీ నిర్ణయించింది. – కె.వెంకారెడ్డి, అదనపు కలెక్టర్ రెవెన్యూ -
పెరిగిన యాదగిరీశుడి హుండీ ఆదాయం
యాదగిరిగుట్ట: శ్రావణ మాసంలో యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ హుండీ ఆదాయం పెరిగింది. శ్రావణ మాసం ప్రారంభమైనప్పటి నుంచి భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు అధికంగా తరలివచ్చారు. దీంతో శ్రీస్వామి వారికి ఈ మాసంలో రూ.12,69, 50,890 ఆదాయం వచ్చినట్లు ఆలయాధికారులు శుక్రవారం వెల్లడించారు. ఇక గతేడాది శ్రావణ మాసంలో రూ.10,27, 06,792 ఆదాయం రాగా.. ఈఏడాది రూ.2, 42,44,098 అధికంగా వచ్చినట్లు తెలిపారు. శ్రావణ మాసంలో వచ్చిన నాలుగు ఆదివారాలతో పాటు వరలక్ష్మీ వ్రతం, ప్రత్యేక సెలవు రోజుల్లో, స్వాతి నక్షత్రం రోజుల్లో భక్తులు శ్రీస్వామిని అధికంగా దర్శించుకున్నట్లు ఆలయాధికారులు పేర్కొన్నారు. రంగాపురం ఉపాధ్యాయుడికి అంతర్జాతీయ గుర్తింపుగరిడేపల్లి: జపాన్‌లో జరిగిన అంతర్జాతీయ విద్యా అధ్యయన పర్యటనలో గరిడేపల్లి మండలంలోని రంగాపురం పాఠశాల ఉపాధ్యాయుడు, ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు చారుగుండ్ల రాజశేఖర్ ఉత్తమ పరిశోధనా పత్రంతో ప్రత్యేక గుర్తింపు పొందారు. సెప్టెంబర్ 5 నుంచి 12 వరకు జరిగిన ఈ పర్యటనలో పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ నవీన్ నికోలస్ నేతృత్వంలో తెలంగాణ నుంచి 29 మంది ఉపాధ్యాయులు, విద్యా నిపుణులు పాల్గొన్నారు. జపాన్‌లోని ప్రముఖ విద్యాసంస్థలను సందర్శించిన ఈ బృందం.. రోబోటిక్స్, సాంకేతిక విద్య, ఉపాధ్యాయుల నైపుణ్యాభివృద్ధి, సీడబ్ల్యూఎస్ఎన్ బోధనా పద్ధతులపై అధ్యయనం చేసింది. ఈ వేదికపై రాజశేఖర్ సమర్పించిన పరిశోధనా పత్రానికి విశేష స్పందన లభించింది. ఆయన ప్రతిభను అభినందిస్తూ జపాన్ విద్యాశాఖ సంచాలకులు డాక్టర్ ఆఖావో చేతుల మీదుగా రాజశేఖర్ ప్రశంసాపత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయనను విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ నవీన్ నికోలస్ ప్రత్యేకంగా అభినందించారు. జాతీయ స్థాయి ‘ప్రేరణ’కు కల్మల్ చెరువు విద్యార్థిగరిడేపల్లి: సూర్యాపేట జిల్లా విద్యా రంగానికి సంబంధించి కల్మల్ చెరువు విద్యార్థి అరుదైన ఘనత సాధించాడు. గరిడేపల్లి మండలం కల్మల్ చెరువు జెడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన 10వ తరగతి విద్యార్థి గుండెబోయిన శ్రీరామ్.. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జాతీయ స్థాయి శ్రీప్రేరణశ్రీ (అనుభవాత్మక విద్యా కార్యక్రమం)కు ఎంపికయ్యాడు. 2025 నవంబర్‌లో జవహర్ నవోదయ విద్యాలయంలో నిర్వహించిన జిల్లా స్థాయి ప్రేరణ ఉత్సవ్‌లో శ్రీరామ్ తన సృజనాత్మకత, నాయకత్వ లక్షణాలు, ప్రతిభతో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి జాతీయ స్థాయికి అర్హత సాధించినట్లు జిల్లా నోడల్ నవోదయ ప్రిన్సిపాల్ ఆదినారాయణ ప్రకటించారు. గుజరాత్‌లోని వాద్నగర్లో ఉన్న ‘ది వెర్నాక్యులర్ స్కూల్’లో (ప్రధాని మోదీ చదివిన పాఠశాల) 2026 నవంబర్ 15 నుంచి 21 వరకు జరిగే రెసిడెన్షియల్ శిక్షణలో శ్రీరామ్ పాల్గొననున్నాడు. 13 మంది యువకుల బైండోవర్హుజూర్నగర్ : వినాయక చవితి ఉత్సవాల నిర్వహణ గురించి జరిగిన గొడవలో ఇరువర్గాలకు చెందిన 13 మంది యువకులను బైండోవర్ చేసినట్లు ఎస్ఐ నరేష్ శుక్రవారం తెలిపారు. హుజూర్‌నగర్‌లోని పీర్లకొట్టం వద్ద నిమ్మతోట బజారులో ఇరువర్గాలకు చెందిన 13మంది యువకుల మధ్య ఉత్సవ నిర్వహణపై గొడవ జరిగింది. దీంతో వారిని స్థానిక తహసీల్దార్ సమక్షంలో వారిని బైండోవర్ చేసినట్లు పేర్కొన్నారు. -
నిందితులను అరెస్ట్ చేయాలి
మర్రిగూడ : విద్యార్థిని మౌనిక ఆత్మహత్యకు కారణమైన నిందితులను అరెస్ట్ చేసి తమ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బాధిత కుటుంబసభ్యులు, బంధువులు, గ్రామస్థులు శుక్రవారం మర్రిగూడ పోలీస్‌స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. మండల పరిధిలోని లెంకలపల్లి గ్రామానికి చెందిన డిగ్రీ మొదటి సంవత్సరం విద్యార్థిని వరికుప్పల మౌనిక ఈ నెల 2న తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గ్రామానికి చెందిన ఇద్దరి వేధింపుల కారణంగానే మౌనిక మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుందని కుటుంబసభ్యులు ఆరోపించారు. బాలిక రాసిన సూసైడ్ నోట్‌ను కూడా పోలీసులకు అందజేశామని తెలిపారు. ఘటన జరిగిన రోజే మౌనిక తండ్రి శ్రీనివాస్ ఫిర్యాదు చేసినప్పటికీ, నిందితులను అరెస్ట్ చేయకుండా పోలీసులు కాలయాపన చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసు ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపి నిందితులపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. -
ఆదర్శమూర్తి వినోబాభావే
ఫ గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ రాష్ట్ర అధ్యక్షుడు గున్నా రాజేందర్‌రెడ్డి భూదాన్‌పోచంపల్లి : భూదానోద్యమానికి ఆద్యుడైన ఆచార్య వినోబాభావే ప్రతిఒక్కరికీ ఆదర్శమూర్తని గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ రాష్ట్ర అధ్యక్షుడు గున్నా రాజేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం వినోబాభావే జయంతిని పురస్కరించుకుని పోచంపల్లిలోని టూరిజం పార్కు ఆవరణలో ఉన్న ఆయన కాంస్య విగ్రహానికి మున్సిపల్ చైర్మన్ తడక వెంకటేశ్వర్లుతో కలిసి ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వినోబాభావే దేశవ్యాప్తంగా పాదయాత్ర చేసి 44 లక్షల ఎకరాల భూమిని సేకరించి పేదలకు పంచిపెట్టారన్నారు. కార్యక్రమంలో వినోబాభావే సేవా సమితి నాయకులు ఏలే భిక్షపతి, కొయ్యడ నర్సింహ, వేశాల మురళి, చింతకింది రమేశ్, భారత భూషణ్, భారత భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
కాలుష్య కోరల్లో మూడు గ్రామాలు
బొమ్మలరామారం : బొమ్మలరామారం మండలంలోని రంగాపూర్ గ్రామ సమీపంలో ఉన్న ‘ఎన్‌అండ్‌ఎన్’ టైర్ కంపెనీ వెదజల్లుతున్న కాలుష్యంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. గ్రామానికి అర కిలోమీటర్ దూరంలో ఏర్పాటు చేసిన టైర్ల కంపెనీ నుంచి ప్రజారోగ్యానికి హానికరమైన కాలుష్యాన్ని విడుదల చేస్తోంది. ఈ కంపెనీని మూసేయాలని ఇటీవలే రంగాపూర్‌తో పాటు కాలుష్యం బారిన పడుతున్న పెద్ద పర్వతాపూర్, బొమ్మలరామారం గ్రామాల ప్రజలు అఖిల పక్షం ఆధ్వర్యంలో ధర్నాలు చేసి అధికారులకు వినతిపత్రాలు ఇచ్చినా ఎలాంటి స్పందన లేదు. ఆందోళనలు చేపట్టినా.. కాలుష్యాన్ని వెదజల్లుతున్న టైర్ల కంపెనీని మూసివేయాలని గతంలో ఉన్న కలెక్టర్ హనుమంతరావు, కాలుష్య నియంత్రణ మండలి, మండల అధికారులకు ప్రజలు ఎన్నో వినతులు సమర్పించారు. రంగాపూర్ గ్రామ పంచాయతీలో గతనెల 4న ఏకగ్రీవ తీర్మానం కూడా చేశారు. దీనికితోడు గతనెల 11న రంగాపూర్, పెద్ద పర్వతాపూర్, బొమ్మలరామారం ప్రజలు అఖిల పక్షం ఆధ్వర్యంలో టైర్ల కంపెనీ ఎదుట ధర్నా, నిరసనలు చేపట్టారు. గతనెల 14న ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య సైతం టైర్ల కంపెనీని పరిశీలించి ప్రజారోగ్యానికి ముప్పు ఉందని గమనించారు. ఫ్యాక్టరీని మూసేయాలని జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. కనీసం జిల్లా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు కంపెనీ వైపు కన్నెత్తి చూడడం లేదు. జనావాసాల్లోకి కాలుష్యం టైర్ల రీసైక్లింగ్ కంపెనీ నుంచి జనావాసాల్లోకి వదులుతున్న పొగతో గాలిలో కార్బన్ డైయాక్సడ్ పెరిగి ఆక్సిజన్ స్థాయి పడిపోయి కళ్లు మండడంతో పాటు ప్రజలు ఊపిరి కూడా పీల్చుకోలేకపోతున్నారు. ఫలితంగా శ్వాస సంబంధిత సమస్యతో పాటు గుండె, ఊపిరితిత్తులు పాడవడం, జలుబు, ఎలర్జీ లాంటి అనారోగ్యం బారిన పడుతున్నామని ఆయా గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సమీపంలోని కూరగాయల పంటలపై నల్లటి బొగ్గులాంటి పదార్థం పేరుకుపోతుందని రైతుల వాపోతున్నారు. కంపెనీపై విచారణ జరిపి మూసివేయాలని బా ధిత గ్రామాల ప్రజల డిమాండ్ చేస్తున్నారు. ప్రజల నుంచి ఫిర్యాదులు అందాయి. ఈ మేరకు రంగాపూర్ గ్రామ సమీపంలోని కాలుష్యం వెదజల్లుతున్నట్లు ఎన్‌అండ్‌ఎన్ టైర్ల కంపెనీపై త్వరలోనే చర్యలు తీసుకుంటాం. ఎలాంటి చర్యలు తీసుకుంటున్నామో.. ఎన్ని రోజుల్లో అమలు చేస్తామనే వివరాలు తెలుసుకునేందుకు ఆర్టీఐ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. – వెంకన్న, జిల్లా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారియాదగిరిగుట్ట : పలు గ్రామాల ప్రజలకు ఇబ్బందులు కలిగేలా ఉన్న బొమ్మలరామారం మండలం రంగాపూర్‌లోని టైర్ల పరిశ్రమపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అసెంబ్లీ వేదికగా కోరారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శుక్రవారం ఆయన మాట్లాడుతూ టైర్ల పరిశ్రమ నుంచి వెలువరించి పొగ కాలుష్యం వల్ల రంగాపూర్పాటు చుట్టుపక్కల గ్రామాల్లో ప్రజలు తీవ్ర అనారోగ్యాలకు గురవుతున్నారని పేర్కొన్నారు. టైర్ల పరిశ్రమలో తనిఖీలు చేసి, కాలుష్య నియంత్రన నిబంధనలు పాటిస్తున్నాయా లేదా అనే అంశాలను పరిశీలించాలన్నారు. అలాగే తుర్కపల్లి మండలంలో ఐటీ పార్క్‌ను ఏర్పాటు చేసిన నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఐటీ పార్క్ ఏర్పాటు కోసం 110 ఎకరాల భూమిని ఇప్పటికే సేకరించడం జరిగిందని తెలిపారు. ఫ ఎన్‌అండ్‌ఎన్ టైర్ల కంపెనీతో కాలుష్యం ఫ అనారోగ్యం బారిన ప్రజలు ఫ మూసేయాలని రంగాపూర్ పంచాయతీ తీర్మానం ఫ మరో రెండు గ్రామాల ప్రజలూ ఆందోళనబాట -
పెండింగ్ డీఏ, టీఏలు క్లియర్ చేస్తామని మంత్రి హామీ
నల్లగొండ : అన్నెపర్తిలోని 12వ బెటాలియన్ కమాండెంట్ బి.రామకృష్ణ శుక్రవారం హైదరాబాద్‌లో రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని కలిసి మొక్కను అందజేశారు. పోలీసు సిబ్బందికి పెండింగ్‌లో ఉన్న డీఏలు, టీఏలు, సరెండర్ లీవ్‌ల బకాయిలను అతి త్వరలోనే క్లియర్ చేయనున్నట్లు మంత్రి ఆయనకు హామీ ఇచ్చారు. ఉపేందర్‌కు సేవా రత్న అవార్డు నల్లగొండ టూటౌన్ : తెలంగాణ సాంస్కృతిక శాఖ సౌజన్యంతో జి.సి.ఎస్.వల్లూరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో నిర్వహించిన తెలంగాణ లిబరేషన్ డే అవార్డుల కార్యక్రమంలో అడవిదేవులపల్లి మండలం చిట్యాల ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు నాగవెల్లి ఉపేందర్ ‘మౌలానా అబుల్ కలాం సేవా రత్న’అవార్డు అందుకున్నారు. కరోనా కాలంలో పేదలు, కులవృత్తుల వారికి నిత్యావసర సరుకులు అందజేయడం లాంటి సామాజిక కార్యక్రమాలు చేసినందుకు ఉపేందర్ రాజ్యసభ ఎంపీ ఆర్.కృష్ణయ్య, ఎమ్మెల్సీ కోదండరామ్, మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాలచారి, మాజీ మంత్రి బాబుమోహన్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. -
నాణ్యమైన విద్యనందించాలి
అడ్డగూడూరు : విద్యార్ధులకు నాణ్యమైన విద్యతోపాటు మౌలిక వసతులు కల్పించాలి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు అన్నారు. శుక్రవారం అడ్డగూడూరు మండలం కంచనపల్లిలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం ((కేజీబీవీ)ను ఆయన తనిఖీ చేశారు. విద్యార్థినులకు అందున్న విద్య, వసతుల గురించి ఆరా తీశారు. విద్యార్థినుల సామర్థ్యాలను పరీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడారు. విద్యార్థినులు ఆరోగ్యం,భ భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఆయన వెంట పాఠశాల ఎస్ఓ పద్మ, ఉపాధ్యాయులు ఉన్నారు. -
పెసర, మినుము సాగుకు అనువైన సమయమిదే..
గరిడేపల్లి: యాసంగి సీజన్లో పెసర, మినుము పంటలను సాగు చేసేందుకు ప్రస్తుతం అనువైన సమయమని కేవీకే గడ్డిపల్లి మృత్తిక శాస్త్రవేత్త అరిగెల కిరణ్‌కుమార్ తెలి పారు. తేమను నిల్వ ఉంచే అన్ని రకాల భూముల్లో పెసర సాగు చేసుకోవచ్చని, మినుము సాగుకు నల్లరేగడి నేలలు అత్యంత అనుకూలమని, చౌడు నేలలు, మురుగు నీరు నిలిచే భూములు ఈ పంటల సాగుకు అనుకూలం కాదని పేర్కొన్నారు. పెసర, మినుము సాగులో రైతులు పాటించాల్సిన సస్యరక్షణ చర్యలు, విత్తనశుద్ధిపై పలు సలహాలు, సూచనలు ఆయన మాటల్లోనే. సెప్టెంబర్ 15 నుంచి విత్తుకోవచ్చు యాసంగిలో పెసర, మినుము పంటలను సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ వరకు విత్తుకోవచ్చు. పెసరలో డబ్ల్యూజీజీ– 42 (యాదాద్రి), ఎంజీజీ– 295, డబ్ల్యూఆర్‌జీ– 37 రకాలు అనుకూలంగా ఉంటాయి. ఇవి 60 నుంచి 65 రోజుల పంట కాలాన్ని కలిగి ఉండి ఎకరానికి సుమారు 4 నుంచి 6 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. మినుములో మధిర మినుము–01 (ఎంబీజీ–1070), ఎల్బీజీ–752, ఎల్బీజీ– 20, ఎంబీజీ– 207, పీయూ–31 రకాలను సాగు చేసుకోవచ్చు. ఈ రకాలు 70 నుంచి 85 రోజుల పంటకాలాన్ని కలిగి ఉండి ఎకరానికి 4 నుంచి 6 క్వింటాళ్ల వరకు దిగుబడి ఇచ్చే అవకాశం ఉంది. విత్తనశుద్ధితో పురుగుల నివారణ ఎకరాకు 6 నుంచి 8 కిలోల విత్తనం అవసరమవుతుంది. కిలో విత్తనానికి 5 గ్రాముల ఇమిడాక్లోప్రిడ్ లేదా 5 గ్రాముల థయోమిథాక్సామ్‌తో విత్తనశుద్ధి చేయడం ద్వారా సుమారు 15 నుంచి 20 రోజుల వరకు రసం పీల్చు పురుగుల నుంచి పంటను రక్షించుకోవచ్చు. పొలంలో మొదటిసారిగా ఈ పంటలను సాగు చేస్తున్న రైతులు విత్తనాలకు రైజోబియం కల్చర్‌ను పట్టించాలి. ఎకరాకు అవసరమైన విత్తనాలకు 200 గ్రాముల రైజోబియం కల్చర్‌ను బాగా కలిపి, నీడలో ఆరబెట్టి విత్తుకోవాలి. ముందుగా శిలీంధ్రనాశక మందుతో విత్తనశుద్ధి చేసి, ఆరబెట్టిన తర్వాతే రైజోబియం కల్చర్‌ను విత్తనాలకు పట్టించాలి. రైతులు పంట సాగులో సమగ్ర సస్యరక్షణ విధానాలను పాటించాలి. సరైన సమయంలో విత్తడం, నాణ్యమైన విత్తనాలను ఎంపిక చేసుకోవడం, విత్తనశుద్ధి చేయడం, అవసరమైన సస్యరక్షణ చర్యలు చేపట్టడం ద్వారా పంటలో చీడపీడలను సమర్థంగా నియంత్రించి అధిక దిగుబడులు పొందవచ్చు. ఫ పంట సాగులో విత్తనశుద్ధి, సస్యరక్షణ చర్యలపై కేవీకే శాస్త్రవేత్త సూచనలు -
కఠోర సాధన
ఖాకీ కొలువుకుపోలీస్ ఉద్యోగమే లక్ష్యంగా శ్రమిస్తున్న యువత ఫ మైదానాల్లో ప్రాక్టీస్ ఫ గ్రంథాలయాల్లో ప్రిపరేషన్రామగిరి (నల్లగొండ): పోలీసు ఉద్యోగాల నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో నల్లగొండ జిల్లాలో అర్హులైన అభ్యర్థులు పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. నిరుద్యోగ యువత ఖాకీ చొక్కా ధరించడమే లక్ష్యంగా ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తున్నారు. అభ్యర్థులతో నిండిపోతున్న లైబ్రరీలు యువతీ యువకులు నల్లగొండలోని ఎన్జీ కళాశాల ఆవరణతోపాటు, క్రీడా మైదానాలకు వేకువజామునే వచ్చి రన్నింగ్, లాంగ్‌జంప్, షాట్‌పుట్ ప్రాక్టీస్ చేస్తున్నారు. శరీర దారుఢ్యాన్ని పెంపొందించుకుంటూ ఫిజికల్ ఈవెంట్లలో అత్యుత్తమ మార్కులు సాధించడమే లక్ష్యంగా సన్నద్ధమవుతున్నారు. మరోవైపు జిల్లా కేంద్ర గ్రంథాలయం, ప్రైవేట్ స్టడీ హాళ్లు, కోచింగ్ సెంటర్లు అభ్యర్థులతో నిండిపోతున్నాయి. ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలకు సిద్ధమవుతూ అభ్యర్థులు గంటల తరబడి పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. వయోపరిమితి పెంపుతో.. పోలీసు నియామకాలకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వేలాది మంది అభ్యర్థులకు ఊరటనిచ్చింది. గతంలో ఎస్సై ఉద్యోగాలకు వయోపరిమితి 32 ఏళ్లు, కానిస్టేబుళ్లకు 29 ఏళ్లుగా ఉండేది. ఈ వ్యత్యాసంపై అభ్యంతరాలు రావడంతో స్పందించిన ప్రభుత్వం కానిస్టేబుల్ పోస్టులకు కూడా వయోపరిమితిని మరో మూడేళ్లు పెంచుతూ జీవో విడుదల చేసింది. ఈ సడలింపు సివిల్, ఏఆర్, ఫైర్, జైళ్లు, ఎస్పీఎఫ్ విభాగాల్లోని కానిస్టేబుల్ పోస్టులకు వర్తిస్తుంది. దీంతో చివరి అవకాశంగా భావిస్తున్న వందలాది మంది సీనియర్ అభ్యర్థులకు మళ్లీ ఆశలు చిగురించాయి. -
నేటి నుంచి సెలవులో కలెక్టర్
ఫ ఇన్చార్జి కలెక్టర్‌గా భాస్కర్‌రావు సాక్షి, యాదాద్రి : జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి శనివారం ఈనెల 28వ తేది వరకు సెలవుపై వెళ్లారు. తన వ్యక్తిగత పనులపై ఆయన సెలవులో వెళ్తున్నారు. కాగా జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఏ.భాస్కర్‌రావు పూర్తి అదనపు బాధ్యతలతో ఇన్చార్జి కలెక్టర్‌గా వ్యవహరిస్తారు. చాకలి ఐలమ్మ స్ఫూర్తితో పోరాడాలిభువనగిరి : చాకలి ఐలమ్మ, జెన్‌జీ స్ఫూర్తితో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలబిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలపై పోరాడాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు శనిగారపు రజనీకాంత్ అన్నారు. భువనగిరి పట్టణంలోని వెన్నెల కళాశాలలో జరుగుతున్న ఎస్ఎఫ్ఐ రాష్ట్ర గర్ల్స్ శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నూతన విద్య విధానం తేవడం పేద వర్గాలకు ఉన్నత విద్యను దూరం చేయడమేనన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లను విడుదల చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర గర్ల్స్ కన్వీనర్ మేడబోయిన మమత, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి లావుడియా రాజు, రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కల్లూరి మల్లేశం,ఐద్వా జిల్లా కార్యదర్శి బట్టుపల్లి అనురాధ, ఎస్ఎఫ్ఐ జిల్లా మాజీ కార్యదర్శి వనం రాజు,రాష్ట్ర అఫీస్ బేరర్స్ దీపిక, సుమ, నాయకులు వేముల నాగరాజు,ఇందురాణి, ఈర్ల రాహుల్, పుట్టల ఉదయ్, జగన్, నేహల్, నరేందర్, కార్తీక్, ప్రసన్న పాల్గొన్నారు. డీవైఎఫ్ఐ జిల్లా నూతన కార్యవర్గం ఎన్నికఫ అధ్యక్షుడిగా కవిడే సురేష్, కార్యదర్శిగా బుర్రు అనిల్ కుమార్ భువనగిరిటౌన్, చౌటుప్పల్ : డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డీవైఎఫ్ఐ) జిల్లా నూతన కార్యవర్గాన్ని చౌటుప్పల్‌లో నిర్వహించిన ఆ సంఘం జిల్లా 3వ మహాసభల్లో ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు ఆ సంఘం నాయకులు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లా అధ్యక్షుడిగా కవిడే సురేష్, కార్యదర్శిగా బుర్రు అనిల్ కుమార్, ఉపాధ్యక్షులుగా వనం రాజు, ఎండీ ఖాయం, శానుగొండ రాము, పల్లె శివ, దొంతగాని అమరేందర్, సహాయ కార్యదర్శులుగా పల్లె మధుకృష్ణ, ఎండీ సలీం, చుక్క రజినీకాంత్, మొంగాడి పృథ్వీతోపాటు మొత్తం 33మందితో కమిటీ ఎన్నికై ంది. ఇందులో 11 మందితో ఆఫీస్ బేరర్స్ కమిటీ ఏర్పాటైంది. నూతన కార్యవర్గానికి పలువురు నాయకులు అభినందనలు తెలిపారు. జాతీయ రహదారిపై వాహనాల బారులుచౌటుప్పల్ : హైదరాబాద్–విజయవాడ జాతీ య రహదారిపై శుక్రవారం వాహనాల రద్దీ ఏర్పడింది. వరుస సెలవుల నేపఽథ్యంలో ఈ రద్దీ నెలకొంది. వీకెండ్, వరుస సెలవులు, వినాయక చవితి వేడుకలు ఉండడంతో ప్రజలు వివిధ ప్రాంతాలకు ప్రయాణాలను ప్రారంభించారు. దీంతో జాతీయ రహదారిపై వాహనాలు బారులుదీరాయి. విపరీతమైన రద్దీ కారణంగా వాహనాలు బంపర్ టు బంపర్‌గా ముందుకు సాగాయి. ప్రధానంగా విజయవాడ మార్గంలో రద్దీ అత్యధికంగా కొనసాగుతుంది. సాధారణ రోజులతో పోలిస్తే రద్దీ కారణంగా హైదరాబాద్ నుంచి చౌటుప్పల్‌కు చేరుకునేందుకు సుమారుగా రెండింతల సమయం పడుతోంది. ట్రాఫిక్ మూలంగా అటు వాహనదారులు, ఇటు ప్రయాణికులు నానా అవస్థలకు గురయ్యారు. పట్టణంలో రోడ్డు నిర్మాణ పనులు సాగుతుండడంతో వాహనాలు సర్వీస్ రోడ్ల మీదుగా వెళ్తున్నాయి. ఈ క్రమంలో పట్టణవాసులు తీవ్ర ఇబ్బందులకు గురికావాల్సి వస్తుంది. -
మళ్లీ అవకాశం వచ్చింది
గతంలో నాలుగు సార్లు పోలీసు పరీక్షలు రాశాను. ప్రతిసారీ మెయిన్స్‌లో కొద్దిపాటి మార్కులతో ఉద్యోగం చేజారింది. ప్రభుత్వం వయోపరిమితి పెంచడంతో నాకు ఇది ఐదో అవకాశం లభించింది. లేకపోతే నా వయస్సు దాటిపోయేది. ఈసారి ఎలాగైనా ఖాకీ చొక్కా తొడగాలనే పట్టుదలతో చదువుతున్నాను. – సింగారపు జానయ్య ఇంతకుముందు ఒకసారి పరీక్ష రాసినా సెలెక్ట్ కాలేకపోయాను. దాంతో విసిగిపోకుండా గత ఏడాది కాలంగా తీవ్రంగా శ్రమిస్తున్నాను. లోపాలను సరిదిద్దుకుంటూ ఈసారి కచ్చితంగా ఉద్యోగం సాధిస్తాననే నమ్మకం ఉంది. – సంపంగి శివ గతంలో ప్రిలిమ్స్, ఫిజికల్ ఈవెంట్లలో క్వాలిఫై అయినా మెయిన్స్ పరీక్షలో తడబడ్డాను. ఈసారి మెయిన్స్‌లో ఎక్కువ మార్కులు సాధించేందుకు సబ్జెక్టుల వారీగా ప్రత్యేక షెడ్యూల్ వేసుకుని చదువుతున్నాను. – రిషిత గత ఐదేళ్లుగా వివిధ కాంపిటేటీవ్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నాను. పోలీసు మెయిన్స్‌లో మ్యాథ్స్ విభాగం కీలకం కాబట్టి, ఆన్లైన్ కోచింగ్ ద్వారా క్లిష్టమైన లెక్కలను తక్కువ సమయంలో చేసే షార్ట్‌కట్ పద్ధతులు నేర్చుకున్నాను. – అన్షూ ఇది నాకు రెండో ప్రయత్నం. జిల్లా కేంద్ర గ్రంథాలయానికి ప్రతిరోజూ వచ్చి సొంతంగా నోట్స్ తయారు చేసుకుంటున్నాను. మెయిన్స్‌లో మంచి స్కోర్ సాధించడానికి ఆన్లైన్ కోచింగ్ క్లాసులు కూడా ఉపయోగించుకుంటున్నాను. – హరీష్ బీటెక్ మూడో సంవత్సరం చదువుతూనే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్షకు సిద్ధమవుతున్నాను. రాతపరీక్షకు సొంతంగా ప్రిపేర్ అవుతూ, రోజువారీ ఫిజికల్ ప్రాక్టీస్ కోసం క్రమం తప్పకుండా గ్రౌండ్‌కు వస్తున్నాను. – వాత్సల్యత -
నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలి
సంస్థాన్ నారాయణపురం : వ్యవసాయానికి నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులు, వ్యవసాయ కూలీలు శుక్రవారం సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో రాస్తారోకో నిర్వహించారు. అనంతరం విద్యుత్ శాఖ కార్యాలయం ముందు మహాధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు, సర్పంచుల ఫోరం రాష్ట్ర జేఏసీ మాజీ అధ్యక్షుడు సుర్వి యాదయ్యగౌడ్ మాట్లాడుతూ లోవోల్టేజ్ సమస్యలు ఉన్న ప్రాంతాల్లో కొత్త ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ట్రాన్స్‌కో ఏఈ దివ్యకు అందజేశారు. కార్యక్రమంలో తెలంగాణ భిక్షం, చిలువేరు భిక్షపతి, బొడ్డుపెళ్లి గాలయ్య, జక్కిడి యాదిరెడ్డి, ఉపల ఆంజనేయులు, పాలకూర్ల సతీష్ గౌడ్, డాక్టర్ ఎర్రోళ్ల లింగస్వామి, రాసాల వెంకటేశం, చిలువేరు శంకర్, ఎడ్ల సత్తయ్య యాదవ్, ఎర్రోళ్ల వెంకటేష్, చిలువేరు వెంకటేశం, బి.రమేష్ గౌడ్, పవన్ కళ్యాణ్, జగ్గు, వెంకటేశం పాల్గొన్నారు. -
5 రోజుల పనిదినాలు అమలు చేయాలి
భువనగిరిటౌన్ : యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్‌బీయూ) ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం జిల్లా వ్యాప్తంగా చేపట్టిన బ్యాంకు ఉద్యోగుల సమ్మె విజయవంతమైంది. ఈ సందర్భంగా భువనగిరి పట్టణంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకు రీజినల్ ఆఫీస్ నుంచి పాత బస్టాండ్ మీదుగా వినాయక చౌరస్తా వరకు ఉద్యోగులు భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో జిల్లా బ్యాంకు ఉద్యోగుల సమాఖ్య జిల్లా కార్యదర్శి కె.సురేష్ మాట్లాడారు. బ్యాంకింగ్ రంగంలో చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న 5 రోజుల పనిదినాలను ప్రభుత్వం వెంటనే అమల్లోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకపోతే 28, 29, 30 తేదీల్లో దేశవ్యాప్త సమ్మె చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ ఉద్యోగుల సమాఖ్య ఆఫీసర్స్ అసోసియేషన్ సీసీ సభ్యుడు ఈ.రఘు, కెనరా, యూనియన్, తెలంగాణ గ్రామీణ బ్యాంకులతోపాటు, నల్లగొండ డీసీసీబీ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. మూడు రోజులు బ్యాంకు సేవలకు విరామమే.. జిల్లా వ్యాప్తంగా బ్యాంకులకు వరుసగా సెలువు వచ్చాయి. శుక్రవారం బ్యాంకు ఉద్యోగుల సమ్మెతో సేవలు నిలిచిపోయాయి. ఇక, రెండో శనివారం, ఆదివారం, సోమవారం (వినాయక చవితి) కావడంతో బ్యాంకులకు వరుస సెలవులు వచ్చాయి. దీంతో సోమవారం వరకు బ్యాంకు లావాదేవీలకు విరామం కలగనుంది. దీంతో ఏటీఎంలలో నగదు కొరత ఏర్పడే అవకాశం ఉండడంతో ఖాతాదారులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ మూడు రోజులు ఆన్లైన్ సేవలు ప్రత్యామ్నాయం కానున్నాయి. అయితే చెక్కుల క్లియరెన్స్, డీడీల చెల్లింపులు, పెద్ద మొత్తంలో నగదు డిపాజిట్లు, విత్‌డ్రాల వంటి కార్యకలాపాలు బ్యాంకులు తిరిగి తెరిచే వరకు నిలిచిపోనున్నాయి. ఫ డిమాండ్లు నెరవేర్చాలని బ్యాంకు ఉద్యోగుల సమ్మె -
సౌత్ ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్‌కు ఆతిథ్యం ఇవ్వనున్న ఎంజీయూ
నల్లగొండ టూటౌన్ : సౌత్ ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ 45వ సెషన్‌కు ఎంజీయూ ఆతిథ్యం ఇవ్వనున్నట్లు వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ తెలిపారు. గురువారం ఆయన యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. నవంబర్ 13 నుంచి 15 వరకు జరగనున్న ఈ కార్యక్రజువఛజులో దక్షిణ భారతదేశం నుంచి చరిత్రకారులు, అధ్యాపకులు హాజరై వారి పరిశోధనా పత్రాలను సమర్పించనున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా సుమారు 1200 మందికి పైగా చరిత్రకారులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. అనంతరం పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సమావేశంలో రిజిస్ట్రార్ కొప్పుల అంజిరెడ్డి, సిబ్బంది విజయబాబు, అరుణప్రియ, వసంత, హరీష్ కుమార్, శ్రీదేవి, అల్వాల రవి, మిరియాల రమేష్, ఉపేందర్‌రెడ్డి, మారం వెంకటరమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
క్రీడలతో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి
క్యాంపస్ సమాచారంనల్లగొండ టూటౌన్ : విద్యార్థులు క్రీడల్లో పాల్గొనడం ద్వారా క్రమశిక్షణ, ఏకాగ్రత, ఆత్మ విశ్వాసం, నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని మహాత్మాగాంధీ యూనివర్సిటీ(ఎంజీయూ) వైస్ ఛాన్స్లర్(వీసీ) ఖాజా ఆల్తాఫ్ హుస్సేన్ అన్నారు. గురువారం ఎంజీయూలో స్పోర్ట్స్ బోర్డు ఆధ్వర్యంలో 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఐసీటీ, ఐయూసీ చెస్ టోర్నమెంట్‌ను వీసీ ప్రారంభించి మాట్లాడారు. చెస్ ఆడటం ద్వారా తార్కిక ఆలోచన, వ్యూహాత్మక ప్రణాళిక, సహనం, ఓర్పు, సమస్యలను పరిష్కరించే నైపుణ్యాలను అభివృద్ధి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ బోర్డు సెక్రటరీ మద్దిలేటి పుసుపుల, ఫిజికల్ డైరెక్టర్లు మురళి, శ్రీనివాస్‌రెడ్డి, చెస్ సెలెక్టర్ కరుణాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఫ ఎంజీయూ వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ -
జీవో 97ను రద్దుచేయాలి
రామగిరి(నల్లగొండ) : పాలిటెక్నిక్ విద్యలో శక్తి ప్రోగ్రామ్‌ను కలపవద్దని, తక్షణమే జీవో నంబర్ 97ను రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ పాలిటెక్నిక్ విద్యార్థులు మండిపడ్డారు. గురువారం నల్లగొండపట్టణంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థుల ఆధ్వర్యంలో వందలాది మంది విద్యార్థులు మహాధర్నా, భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. విద్యార్థుల ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అనంతరం విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ఐదు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలకు చెందిన విద్యార్థులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. శక్తి విధానం వల్ల పాలిటెక్నిక్ పూర్తి చేసిన విద్యార్థులు ఇంజనీరింగ్‌కు దూరమయ్యే ప్రమాదం ఉందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. జీవో 97 విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీసేలా ఉందన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ జీవోను రద్దు చేయకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఫ నల్లగొండలో పాలిటెక్నిక్ విద్యార్థుల మహా ధర్నా, ర్యాలీ -
ఘట్కేసర్–కాజీపేట మధ్య 110 కి.మీ. రైల్వే నాలుగోలైన్‌కు కేంద్ర ప్రభుత్వం ఆమోదం
సాక్షి యాదాద్రి : హైదరాబాద్–కాజీపేట ప్రధాన రైల్వే మార్గంలో విపరీతమైన రద్దీని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఘట్కేసర్ నుంచి కాజీపేట మధ్య 110 కిలోమీటర్ల మేర రూ.2,419 కోట్ల అంచనా వ్యయంతో చేపడుతున్న మల్టీట్రాకింగ్ (నాలుగో లైన్) ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. 2029–30 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న ఈ ప్రాజెక్టుతో హైదరాబాద్–వరంగల్ కారిడార్‌లో రైళ్ల క్రాసింగ్, నిరీక్షణ తప్పుతుంది. ప్యాసింజర్లు, ఉద్యోగులు, విద్యార్థులు, యాదాద్రి భక్తులకు ప్రయాణం మరింత సులభతరం కానుంది. అందుబాటులోకి వస్తే.. హైదరాబాద్, వరంగల్–కాజీపేట ప్రాంతాల మధ్య యాదాద్రి భువనగిరి జిల్లా కీలక అనుసంధానకర్తగా ఉంది. బీబీనగర్, భువనగిరి, యాదగిరిగుట్ట, ఆలేరు పరిసర ప్రాంతాల నుంచి రోజూ వేలాది మంది ఉద్యోగ, వ్యాపార, విద్యా, వైద్య అవసరాల కోసం హైదరాబాద్, వరంగల్ వైపు రాకపోకలు సాగిస్తుంటారు. ప్రస్తుతం ఉన్న మార్గంలో విపరీతమైన రద్దీ కారణంగా ప్యాసింజర్ రైళ్లను క్రాసింగ్ కోసం గంటల తరబడి నిలిపివేస్తున్నారు. నాలుగో లైన్ అందుబాటులోకి వస్తే ఈ నిరీక్షణలు తగ్గి రైళ్ల వేగం, సమయపాలన మెరుగవుతాయి. యాదగిరిగుట్ట భక్తులకు మరింత సౌకర్యం ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్టకు తెలంగాణతో పాటు దేశ నలుమూలల నుంచి నిత్యం వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు. ఈ మార్గంలో ట్రాక్ సామర్థ్యం పెరిగితే భక్తుల కోసం ప్రత్యేక రైళ్లు, అదనపు సర్వీసులు కేటాయించే వెసులుబాటు కలుగుతుంది. ముఖ్యంగా పండుగలు, బ్రహ్మోత్సవాలు, వరుస సెలవుల రోజుల్లో పెరిగే రద్దీని సులువుగా నిర్వహించవచ్చు. ప్రస్తుతం ఘట్కేసర్ నుంచి వంగపల్లి వరకు ఎంఎంటీఎస్ పొడిగింపు పనులు పురోగతిలో ఉండగా, తాజాగా నాలుగో లైన్ కూడా తోడైతే ఈ కారిడార్‌లో రైల్వే రద్దీ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. పారిశ్రామిక రంగానికి ఊతం జిల్లాలో వేగంగా విస్తరిస్తున్న పారిశ్రామిక, వాణిజ్య కార్యకలాపాలకు ఈ నాలుగో లైన్ ఊతమివ్వనుంది. అదనపు ట్రాక్ అందుబాటులోకి రావడం వల్ల సిమెంట్, ఉక్కు, బొగ్గు, ఎరువులు, ఆహార ధాన్యాలు, పెట్రోలియం ఉత్పత్తుల సరుకు రవాణా వేగవంతం కానుంది. ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు లాజిస్టిక్స్, వేర్‌హౌసింగ్ రంగాలు మరింత అభివృద్ధి చెందుతాయి.ఫ రూ.2,419 కోట్లతో ఏర్పాటు ఫ యాదాద్రి భువనగిరి జిల్లా మీదుగా కీలక విస్తరణ ఫ క్రాసింగ్ కష్టాలు, నిరీక్షణకు తెర ఫ ‘గుట్ట’ భక్తులకు మరింత సులభంగా రైలు ప్రయాణం రైల్వే ప్రాజెక్టు ముఖచిత్రం ప్రాజెక్టు పేరు ఘట్కేసర్–కాజీపేట నాలుగో లైన్ (మల్టీట్రాకింగ్) మొత్తం పొడవు 110 కిలోమీటర్లు అంచనా వ్యయంరూ. 2,419 కోట్లు కావాల్సిన భూమి 124 హెక్టార్లు కాలపరిమితి 2029-30 నాటికి -
పల్లెల్లో పారిశుద్ధ్యంపై దృష్టి సారించాలి
భూదాన్‌పోచంపల్లి : పల్లెల్లో పారిశుద్ధ్యం మెరుగుపై పంచాయతీ కార్యదర్శులు ప్రత్యేక దృష్టిసారించాలని జెడ్పీ సీఈఓ శోభారాణి అన్నారు. గురువారం ఆమె పోచంపల్లిలోని మండల పరిషత్ కార్యాలయాన్ని సందర్శించి రికార్డులను పరిశీలించారు. అనంతరం పంచాయతీ కార్యదర్శులు, వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మట్లాడారు. గ్రామాల్లో వీబీజీ రాంజీ పనులు, ఇందిరమ్మ ఇళ్ల ప్రగతిని అడిగి తెలుసుకున్నారు. ఇందిరమ్మ ఇళ్లను వేగవంతం చేయాలని అన్నారు. సమావేశంలో ఎంపీడీఓ విజయ, సూపరింటెండెంట్ ఏపాల సత్యనారాయణరెడ్డి, ఏపీఓ కృష్ణమూర్తి, హౌజింగ్ ఏఈ శివాజీ, కార్యదర్శులు పాల్గొన్నారు. 10బిఎన్జి33 విద్యార్థులతో డిప్యూటీ కమిషనర్ సంతోష్‌కుమార్, కేవీ సిబ్బంది కేవీఎస్‌లో ఉత్సాహంగా యోగాసన పోటీలుభువనగిరిటౌన్ : పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (కేవీఎస్)భువనగిరిలో నిర్వహిస్తున్న 55వ కేవీఎస్ జాతీయ స్థాయి క్రీడాపోటీలు రెండోరోజు గురువారం ఉత్సాహంగా సాగాయి. విద్యార్థులు యోగాసనాల్లో తమ ప్రతిభను చాటారు. హైదరాబాద్ రీజియన్ డిప్యూటీ కమిషనర్ సంతోష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై పోటీలను పరిశీలించి, క్రీడాకారులను అభినందించారు. గురువారం అండర్–17, 19 ఆర్టిస్టిక్ యోగాసన, అండర్–19 బాలుర యోగాసన ఫైనల్ పోటీలు ముగిశాయని ప్రిన్సిపాల్ చంద్రమౌళి తెలిపారు. కార్యక్రమంలో సూర్యప్రకాశ్, రతీష్, నందారం కృపాకర్ పాల్గొన్నారు. రైతులు సాంకేతిక పరిజ్ఞానం పెంచుకోవాలిబొమ్మలరామారం: వ్యవసాయంలో సాంకేతిక పరిజ్ఞానం పెంచుకోవాలని డీఏఓ వెంకట రమణా రెడ్డి సూచించారు. బొమ్మలరామారం మండలం మర్యాలలో గురువారం రైతులకు శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో నియోజకవర్గ ఆత్మ చైర్మన్ ఎనగండ్ల సుధాకర్, ఏఓ దుర్గేశ్వరి, సర్పంచ్‌లు సంగి గణేష్, వెంకటేష్, రవీందర్ నాయక్, ఉప సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, ఎనగండ్ల వీరేశం, శ్రీను నాయక్, మౌనిక రెడ్డి, మదన్, సీమ, వరలక్ష్మి, ఆదిల్ పాల్గొన్నారు. -
రైస్ ఇండస్ట్రీని ప్రభుత్వం ఆదుకోవాలి
సాక్షి యాదాద్రి : తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతున్న రైస్ ఇండస్ట్రీని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి పసుపునూరి నాగభూషణం, జిల్లా అధ్యక్షుడు మార్త వెంకటేశం డిమాండ్ చేశారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గురువారం కలెక్టరేట్ ఎదుట తెలంగాణ రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. అంతకుముందు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మిల్లర్లను దోషులుగా చిత్రీకరించే ప్రక్రియను మానుకోవాలన్నారు. ఉడకబెట్టిన బియ్యం లక్ష్యాన్ని కేటాయించకపోవడం, ఎఫ్‌సీఐ గోదాముల్లో నిల్వకు స్థలం కొరత ఏర్పడటం వల్ల ధాన్యం తరలింపులో తీవ్ర జాప్యం జరుగుతోందన్నారు. ఈ నేపథ్యంలో రబీ 2025–26 నాటి మిగులు ధాన్యాన్ని వెంటనే బహిరంగ మార్కెట్లో విక్రయించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. గత పంటలకు సంబంధించిన సీఎంఆర్ డెలివరీలు పూర్తయ్యే దాకా మిల్లులకు కొత్త ధాన్యాన్ని కేటాయించవద్దన్నారు.మిల్లుల్లో సార్టెక్స్ శుద్ధి ప్రక్రియలో నష్టం, అధిక నూకలు ఏర్పడటం, అకాల వర్షాలు, నిల్వల్లో సహజంగా తేమ తగ్గడం, నాణ్యత క్షీణత తదితర కారణాల వల్ల 18 నుంచి 20 శాతం వరకు ధాన్యం నష్టం తప్పడం లేదని వారు పేర్కొన్నారు. క్షేత్రస్థాయి తనిఖీల సమయంలో అధికారులు ఈ వాస్తవాలను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. పెరిగిన విద్యుత్, కార్మిక, యంత్రాల నిర్వహణ ఖర్చుల దృష్ట్యా మిల్లింగ్ చార్జీలను క్వింటాకు రూ. 150 చొప్పున పెంచి చెల్లించాలని కోరారు. డీఎస్ఓ రోజారాణి, కలెక్టరేట్ ఏఓ అంజిరెడ్డిలకు మిల్లర్ల ప్రతినిధులు వినతి పత్రం అందజేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు జిల్లా వెంకటరమణ, ఇల్లెందుల మల్లేష్, మంచుకంటి భాస్కర్, పసుపునూరి మనోహర్, వలిగొండ అశోక్, మోత్కూరుతోపాటు జిల్లా వ్యాప్తంగా ఉన్న మిల్లర్లు తదితరులు పాల్గొన్నారు. ఫ పెండింగ్ సీఎంఆర్ ఇచ్చాకే కొత్త ధాన్యం కేటాయించాలి ఫ మిల్లింగ్ చార్జీలు క్వింటాకు రూ. 150కి పెంచాలి ఫ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధుల డిమాండ్ -
మాదిగలను కాంగ్రెస్ అవమానిస్తోంది
నకిరేకల్ : కాంగ్రెస్ ప్రభుత్వం మాదిగలను తీవ్రంగా అవమానిస్తోందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆరోపించారు. కేసీఆర్ హయాంలో మాదిగలకు గౌరవం దక్కిందని, దళితులకు వివిధ సంక్షేమ పథకాలు అందాయన్నారు. ఎల్లప్పుడూ కేసీఆర్‌కు మాదిగలు అండగా ఉంటారని స్పష్టం చేశారు. మాజీ సీఎం కేసీఆర్‌కు మద్దతుగా గురువారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నకిరేకల్‌లో డప్పులు మోగించి కేసీఆర్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్లో ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులు కేటాయిస్తున్నామని చెబుతున్నప్పటికీ ఆ నిధులు పూర్తిస్థాయిలో ఖర్చు చేయడం లేదన్నారు. స్పీకర్ పదవిని అవమానపరిచేలా గడ్డం ప్రసాద్‌కుమార్‌ను పదే పదే దళితుడు అంటూ ఆ పార్టీ నేతలే ప్రస్తావిస్తున్నారని అన్నారు. ప్రతి పక్షాల ప్రశ్నలకు సమాధానం చెప్పలేకనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అసెంబ్లీ సమావేశాల నుంచి సస్పెండ్ చేశారని విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి తన వైఖరి మార్చుకోకపోతే తెలంగాణ వ్యాప్తంగా మాదిగలను ఏకం చేసి ఆయన ఇంటిని 2లక్షల డప్పులతో ముట్టడిస్తామన్నారు. రాబోయే రోజుల్లో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని సీఎం గా కేసీఆర్ అసెంబ్లీలో అడుగుపెడతారని అన్నారు. పాలాభిషేకం కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్‌గౌడ్, నకిరేకల్, కేతేపల్లి బీఆర్ఎస్ మండల అధ్యక్షులు ప్రగడపు నవీన్‌రావు, మారం వెంకట్‌రెడ్డి, యూత్ మండలాధ్యక్షుడు పేర్ల కృష్ణకాంత్, నాయకులు పల్రెడ్డి మహేందర్‌రెడ్డి, నోముల కేశవరాజులు, పెండెం సదానందం, తక్కళ్లపల్లి ప్రబాకర్‌రావు, వీర్లపాటి రమేష్, అమీర్ పాష, ఇమడపాక వెంకన్న, చెట్టిపల్లి జానయ్య, రావిరాల మల్లయ్య, రాచకొండ వెంకన్న, యానాల లింగారెడ్డి, గుర్రం గణేష్, మల్లేష్, దైద పరమేశం, జిల్లా సంపత్ తదితరులు పాల్గొన్నారు.ఫ సీఎం ఇంటిని 2లక్షల డప్పులతో ముట్టడిస్తాం ఫ నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఫ కేసీఆర్ మద్దతుగా డప్పుల మోత -
యువతలో సామాజిక చైతన్యం పెరగాలి
యాదగిరిగుట్ట : యువతలో సామాజిక చైతన్యం, ప్రశ్నించేతత్వం, శాసీ్త్రయ ఆలోచనా విధానం పెంపొందించాల్సిన అవసరం ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. యాదగిరిగుట్టలో నిర్వహిస్తున్న ఏఐవైఐఎఫ్ రాష్ట్ర 3వ మహాసభలు గురువారం ముగిశాయి. ఈ సందర్భంగా ఆయన హాజరై మాట్లాడుతూ.. యువత కేవలం ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా సమాజంలో జరుగుతున్న పరిణామాలను అర్థం చేసుకొని, ప్రజా సమస్యల పరిష్కారానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. దేశ భవిష్యత్తును నిర్ణయించే శక్తి యువత చేతుల్లో ఉందని, యువతలో చైతన్యం పెరిగేతేనే సమాజంలో మార్పు సాధ్యమవుతుందన్నారు. యువత సమస్యలపై ఏఐవైఎఫ్ మరింత బలమైన ఉద్యమాలు నిర్మించి పోరాటాలు ఉధృతం చేయాలని సూచించారు. ప్రస్తుతం నక్సల్ అనే పదం పోయిందని ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షా అంటున్నారని. కానీ జెన్‌జీ రూపంలో కేంద్ర ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు యువత ముందుకు వచ్చారన్నారు. స్థానిక సమస్యలపై యువత దృష్టి పెట్టాలని, యువత ప్రజల అభిమానాన్ని సంపాదించి రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. యువత అమరుల త్యాగాలను యువత గుర్తుపెట్టుకొని వారి ఆశయాలను సాధించే దిశగా పని చేయాలన్నారు. ఈ ప్రతినిధుల సభలో సౌహార్ధ సందేశాలను ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోటి నరసింహ, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జాతీయ అధ్యక్షుడు రోషన్ కుమార్ సిన్హా, ప్రధాన కార్యదర్శి సుఖ్జిందర్ మహేశ్వరీ, ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వలి ఉల్లా ఖాద్రి, ప్రధాన కార్యదర్శి ధర్మేంద్ర, వర్కింగ్ ప్రెసిడెంట్ నేర్లకంటి శ్రీకాంత్, ఏఐవైఎఫ్ రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ లింగం రవి, టి.సత్య ప్రసాద్, శ్రీమాన్, యుగంధర్, చేపూరి కొండల్, సీసీఐ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్‌రెడ్డి, జిల్లా సహాయ కార్యదర్శులు బోలగాని సత్యనారాయణ, చెడే చంద్రయ్య, సీపీఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు గోద శ్రీరాములు, జిల్లా కార్యవర్గ సభ్యులు కళ్లెం కృష్ణ, బండి జంగమ్మ, కొల్లూరి రాజయ్య, చెక్క వెంకటేష్, ఎండీ ఇమ్రాన్, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఎండీ నహీం, ప్రధాన కార్యదర్శి పేరబోయిన మహేందర్ తదితరులు పాల్గొన్నారు. ఫ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే సాంబశివరావు ఫ యాదగిరిగుట్టలో ముగిసిన ఏఐవైఎఫ్ రాష్ట్ర 3వ మహాసభలు -
హరిత ఇంధనం వినియోగంతోనే పర్యావరణ పరిరక్షణ
భూదాన్‌పోచంపల్లి : పర్యావరణ పరిరక్షణకు హరిత ఇంధనం వైపు మళ్లాల్సిన అవసరం ఉందని ఐఐటీ తిరుపతి ప్రొఫెసర్ కెఎస్ఎంఎస్ రాఘవరావు అన్నారు. గురువారం భూదాన్‌పోచంపల్లి మండలం దేశ్ముఖిలోని విజ్ఞాన్స్ యూనివర్సిటీలో ‘హార్నెసింగ్ క్లీన్ ఎనర్జీ టెక్నాలజీస్ టూ డ్రైవ్ సస్టెనబిలిటీ అండ్ కాంట్యాట్ క్లైమేట్ ఛేంజ్ వరల్డ్‌వైడ్’ అనే అంశంపై నిర్వహించిన మూడు రోజుల జాతీయ సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ఆయన మాట్లాడారు. గ్లోబల్ వార్మింగ్ వేగంగా పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో హరిత సాంకేతికత ఎంతో అవసరమని అన్నారు. అనంతరం గుజరాత్‌లోని గాంధీనగర్‌లోని పండిట్ దీన్‌దయాళ్ ఎనర్జీ యూనివర్సిటీ ప్రొఫెసర్ రమేశ్ కె. గూడురు మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఇంధన అవసరాలను తీర్చడానికి కాలుష్య రహిత క్లీన్ ఎనర్జీ, ఉత్పాదక టెక్నాలజీని అభివృద్ది చేయడం ఎంతో ఆవసరం అన్నారు.ఈ సదస్సులో ఏఐ, రోబోటిక్స్, బయోడైవర్సిటీ, క్లీన్ ఎనర్జీ, క్లైమేట్ ఛేంజ్ వంటి సాంకేతిక అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో సీఎస్ఐఆర్–ఐఐసీటీ శాస్త్రవేత్త డాక్టర్ రెడ్డి కామేశ్, ప్రొఫెసర్ జెఎస్ఎస్ ప్రకాశ్, యూనివర్సిటీ అడ్వైజర్, మాజీ ఐఏఎస్ అధికారిణి డాక్టర్ పూనం మాలకొండయ్య, డైరెక్టర్ ప్రొఫెసర్ వైవీ దాసేశ్వర్‌రావు, డీన్లు, హెచ్ఓడీలు, అధ్యాపకులు, రీసెర్చ్ స్కాలర్స్ తదితరులు పాల్గొన్నారు. ఫ ఐఐటీ తిరుపతి ప్రొఫెసర్ కెఎస్ఎంఎస్ రాఘవరావు -
బోధనలో ఒదుగుతూ.. రచనలో రాణిస్తూ
కనగల్ : నల్లగొండ మండలం మేళ్లదుప్పలపల్లిలో జన్మించిన బుచ్చిరెడ్డికి తొలి నుంచి సాహిత్యమంటే మక్కువ. ఆయన రాసిన ఊగుతున్న ఉయ్యాల బాలగేయాల పుస్తకం నుంచి కంప్యూటర్ పిల్లలం గేయాన్ని మహారాష్ట్ర ప్రభుత్వ పాఠ్యాంశాల కమిటీ ఎంపిక చేసింది. తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాల పాఠ్యపుస్తకాల్లో చోటు దక్కించుకున్న అతికొద్ది మందిలో ఆయన ఒకరు. రెండు దశాబ్దాలుగా బాల సాహిత్య సేవ గత 28 ఏళ్లుగా ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ఆయన.. రెండు దశాబ్దాలకు పైగా బాలసాహిత్యానికి విశేష సేవలందిస్తున్నారు. ఇంటర్మీడియట్ నుంచే సాహిత్యంపై ఆసక్తి పెంచుకున్న ఆయన.. తెలంగాణ ఉద్యమ సమయంలో సాహిత్యం వైపు దృష్టి సారించారు. చిన్నారుల కోసం సులువుగా అర్థమయ్యే రీతిలో 350కి పైగా కథలు, కవితలు, గేయాలు రాశారు. గతంలో మండల రీసోర్స్‌పర్సన్‌గా పనిచేసినప్పుడు వినూత్న విద్యా కార్యక్రమాల్లో కీలకపాత్ర పోషించారు. రాజీవ్ విద్యామిషన్ (సర్వశిక్షా అభియాన్) ఆధ్వర్యంలో నల్లగొండ నుంచి వెలువడిన జాబిల్లి పిల్లల మాసపత్రిక సంపాదక వర్గ సభ్యుడిగా కూడా సేవలందించారు. విద్యార్థులకు ముందుగా మాతృభాషలో అవగాహన కల్పిస్తే, ఆంగ్లాన్ని సులువుగా నేర్చుకోగలరన్నది ఆయన అభిప్రాయం. విద్యార్థుల్లో సృజనాత్మకతకు పెద్దపీట ప్రౌఢ సాహిత్యంలో ధీరుల మొగసాల, డమరుకం, మాలిమి తదితర పుస్తకాలు రాసిన ఆయన.. బాల సాహిత్యంలో మొలకలు, బంతి పూలు, బహుమతి, మార్గదర్శి వంటి పిల్లల కథల పుస్తకాలను వెలువరించారు. వీటిని ఎలాంటి లాభాపేక్ష లేకుండా 70కి పైగా ప్రభుత్వ పాఠశాలల గ్రంథాలయాలకు ఉచితంగా అందించారు. హెచ్ఎం, ఇతర ఉపాధ్యాయుల సహకారంతో పాఠశాలలో వర్క్‌షాప్‌లు నిర్వహిస్తూ విద్యార్థుల్లో రచనా సామర్థ్యాన్ని ప్రోత్సహిస్తున్నారు. విద్యార్థులు రాసిన కథలతో మాదారం మందారాలు అనే సంపుటిని వెలువరించేందుకు సిద్ధమయ్యారు. పిల్లలు రాసిన అంశాలు మొలక, బాల చెలిమి వంటి పత్రికల్లో అచ్చయ్యేలా ప్రోత్సహిస్తున్నారు. అంతేకాకుండా దాతల సహకారాన్ని కూడగట్టి పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తున్నారు. అక్షరంతో పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దుతూ.. బాల సాహిత్యంతో సరిహద్దులు దాటి గుర్తింపు పొందారు కనగల్ మండలం చిన్న మాదారం ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆంగ్ల ఉపాధ్యాయుడు(స్కూల్ అసిస్టెంట్) కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి. ఆయన రచించిన కంప్యూటర్ పిల్లలం అనే బాల గేయాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం.. ఈ విద్యా సంవత్సరానికి గాను అక్కడి నాలుగో తరగతి తెలుగు బాలభారతి పాఠ్యపుస్తకంలో పాఠ్యాంశంగా ఎంపిక చేసింది. ఫ రెండు దశాబ్దాలుగా బాల సాహిత్యానికి విశేష సేవలందిస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి ఫ ఆయన రాసిన కంప్యూటర్ పిల్లలం గేయానికి అరుదైన గుర్తింపు ఫ మహారాష్ట్రలోని నాలుగో తరగతి తెలుగు బాలభారతిలో పాఠ్యాంశంగా ఎంపిక -
మారెమ్మ యూనిట్ సందడి
చౌటుప్పల్, భువనగిరి: చౌటుప్పల్, భువనగిరి పట్టణాల్లో మారెమ్మ సినిమా యూనిట్ గురువారం సందడి చేసింది. ఆయా పట్టణాల్లో శ్రీనివాస, వసుంధర థియేటర్లలో ఆ సినిమాను హీరోయిన్ దీపాబాలు.. యూనిట్ సభ్యులు ..ప్రేక్షకులతో కలిసి తిలకించారు. వారితో మాట్లాడారు. హీరోయిన్ను చూసేందుకు స్థానికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సినిమా యూనిట్‌తో సెల్ఫీలు తీసుకోవడానికి ఆసక్తి చూపారు. ఈ సందర్భంగా హీరోయిన్ దీపా బాలు, బండారు సుభాష్‌రెడ్డి, ఇతర సభ్యులు కున్రెడ్డి, సందీప్‌రెడ్డిలు మాట్లాడారు. పల్లెప్రజల జీవన విధానం, ఆచార వ్యవహారాలు సినిమాలో మలచిన విధానం ఎంతో బాగుందని ప్రేక్షకులు చెబుతున్నారని వారు తెలిపారు. -
ఫ ఐలమ్మకు నివాళి
867 మందికి ఇందిరమ్మ ఇళ్ల బిల్లు రామన్నపేట: ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు వచ్చాయి. జిల్లాలో ఇప్పటి వరకు 867మంది లబ్ధిదారుల ఖాతాల్లో సుమారు రూ.9.40కోట్లను ప్రభుత్వం జమ చేసింది. రాష్ట్రప్రఽభుత్వం గత ఆర్థిక సంవత్సరంలో మొదటి దశలో జిల్లాకు 9,861 ఇళ్లను మంజూరు చేసింది. వాటిలో 5,200 ఇళ్ల నిర్మాణం పూర్తయ్యింది. వీటిలో బేస్మెంట్ పూర్తయిన తరువాత రూ. 1లక్ష, గోడలు నిర్మించిన తరువాత మరో లక్ష, స్లాబ్‌వేసిన వెంటనే రూ 1.40లక్షల చొప్పున చెల్లించింది. వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మాణానికి ఈజీఎస్ నుంచి రూ 12వేలు జమ అయ్యాయి. 90రోజుల పని కల్పించడం ద్వారా రోజుకు రూ .307ల చొప్పున చెల్లిస్తోంది. ఇంటి నిర్మాణం పూర్తయిన 5,200మంది లబ్ధిదారులకుగాను రాష్ట్ర ప్రభుత్వం చివరిబిల్లు కింద 700 మంది లబ్ధిదారులకు రూ 1,20,000ల చొప్పున వారి ఖాతాల్లో జమ చేసింది. అదేవిధంగా పైలట్‌ప్రాజెక్టులో భాగంగా ఇళ్లు కట్టుకొని స్లాబ్‌దశలో రూ. 2లక్షల బిల్లు పొందిన 167మంది లబ్ధిదారులకు రూ. 60వేల చొప్పున జమ చేసింది. -
తుక్కాపూర్‌లో విద్యుత్ సబ్‌స్టేషన్ ముట్టడి
భువనగిరిటౌన్ : సమయానికి విద్యుత్ సరఫరా చేయకపోవడంతో పాటు లో–ఓల్టేజీ, సప్లయ్‌లో తీవ్ర అంతరాయాలను నిరసిస్తూ భువనగిరి మండల పరిధిలోని తుక్కాపూర్ గ్రామ రైతులు, ప్రజాప్రతినిధులు స్థానిక విద్యుత్ సబ్‌స్టేషన్ గురువారం ముట్టడించారు. ఈ సందర్భంగా తుక్కాపూర్ సర్పంచ్ జనగాం పాండు మాట్లాడుతూ గ్రామంలో వ్యవసాయానికి సరైన సమయానికి విద్యుత్ అందించడం లేదన్నారు. సరఫరా సమయంలోనూ తీవ్ర లోఓల్టేజీ ఉంటుందని పేర్కొన్నారు. గ్రామానికి చెందిన లైన్‌మన్ ఎల్సీ పేరుతో రోజులో అనేకసార్లు విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నారని ఆయన మండిపడ్డారు. రోజుకు కనీసం 7 నుంచి 8 గంటల విద్యుత్ కూడా సరిగ్గా సరఫరా కాకపోవడంతో పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందని, అధికారుల నిర్లక్ష్య వైఖరి నచ్చకే రైతులంతా కలిసి సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగాల్సి వచ్చిందని తెలిపారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నోముల మహేందర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ రాసాల మల్లేష్ యాదవ్, నల్లమాస సత్యనారాయణ, గ్రామ శాఖ అధ్యక్షుడు రాసాల శేఖర్ యాదవ్, ఉప సర్పంచ్ రాసాల లింగస్వామి యాదవ్, వార్డు సభ్యులు ఎలకొండ శేఖర్ రెడ్డి, శరత్, ఎలకొండ సుధాకర్ రెడ్డి, దండమోని నరసింహ, దండేమోని పాండు, దానయ్య, రైతులు ఏదునూరి వెంకయ్య, కొసని వెంకటేష్, జక్కిడి శేఖర్ రెడ్డి, కంటం రాజమోహన్, జనగాం మహేష్, రాసాల భూలోక్, రత్నపురం శ్రీనివాస్, రాసాల మల్లయ్య, రాసాల క్రాంతి, దండముని రాజు తదితరులు పాల్గొన్నారు. -
నిరుద్యోగులకు ఉపాధి కల్పనే ధ్యేయం
సాక్షి, యాదాద్రి: జిల్లాలోని నిరుద్యోగ యువతకు నైపుణ్యాభివృద్ధి (స్కిల్ డెవలప్మెంట్) ద్వారా మెరుగైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా యంత్రాంగం నిరుద్యోగుల కోసం ప్రభుత్వ ఉద్యోగాల శిక్షణతో పాటు ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగావకాశాలు కల్పిస్తుందన్నారు. తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ భాగస్వామ్యంతో రెండు మోడల్స్‌లో శిక్షణ ఇస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. మొదటిది టాస్క్ ట్రైనర్ల ద్వారా నేరుగా నైపుణ్య శిక్షణ ఇవ్వడం. రెండోది ప్రైవేట్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుని ఉద్యోగాధారిత శిక్షణ అందించనున్నట్లు చెప్పారు. శిక్షణ అంశాలు ఏమిటంటే..ఏఐ , మెషిన్ లెర్నింగ్, పైథాన్, జావా, హెచ్‌టీఎంఎల్, జావాస్క్రిప్ట్, యానిమేషన్స్ వంటి ఐటీ, సాంకేతిక కోర్సులలో శిక్షణ ఇవ్వనున్నట్లు వివరించారు. వైఎస్‌కే ఇన్ఫోటెక్, టెలిపెర్ఫార్మెన్స్, మైండ్ ప్లస్ వంటి కంపెనీలు ఫ్రెషర్లకు 15 నుంచి 45 రోజుల పాటు శిక్షణ ఇచ్చి ఇందులో ప్రతిభ చూపిన వారికి రూ. 1.8 లక్షల వార్షిక ప్యాకేజీతో ఉద్యోగాలు కల్పిస్తాయన్నారు. దరఖాస్తుల సంఖ్య ఆధారంగా భువనగిరి, చౌటుప్పల్, రామన్నపేట, మోత్కూర్ వంటి ప్రాంతాల్లోనూ శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసే ఆలోచన ఉంది. ఐటీ రంగానికే పరిమితం కాకుండా రీటైల్ సేల్స్, హోటల్ మేనేజ్మెంట్ వంటి ఆధునిక కోర్సులలోనూ శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. జిల్లా గ్రంథాలయ సంస్థ సహకారంతో భువనగిరిలోని లైబ్రరీ ప్రాంగణంలో బ్యాంకింగ్, ఎస్ఎస్సీ, ఆప్టిట్యూడ్, జనరల్ స్టడీస్ వంటి పోటీ పరీక్షలన్నింటికీ ఉపయోగపడేలా 8 నెలల శిక్షణ తరగతులు నిర్వహిస్తారన్నారు. వచ్చేవారం శిక్షణ తరగతులు ప్రారంభం శిక్షణకు ఇప్పటికే 46 దరఖాస్తులు వచ్చాయని, ప్రతి కోర్సుకు కనిష్టంగా 50 మంది విద్యార్థులకు అవకాశం కల్పిస్తామని చెప్పారు. వచ్చే వారంలో శిక్షణ ప్రారంభమవుతుందన్నారు. మహిళలు, దివ్యాంగులకు రవాణా సౌకర్యవంతంగా ఉండి, కంప్యూటర్ ల్యాబ్ వసతి ఉన్న వేదికను త్వరలోనే ఖరారు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో ట్రెయినీ డెప్యూటీ కలెక్టర్లు కృతిక, సాత్విక్ నాయక్ పాల్గొన్నారు.ఫ ప్రైవేట్, ప్రభుత్వ సంస్థల భాగస్వామ్యంతో శిక్షణ ఫ కలెక్టర్ అనురాగ్ జయంతి వెల్లడి -
యూనివర్సిటీలను నిర్వీర్యం చేస్తే సహించేదిలేదు
నల్లగొండ టూటౌన్ : యూనివర్సిటీలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తే సహించేది లేదని ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఛత్రపతి చౌహన్ అన్నారు. ఏబీవీపీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గురువారం మహాత్మాగాంధీ యూనివర్సిటీలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యూనివర్సిటీల్లో ప్రభుత్వం కనీస మౌలిక సదుపాయాలు కల్పించకుండా వివక్ష చూపిస్తుందని ఆరోపించారు. యూనివర్సిటీలలో సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులను రెగ్యులర్ చేయకుండా యూనివర్సిటీ ఫిక్స్డ్ డిపాజిట్లను కాజేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. ఫిక్స్డ్ డిపాజిట్లను స్వాధీనం చేసుకోవాలనే ఆలోచన ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని వీసీకి అందజేశారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ కార్యదర్శి మోహన్, రాష్ట్రకార్యవర్గ సభ్యులు శంకర్, నగేష్, అజయ్, సంపత్, మౌనేష్, రాజేష్, గణేష్, మల్లిఖార్జున్, సాయి, సిద్దు, సిరిచందన, శివానీ పాల్గొన్నారు. ఫ ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఛత్రపతి చౌహన్ -
విద్యార్థినుల రక్షణలో ప్రభుత్వాలు విఫలం
భువనగిరిటౌన్ : విద్యార్థినులకు రక్షణ కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమవుతున్నాయని ఎస్ఎఫ్ఐ జాతీయ ఉపాధ్యక్షురాలు శిల్ప, రాష్ట్ర కార్యదర్శి టి. నాగరాజు అన్నారు. భువనగిరి పట్టణంలోని వెన్నెల కళాశాలలో ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర గర్ల్స్ శిక్షణా తరగతులు గురువారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా శిల్ప మాట్లాడుతూ.. దేశంలో మహిళలు, విద్యార్థినులపై హింస, వేధింపులు, వివక్ష కొనసాగుతున్నప్పటికీ ప్రభుత్వాలు సరైన చర్యలు తీసుకోవడం లేదన్నారు. జెన్‌జీ విద్యార్థి ఉద్యమాల్లో విద్యార్థినులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని తమ పోరాట స్ఫూర్తిని చాటారని అన్నారు. తమ విద్యా హక్కులు, ప్రజాస్వామ్య హక్కులు, సామాజిక న్యాయం కోసం యువత ముందుకు వస్తున్న తరుణంలో వారి స్వరాన్ని అణిచివేయకుండా ప్రభుత్వాలు సమస్యలను పరిష్కరించాలని సూచించారు. నూతన జాతీయ విద్యా విధానం–2020 వల్ల పేద, మధ్యతరగతి విద్యార్థులు, ముఖ్యంగా విద్యార్థినులు విద్యకు దూరమయ్యే పరిస్థితులు ఉన్నాయని విమర్శించారు. అనంతరం రాష్ట్ర కార్యదర్శి టి. నాగరాజు మాట్లాడుతూ.. మహిళలకు సమాన విద్యా అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. కార్యక్రమంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కల్లూరి మల్లేష్, ఐద్వా జిల్లా కార్యదర్శి బి. అనురాధ, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామెర కిరణ్, రాష్ట్ర సహాయ కార్యదర్శులు దీపిక, సుమ, కృపా జార్జీ, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వేముల నాగరాజు, లావుడియ రాజు, జిల్లా గర్ల్స్ కన్వీనర్ ఇందు రాణి, జిల్లా ఉపాధ్యక్షులు ఈర్ల రాహుల్, పట్టల ఉదయ్, ధరావత్ జగన్, జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఫ ఎస్ఎఫ్ఐ జాతీయ ఉపాధ్యక్షురాలు శిల్ప -
ఎకరాకు రూ.1.20 కోట్ల పరిహారం ఇవ్వాలి
ఫ 930పి జాతీయ రహదారి భూ నిర్వాసితుల డిమాండ్ భూదాన్‌పోచంపల్లి : పోచంపల్లి మండలం మీదుగా వెళ్తున్న 930పి గౌరెల్లి–భద్రాద్రి జాతీయ రహదారి భూ నిర్వాసితులకు ఎకరాకు రూ.1.20 కోట్ల పరిహారం ఇవ్వాలని అఖిలపక్షాల రైతు నాయకుడు పాక మల్లేశ్ డిమాండ్ చేశారు. గురువారం పోచంపల్లి మండలం కనుముకుల గ్రామంలో జరుగుతున్న జాతీయ రహదారి పనులను రైతులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోచంపల్లి మండలం పక్కనే ఉన్న రంగారెడ్డి జిల్లాలోని గ్రామాలతో పాటు చౌటుప్పల్‌లో ఎకరానికి రూ.కోటికి పైగా పరిహారం ఇస్తున్నారని అన్నారు. అంతేకాక వలిగొండలో రీజినల్ రింగ్‌రోడ్డు భూ నిర్వాసితులకు రూ.50 లక్షలకు పైగా పరిహారం చెల్లిస్తున్నారని పేర్కొన్నారు. పోచంపల్లి మండల రైతులకు మాత్రం ఎకరానికి రూ.24లక్షలు నిర్ణయించడం సరికాదన్నారు. పరిహారం పెంచాలని కలెక్టర్‌కు విన్నవించినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. పరిహారం పెంచిన తర్వాతే రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో రైతు నాయకులు సామ మధుసూధన్‌రెడ్డి, కోట రాంచంద్రారెడ్డి, చుక్క శంకర్, ఇటమోని మహేశ్, వారాల శేఖర్‌రెడ్డి, బానాల ఎల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
జ్వరాల బారిన గురుకుల విద్యార్థులు
● రక్త నమూనాల సేకరణసంస్థాన్ నారాయణపురం : మండల కేంద్రంలోని గిరిజన గురుకుల పాఠశాల విద్యార్థులను జ్వరాలు కలవరపెడుతున్నాయి. పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న 15 మంది విద్యార్థులు గత రెండు రోజులుగా జ్వరాల బారిన పడినట్లు తెలిసింది. విద్యార్థులను పాఠశాల సిబ్బంది ప్రభుత్వాస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. విద్యార్థుల రక్త నమూనాలను సేకరించి పరీక్షలకు పంపించారు. అంతేకాకుండా పాఠశాలలో మరికొందరు విద్యార్థులు కూడా జ్వరం, జలుబు వంటి సమస్యలతో బాధపడుతున్నట్లు తెలిసింది. దీంతో ప్రభుత్వాస్పత్రి వైద్యురాలు జ్యోత్స్న, వైద్య సిబ్బంది పాఠశాలను సందర్శించి విద్యార్థులకు కూడా వైద్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు. వైరల్ జ్వరాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై డాక్టర్ జ్యోత్స్న అవగాహన కల్పించారు.ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన లారీఫ యువకుడి దుర్మరణం చౌటుప్పల్ : ద్విచక్ర వాహనంపై వెళ్తున్న యువకుడిని లారీ ఢీకొనడంతో మృతిచెందాడు. ఈ ఘటన హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై చౌటుప్పల్ మండలం కై తాపురం గ్రామం వద్ద గురువారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చౌటుప్పల్ మండలం ధర్మోజిగూడెం మాజీ సర్పంచ్ భద్రి లింగయ్య కుమారుడు భద్రి రాహుల్ అలియాస్ రాము(22) వరంగల్‌లో హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నాడు. అక్కడే పార్ట్‌టైం జాబ్ సైతం చేస్తున్నాడు. కాగా ధర్మోజిగూడెం గ్రామంలో గురువారం బోనాల వేడుకలు ఉండటంతో రాహుల్‌ను ఊరికి రమ్మని కుటుంబ సభ్యులు పిలిచారు. దీంతో వరంగల్ నుంచి హైదరాబాద్‌కు వెళ్లిన రాహుల్ అక్కడ తన మిత్రుడి వద్ద ద్విచక్ర వాహనాన్ని తీసుకొని స్వగ్రామానికి వస్తున్నాడు. మార్గమధ్యలో చౌటుప్పల్ మండలం కై తాపురం గ్రామం వద్దకు రాగానే వెనుక నుంచి వస్తున్న లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాహుల్ తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని చికిత్స నిమిత్తం చౌటుప్పల్ ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా అక్కడ మృతిచెందాడు. ప్రమాదానికి కారణమైన లారీని డ్రైవర్ ఆపకుండా పరారు కాగా.. స్థానికులు వెంబడించి పట్టుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మన్మథకుమార్ తెలిపారు. కుటుంబ సభ్యులతో గొడవపడి వ్యక్తి ఆత్మహత్యభువనగిరి : కుటుంబ సభ్యులతో గొడవపడి మనస్తాపానికి గురైన వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన భువనగిరి మండలం బీఎన్ తిమ్మాపురం గ్రామంలో గురువారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీఎన్ తిమ్మాపురం గ్రామానికి చెందిన ఇండ్ల కుమార్(33)కు ఐదేళ్ల క్రితం తుర్కపల్లి మండలం వీరారెడ్డిపల్లి గ్రామానికి చెందిన మమతతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. బస్వాపురం రిజర్వాయర్ ముంపు కింద కుమార్ కుటుంబానికి చెందిన భూములు కోల్పోవడంతో ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించింది. ఆ డబ్బులతో కుమార్ తరచూ మద్యం తాగుతూ దానికి బానిసయ్యాడు. డబ్బుల వృథా విషయమై కుమార్‌తో గొడవ పడిన అతడి భార్య పిల్లలతో కలిసి ఆరు నెలల క్రితం పుట్టింటికి వెళ్లింది. అయినప్పటికీ తరచూ మద్యం తాగి వచ్చి ఇంట్లోని కుటుంబ సభ్యులతో గొడవపడేవాడు. గురువారం కూడా కుటుంబ సభ్యులతో గొడవపడిన తర్వాత ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటి ముందు ఉన్న చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ అనిల్‌కుమార్ తెలిపారు. -
పరిశ్రమల్లో స్థానికులకే ఉద్యోగాలివ్వాలి
చౌటుప్పల్ : స్థానిక పరిశ్రమల్లో స్థానికులకే ఉద్యోగాలివ్వాలనే డిమాండ్‌తో ఉద్యమించనున్నామని డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు కోట రమేష్, కార్యదర్శి ఆనగంటి వెంకటేష్ తెలిపారు. చౌటుప్పల్‌లో గురువారం డీవైఎఫ్ఐ జిల్లా మహాసభలో వారు మాట్లాడారు. యువత సమస్యలపై ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. సమస్యల పరిష్కారం కోసం చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. స్థానిక పరిశ్రమల్లో స్థానిక నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చేలా ప్రభుత్వం చట్టం తీసుకురావాలన్నారు. సభలో డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి గడ్డం వెంకటేష్, జిల్లా అధ్యక్షుడు పల్లె మధుకృష్ణ, నాయకులు సురేష్దయ్యాల, మల్లేష్, సలీం, రత్నం శ్రీకాంత్, పల్లె శివకుమార్, గండని లక్ష్మీపతి, బోదాసు నరేష్, నత్తి నరేష్, జంగిలి సాయి, బాలెం నరేష్, బర్రె రాజు,శశి తదితరులు పాల్గొన్నారు. ఫ డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు కోట రమేష్, కార్యదర్శి వెంకటేష్ -
జాతీయ స్థాయి ‘ప్రేరణ’కు ఎంపికైన విద్యార్థులు
సూర్యాపేటటౌన్ : గుజరాత్లో నవంబర్ 15 నుంచి 21 వరకు జరగనున్న జాతీయ స్థాయి ప్రేరణ అనుభవపూర్వక విద్యా కార్యక్రమానికి సూర్యాపేట జిల్లా నుంచి ఇద్దరు విద్యార్థులు ఎంపికై నట్లు ప్రేరణ నోడల్ స్కూల్, జవహర్ నవోదయ విద్యాలయ ప్రిన్సిపాల్ ఆదినారాయణ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గరిడేపల్లి మండలం కల్మలచెరువు జెడ్పీహెచ్ఎస్ 9వ తరగతి విద్యార్థి జి. శ్రీరామ్, సూర్యాపేట మండలం ఇమాంపేట టీఎస్ఎంఎస్ 9వ తరగతి విద్యార్థిని ముప్పని రిత్వికారెడ్డి ఎంపికై నట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా 20మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. విద్యార్థుల ప్రయాణ ఏర్పాట్లు తదితర అంశాలను పర్యవేక్షిస్తున్నట్లు ప్రిన్సిపాల్ పేర్కొన్నారు. -
తెలంగాణలో శాంతిభద్రతలు అదుపుతప్పాయి
నకిరేకల్ : రాష్టంలో కాంగ్రెస్ పాలనలో శాంతిభద్రతలు అదుపుతప్పాయని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆరోపించారు. బుధవారం రాత్రి ఆయన నకిరేకల్‌లో విలేకరులతో మాట్లాడారు. మాజీ సీఎం కేసీఆర్ చావును కోరుతూ చావు డప్పు కొట్టించి ఆయనపై హత్యాయత్నానికి పాల్పడం చూస్తే సీఎం రేవంత్‌రెడ్డి, డీజీపీ కనుసన్నల్లోనే ఈ తతంగం జరిగిందని అనిపిస్తోందన్నారు. రేవంత్‌రెడ్డి సీఎం హోదాలో ఉండి కూడా అనేక సందర్భాల్లో బండబూతులు మాట్లాడతున్నారని అన్నారు. కేసీఆర్ చావును కోరడం ఎంతవరకు సమంజసమన్నారు. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంకు కూడా రాజకీయ భిక్ష పెట్టింది కేసీఆరే అని గుర్తుంచుకోవాలన్నారు. ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కూడా తన ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. వీరందరు కూడా కేసీఆర్ రాజకీయ భిక్షతో వచ్చి ఆయనపైనే విమర్శలు చేయడం సరికాదన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి తన 1000 రోజుల పాలనలో ఘోరంగా విఫలమయ్యారని, బీఆర్ఎస్ శ్రేణులు వెళ్లి ఆయన ఇంటి ముందు చావు డప్పు కొట్టలేమా అని ప్రశ్నించారు. ఇకనైనా రేవంత్‌రెడ్డి ఇలాంటి నీచమైన పనులకు ఒడిగట్టకుండా అసెంబ్లీని సజావుగా నడపాలని కోరారు. ఫ నకిరేకల్ మాజీ ఎమ్మేల్యే చిరుమర్తి లింగయ్య


