ఆర్థిక సమస్యలతో వ్యక్తి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

ఆర్థిక సమస్యలతో వ్యక్తి ఆత్మహత్య

Mar 28 2026 7:15 AM | Updated on Mar 28 2026 7:15 AM

అర్వపల్లి : అనారోగ్యంతో పాటు ఆర్థిక సమస్యలతో జీవితంపై విరక్తి చెంది ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన జాజిరెడ్డిగూడెం మండలం కొమ్మాల గ్రామంలో శుక్రవారం జరిగింది. స్థానిక ఎస్‌ఐ ఈట సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. కొమ్మాల గ్రామానికి చెందిన కందుకూరి వెంకన్న (50) కొంతకాలంగా కుటుంబంతో కలిసి నల్లగొండలో నివాసముంటున్నాడు. రెండు నెలలుగా అనారోగ్య సమస్యలతో పాటు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాడు. దీంతో ఇటీవల కుటుంబ సభ్యులతో కలిసి స్వగ్రామానికి వచ్చి ఉంటున్నాడు. శుక్రవారం ఇంట్లో ఎవరికీ చెప్పకుండా గ్రామ శివారులోకి వెళ్లి చెట్టుకు ఉరేసుకని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. మృతుడి కుమారుడు నవీన్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక ఎస్‌ఐ తెలిపారు.

బైక్‌ను ఢీకొట్టిన టిప్పర్‌.. ఒకరు మృతి

మిర్యాలగూడ టౌన్‌ : బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని టిప్పర్‌ ఢీకొనడంతో మృతిచెందాడు. ఈ ఘటన శుక్రవారం మిర్యాలగూడ మండలం కిష్టాపురం వద్ద జరిగింది. మిర్యాలగూడ రూ రల్‌ ఎస్‌ఐ మల్లికంటి లక్ష్మయ్య తెలిపిన వివరా ల ప్రకారం.. మిర్యాలగూడ మండలం కేశవాపురం గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు (54) బైక్‌పై మిర్యాలగూడ పట్టణానికి వస్తుండగా.. కిష్టాపురం వద్దకు రాగానే దామరచర్ల నుంచి వస్తున్న టిప్పర్‌ బైక్‌ను వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వెంకటేశ్వర్లును మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

అక్రమంగా తరలిస్తున్న మద్యం స్వాధీనం

మేళ్లచెరువు : కోదాడ మండలం నల్లబండగూడెం గ్రామానికి చెందిన షేక్‌ జానీపాష శుక్రవారం యాక్టీవాపై మేళ్లచెరువు మండలం రామాపురం గ్రామానికి అక్రమంగా మద్యం తరలిస్తుండగా ఎకై ్సజ్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి 18 బీరు బాటిళ్లు, 47 క్వాటర్ల మద్యం స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.

బస్సులో ప్రయాణికుడి

సెల్‌ఫోన్‌ చోరీ

కొండమల్లేపల్లి : ఆర్టీసీ బస్సులో ప్రయాణికుడి జేబులోని సెల్‌ఫోన్‌ను గుర్తుతెలియని వ్యక్తి చోరీ చేశాడు. వివరాలు. కొండమల్లేపల్లి పట్టణానికి చెందిన బూడిద శ్రీనివాస్‌యాదవ్‌ హైదరాబాద్‌కు వెళ్లేందుకు శుక్రవారం కొండమల్లేపల్లి బస్టాప్‌ వద్ద ఆర్టీసీ బస్సు ఎక్కాడు. ఈ క్రమంలో గుర్తుతెలియని వ్యక్తి శ్రీనివాస్‌యాదవ్‌ జేబులో నుంచి అతడి సెల్‌ఫోన్‌ను దొంగలించాడు. అనంతరం బ్యాంక్‌ ఖాతా నుంచి రూ.25వేలు తస్కరించాడు. బాధితుడు కొండమల్లేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement