చౌటుప్పల్: హైదరాబాద్– విజయవాడ జాతీయ రహదారిపై శనివారం ట్రాఫిక్ స్తంభించింది. చౌటుప్పల్ మండల పరిధిలోని కొయ్యలగూడెం గ్రామ శివారులో జాతీయ రహదారిపై హైదరాబాద్ మార్గంలో వెళ్తున్న ట్యాంకర్, ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టి రహదారిపై అడ్డంగా నిలిచిపోయింది. దీంతో వాహనాల ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో కిలోమీటర్ల మేర వాహనాలు బారులుదీరాయి. సమాచారం అందుకున్న పోలీసులు క్రేన్‌లను తెప్పించి ట్యాంకర్ లారీని రోడ్డు పైనుంచి పక్కకు జరిపించి, ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. వాహనదారులు, ప్రయాణికులు సుమారు మూడు గంటలపాటు ట్రాఫిక్‌లో చిక్కుకొని తీవ్రంగా ఇబ్బందిపడ్డారు.


