నిరాహార దీక్షను విజయవంతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

నిరాహార దీక్షను విజయవంతం చేయాలి

Mar 22 2026 7:30 AM | Updated on Mar 22 2026 7:30 AM

కోదాడరూరల్‌ : ఎన్నికల సమయంలో మాదిగలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 30న హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్‌ వద్ద నిర్వహించనున్న నిరాహార దీక్షను విజయవంతం చేయాలని టీ ఎమ్మార్పీఎస్‌ అనుబంధ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చింత బాబుమాదిగ పిలుపునిచ్చారు. శనివారం కోదాడ పట్టణంలో దీక్ష పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. ఎన్నికలకు ముందు ప్రకటించిన చేవెళ్ల డిక్లరేషన్‌ను అమలు చేయకుండా కాంగ్రెస్‌ ప్రభుత్వం మాదిగలను మోసం చేస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు పల్లేటి లక్ష్మణ్‌, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ బచ్చలకూరి నాగరాజు, బాణాల అబ్రహం, జానయ్య, రమేష్‌, ఆదినారాయణ, యాదగిరి, నాగేశ్వరరావు, స్వామి, హుస్సేన్‌, బాబురావు, కాశీ, ప్రసాద్‌, వినోద్‌, రాజేష్‌ తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement