యాదగిరిగుట్ట : ఇంటర్ పరీక్షలు ముగియడంతో యాదగిరి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునేందుకు భక్తులు శని వారం భారీగా తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాలు, క్యూలైన్లు, మాడ వీధులు, ప్రసాద విక్రయశాల, శివాలయం, లక్ష్మీ పుష్కరిణి, కల్యాణ కట్ట, సత్యనారాయణస్వామి వ్రత మండపాలు భక్తులతో సందడిగా మారాయి. స్వామివారి ధర్మ దర్శనానికి 3గంటలకు పైగా, వీఐపీ దర్శనానికి గంట సమయం పట్టింది. స్వామివారిని 40వేల మంది దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. వివిధ పూజలతో నిత్యాదాయం రూ.34,24,189 వచ్చి నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.
ఫ యాదగిరిగుట్టలో భక్తుల రద్దీ


