యాదగిరిగుట్ట : యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రధానార్చకుడు కాండూరి వెంకటాచార్యులు, అనుబంధ ఆలయమైన శ్రీపర్వత వర్ధిని సమేత రామలింగేశ్వరస్వామి ఆలయ ప్రధాన అర్చకుడు జి. నర్సింహమూర్తి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉగాది పురస్కారాలు అందుకున్నారు. గురువారం హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో సీఎం రేవంత్‌రెడ్డి, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ, దేవాదాయశాఖ కమిషనర్ హనుమంతరావు చేతులమీదుగా వారు ఉగాది పురస్కారాలతో పాటు సత్కారం అందుకున్నారు. ఈ వేడుకల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి జూపల్లి కృష్ణారావు, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ పాల్గొన్నారు.


