పడవ మీద పడి వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

పడవ మీద పడి వ్యక్తి మృతి

Mar 13 2026 9:08 AM | Updated on Mar 13 2026 9:08 AM

గరిడేపల్లి : లారీలో తరలిస్తున్న పడవ రోడ్డు మధ్యలో సెంట్రల్‌ లైటింగ్‌ స్తంభానికి తగిలి బైక్‌పై వెళ్తున్న వ్యక్తిపై పడడంతో మృతిచెందాడు. ఈ ఘటన గరిడేపల్లి మండల కేంద్రంలో గురువారం జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పాలకీడు మండలం బెట్టితండా గ్రామానికి చెందిన మాలోతు లక్ష్మ(37) గురువారం కేసు విచారణ నిమిత్తం బైక్‌పై హుజూర్‌నగర్‌ కోర్టుకు బయల్దేరాడు. అదే సమయంలో ఏపీలోని ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి గ్రామానికి చెందిన కాప శ్రీనివాస్‌ రాజమండ్రి నుంచి పడవను లారీలో సుంకేసుల డ్యాం వద్దకు తీసుకెళ్తున్నాడు. ఈ క్రమంలో గరిడేపల్లి మండల కేంద్రంలోకి రాగానే లారీపై ఉన్న పడవ రోడ్డు మధ్యలోని సెంట్రల్‌ లైటింగ్‌ స్తంభానికి తగలి రోడ్డుకు అటువైపు బైక్‌పై వెళ్తున్న మాలోతు లక్ష్మ తలపై పడింది. ఈ ప్రమాదంలో లక్ష్మ తలకు తీవ్ర గాయాలయ్యాయి. అతడిని హుజూర్‌నగర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడి భార్య లక్ష్మీబాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ చలికంటి నరేష్‌ తెలిపారు. మృతుడికి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.

లారీలో పడవ తరలిస్తుండగా స్తంభానికి తగిలి మీదపడటంతో ఘటన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement