ఫ మరొకరికి గాయాలు
మిర్యాలగూడ టౌన్ : మిర్యాలగూడ మండలం శ్రీనివాస్‌నగర్ గ్రామంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందగా.. మరొకరికి గాయాలయ్యాయి. రూరల్ ఎస్‌ఐ మల్లికంటి లక్ష్మయ్య తెలిపిన వివరాల ప్రకారం.. పెన్‌పహాడ్ మండలం నాగులపాటి అన్నారం గ్రామానికి చెందిన శ్రీరాముల రాములు(50) తన సోదరుడితో కలిసి బైక్‌పై త్రిపురారం మండలం బెజ్జికల్‌లో బంధువుల అంత్యక్రియలకు హాజరయ్యారు. అక్కడి నుంచి తిరిగి వస్తుండగా.. మిర్యాలగూడ మండలం శ్రీనివాస్‌నగర్ గ్రామానికి రాగానే లారీ వారి బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాములు అక్కడికక్కడే మృతిచెందాడు. అతడి సోదరుడికి గాయాలు కాగా.. స్థానికులు ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. రాములు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
తండ్రి, కుమారుడికి తీవ్ర గాయాలు..
గరిడేపల్లి : మండలంలోని కీతవారిగూడెం గ్రామంలో శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రి, కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రభుత్వ ఉపాధ్యాయుడైన బాణోతు నాగేశ్వరరావు, ఆయన కుమారుడు జ్ఞానేశ్వర్ కలిసి బైక్‌పై రేగులగడ్డ తండా నుంచి వస్తుండగా.. కీతవారిగూడెం యూటర్న్ వద్ద కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తండ్రి, కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గాయపడిన ఇద్దరిని 108 వాహనంలో హుజూర్‌నగర్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం వారిని హైదరాబాద్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదానికి కారణమైన కారును అక్కడే వదిలేసి పరారైన వ్యక్తిని కోదాడకు చెందిన నాగుల్‌మీరాగా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ చలికంటి నరేష్ తెలిపారు.


