భూగర్భ జలాలను సంరక్షించాలి | - | Sakshi
Sakshi News home page

భూగర్భ జలాలను సంరక్షించాలి

Mar 14 2026 10:18 AM | Updated on Mar 14 2026 10:18 AM

భువనగిరిటౌన్‌ : భూగర్భజలాలను సంరక్షిస్తే భవిష్యత్‌ తరాలకు తగినన్ని నీటి వనరులు అందుబాటులో ఉంటాయని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ భాస్కర్‌రావు అన్నారు. భూగర్భ జలాల సంరక్షణపై శుక్రవారం భువనగిరి కలెక్టర్‌లో కేంద్రీయ భూగర్భ జల బోర్డు ఆధ్వర్యంలో నిర్వహించిన ఒకరోజు శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఇంకుడు గుంతలు, నీటి కుంటల ద్వారా భూగర్భ జలాలను పెంచేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. డీఆర్‌డీఓ నాగిరెడ్డి మాట్లాడుతూ నీటి సంరక్షణపై అవగాహన పెంచుకోవాలన్నారు. సీజీడబ్ల్యూ రీజినల్‌ డైరెక్టర్‌ జ్యోతికుమార్‌ మాట్లాడుతూ సాంకేతిక పద్ధతుల ద్వారా భూగర్భ జల సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలో వివరించారు. జిల్లా భూగర్భ జల అధికారి జ్యోతికుమార్‌ మాట్లాడుతూ భూగర్భ జల వనరులను కాపాడుకోవడం ప్రతిఒక్కరి బాధ్యత అన్నారు. అనంతరం భూగర్భ జలమండలి ఆధ్వర్యంలో ముద్రించిన నకీమ్‌ రిపోర్ట్‌, జిల్లా రీచార్జ్‌ మ్యాప్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీజీడబ్ల్యూ శాస్త్రవేత్త యాదయ్య, ఆర్డీఓ కృష్ణారెడ్డి, జేఏసీ చైర్మన్‌ మందడి ఉపేందర్‌రెడ్డి, డీపీఓ విష్ణువర్ధన్‌రెడ్డి, సుధీర్‌కుమార్‌, మాధవ్‌, సరిత, రేష్మ పిల్లాయి, సర్ధాజ్‌ భాషా, అధికారులు పాల్గొన్నారు.

ఫ అదనపు కలెక్టర్‌ భాస్కర్‌రావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement