భువనగిరి: అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందించి జిల్లాను అభివృద్ధిలో ముందంజలో ఉంచాలని ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య కోరారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక–99రోజుల కార్యచరణ ప్రణాళిక పై నూతనంగా ఎన్నికై న కౌన్సిలర్లు, సర్పంచ్‌లు, చైర్మన్‌న్లకు గురువారం స్థానిక వి కన్వెన్షన్‌లో నిర్వహించిన ఒక రోజు శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సర్పంచ్‌లు, వార్డు సభ్యులు, చైర్మన్‌న్లు గ్రామాలు, పట్టణాలలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. రెండు సంవత్సరాల వ్యవధిలో రైతు రుణమాఫీ, రైతు భరోసా,మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఇందిరమ్మ ఇళ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, నూతనరేషన్‌కార్డుల జారీ, సన్న బియ్యం వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రజా ప్రభుత్వం అమలు చేస్తోందని చెప్పారు. రానున్న ఎండకాలంలో నీటిఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ ప్రజలు మెచ్చేలా ప్రజాప్రతినిధులు అభివృద్ధి పనులు చేపట్టాలన్నారు. భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ గ్రామాలలో ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి పనులు చేపట్టాలన్నారు. ప్రభుత్వం నుంచి నిధులుమంజూరు అవుతున్న నేపథ్యంలో ప్రజలకు నచ్చేలా అభివృద్ధి పనులు చేయాలన్నారు. పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంజయ్‌కుమార్ మాట్లాడుతూ గ్రామాల్లో పారిశుద్ధ్యం, పరిశుభ్రత పాటించినట్లయితే అందంగా తయారవుతాయన్నారు. సెర్ప్ సీఈఓ, పంచాయతీ రాజ్ కమిషనర్ దివ్యదేవరాజన్ మాట్లాడుతూ కొత్తగా ఎన్నికై నప్రజాప్రతినిధులు పట్టుదలతో అభివృద్ధి పనులు చేపడితే విజయం సాధించవచ్చన్నారు. 15వ ఆర్థిక సంఘం ద్వారా మంజూరైన నిధులను దుర్వినియోగం చేయకుండా అభివృద్ధి పనుల కోసం ఖర్చు చేయాలన్నారు. ఈ సందర్భంగా 10 అంశాలపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ అనురాగ్‌జయంతి, అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు, ఎస్పీ అక్షాంశ్ యాదవ్, జెడ్పీ సీఈఓ శోభారాణి, సర్పంచ్‌లు, మున్సిపాలిటీ చైర్మన్లు, కౌన్సిర్లు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
ఫ ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య
ఫ భువనగిరిలో ప్రజాప్రతినిధులకు శిక్షణ


