మర్రిగూడ(చింతపల్లి): కారు అదుపుతప్పి చెట్టుకు ఢీకొని ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ సంఘటన బుధవారం కుర్మేడు సమీపంలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. దేవరకొండ మండలం తూర్పుపల్లెకు చెందిన ముగ్గురు సోదరులు నాగవరం వెంకటేశ్వర్‌రావు, గోవర్ధన్‌రావు(63), రాజేందర్‌రావులు పని నిమిత్తం గ్రామం నుంచి హైదరాబాద్‌కు కారులో బయలుదేరారు. కుర్మేడు సమీపంలో వారు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి చెట్టుకు ఢీకొనడంతో గోవర్ధన్‌రావు అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడితోపాటు కారులో ప్రయాణిస్తున్న అతడి సోదరులకు స్వల్ప గాయాలయ్యాయి. మృతుడి భార్య నాగవరం లక్ష్మీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్‌ఐ ముత్యాల రామ్మూర్తి తెలిపారు.


