మఠంపల్లి: మఠంపల్లి మండల కేంద్రానికి చెందిన మన్నెం వెంకటరెడ్డి, సరోజనమ్మ దంపతుల పెద్దకుమారుడు వ్యాయామ ఉపాధ్యాయుడు (పీడీ) మన్నెం సీతారాంరెడ్డి ఆలిండియా సివిల్ సర్వీసెస్ వాలీబాల్ క్రీడాపోటీలకు (నేషనల్ గేమ్స్) తెలంగాణ రాష్ట్రం నుంచి ఎంపికయ్యారు. గతేడాది సెప్టెంబర్‌లో హైదరాబాద్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి వాలీబాల్ ఎంపిక పోటీల్లో ప్రతిభ కనబరిచారు. ఈనెల 20 నుంచి 25వరకు న్యూఢిల్లీలో జరగనున్న వాలీబాల్ పోటీల్లో రాష్ట్రం తరుపున ఆడనున్నారు. ప్రస్తుతం ఆయన చిలుకూరు మండలం పాలెఅన్నారం ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు వాలీబాల్ క్రీడలో శిక్షణ ఇస్తున్నారు.


