యాదగిరీశుడి ఆలయంలో భక్తుల రద్దీ | - | Sakshi
Sakshi News home page

యాదగిరీశుడి ఆలయంలో భక్తుల రద్దీ

Mar 30 2026 7:15 AM | Updated on Mar 30 2026 7:15 AM

యాదగిరిగుట్ట: యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. ఆదివారం సెల వు రోజు కావడంతో భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో స్వామివారి ధర్మ దర్శనానికి 3 గంటలు, వీఐపీ దర్శనానికి గంట సమయం పట్టింది. భక్తులు అధికంగా రావడంతో ఆలయ మాడ వీధులు, క్యూలైన్లు, క్యూకాంప్లెక్స్‌, ప్రసాద విక్రయశాలతో పాటు ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. స్వామి వారిని సుమారు 40వేల మందికి పైగా భక్తులు దర్శించుకున్నారు. వివిధ పూజలతో నిత్యాదాయం రూ.41,39,620 వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement