కష్టం చూసి.. కల నెరవేర్చిన దంపతులు | - | Sakshi
Sakshi News home page

కష్టం చూసి.. కల నెరవేర్చిన దంపతులు

Mar 28 2026 7:15 AM | Updated on Mar 28 2026 7:15 AM

మఠంపల్లి : మఠంపల్లి మండలంలోని పెదవీడు గ్రామ పంచాయతీ పరిధిలోని చింతలమ్మగూడేనికి చెందిన పగిడి సైదులు, సోమమ్మ దంపతులకు సొంత ఇల్లు లేక పూరి గుడిసెలో తలదాచుకుంటున్నారు. దీంతో వారి దీనస్థితిని చూసిన అదే గ్రామానికి చెందిన మల్‌రెడ్డి ఆదినారాయణరెడ్డి, పద్మావతి దంపతులు ఇల్లు కట్టించి ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో స్థానికంగా రూ.1.50లక్షలతో రెండు గదులతో కొత్త ఇల్లు నిర్మించారు. శుక్రవారం శ్రీరామనవమి పండుగతో పాటు ఆదినారాయణరెడ్డి, పద్మావతి దంపతుల మనవడు నియాన్స్‌రెడ్డి పుట్టినరోజు కావడంతో గ్రామ పెద్దల సమక్షంలో కొత్త ఇంటిని సైదులు, సోమమ్మ దంపతులకు అప్పగించి గృహప్రవేశం చేయించారు. పేద దంపతుల కల నెరవేర్చిన ఆదినారాయణరెడ్డి, పద్మావతి దంపతులను గ్రామ పెద్దలు ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు సాముల శివారెడ్డి, గ్రామ సర్పంచ్‌ అమరారపు వెంకటేశ్వర్లు, ఉప సర్పంచ్‌ త్రివేణి, నాయకులు షేక్‌ ఖరీమ్‌, మట్టపల్లి యాదవ్‌, వేముల పిచ్చయ్య, తెలపాటి శ్రీనివాస్‌ గౌడ్‌, గాయం ఆదిరెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, రహీమ్‌, కోటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఫ నిరుపేద కుటుంబానికి సొంత ఖర్చులతో కొత్త ఇల్లు కట్టించి అందజేత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement