చౌటుప్పల్ : హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారి దాటుతున్న వ్యక్తిని ఆటో ఢీకొనడంతో మృతిచెందాడు. ఈ ఘటన చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని తంగడపల్లి క్రాస్ రోడ్డు వద్ద సోమవారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిట్యాల మండలం పిట్టంపల్లి గ్రామానికి చెందిన ఈసం సత్తయ్య(43) కుటుంబంతో కలిసి చౌటుప్పల్‌లోని రాంనగర్‌కాలనీలో నివాసముంటూ తాపీ మేసీ్త్రగా పనిచేస్తున్నాడు. రోజుమాదిరిగా సోమవారం కూడా చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని తంగడపల్లి గ్రామానికి పనికి వెళ్లాడు. పని పూర్తయిన తర్వాత రాత్రి ఆటోలో వచ్చి తంగడపల్లి క్రాస్‌రోడ్డు వద్ద దిగాడు. అక్కడి నుంచి ఇంటికి వెళ్లేందుకు గాను సత్తయ్య హైదరాబాద్–విజయవాడ హైవే దాటుతుండగా ఆటో ఢీకొట్టింది. దీంతో రోడ్డుపై ఎగిరిపడడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు అతడిని అంబులెన్స్‌లో చౌటుప్పల్ ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి అన్న ఈసం బాబు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మన్మథకుమార్ తెలిపారు.


