శ్రీరాముడికి పట్టాభిషేకం | - | Sakshi
Sakshi News home page

శ్రీరాముడికి పట్టాభిషేకం

Mar 29 2026 6:44 AM | Updated on Mar 29 2026 6:44 AM

యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రానికి అనుబంధంగా ఉన్న శ్రీపర్వత వర్థిని సమేత రామలింగేశ్వరస్వామి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. శనివారం ఉదయం శివాలయంలో సీతారామచంద్రస్వామి వారికి నిత్యారాధనలు నిర్వహించారు. మధ్యాహ్నం స్వామివారికి పట్టాభిషేకం జరిపించారు. సాయంత్రం నిత్యారాధనలు, రాత్రి 7 గంటల నుంచి 8.30గంటల వరకు శివాలయ యాగ మండపంలో సహస్రనామార్చనలు, నివేదన, నీరాజన, మంత్ర పుష్ప కార్యక్రమాలు చేపట్టారు. ఆయా వేడుకల్లో ఆలయ అనువంశిక ధర్మకర్త బి.నర్సింహమూర్తి, పూజారులు, భక్తులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement