తిరుమలగిరి(సాగర్) : శ్రీరామనవమి సందర్భంగా నల్లగొండ జిల్లా తిరుమలగిరి సాగర్ మండల కేంద్రంలో వివిధ క్రీడాపోటీలను ఆలయ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా 120 కిలోల బరువైన గుండు ఎత్తే పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో ముగ్గురు వ్యక్తులు పాల్గొనగా.. నిర్ణీత ఐదు నిమిషాల సమయంలో తిరుమలగిరి మండల కేంద్రానికి చెందిన అలేఖ్య తొమ్మిదిసార్లు పందెం గుండును లేపి ప్రథమ బహుమతిని గెల్చుకున్నాడు. అదేవిధంగా ప్రశాంత్ నిర్ణీత సమయంలో ఆరు సార్లు గుండును లేపి రెండవ బహుమతిని గెల్చుకున్నాడు. ఈ పోటీలను భక్తులు, స్థానికులు ఆసక్తిగా తిలకించారు.


