సాగర్‌లో మహారాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ | - | Sakshi
Sakshi News home page

సాగర్‌లో మహారాష్ట్ర ఎన్నికల కమిషనర్‌

Mar 22 2026 7:30 AM | Updated on Mar 22 2026 7:30 AM

నాగార్జునసాగర్‌ : మహారాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ దినేష్‌ వాగ్మరే శనివారం కుటుంబ సమేతంగా కలిసి నాగార్జునసాగర్‌ను సందర్శించారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఈవీఎంలు తయారుచేసే ఈసీఐఎల్‌ సంస్థ ఉన్నతాధికారులతో సమావేశమైన ఆయన.. శనివారం సాగర్‌కు విచ్చేశారు. విజయ్‌ విహార్‌ అతిథి గృహానికి చేరుకున్న ఆయనకు తిరుమలగిరి(సాగర్‌) తహసీల్దార్‌ అనిల్‌కుమార్‌, ప్రొటోకాల్‌ ఆర్‌ఐ దండ శ్రీనివాస్‌రెడ్డి, విజయ్‌ విహార్‌ మేనేజర్‌ కిరణ్‌ స్వాగతం పలికారు. అనంతరం దినేష్‌ వాగ్మరే తన కుటుంబ సభ్యులతో కలిసి లాంచీలో నాగార్జునకొండ మ్యూజియాన్ని సందర్శించారు. అనంతరం బుద్ధవనంలో బుద్ధుడి పాదాల వద్ద పుష్పాంజలి ఘటించారు. వారిని బుద్ధవనం ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ శాసన, ఎస్టేట్‌ మేనేజర్‌ రవి చంద్ర సత్కరించారు. వారి వెంట ఈసీఐఎల్‌ సంస్థ ప్రతినిధి సౌరబ్‌, లైజనింగ్‌ ఆఫీసర్లు సుధీర్‌రెడ్డి, పాండు, అభిషేక్‌, టూరిజం గైడ్‌ సత్యనారాయణ, స్థానిక ఎస్‌ఐ ముత్తయ్య తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement