భానుడి భగభగలు | - | Sakshi
Sakshi News home page

భానుడి భగభగలు

Mar 29 2026 7:27 AM | Updated on Mar 29 2026 7:27 AM

యాదగిరి క్షేత్రంలో శాస్త్రోక్త పూజలు

అత్యధిక ఉష్ణోగ్రత నమోదైన

ప్రాంతాలు ఇలా (డిగ్రీల సెల్సియస్‌లో..)

భువనగిరి 39.2

చౌటుప్పల్‌ 39.9

ఆలేరు 39.0

యాదగిరిగుట్ట 39.1

బీబీనగర్‌ 39.6

యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో శనివారం భక్తజనుల ఆర్జిత పూజలు శాస్త్రోక్తంగా కొనసాగాయి. వేకువజామునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు శ్రీస్వామి అమ్మవార్లకు సుప్రభాతం, అభిషేకం, బాలభోగం, ఆరాధన, సహస్ర నామార్చన, శ్రీస్వామి అమ్మవార్ల నిత్యకల్యాణ జరిపించారు. సాయంత్రం జోడు సేవలను ఊరేగించారు.

పెరుగుతున్న పగటి ఉష్ణోగ్రతలు

జలాల్‌పురంలో గరిష్టంగా 41 డిగ్రీలు నమోదు

భువనగిరిటౌన్‌ : ఎండలు మండుతున్నాయి. దీంతో రోజు రోజుకు ఉష్ణోగ్రతల తీవ్రత పెరుగుతోంది. తెలంగాణ డెవలప్‌మెంట్‌ ప్లానింగ్‌ సొసైటీ శనివారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం జిల్లాలోని పలు మండలాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యాయి. అత్యధికంగా భూదాన్‌పోచంపల్లి మండలంలోని జలాల్‌పురం గ్రామంలో 41 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది. వలిగొండ మండలం వెంకటాపురంలో 40.3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదై ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేసింది. జిల్లావ్యాప్తంగా దాదాపు అన్ని మండలాల్లోనూ 37 డిగ్రీల నుంచి 41 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం 10 గంటల నుంచే ఎండ ప్రభావం మొదలవుతుండడంతో వాహనదారులు, బాటసారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వేసవి తీవ్రత దష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. మరో నాలుగు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

వీధి కుక్కలను నియంత్రించాలి

కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి

సాక్షి, యాదాద్రి : వీధి కుక్కలను నియంత్రించి వాటి దాడులను నుంచి ప్రజలకు రక్షణ కల్పించాలని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి అధికారులను ఆదేశించారు. శనివారం భువనగిరి కలెక్టరేట్‌లోని మినీ మీటింగ్‌ హాల్‌లో ఎస్పీ అక్షాంశ్‌ యాదవ్‌, అదనపు కలెక్టర్‌ భాస్కర్‌రావుతో కలిసి నిర్వహించిన జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో వీధి కుక్కల బెడద అధికంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి, ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి కుక్కలను బంధించాలన్నారు. కుక్కకాటు బాధితులకు యాంటీ రేబిస్‌ టీకాలు వేయాలన్నారు. కుక్కల నియంత్రణకు స్టెరిలైజేషన్‌ ఆపరేషన్లు చేపట్టాలన్నారు. అధికారులకు పలు సూచనలు చేశారు. ఎస్పీ అక్షాంశ్‌ యాదవ్‌ మాట్లాడుతూ కుక్కలు రోడ్లపై తిరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి విష్ణువర్ధన్‌రెడ్డి, ఆర్‌ అండ్‌ బీ శాఖ అధికారి సరిత, పశుసంవర్ధక శాఖ అధికారి జానయ్య, జిల్లా విద్యాశాఖ అధికారి సత్యనారాయణ, .జిల్లా వైద్యశాఖ అధికారి మనోహర్‌, జిల్లా రవాణా శాఖ అధికారి సాయికృష్ణ, మున్సిపల్‌ కమిషనర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

2,193 కేసులు పరిష్కారం

భువనగిరిటౌన్‌ : పెండింగ్‌ కేసుల పరిష్కారం విషయంలో రాజీమార్గమే రాజమార్గమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షులు ఎ.జయరాజు అన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో భువనగిరి కోర్టు ఆవరణలో ఏర్పాటు చేసిన జాతీయ లోక్‌అదాలత్‌లో ఆయన మాట్లాడారు.కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న రాజీ పడదగిన కేసులను లోక్‌ అదాలత్‌ ద్వారా పరిష్కరించుకోవడం వల్ల కక్షిదారులకు సమయం, డబ్బు వృథా కాకుండా ఉంటాయన్నారు. ఒక కుటుంబ వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకున్న భార్యాభర్తలను న్యాయమూర్తి ప్రత్యేకంగా అభినందించారు. జిల్లావ్యాప్తంగా అన్ని కోర్టుల్లో నిర్వహించిన జాతీయ లోక్‌ అదాలత్‌ కార్యక్రమంలో క్రిమినల్‌ కేసులు 2,163, సివిల్‌ కేసులు 7, పీఎల్‌సీ కేసులు 23తో కలిపి మొత్తం 2,193 కేసులు పరిష్కారమయ్యాయి. రాజీ కుదిరిన కక్షిదారులకు ఈ సందర్భంగా న్యాయమూర్తుల చేతుల మీదుగా అవార్డు పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి పి.ముక్తిదా, పోక్సో కోర్టు స్పెషల్‌ జడ్జి మిలింద్‌ కాంబ్లీ, ప్రధాన జూనియర్‌ సివిల్‌ జడ్జి స్వాతి, రెండవ తరగతి మెజిస్ట్రేట్‌ జ్యోతిరావు, లోక్‌ అదాలత్‌ సభ్యులు జి.నాగేంద్రమ్మ, కె.మల్లేష్‌, సీహెచ్‌.ఐలయ్య, కె.గోపాల్‌రావు, న్యాయవాదులు, పోలీస్‌ అధికారులు పాల్గొన్నారు.

జనగణన పారదర్శకంగా చేపట్టాలి

సాక్షి, యాదాద్రి : జనగణనను పారదర్శకంగా, సమగ్రంగా నిర్వహించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ భాస్కర్‌రావు అన్నారు. శనివారం భువనగిరి కలెక్టరేట్‌లో జనగణన–2027 ఫేజ్‌–1 గృహాల గణనకు సంబంధించి క్షేత్రస్థాయి శిక్షకుల (ఫీల్డ్‌ ట్రైనర్స్‌)కు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మే 11 నుంచి ప్రారంభమయ్యే గృహాల గణనలో ఎలాంటి తప్పులకు తావు లేకుండా నిర్వహించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా జనగణన అధికారి వెంకటరమణ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

సదరమ్‌ కేసులను త్వరగా పరిష్కరించాలి

భువనగిరిటౌన్‌ : పెండింగ్‌లో ఉన్న సదరమ్‌ కేసులను త్వరగా పరిష్కరించాలని అదనపు కలెక్టర్‌ భాస్కర్‌రావు అన్నారు. శనివారం సదరమ్‌ క్యాంపుల నిర్వహణ, యూడీఐడీ దరఖాస్తుల పురోగతిపై హైదరాబాద్‌ నుంచి సెర్ప్‌ సీఈఓ దివ్య నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరైన అనంతరం జిల్లా కలెక్టరేట్‌లో అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఈ సమావేశంలో డీఆర్‌డీఓ నాగిరెడ్డి, భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రి ఆర్‌ఎంఓ డాక్టర్‌ కిరణ్‌, పెన్షన్‌ ఏపీఎం సుమన్‌, సదరం విభాగపు సిబ్బంది పాల్గొన్నారు.

భువనగిరిటౌన్‌ : పని ప్రదేశాల్లో మహిళలకు రక్షణ వాతావరణం కల్పించడం సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్‌ఓ) జయమ్మ అన్నారు. శుక్రవారం భువనగిరి జిల్లా కేంద్రంలోని వెటర్నరీ మీటింగ్‌ హాల్‌లో ఆక్షన్‌ ఎయిడ్‌ సంస్థ ఆధ్వర్యంలో పోష్‌ చట్టం–2013పై వివిధ ప్రభుత్వ శాఖల కమిటీల సభ్యులకు నిర్వహించిన శిక్షణలో ఆమె మాట్లాడారు. జిల్లాలోని అన్ని సంస్థల్లో నిబంధనల ప్రకారం అంతర్గత కమిటీలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అనంతరం పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆక్షన్‌ ఎయిడ్‌ ప్రతినిధి వందన పాల్‌, జిల్లా సంక్షేమాధికారి నరసింహరావు, ఉపాధి కల్పనాధికారి సాహితీ, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ యశోద, హ్యూమన్‌ రైట్స్‌ డిఫెండర్‌ సురుపంగ శివలింగం, వివిధ శాఖల సీడీపీఓలు, వైద్యులు, ఆక్షన్‌ ఎయిడ్‌ సంస్థకు చెందిన 85 మంది ప్రతినిధులు పాల్గొన్నారు.

పోస్టర్‌ ఆవిష్కరిస్తున్న అధికారులు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు

టెన్త్‌ పరీక్షకు

12 మంది గైర్హాజరు

భువనగిరి : జిల్లా వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు కొనసాగుతున్నాయి. శనివారం 50 కేంద్రాల్లో ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరిగిన గణిత పరీక్ష జరిగింది. దీనికి 8,930 మంది విద్యార్థులు హాజరు కావాల్సిందిగా 8,918 మంది హాజరు కాగా 12 మంది విద్యార్థులు గైరాజరైనట్లు జిల్లా విద్యా శాఖ అధికారి (డీఈఓ) సత్యనారాయణ తెలిపారు

ఫ అన్ని కోర్టుల్లో జాతీయ మెగా లోక్‌అదాలత్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement