కట్టంగూర్ : ఉపాధి హామీ పనులతో రైతులకు మేలు జరిగిందని జల సంచయ్–జల భగీరథ ఇంపాక్ట్ స్టడీ కేంద్ర బృందం సభ్యులు నవనీత, రాచీ గార్గ్, ప్రతీక్ కోర్‌డే అన్నారు. గురువారం వారు నకిరేకల్ క్లస్టర్ ఏపీడీ నర్సింహారావు, ఏపీఓ కడెం రాంమోహన్‌తో కలిసి కట్టంగూర్ మండలంలోని ఈదులూరు, కల్మెర, పరడ, కట్టంగూర్ గ్రామాల్లో ఉపాధి హామీ పథకంలో చేపట్టిన నీటి సంరక్షణ పనులను పరిశీలించారు. సోక్‌పిట్, అమృత్ సరోవర్, ఓవర్‌హెడ్ ట్యాంకు, చెక్ డ్యాం, ఫాంపాండ్, చేపల చెరువు పనులను పరిశీలించి వాటి ప్రయోజనాల గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బృందం సభ్యులు మాట్లాడుతూ.. నీటి నిల్వ పనులతో భూగర్భ జలాలు పెరిగి రైతులకు మేలు చేకూరిందన్నారు. నీటి వృథాను అరికట్టేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలన్నారు. వారి వెంట ఆయా గ్రామాల సర్పంచులు ముక్కాముల శ్యామలశేఖర్, తోటకూరి జలజ, కొలిపాక సురేందర్, ఇప్పలపల్లి అనిత, ఈసీ శ్రీధర్, టీఏ రమణ, పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్‌లు ఉన్నారు.
ఫ జల సంచయ్–జల భగీరథ
ఇంపాక్ట్ స్టడీ బృందం
ఫ కట్టంగూర్ మండలంలో
ఉపాధి హామీ పనుల పరిశీలన


