భూదాన్‌పోచంపల్లి : చేనేత పరిశ్రమ, టూరిజంను అనుసంధానం చేస్తూ భూదాన్‌పోచంపల్లిని టూరిజం హబ్‌గా మార్చేందుకు సమగ్ర ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. బుధవారం నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్ నిత్య, డెక్కన్ ఆర్కీవ్ ఏజెన్సీ హెడ్ సిబ్‌ఘట్‌తో కలిసి ఆయన టూరిజం పార్కు, లేక్‌వ్యూ పార్కు, పెద్ద చెరువు, వినోబాభావే మందిరం, చేనేత గృహాలు, చేనేత సహకార సంఘం, కళాపునర్వి హ్యాండ్లూమ్ యూనిట్, జలాల్‌పురంలోని స్వామి రామానందతీర్థ గ్రామీణ సంస్థ, ఎకో చిల్ట్రన్ పార్కు, అర్బన్ ఫారెస్ట్ పార్కును సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోచంపల్లి మినీట్యాంక్ బండ్ అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని హెచ్‌ఎండీఏ అధికారులను కోరారు. అయ్యప్పస్వామి దేవాలయంలో పూజలు నిర్వహించారు. భూదానోద్యమ పిత ఆచార్య వినోబాబావే, ప్రథమ భూదాత వెదిరె రాంచంద్రారెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తడక వెంకటేశ్వర్లు, డీఆర్‌డీఓ నాగిరెడ్డి, డీపీఓ విష్ణువర్ధన్‌రెడ్డి, ఎస్‌ఆర్టీఆర్‌ఐ చైర్మన్ డాక్టర్ ఎన్.కిషోర్‌రెడ్డి, జిల్లా ఉపాధికల్పన అధికారి సాహితీ, జిల్లా చేనేత జౌళిశాఖ ఏడీ శ్రీనివాసరావు, తహసీల్దార్ పి.శ్రీనివాస్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ అంజన్‌రెడ్డి, ఎంపీడీఓ భాస్కర్, గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ రాష్ట్ర అధ్యక్షుడు గున్నా రాజేందర్‌రెడ్డి, మాస్టర్‌వీవర్ భారత లవకుమార్, ఆర్‌ఐ వెంకట్‌రెడ్డి, ఎంపీఓ మాజిద్, డీఓ బాలమోహన్‌రెడ్డి, టై అండ్ డై అసోషియేషన్ అధ్యక్షుడు కర్నాటి బాలరాజు, చేనేత కార్మిక సంఘం అధ్యక్షుడు అంకం పాండు, ఏపీఎం తౌర్యానాయక్, ఏపీఓ కృష్ణమూర్తి, జలాల్‌పురం సర్పంచ్ శాపాక లింగస్వామి, ఉపసర్పంచ్ మధు, కార్యదర్శి నరేశ్ తదితరులు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ అనురాగ్ జయంతి


