శాలిగౌరారం: మండలంలోని అడ్లూరు గ్రామానికి చెందిన దేశెట్టి రంజిత్‌కుమార్ డైరెక్టర్‌గా తొలి సినిమాను తీస్తున్నారు. అందుకు సంబంధించి శుక్రవారం హైదరాబాద్‌లోని మాదాపూర్‌లోగల కాకతీయహిల్స్‌లోని శ్రీవేంకటేశ్వర దేవాలయంలో పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమానికి ప్రముఖ సినీ దర్శకులు బుచ్చిబాబు, కొరటాల శివ హాజరయ్యారు. మల్టీమీడియాలో ఎడిటింగ్ స్పెషలైజేషన్‌తో 2009లో డిగ్రీ విద్యను పూర్తిచేసిన రంజిత్‌కుమార్ గత 15 సంవత్సరాలుగా అనేక సినిమాలకు సహదర్శకుడిగా పనిచేశారు. స్వాన్ ఎంటర్‌టైన్‌మెంట్, శుభకరి ప్రొడక్షన్ సంయుక్త నిర్మాణంలో రవీంద్రతేజ్, ఆరియామోడీ నటీనటులుగా ‘లవ్‌వాలా’ అనే సినిమాకు రంజిత్‌కుమార్ దర్శకుడిగా తన మొదటి సినిమాను తీస్తున్నారు. రంజిత్‌కుమార్ తండ్రి జనార్దన్ అడ్లూరు గ్రామపంచాయతీలో ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తుండగా, తల్లి భద్రమ్మ గృహిణి. రంజిత్‌కుమార్ సినిమా డైరెక్టర్ కావడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


