23 గొర్రెలు మృత్యువాత | - | Sakshi
Sakshi News home page

23 గొర్రెలు మృత్యువాత

Mar 11 2026 9:21 AM | Updated on Mar 11 2026 9:21 AM

మునగాల : మండలంలోని కొక్కిరేణి గ్రామంలో మంగళవారం విద్యుదాఘాతానికి గురై 23 గొర్రెలు మృతిచెందాయి. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. కొక్కిరేణి గ్రామానికి చెందిన చింతకాయల అరుణ్‌యాదవ్‌కు చెందిన గొర్రెల మంద నీటి కోసం గ్రామ శివారులోని గురప్పకుంట చెరువు వద్దకు చేరుకున్నాయి. ఇదే చెరువులో తిమ్మారెడ్డిగూడెం గ్రామానికి చెందిన కొందరు రైతులు సాగునీటి కోసం విద్యుత్‌ (ఓపెన్‌ వెల్‌) మోటార్లు అమర్చారు. దీంతో చెరువులో నీరు తాగేందుకు వెళ్లిన 23 గొర్రెలు విద్యుదాఘాతానికి గరై మృతిచెందాయి. అంతేకాకుండా అరుణ్‌యాదవ్‌ కూడా విద్యుదాఘాతానికి గురి కాగా ప్రాణప్రాయం నుంచి బయటపడ్డాడు. బాధితుడికి ప్రభుత్వం రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని గొర్రెల కాపరుల సంఘం కోదాడ నియోజకవర్గ అధ్యక్షుడు ఈదుల కృష్ణయ్యయాదవ్‌ డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement