న్యూఢిల్లీ చేనేత ఎగ్జిబిషన్‌లో పుట్టపాక వాసి స్టాల్‌ | - | Sakshi
Sakshi News home page

న్యూఢిల్లీ చేనేత ఎగ్జిబిషన్‌లో పుట్టపాక వాసి స్టాల్‌

Mar 29 2026 6:44 AM | Updated on Mar 29 2026 6:44 AM

సంస్థాన్‌ నారాయణపురం: న్యూఢీల్లీలోని టీఈహెచ్‌ బజారులో నిర్వహించిన చేనేత ఎగ్జిబిషన్‌లో తెలుగు (తెలంగాణ, ఏపీ) రాష్ట్రాల నుంచి సంస్థాన్‌ నారాయణపురం మండలం పుట్టపాక గ్రామానికి అవకాశం లభించింది. ఈ స్టాల్‌లో గ్రామానికి చెందిన జాతీయ చేనేత అవార్డు గ్రహీత ఆనందం నాగరాజు స్టాల్‌ ఏర్పాటు చేశారు. తేలియా రూమాల్‌ వస్త్రాలు, సింగిల్‌ ఇక్కత్‌, డబుల్‌ ఇక్కత్‌ వివిధ రకాల దుస్తులు, కాటన్‌, సిల్క్‌, శారీస్‌, దుప్పట్లను ప్రదర్శించినట్లు తెలిపారు.

యువకుడు బ్రెయిన్‌ డెడ్‌

అవయవదానం

చేసిన కుటుంబసభ్యులు

గుండాల : బెయ్రిన్‌ డెడ్‌ అయిన యువకుడి అవయవాలను కుటుంబసభ్యులు దానం చేసి నలుగురి జీవితాల్లో వెలుగులు నింపారు. గుండాల మండలం మా సాన్‌పల్లి గ్రామానికి చెందిన బత్తిని ఎల్లయ్య, మహేశ్వరిల కుమారుడు బత్తిని హరీష్‌ గౌడ్‌ హైదరాబాద్‌లో ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తున్నాడు. ఈ నెల 24న రాత్రి ఉప్పల్‌లోని తన రూమ్‌కు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ప్రమాదవశాత్తు వాహనం విద్యుత్‌ స్తంభానికి ఢీకొని తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో కోమాలోకి వెళ్లాడు. చికిత్స నిమిత్తం మలక్‌పేటలోని ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించగా బ్రెయిన్‌ డెడ్‌ అయినట్లు డాక్టర్లు శుక్రవారం నిర్ధారించారు. తమ కుమారుడి అవయవాలను ధీన్‌దార్‌ స్వచ్ఛంద సంస్థకు దానం చేసేందుకు కుటుంబ సభ్యులు అంగీకరించారు. శనివారం ఉదయం స్వచ్ఛంద సంస్థ వారు యువకుడి అవయవాలను సేకరించి, మృతదేహాన్ని బాధిత కుటుంబానికి అప్పగించారు.

బైక్‌ షోరూంకు రూ.లక్షా 75 వేలు జరిమానా

నల్లగొండ : బైక్‌ షోరూంకు రూ.లక్షా75 వేలు జరిమానా విధిస్తూ నల్లగొండ వినియోగదారుల కమిషన్‌ తీర్పునిచ్చింది. చౌటుప్పల్‌కు చెందిన బొమ్మ మల్లేష్‌ 2023లో చౌటుప్పల్‌లోని హైటెక్‌ మోటార్స్‌లో హీరో గ్లామర్‌ బైక్‌ కొనుగోలు చేశాడు. బైక్‌ సరిగ్గా నడవకపోవడంతో షోరూంను సంప్రదించాడు. నిర్వాహకులు స్పందించకపోవడంతో నల్లగొండ వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించాడు. పూర్ణచందర్‌ వాదనలతో ఏకీభవించిన కమిషన్‌ బాధితుడికి రూ.1.35లక్షలు బైక్‌ ఖరీదు, రూ. 30 వేలు జరిమానా, రూ.10 వేలు కోర్టు ఖర్చులు చెల్లించాలని శనివారం తీర్పునిచ్చింది. పరిహారాన్ని మొత్తం 9 శాతం వడ్డీతో చెల్లించాలని తీర్పులో పేర్కొన్నారు

కారు దగ్ధం

భువనగిరి( బీబీనగర్‌): బీబీనగర్‌ మండలం కొండమడుగు మెట్టు వద్ద కారులో అకస్మాత్తుగా మంటలు రావడంతో దగ్ధమైంది. హనుమకొండ కు చెందిన కోటకొండవాది రాజు తన భార్యతో కలిసి శనివారం హనుమకొండ నుంచి కారులో హైదరాబాద్‌ కు వెళ్లేందుకు బయలుదేరాడు. ఈ క్రమంలో ఉదయం బీబీనగర్‌ మండలం కొండమడుగు మెట్టు వద్దకు చేరుకోగానే కారులో అకస్మాత్తుగా మంటలు వచ్చాయి. గమనించిన రాజు కారు నిలిపివేసి భార్యతో కలిసి బయటకు వచ్చాడు. అనంతరం కారులో మంటలు వ్యాపించి పూర్తిగా దగ్ధమైంది. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు సీఐ ప్రభాకర్‌ రెడ్డి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement