యాదగిరిగుట్ట: నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అన్నారు. యాదగిరిగుట్ట పట్టణంలోని 7వ వార్డులో ఇందిరమ్మ ఇంటిని పూర్తి చేసుకొని శుక్రవారం గృహ ప్రవేశం చేసిన దూశెట్టి లలిత, రామచంద్రయ్య దంపతులకు నూతన వస్త్రాలు కానుకగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ పథకాలు అందే విధంగా కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ గుండ్లపల్లి వాణి భరత్‌గౌడ్, వైస్ చైర్‌పర్సన్ బరిగె రమ్య రాంచందర్, మున్సిపల్ కమిషనర్ లింగస్వామి, కౌన్సిలర్లు పెలిమెల్లి లావణ్య శ్రీధర్‌గౌడ్, బూడిద మధు, ముక్కెర్ల మల్లేష్ యాదవ్, బిట్టు సరోజ హరీష్, మాజీ ఎంపీపీ చీర శ్రీశైలం, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు భిక్షపతి, సీనియర్ నాయకులు గుండ్లపల్లి భరత్‌గౌడ్, ఎరుకల హేమేందర్ తదితరులున్నారు.


