జిల్లాలోని భౌగోళిక ప్రాంతాల్లో అత్యధికంగా అటవీ విస్తీర్ణం రాష్ట్రంలోని ములుగు జిల్లాలోనే 64.64 శాతం ఉంది. ఇక యాదాద్రి జిల్లాలో 9.66 శాతం, నల్లగొండలో 9.57 శాతం, సూర్యాపేటలో 4.67 శాతం అటవీ విస్తీర్ణం ఉన్నట్లు ఇండియన్ ఫారెస్ట్ సర్వే–2023 వెల్లడించింది.
జిల్లాలో ప్రస్తుతం 515 రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యం పంపిణీ జరుగుతోంది. ఇందులో ఆహార భద్రతా కార్డులు 2,36,555, అంత్యోదయ కార్డులు 13,737 ఉన్నాయి. అయితే జిల్లాలో నిరుపేదలకు ఇచ్చే అన్నపూర్ణ కార్డులు సున్నాగా నమోదయ్యాయి.


