ఆత్మకూర్(ఎస్) : మండల పరిధిలోని ముక్కుడుదేవులపల్లి గ్రామానికి చెందిన పెద్ద చెరువు తూమును శుక్రవారం రాత్రి కొందరు వ్యక్తులు జేసీబీతో ధ్వంసం చేసినట్లు రైతులు ఆరోపిస్తున్నారు. చెరువు కింద కొంతమంది పొలాలు నీరు లేక ఎండుతున్నాయని రాత్రివేళ తూమును ధ్వంసం చేసి నీటిని అక్రమంగా బయటకు తరలిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. శనివారం ఉదయం రైతులు తిరిగి ఆ తూమును గడ్డితో పూడ్చివేశారు. స్థానిక రైతులు తూమును ధ్వంసం చేసిన విషయమై ఇరిగేషన్ అధికారులకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. చెరువు నీటిని అక్రమంగా తరలించకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.


