వినూత్నంగా ఉగాది వేడుకలు | - | Sakshi
Sakshi News home page

వినూత్నంగా ఉగాది వేడుకలు

Mar 20 2026 9:21 AM | Updated on Mar 20 2026 9:21 AM

మోత్కూరు : మోత్కూరు పట్టణంలో గురువారం ఉగాది పండుగను వినూత్నంగా జరుపుకున్నారు. మహిళలు బోనాలతో ఊరేగింపుగా వచ్చి స్థానిక జెడ్పీహెచ్‌ఎస్‌కు చేరుకున్నారు. అక్కడ నుంచి చెరువు కట్ట వద్ద గల తూర్పు ముత్యాలమ్మ ఆలయం, అంగడి బజార్‌లో ఉన్న పడమటి ముత్యాలమ్మ ఆలయానికి ఊరేగింపుగా చేరుకుని దేవతలకు నైవేద్యం సమర్పించారు. అంతకుముందు స్థానిక కల్వల సుధాకర్‌రావు నివాసం నుంచి వారి కుమారుడు సుజిత్‌కుమార్‌తో పాటు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గడ్డం స్వప్నసోమనర్సయ్య, వైస్‌ చైర్మన్‌ పల్లెర్ల వెంకన్నగుప్తా, ఆలయ కమిటీ చైర్మన్‌ గుండగోని రామచంద్రుగౌడ్‌, కౌన్సిలర్లు పన్నాల శ్రీవిద్య, కూరెళ్ల ప్రమీల, మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ పన్నాల శ్రీనివాస్‌రెడ్డి తదితరులు చెరువు కట్ట ముత్యాలమ్మ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు.

ఎడ్ల బండ్ల ప్రదర్శనలు.. బైక్‌ విన్యాసాలు..

ఉగాది వేడుకల్లో భాగంగా ఎడ్ల బండ్ల ప్రదర్శనలు, బైక్‌ల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఎడ్ల బండ్లను వివిధ పార్టీల జెండాలతో అలంకరించి ప్రదర్శన నిర్వహించారు. శివసత్తుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఈ వేడుకలను మున్సిపల్‌ కమిషనర్‌ కె. సతీష్‌కుమార్‌ పర్యవేక్షించారు. ఇన్‌స్పెక్టర్‌ సి. వెంకటేశ్వర్లు బందోబస్తు ఏర్పాటు చేశారు.

మోత్కూరులో బోనాలు

ఆకట్టుకున్న ఎడ్ల బండ్ల ప్రదర్శనలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement