యాదగిరిగుట్ట : యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయ హుండీల్లో భక్తులు సమర్పించుకున్న నగదు, నగలను ఆలయ ఈఓ భవానీ శంకర్, అనువంశిక ధర్మకర్త బి. నర్సింహమూర్తి ఆధ్వర్యంలో మంగళవారం సత్యనారాయణస్వామి వ్రత మండపంలో లెక్కించారు. ఈ లెక్కింపులో రూ.1,86, 44,511 నగదు, మిశ్రమ బంగారు 57గ్రాముల 500 మిల్లీగ్రాములు, మిశ్రమ వెండి 2 కిలోల 750 గ్రాములు వచ్చినట్లు ఈఓ వెల్లడించారు. వీటితో పాటు వివిధ దేశాలకు చెందిన కరెన్సీ వచ్చాయన్నారు. ఈ హుండీ ఆదాయం 28 రోజులదని ఈఓ పేర్కొన్నారు.


