ఉపాధి హామీలో భేష్!
● ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య
యాదగిరిగుట్ట : యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటూ భగత్‌సింగ్ స్ఫూర్తితో దేశాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పిలుపునిచ్చారు. యాదగిరిగుట్ట పట్టణంలోని కొత్త గుండ్లపల్లిలో శనివారం ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో స్టాప్ డ్రగ్స్–స్టార్ట్ స్పోర్ట్స్ పేరిట చేపట్టిన వాలీబాల్ టోర్నమెంట్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా భగత్‌సింగ్ ఫ్లెక్సీకి పూలమాల వేసి నివాళుర్పించి మాట్లాడారు. నేటి యువత క్రీడలపై దృష్టిసారించి ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర, మున్సిపల్ చైర్‌పర్సన్ గుండ్లపల్లి వాణి భరత్‌గౌడ్, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి పేరబోయిన మహేందర్, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి బోలగాని సత్యనారాయణ, జిల్లా కార్యవర్గ సభ్యులు కళ్లెం కృష్ణ, కొల్లూరి రాజయ్య, బండి జంగమ్మ, మండల కార్యదర్శి కళ్లేపల్లి మహేందర్, పట్టణ కార్యదర్శి బబ్బురి శ్రీధర్, కౌన్సిలర్ పి.లావణ్య శ్రీధర్ పాల్గొన్నారు.
యాదగిరి క్షేత్రంలో విశేష పూజలు
యాదగిరిగుట్ట : శ్రీయాదగిరి లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో శనివారం భక్తల మధ్యన నిత్య ఆర్జిత కై ంకర్యాలు విశేషంగా జరిగాయి. వేకువజామునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు శ్రీస్వామి వారికి సుప్రభాతం, అభిషేకం, బాలభోగం, ఆరాధన, సహస్ర నామార్చన పూజలను జరిపించారు. సాయంత్రం భక్తుల కోలాహలం నడుమ జోడు సేవలను మంగళ వాయిద్యాలతో ఊరేగించారు.
నేడు భువనగిరికి పీసీసీ అధ్యక్షుడి రాక
భువనగిరిటౌన్ : భువనగిరిలో ఆదివారం నిర్వహించే డీసీసీ నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి టీ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్‌గౌడ్, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్‌రెడ్డి ముఖ్య అతిథులుగా రానున్నట్లు ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు బీర్ల ఐలయ్య శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు హాజరై విజయవంతం చేయాలని కోరారు.
ఉపాధి హామీ పథకం అమలులో జిల్లా గణనీయమైన పురోగతి సాధించింది. గతేడాది 7వ స్థానంలో ఉండగా, ఈసారి 93.30 శాతం పనులు పూర్తి చేసి 5వ స్థానానికి ఎగబాకింది. ఉమ్మడి జిల్లాలోని ఇతర ప్రాంతాల కంటే యాదాద్రి మెరుగైన పనులు చేపట్టింది.


