తిరుమలగిరి (తుంగతుర్తి) : లారీ, ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన తిరుమలగిరి మండలం వెలిశాల గ్రామం వద్ద శనివారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హన్మకొండ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు తిరుమలగిరికి వస్తుండగా.. తిరుమలగిరి నుంచి తొర్రూరు వైపు వెళ్తున్న లారీ వెలిశాల వద్ద బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ సంతోష్‌గౌడ్‌కు కడుపులో గాయాలయ్యాయి. ప్రయాణికురాలు బోళ్ల అంజమ్మకు చెయ్యి విరిగింది. మరో పది మందికి గాయాలు కావడంతో వారిని 108 వాహనంలో ఆస్పత్రికి తరలించారు. లారీ డ్రైవర్ దీపక్ క్యాబిన్‌లో ఇరుక్కుపోవడంతో స్థానికులు అతడిని అతికష్టం మీద బయటకు తీయగా.. అతడి కుడి కాలు విరిగింది. ఘటనా స్థలాన్ని ఎస్‌ఐ వెంకట్‌రెడ్డి సందర్శించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.


