కోదాడ: ఏకగ్రీవంగా ఎన్నికై న కోదాడ పబ్లిక్‌క్లబ్ నూతన కార్యవర్గం ఆదివారం బాధ్యతలు స్వీకరించింది. ఎన్నికల అధికారిగా వ్యవహరించిన న్యాయవాది ఎస్‌ఆర్‌కే మూర్తి.. క్లబ్ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో నూతన కార్యవర్గం చేత ప్రమాణస్వీకారం చేయించారు. అధ్యక్షుడిగా కత్రం సీతరాంరెడ్డి, క్యార్యదర్శిగా పోటు రంగారావులతో పాటు ఉపాధ్యక్షులుగా తోట రంగారావు, గుండపనేని వెంకట సత్యనారాయణరావు, సంయుక్త కార్యదర్శులుగా వంగవేటి గురునాథం, కోటమర్తి విద్యాసాగర్‌రావు, కార్యవర్గ సభ్యులుగా టి. రామయ్య, అమరనాయిని శేషగిరిరావు, సుంకర సత్యనారాయణ, మేకల ప్రతాప్, ముండ్రా రవికుమార్, ఇర్ల నాగమునీందర్‌రెడ్డి, కుక్కడపు వెంకటేశ్వర్లు(బాబు) ప్రమాణం చేశారు. క్లబ్‌ను సామాజికసేవా కార్యక్రమాల్లో అగ్రభాగాన నిలుపుతామని నూతన కార్యవర్గం ప్రకటించింది.


