మోత్కూరు : మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని కొండగడప గ్రామానికి చెందిన దొండ లింగమల్లుయాదవ్‌కు చెందిన 5 మేకలను గు రువారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్య క్తులు అపహరించారు. దీంతో బాధితుడు మో త్కూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దొంగలను త్వరలోనే పట్టుకుంటామని మోత్కూరు సీఐ సి. వెంకటేశ్వర్లు తెలిపారు.
చెట్టును ఢీకొట్టిన ద్విచక్ర వాహనం.. ఒకరు మృతి
కట్టంగూర్ : ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తి చెట్టును ఢీకొని మృతిచెందాడు. ఈ ఘటన కట్టంగూర్ మండలం కల్మెర గ్రామ శివారులో గురువారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నార్కట్‌పల్లి మండలం షాపల్లి గ్రామానికి చెందిన అక్కెనపల్లి యాదయ్య(59) గురువారం ఉదయం కట్టంగూర్‌లో ఉంటున్న తన కుమార్తె వద్దకు ద్విచక్ర వాహనంపై వచ్చాడు. మధ్యాహ్నం తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా.. మార్గమధ్యలో కల్మెర గ్రామ శివా రులోకి రాగానే ద్విచక్ర వాహనం అదుపుతప్పడంతో రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో యాదయ్య తలకు తీవ్ర గాయాలయ్యాయి. యాదయ్యను 108 వాహనంలో నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి భార్య అరుణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రవీందర్ తెలిపారు.
భార్యను వేధించిన వ్యక్తికి జైలు శిక్ష
రామగిరి(నల్లగొండ): భార్యను వేధించిన భర్తకు నల్లగొండ ప్రత్యేక ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ నేరాలు కోర్టు న్యాయమూర్తి దారా సాయిమేఘన రెండేళ్ల జైలుశిక్ష విధిస్తూ గురువారం తీర్పు వెలువరించారు. వివరాలు.. వరంగల్ జిల్లాకు చెందిన గిరిగాని వేణుకు నల్లగొండకు చెందిన మహిళతో వివాహమైంది. వేణు తన భార్యను వేధిస్తుండడంతో ఆమె నల్లగొండ మహిళా పోలీస్ స్టేషన్‌లో 2015లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సరైన ఆధారాలతో ఛార్జిషీట్ దాఖలు చేసి వేణును కోర్టులో హాజరుపర్చారు. ఈ కేసు తుది తీర్పులో భాగంగా పబ్లిక్ ప్రొసిక్యూటర్ వాదనలతో ఏకీభవించిన జడ్జి నిందితుడికి రెండేళ్లు జైలుశిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు.
బైక్‌ను ఢీకొట్టిన కారు
ఫ ఒకరికి గాయాలు
అదుపుతప్పిన ట్రావెల్స్ బస్సు
ఫ ప్రయాణికులు సురక్షితం
మునగాల:హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై మునగాల మండల కేంద్రం శివారులో గురువారం తెల్లవారుజామున ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు అతివేగంతో వెళ్తున్న ఒక్కసారిగా బస్సు అదుపుతప్పడంతో డ్రైవర్ అప్రమత్తమై కంట్రోల్ చేయడంతో పెను ప్రమాదం తప్పింది. బస్సులో సుమారు 36 మంది ప్రయాణికులు ఉన్నారు.


