నాగార్జునసాగర్: నాగార్జునసాగర్‌లో జెన్‌కో పవర్‌హౌజ్ ప్రాంగణంలో నిర్వహిస్తున్న 55వ జాతీయ భద్రతా వారోత్సవాలు మంగళవారంతో ముగిశాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నల్లగొండ డిప్యూటీ చీఫ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ శ్రీదేవి హాజరై మాట్లాడారు. ఏడీలు, ఏఈలు, ఉద్యోగులతో భద్రతా ప్రతిజ్ఞ చేయించారు. పరిశ్రమల్లో భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రతి ఉద్యోగి సురక్షితంగా పనిచేయడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని అధికారులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జెన్‌కో చీఫ్ ఇంజనీర్ మంగేష్‌కుమార్, ఎస్‌ఈలు రామకృష్ణారెడ్డి, రఘురాంరెడ్డి, ఫైర్ అండ్ సేఫ్టీ ఏడీ రజనీ, ఏఈ అజమ్ తదితరులు పాల్గొన్నారు.


